Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 21

పార్ట్ 8

అతను కార్ దిగి అసలు ఏంటి మీ ప్రాబ్లం? మీరు నాకు

సారీ చెప్పాలి అంతే.. ఒకే ఐ యాం సారీ.. ఇప్పుడు ఒకే

నా.. హా ఒకే.. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

అతను ఆద్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. వెనుక

నుంచి హార్న్ మ్రోగడంతో ఈ లోకంలోకి వచ్చి కార్ డ్రైవ్

చేసుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళాడు. నైట్ ఆద్య

డిన్నర్ కంప్లీట్ చేసి హాల్ లో టివి చూస్తుంది. దివ్యకి

తలనొప్పిగా ఉందని కాలేజ్ నుంచి త్వరగా వచ్చి డిన్నర్

చేసి పడుకుంది. టీవీ లో మూవీ చూస్తూ ఉండగా

కాలింగ్ బెల్ మోగింది. ఆద్య వాల్ క్లోక్ వైపు చూసి

10.30 అయ్యింది, ఈ టైం లో ఎవరబ్బా? అని వెళ్ళి డోర్

ఓపెన్ చేసింది. బయట ఒకతను నిల్చుని పాటలు

పాడుకుంటూ వున్నాడు. ఆద్య షాక్ అయ్యి నువ్వా?


నువ్వేంటి ఇక్కడ, నిన్నెవరు గేటు లోపలి రానిచ్చారు.

రామయ్యా..రామయ్యా.. అంటూ అరుస్తుంది. హే ష్…

అంటూ నోటిపై వేలు పెట్టు కుని అరవకు అని చెప్పి, అది

నేను నిన్ను అడగాలి నువ్వేంటి నా ఇంట్లో? అన్నాడు

ఆనంద్. నీ ఇల్లా ? నీ ఇళ్ళేంటి? ఇది మేము రెంట్ కి

తీసుకున్న హౌస్. రెంట్ హౌస్ కి కూడా ఓనర్స్ ఉంటారు.

ఈ ఇంటి ఓనర్ నేనే.. అంటుండగా ఆద్య కేకలు విన్న

రామయ్య వచ్చాడు. ఏమైందమ్మా అలా కేకలేశారు అని

ఆనంద్ వైపు చూసి అయ్యో మర్చిపోయాను చిన్నాయ్యా,

వీళ్ళకే ఇన్లు బాడుగకి ఇచ్చాను. రేపు ఖాళీ చేసేయమని

చెప్తా ను. పర్లేదు రామయ్యా.. నువ్వు వెళ్ళు.. నేను

మాట్లా డతాను. అని ఆనంద్ అనగానే రామయ్య

అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆద్య కి ఏమీ చెయ్యాలో

తోచక అలానే చూస్తూ ఉండిపోయింది. ఆనంద్ ఆద్య ని


చూసి హలో మేడం.. అంటూ పేస్ ముందు చిటిక

వేసాడు. ఏదో ఆలోచన నుంచి తేరుకున్న ఆద్య సారీ.. ఈ

ఇంటి ఓనర్ మీరేనా?నాకు తెలియదు అంది కొంచెం

బాధగా పేస్ పెట్టి. ఈవెనింగ్ మీరు నన్ను సారీ

చెప్పమన్నారు, ఇప్పుడు మీరు సారీ చెప్తు న్నారు. సారీ

చెప్పమన్నందుకు సారీ అంది అప్రయత్నంగా ఆద్య. ఇంక

సారీ చెప్తూ నే ఉంటారా? ఇంట్లో కి రానిస్తా రా? ఓహ్ సారీ,

లోపలి రండి. అని డోర్ కి అడ్డు తొలగింది. ఆనంద్

లోపలి రాగానే మరి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు?

