కొమురం భీమ్ - వికీపీడియా

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

కొమురం భీమ్

గిరిజనోద్యమ నాయకుడు

కొమురం భీమ్, (1901 అక్టో బరు 22 - 1940 అక్టో బరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి
వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లా కు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.[1] ఇతను ఆదిలాబాద్ అడవులలో,
గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు
ఆదిలాబాద్ జిల్లా , ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రా మంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.[2] పదిహేనేళ్ల
వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని
సర్ధా పూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను
అడవిని జీవనోపాధిగా చేసుకొని,అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థా నాలు, చట్టా లు)
తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై
విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి. అడవి.నీరు
మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడు.

బాల్యం
కొమురం భీమ్ గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు 1901 సంవత్సరంలో
ఆదిలాబాద్ జిల్లా , ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రా మంలో జన్మించాడు.
ఉద్యమ జీవితం కొమురం భీమ్

2010 అక్టో బరు 23 తేదీన సాక్షి


దినపత్రికలో ప్రచురితమైన జల్-జంగిల్-జమీన్ .
కొమురం భీము రేఖాచిత్రం

భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన జననం కొమురం


పోరాటాలు చరిత్రా త్మక మైనవి. ఆదివాసీలపై నిజాం
నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ భీము
వీరోచితంగా పోరాడి ప్రా ణాలర్పించిన కొమురం భీమ్
‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా అక్టో బర్
నిలిచిపోయూడు. కొండ కోనల్లో , ప్రకృతితో సహ జీవనం
సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక 22, 1901
న్యాయుంలో భాగమని నినదిస్తూ , 1928 నుంచి 1940
వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ సంకేపల్లి ,
గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు...

భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ


ఆసిఫాబాద్
సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కెరమెరి
ప్రాంతంలోని సర్దా పూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు
మండలం,
సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు
ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని
ఆదిలాబాద్
హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ
ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన జిల్లా
భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు
పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా
గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. మరణం అక్టో బరు
ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు
కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని
27 , 1940
కొనసాగించాడు. భీమ్ కు కుడిభజంగా కొమురం సూరు
కూడా ఉద్యమంలో పాల్గొ న్నాడు.[3] వెడ్మ రాము[4]
జోడేఘాట్
కూడా భీమ్ కు సహచరుడిగా ఉన్నాడు. కుర్దు పటేల్
అనే నమ్మకద్రో హి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం
ఆడవులు
1940 అక్టో బర్ 27 న జోడేఘాట్ అడవుల్లో ని కొమురం
భీమ్ స్థా వరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. ఇతర పేర్లు కొమురం
నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం
కొదమసింహం లా గర్జించాడు. కుర్దు పటేల్ అనే భీమ్,
నమ్మకద్రో హి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం
స్థా వరాలను సైన్యం చుట్టు ముట్టగా జోడేఘాట్ గోండు
అడవుల్లో 1940, అక్టో బర్ 27 న, అంటే ఆదివాసీలు
పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున బెబ్బులి.
కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ
తిథి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకోవడం
ఆదివాసీల ఆనవాయితీ. ప్రసిద్ధి ప్రత్యేకమైన
ఆదివాసి
రాజ్యం కోసం,
స్వపరిపాలన
కోసం,ఆదివాసీ
హక్కులకోసం
అసఫ్ జహి
రాజవాసంకు
వ్యతిరేకంగా
పోరాడిన ఒక
నేటి పోరాటాలకు గొప్ప ఆదివాసి
స్ఫూర్తి నాయకుడు.
తండ్రి చిన్నూ
తల్లి సోంబారు

ఆదిలాబాద్ జిల్లా కుంతాల జలపాతం వద్ద


కొమురం భీము విగ్రహం
కొమురం భీం శిలావిగ్రహం

ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. పోరాట పంథానే
చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు.
ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డభ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తు న్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక
సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు
అలుపు ఎరగకుండా ఉద్యమిస్తు న్న సందర్భం నేడున్నది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తు న్న ఆదివాసీ సమాజాలను
క్రూ రంగా అణచివేస్తు న్న ప్రభుత్వాలు కండ్లముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ
సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటిష్ చట్టా లకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్‌లు,
తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల
దోపిడీ, పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమైన చోట తమ
అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తు న్నారు.

ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టా న్ని అమలుపర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను, భూములను
పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర
ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తు న్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం
వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్‌డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన
ఉంది. వలస వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులవడంతో వీరికష్టా లు రెట్టింపయ్యాయి. ఆదిమ సమాజం వీరి వల్ల
రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు
మదనపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తు న్న ప్రభుత్వాల
వైఖరిలో మార్పు రావడంలేదు. ఏటా విషజ్వరాలతో ప్రా ణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు
అందడంలేదు. ప్రతిఏటా రెండు వందల నుంచి మూడు వందల మలేరియా మరణాలు సంభవిస్తు న్నాయి.
పోషకాహారలేమితో మరణిస్తు న్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి
తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తు న్నాయి.
భీం పోరాటం జరిగి డెభ్బైఏళ్లు అవుతున్నా, ఆపోరాట స్ఫూర్తినేటికీ ఉంది. అది మరోఇంద్ర పోరాట రూపంగా
పెల్లు బకవచ్చు. ప్రభుత్వాలు మరో ఉప్పెన రాక మునుపే మేల్కొనాలి.

అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా


కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తు న్నది.
బాబేఝురి లోద్దు ల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ
దండకారణ్యంలో కొనసాగుతున్నది.

కొమురం భీము విగ్రహం


2009 డిసెంబరు 17 న హైదరాబాదులో కొమురం భీము విగ్రహం నెలకొల్పుటకు ప్రభుత్వం ప్రకటించింది.[5]

ఇవి కూడా చూడండి


1. కొమరంభీమ్ (సినిమా): కొమురం భీము
జీవితగాధ ఆధారంగా రూపొంది రెండు నంది
పురస్కరాలను గెలుచుకున్న చిత్రం.
2. కొమురం సూరు: జోడేఘాట్‌వీరుడు
3. వెడ్మ రాము
మూలాలు
1. "Tributes paid to Telangana
martyrs" (https://web.archive.org/
web/20061028163647/http://www.
hindu.com/2005/09/18/stories/200
5091816590500.htm) . The Hindu.
Chennai, India. 2005-09-18.
Archived from the original (http://w
ww.hindu.com/2005/09/18/stories/
2005091816590500.htm) on
2006-10-28. Retrieved 2014-02-
04.
2. "ఆర్కైవ్ నకలు" (https://web.archive.o
rg/web/20110929190923/http://ww
w.fullhyderabad.com/profile/event
s/74/2/komaram-bheem_review) .
Archived from the original (http://w
ww.fullhyderabad.com/profile/eve
nts/74/2/komaram-bheem_revie
w) on 2011-09-29. Retrieved
2014-02-04.
3. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (5 November
2016). "జోడేఘాట్‌వీరుడు కుమ్రం సూరు"
(https://www.andhrajyothy.com/art
ical?SID=330017) .
www.andhrajyothy.com. గుమ్మడి
లక్ష్మీనారాయణ. Archived (https://we
b.archive.org/web/2016110802582
4/https://www.andhrajyothy.com/a
rtical?SID=330017) from the
original on 8 November 2016.
Retrieved 22 October 2019.
4. నమస్తే
తెలంగాణ, ఎడిటోరియల్ (26
October 2016). "కుమ్రం భీము మెచ్చిన
రాము" (https://www.ntnews.com/E
ditpage/~/Editorial-News-in-Telug
u/%E0%B0%95%E0%B1%81%E0%
B0%AE%E0%B1%8D%E0%B0%B
0%E0%B0%82-%E0%B0%AD%E
0%B1%80%E0%B0%AE%E0%B1%
81-%E0%B0%AE%E0%B1%86%E
0%B0%9A%E0%B1%8D%E0%B0%
9A%E0%B0%BF%E0%B0%A8-%E
0%B0%B0%E0%B0%BE%E0%B
0%AE%E0%B1%81-1-7-492333.ht
ml) . www.ntnews.com. డాక్టర్
ద్యావనపల్లి సత్యనారాయణ. Archived (h
ttps://web.archive.org/web/201911
07192619/https://www.ntnews.co
m/Editpage/~/Editorial-News-in-T
elugu/%E0%B0%95%E0%B1%81%
E0%B0%AE%E0%B1%8D%E0%B
0%B0%E0%B0%82-%E0%B0%A
D%E0%B1%80%E0%B0%AE%E0%
B1%81-%E0%B0%AE%E0%B1%8
6%E0%B0%9A%E0%B1%8D%E0%
B0%9A%E0%B0%BF%E0%B0%A8
-%E0%B0%B0%E0%B0%BE%E0%
B0%AE%E0%B1%81-1-7-492333.h
tml) from the original on 7
November 2019. Retrieved 7
November 2019.
5. "Komaram Bheem statue to be
installed in city" (https://web.archiv
e.org/web/20091221233100/http://
www.hindu.com/2009/12/18/storie
s/2009121860130400.htm) .
Chennai, India: The Hindu. 2009-
12-18. Archived from the original (h
ttp://www.hindu.com/2009/12/18/s
tories/2009121860130400.htm) on
2009-12-21. Retrieved 2010-01-03.

బయటి లింకులు
కొమురం భీము 70వ వర్ధంతి వారోత్సవాలలో భాగంగా గుమ్మడి లక్ష్మీనారాయణ 23 అక్టో బరు 2010 తేదీన సాక్షి
పత్రికలో వ్యాసిన వ్యాసం (https://web.archive.org/web/20101025014209/http://epaper.sakshi.c
om/apnews/Hyderabad-Main_Edition/23102010/4)
"https://te.wikipedia.org/w/index.php?
title=కొమురం_భీమ్&oldid=4076006" నుండి
వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 3 జనవరి 2024న 06:05కు


జరిగింది. •
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0
క్రింద లభ్యం

You might also like