Telugu Padhyalu

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

1) వినదగునెవ్వరు చెప్పిన

వినినంతనే వేగపడక వివరింపదగున్

కనికల్ల నిజము తెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ!

భావం: మంచిబుద్ధికలవాడా! ఎవరు ఏమి చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి
రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని, ఆ చెప్పిన విషయం అసత్యమో, సత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారు నీతి
తెలిసినవారు

2)సిరిదా వచ్చిన వచ్చును

సరసంబుగ నారికేళ సలిలము భంగిన్

సిరిదా పోయిన పోవును

కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

భావం : ఓ బుద్ధిమంతుడా!

ఎవరికైనా సరే సంపదలు ఏ విధంగా వస్తా యో ఎవ్వరికీ తెలియదు. ఎలాగంటే కొబ్బరికాయలోకి తియ్యటి నీళ్లు ఎక్కడి నుంచి
ప్రవేశిస్తా యో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ధనం అదేవిధంగా వస్తుంది. అలాగే వెలగపండులో ఉన్న గుజ్జు మాయమైపోయి
కాయ మాత్రం చక్కగాఉంటుంది. బయట నుంచి చూస్తే అది గుజ్జు నిండిన కాయలాగే ఉంటుంది. ఎక్కడా రంధ్రం కాని
పుచ్చుకాని ఉండదు. అయితే అందులోకి కరి అనే ఒకరకమైన పురుగు చేసి లోపల ఉన్న గుజ్జు తినే సి వెళ్లిపోతుందని పెద్దలు
చెబుతారు. కరి అనే ఒకరకమైన వ్యాధివచ్చినప్పుడు లోపల గుజ్జు పోతుందని మరికొందరు చెప్తా రు. ఏది ఏమైనా
వెలగపండులో ఉన్న గుజ్జు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా ఒకవ్యక్తి దగ్గర నుంచి ధనం కూడా అలాగే
వెళ్లిపోతుంది.

3)ఉపకారికి నుపకారము

విపరీతము కాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!

భావం: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తా రు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో
పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు
కలవాడు.

3)కనకపు సింహాసనమున
శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునం

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

భావం : మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొని వెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా పట్టా భిషేకం
చేయవచ్చును. కాని అది దాని స్వభావ లక్షణాన్ని విడిచిపెట్టదు. (తినకూడని వాటిని తినడం వాటి లక్షణం). అంటే దాని
పూర్వలక్షణాన్ని అది మానుకోలేదు. ఈ నీతిని జాగ్రత్తగా, శ్రద్ధతో వినవయ్యా. ఎవరు ఏమి చేసినప్పటికీ నీచునికి సహజంగా
ఉండే నీచబుద్ధి ఎక్కడికీ పోదు.

4)చీమలు పెట్టిన పుట్టలు

పాములకిరవైనయట్లు పామరుడు తగన్

హేమంబు కూడబెట్టిన

భూమీశుల పాల జేరు భువిలో సుమతీ!

భావం: చిన్నచిన్న చీమలు నిరంతరం కష్టపడి మట్టితో పుట్టలు నిర్మిస్తా యి. అయితే అందులో పాములు చేరి నివసిస్తా యి.
తెలివితక్కువవాడు వివిధరకాలుగా కష్టపడి అత్యాశతో ధనం కూడబెడతాడు. అయితే అది చివరకు భూమీశులయినరాజుల
ఆస్తిలో కలిసిపోతుంది.

5)కూరిమి గల దినములలో

నేరము లెన్నడును గలుగనేరవు మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

భావం: ఇద్దరి మధ్య స్నేహం, అభిమానం, ప్రేమ వంటివి ఉన్న రోజులలో ఒకరిలో ఉన్న దోషాలు, తప్పులు మరొకరికి
కనిపించవు. ఏదైనా కారణం వల్ల ఎప్పుడైతే ఆ స్నేహం, అభిమానం, ప్రేమ ద్వేషంగా మారతాయో, అప్పుడు ఎదుటివారిలోఉన్న
దోషాలు, అపరాధాలు మాత్రమే కనిపిస్తా యి. ఇది వాస్తవం.

6)తన కోపమె తన శత్రు వు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

భావం : తనకు ఉన్న కోపమే తనకు హాని చేసే శత్రు వు. తనలో ఉన్న శాంతగుణమే తనకు రక్షగా ఉంటుంది. ఇతరుల దుఃఖాన్ని
పోగొట్టటానికి తాను చేసే పనే తనకు బంధువు, చుట్టం. తనకు ఉండే సంతృప్తే స్వర్గం అంటే సంతోషాన్ని కలిగించేచోటుతో
సమానం. తనకు ఉన్న బాధే దుఃఖాలను, ఇబ్బందులను కలిగించే స్థా నమని విజ్ఞులు చెబుతుంటారు
7)తలనుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

తలతోక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

భావం: పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం
లేకుండా శరీరమంతా ఉంటుంది.

8)పాలను గలిసిన జలమును

పాల విధంబుననె యుండు బరికింపంగా

బాల చవి జెఱచు గావున

బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ!

భావం : పాలలో కలిసిన నీళ్లు కూడా చూడటానికి పాలలాగానే తెల్లగా ఉంటాయి. కాని ఆ నీరు పాలలో కలిసినందువల్ల పాలకు
ఉండే సహజమైన రుచి పోతుంది. దుర్మార్గుడు చూడటానికి మంచివానిగా, వివేకం కలవానిగా కనిపిస్తా డు. కానిమంచివానిలో
ఉండే సజ్జన గుణాన్ని పోగొడతాడు. కనుక చెడ్డవానితో స్నేహం ఎంత మాత్రం పనికిరాదు.

9 )లావుగలవానికంటెను

భావింపగ నీతిపరుడు బలవంతుండౌ

గ్రావంబంత గజంబును

మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

భావం: మంచిబుద్ధికలవాడా! శరీర బలం ఉన్నవాని కంటె తెలివితేటలు ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. పర్వతమంత
ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసి దానిమీదకు ఎక్కగలడు. కండలు తిరిగి, శరీరం
దృఢంగా ఉండిబలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న
నీతిమంతులు కూడా ఉంటారు.

10) బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!


తమకు చాలా బలం ఉంది అని గర్వంతో విర్రవీగేవారి గురించి వర్ణిస్తూ బద్దెన ఈ పద్యాన్ని చెప్పాడు.

భావం: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు
ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లా డతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె
చిన్నప్రాణులైనచీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టు కుంటుంది.

You might also like