ఎక్కడేంటి? ఇక్కడే.. ఇక్కడా? ఇక్కడెక్కడా? ఈ ఇంట్లో

2 బెడ్ రూమ్స్ ఉన్నాయి కదా.. ఒక దాంట్లో మీరు ఇంకో

దాంట్లో నేను.. సారీ నాతో పాటు ఇక్కడ మా సిస్టర్

కూడా ఉంది. ఈ రోజుకి తను నేను ఒకే రూం లో

ఉంటాం. కానీ ఇప్పుడు సామాన్లు తీయడానికి చాలా టైం


పడుతుంది. ఒక వారం రోజుల్లో ఇంకొక ఇళ్ళు

చూసుకుంటాం. అప్పటి వరకూ టైం ఇవ్వండి ప్లీజ్ అంది

అర్ధిస్తూ. ఇట్సోక్కే మీరు ఎన్ని రోజులు కావాలన్నా ఇక్కడే

ఉండొచ్చు. ఎలాగూ రెంట్ ఇస్తు న్నారు కదా. అంటూ

అక్కన్నుండి తన రూమ్ కి ప్రెజెంట్ ఆద్య ఉంటున్న

రూమ్ లోకి వెళ్ళాడు.

ఆ రూం అంతా తనకి చాలా బాగా నచ్చుతుంది.. జర్నీ

చేసి అలసిపోవడం తో త్వరగా పడుకుంటాడు... తను

(ఆనంద్) డైరెక్ట్ గా ఆద్య రూం కి వెళ్తా డు.. ఎప్పుడూ

చూసే గది అయినా తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది.. ఆ

రూం అంతా తనకి చాలా బాగా నచ్చుతుంది. జర్నీ చేసి

అలసిపోవటంతో త్వరగా పడుకుంటాడు. ఆద్య : అంటే


ఇతనే ఆనంద్ అన్నమాట.. అని మనసులో అనుకుంటూ

వెళ్లి, పడుకుంటుంది. తెల్లవారగానే ఆద్య లేచి టిఫిన్ రెడీ

చేస్తూ ఉంటుంది.. ఇక దివ్య లేచి ఫ్రష్ అయి బయటికి

వస్తుంది.. దివ్య : డైరెక్ట్ గా ఆద్య రూం కి వెళ్తుంది., డ్రెస్

కోసం.. అక్కడే పడుకొని ఉన్న ఆనంద్ ని చూసి., షాక్

అయ్యి.. వామ్మో! ఎవడు వీడు.? డైరెక్ట్ గా ఇంట్లోకి

రావడమే కాకుండా, అక్క బెడ్ పైనే పడుకున్నాడు..

రేయ్ దున్నపోతా! లేరా.. ఎవర్రా నువ్వు? డైరెక్ట్ గా మా

ఇంట్లోకే వచ్చేసావ్. ఆనంద్ : ఏంటి?😠 ఎవరు నువ్వు?

దివ్య : అది, నేను నిన్ను అడగాలి రా అడ్డగాడిద..

ముందు నువ్వు కిందకు దిగరా.. ఎంత ధైర్యం ఉంటే మా

పర్మీషన్ లేకుండా మా ఇంట్లోకి దొంగ లాగా వచ్చి, మా

బెడ్ పైనే పడుకుంటావా? ఆనంద్ : హలో! మైండ్

యువర్ వర్డ్స్.. అయినా ఇది నా ఇల్లు , నా ఇంట్లోకి


దొంగ లాగా రావాల్సిన అవసరం నాకేంటి? దివ్య : ఇది నీ

ఇల్లా ? ఇది మేము రెన్ట్ తీసుకున్న హౌస్.. ఈ ఇంటి ఓనర్

రావడానికి 4 నెలలు పడుతుంది. ఆనంద్ : ఆ నాలుగు

నెలలు గడిచి 14 రోజులౌతుంది.. దివ్య : హా!😮 అంటే

ఈ ఇంటి ఓనర్ మీరేనా? 😁😁సోరీ అండి.. ఆనంద్ : మీ

అక్కాచెల్లెళ్ల ఇద్దరికీ ఆన్సర్ చేయలేక చచ్చిపోతున్నా.

దివ్య : సోరీ! అంటూ అక్కన్నుంచి జంప్. అక్కా..

అక్కా.. అంటూ కిచెన్ లోకి వెళ్లి., అయ్యో! నాకెందుకు

చెప్పలేదే? ఆద్య : ఏం చెప్పలేదే? దివ్య : అదేనే.! ఈ

ఇంటి ఓనర్ గాడు వచ్చాడని నాకెందుకు చెప్పలేదే?

ఆద్య : హో! అదా? నైట్ అతను వచ్చేసరికే నువ్వు

పడుకున్నావ్. మార్నింగ్ లేచాక చెప్పుదాం అనుకున్నా.,

ఎందుకే?ఇప్పుడు ఏమైంది? దివ్య : ఏంలేదు కానీ.,

ఇప్పుడెలాగే? అతను వచ్చేస్తే మనం ఈ ఇంట్లో నుండి


వెళ్ళిపోవాలి కదా! ఆద్య : నువ్వేం టెన్షన్ పడకు చిన్ను.

అతన్ని 5 డేస్ టైం ఇవ్వమని అడిగాను., అప్పటికీ వేరే

ఎక్కడా దొరక్కపోతే., మనం ఇక్కడే ఉండడానికి

అతనుఒప్పుకున్నాడు. దివ్య : అవునా! హమ్మయ్య! ఒక

పెద్ద టెన్షన్ తీరిపోయింది. ఆద్య : హా అవును రా చిన్ను.

అలా వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. ఆనంద్ బయటికి

వచ్చి, వాళ్ళు వెళ్ళిపోయారు అని చూసి.. డైరెక్ట్ గా

రామయ్య దగ్గరికి వెళ్లి, టిఫిన్ చేసి, స్టోర్ రూం కీ

తీసుకుని లోపలికి వెళ్తా డు. స్టోర్ రూంలో ఉన్న ఆ పోస్టర్

ని చూడగానే., తనకి మళ్ళీ ఆ జ్ఞాపకాలు

గుర్తు కువస్తా యి.. ఏ జ్ఞాపకాలైతే మర్చిపోదామని.,

విదేశాల పేరుతో అజ్ఞాతవాసం లోకి వెళ్ళాడో., అవే

జ్ఞాపకాలు తనని మళ్ళీవెంటాడుతాయి. వెంటనే ఆ

పోస్టర్ ని, డైరీ ని ఒక బాక్స్ లో పెట్టి, కబోర్డ్ లో ఒక


మూలన విసిరేస్తా డు.. *** జైలు నుండి రిలీజ్ అయిన

వ్యక్తి 4 నెలలు గడిచినా ఇంకా తను ప్రేమించిన అమ్మాయి

కోసం వెతుకుతూనే ఉంటాడు.. ఎవ్వరిని అడిగినా,

బెదిరించినా అతనికి ఎక్కడా సమాధానం దొరకదు..

దాంతో అతను విసుగు చెంది తనలో తానే ఇలా

మాట్లా డుకుంటాడు.. అతను : నువ్వు ఈ

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే,. నిన్ను

వెతికి నా దాన్ని చేసుకుంటాను.. అయినా నువ్వు

ఎంత పిచ్చిదానివే ఆద్య (జైలు గోడల పై అతను

రాసుకున్న పేరు కూడా ఇదే), నాకు కనిపించకుండా

దాక్కుంటే., వెతకలేనని అనుకున్నావా? మన ఇద్దరి

మధ్య అడ్డం వచ్చినందుకే కదా అత్త అని

కూడా చూడకుండా మీ అమ్మను కూడా

చంపించింది. అలాంటిది నువ్వు కనిపించనంత


మాత్రాన నిన్ను వదిలేస్తా నా? .. నెవెర్...

వెతుకుతూనే ఉంటాను .., నువ్వు కనిపించేంత

వరకూ .... *** సాయంత్రం అయ్యేసరికి ఆనంద్ తన

ఆఫీసు వర్క్ చూసుకుని ఇంటికి వచ్చి, రామయ్య

సహాయంతో గది అంతా శుభ్రంచేయిస్తా డు. ఆనంద్ :

రామయ్య.. రామయ్య : ఏంటి బాబు? టీ ఏమైనా

కావాలా? చెప్పండి బాబు చిటికెలో తెస్తా ను.. ఆనంద్ :

ఏదీ వద్దు రామయ్య.. నన్ను రేపు ఉదయం వరకూ

డిస్టర్బ్ చేయకు.. రామయ్య : అదేంటి బాబు.., కాస్త

అన్నం అయినా తిన్నాక.. ఆనంద్ : రామయ్య.. ఇక

నువ్వు వెళ్ళు.. రామయ్య : డైరెక్ట్ గా వెళ్లి , భాస్కర్

(ఆనంద్ వాళ్ళ నాన్న) గారికి ఫోన్ చేస్తా డు. భాస్కర్ :

హలో! చెప్పు రామయ్య.. వాడిలో ఏమైనా మార్పు

వచ్చిందా? రామయ్య : నిన్న ఒక్కరోజు బానే ఉన్నాడు


పెద్ధయ్య., ఈ రోజు మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు అని

చెప్పారయ్య. భాస్కర్ : అవునా? వాడు ఇంకా

మారలేదా? రామయ్య : మీరేమి బాధపడకండి

పెద్దయ్య., నాకెందుకో చిన్నయ్య తప్పకుండా తొందర్లోనే

మామూలుగా మారతాడనికచ్చితంగా అనిపిస్తుంది.

భాస్కర్ : ఏంటో రామయ్య? వాడు ఎప్పుడు మామూలు

స్థితికి వస్తా డో? ఎప్పుడు మాతో మామూలుగా

మాట్లా డతాడో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తు న్నాం.

రామయ్య : ఇంతకీ కరుణమ్మ ( కరుణ - ఆనంద్ వాళ్ళ

అమ్మ గారు ) గారు ఎలా ఉన్నారు పెద్దయ్య? భాస్కర్ :

ఎప్పట్లా గే ఉంది రామయ్య.. తన కొడుకు వాడి బాధని

మర్చిపోయి., ఎప్పుడు మాములుగా మారుతాడా అని

ఎదురు చూస్తుంది. రామయ్య : ఆ రోజు తొందర్లోనే

వస్తుంది పెద్దయ్య. భాస్కర్ : నేను కూడా ఆ రోజు


కోసమే ఎదురు చూస్తు న్నా రామయ్య. రామయ్య : సరే

పెద్దయ్య ఇక నేను ఉంటాను. భాస్కర్ : హా! వాన్ని

జాగ్రత్తగా చూస్కో రామయ్య. రామయ్య : మీరు

ప్రత్యేకంగా చెప్పాలా పెద్దయ్య., నేను చూసుకుంటాను.

ఉంటాను పెద్దయ్య. భాస్కర్ : హా సరే.. *** ఆద్య ,

దివ్య ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి డిన్నర్ చేస్తూ ఉంటారు..

దివ్య : అక్క నాకో డౌటే.. అసలు మన ఓనర్ గారికి

పెళ్ళైంది అంటావా🤔? ఆద్య : ఏమోనే నాకేం తెలుసు?

అయినా అతని గురించి నీకెందుకే? దివ్య : ఊరికే

అడుగుతున్నా అక్క., చూడ్డా నికి బాగున్నాడు కదా

అందుకే.,. ఆద్య : షట్ ఆప్ చిన్ను. ఏం

మాట్లా డుతున్నావే? అతను వింటే ఏమనుకుంటాడు?

దివ్య : అయినా వచ్చి ఇంత సేపైనా అతను రూం నుండి

బయటకే రావట్లేదు? ఆద్య : ఏమోనే? అయినా


మనకెందుకు? పద వెళ్లి పడుకుందాం. దివ్య : హా పదక్క

నాకూ నిద్రొస్తుంది. అలా వెళ్లి పడుకున్నాక కాసేపటికి

ఆద్య కి దాహంగా అనిపించి., వాటర్ తాగడానికి

లేస్తుంది.. ఆద్య : వాటర్ తాగి వస్తూ.. స్టోర్ రూం లైట్

ఏంటి ఇంకా వెలుగుతుంది? అతను ఇంకా మెలుకువ

గానే ఉన్నాడా?, లేదా లైట్ ఆఫ్ చేయడం

మర్చిపోయాడా? ఒకసారి వెళ్లి చూద్దాం అంటూ., సగం

తీసి ఉన్న డోర్ ని మొత్తం తెరిచి లోపలకి వెళ్తుంది.

ఇంతలోనే కరెంట్ పోతుంది.. వామ్మో! ఇప్పుడే కరెంట్

పోవాలా? అని అనుకుంటూ ఉండగానే.. రెండు

చేతులు వచ్చి., ఫోర్స్ గా తన భుజాలని గోడకు

ఆనిస్తా యి. ఇంతలో కరెంటు వస్తుంది.. ఊహించని ఈ

పరిణామానికి అరవాల్సిన ఆద్య నోరు మూగబోతుంది.,

ఎదురుగా ఉన్న వ్యక్తి ని చూసి.. ఆనంద్ ఫేస్ ని కూడా


సరిగా చూడని ఆద్య., ఆనంద్ ని అంత దగ్గరగా

చూసేసరికి తన నోట్లో నుండి మాట రాదు. తను షాక్

లో అలా చూస్తూ ఉండిపోతుంది.. చూస్తుంటే., అప్పటికే

ఫుల్ గా డ్రింక్ చేసినట్టు ఉన్నాడు అతను.. ఆనంద్ :

(తనకి ఇంకా దగ్గరగా వచ్చి., ఏడుస్తూ..) ఎందుకు

నన్ను వదిలేసి వెళ్లిపోయావ్? నన్నెందుకు ఇలా

ఒంటరి వాన్ని చేసావు? నువ్వు లేకుండా నేను

ఎలా ఉండాలి? చెప్పు మహిత .. చెప్పు .. ఆద్య :

తన మాటలకి తేరుకుని ఆనంద్ ని తనకి దూరంగా

నెట్టేసి., పరుగున రూం లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది.

ఒళ్ళంతా చెమటలు పట్టేస్తా యి.. జరిగింది కలో , నిజమో

కూడా తనకి అర్థం కావట్లేదు.. కాసేపటికి జరిగింది కల

కాదు నిజమేనని తనకి అర్థం అవుతుంది.. కానీ తను

ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం కాదు. ఆద్య


(మనసులో) : బహుశా తాగిన మైకంలో నేనే మహిత

అని అనుకొని ఉంటాడు. కానీ తను ఎందుకు అలా

మాట్లా డాడు? అంటే., మహిత తనని వదిలేసి

వెళ్ళిపోయిందా? అంటే., తను చనిపోయిందా? లేదా

తనకి మ్యారేజ్ అయిందా? లేదా ఇంకైదైనా కారణం

ఉందా?.. అసలు నేనే పిచ్చి పని చేసాను.. ఆ రోజే రెండో

సారి డైరీ ఓపెన్ చేసినప్పుడైనా చదివి ఉండాల్సింది..

అనవసరంగా నాకెందుకులే అని వదిలేసాను.. విషయం

ఏంటో సరిగా అర్థం కాలేదు కానీ తను మాత్రం చాలా

సఫర్ అవుతున్నాడు అని క్లా రిటీ గా అర్థం అవుతుంది..

ఆద్య : విషయం ఏంటో సరిగా అర్థం కాలేదు కానీ తను

మాత్రం చాలా సఫర్ అవుతున్నాడు అని క్లా రిటీ గా

అర్థంఅవుతుంది.. ఈ విషయం ఏమోగానీ ఈ ఇంట్లోనే

ఉంటే ఇంకా ఏం జరుగుతుందో., ముందు వేరే ఎక్కడైనా


ఇల్లు ఉందో ట్రై చేయాలి. అని అనుకుంటూ

పడుకుంటుంది.. కానీ తను ఎంత ప్రయత్నించినా

అస్సలు నిద్ర పట్టదు.. మాటిమాటికీ ఆనంద్ మాటలు,

తన మొహమే కనిపిస్తూ ఉంటాయి అలా చాలాసేపు

ఆలోచించి ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటుంది.

మార్నింగ్ లేచాక త్వరత్వరగా అన్నీ రెడీ చేస్తుంది..

ఆనంద్ లేవడానికి ముందే., ఆఫీస్ లో మీటింగ్ ఉందని

దివ్య కి చెప్పి ఫాస్ట్ గా వెళ్లి, వేరే ఇళ్ళు కోసం

ప్రయత్నిస్తూఉంటుంది.. ఆనంద్ తెల్లవారాక ఎప్పటికో

లేచి టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆద్య కి ఎంత

ప్రయత్నించినా ఎక్కడా ఇళ్ళు దొరకదు. ఒకచోట హాస్టల్

దొరుకుతుంది., కానీ దివ్యకి ఇష్టం లేకుండా వద్దు అని

అనుకుంటుంది. ఐశ్వర్య., తన ఇంట్లోనే ఉండమని

చెప్తుంది., కానీ తనకి మనసొప్పక., రెంట్ ఎలాగూ


ఇస్తు న్నాం కదా ఇక ఈ ఇంట్లోనే ఉండటం బెటర్ అని

ఫిక్స్ అవుతుంది. చాలా తలనొప్పిగా ఉండటంతో

త్వరగానే ఇంటికి వెళ్ళిపోతుంది ఆద్య. ఐశ్వర్య కూడా

తనతో పాటే వచ్చి కొంతసేపు ఉండి., రెస్ట్ తీసుకోమని

చెప్పి వెళ్లిపోతుంది. తను అక్కడే సోఫా లో

పడుకుంటుంది.. ఆఫీస్ లో వర్క్ చూసుకుని త్వరగానే

ఇంటికి వచ్చేస్తా డు ఆనంద్.. ఫుల్ వర్క్ స్ట్రెస్ తో ఇంటికి

వచ్చిన ఆనంద్, సోఫా లో పడుకున్న ఆద్య ఫేస్

చూడగానే చాలా రిలీఫ్ గా అనిపిస్తుందిఅతనికి. ఆనంద్

కి టీ తాగాలి అనిపించడంతో, రామయ్య ఇంటికి

వెళ్తా డు. కానీ రామయ్య ఇంట్లో ఉండకపోవడంతో

బయటికి వెళ్లి తాగుదామని అనుకోని ఇంట్లోకి వెళ్ళేసరికి

ఆద్య ఇంకా అలాగేపడుకుని ఉంటుంది. ఆనంద్ : తనకి

కూడా తలనొప్పిగా ఉందేమో? పోనీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే


అయిపోతుంది కదా అని వెళ్లి టీ చేసితీసుకొస్తా డు.. టీ

అయితే చేసాను కానీ, అది ఈ అమ్మాయికి ఎలా

ఇవ్వాలి? పేరుతో పిలుద్దాం అంటే, ఈ అమ్మాయి పేరు

కూడా నాకు తెలియదే? అని చేతిలో కప్ పట్టు కోని తన

ముందు నిలబడి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో

తన చేతి మీద ఉన్న టాటూ కనిపిస్తుంది. దాన్ని

చూసుకుంటూ మహా అని మనసులో

అనుకుంటాడు. ఆద్య : తనకి వాళ్ళ అమ్మ పిలిచినట్టు గా

అనిపించి., వెంటనే లేచి కూర్చుంటుంది. చేతిలో కాఫీ

కప్ తో నిలబడి ఉన్న ఆనంద్ ని చూసి షాక్ అవుతుంది.

ఆనంద్ ఫేస్ చూడగానే నిన్న రాత్రి జరిగిన సంఘటన

గుర్తు కువచ్చి, భయంతో కళ్ళు పెద్దవి చేసి, అక్కన్నుంచి

పరుగునతన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆనంద్ : ఏమైంది

ఈ అమ్మాయికి., నన్ను చూసి అలా భయపడి


పారిపోయింది? అనుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాడు.

ఇంతలో దివ్య వస్తుంది.. అక్కడే కాఫీ తాగుతున్న ఆనంద్

ని చూసి 😁 పల్లు బయటపెడుతుంది. ఆనంద్ : హాయ్!

అంటాడు తన నవ్వుని చూసి.. దివ్య : హాయ్! సోరీ..నిన్న

మార్నింగ్., మీరు ఎవరో తెలియకుండా అలా అనేసాను.

సోరీ.. ఆనంద్ : ఇట్సోక్కే. దివ్య : 🙂 ఆయామ్ దివ్య.

మీ పేరు? ఆనంద్ : ఆయామ్ ఆనంద్. దివ్య : హో! ఒకే

ఇది మీ ఓన్ హౌసే కదా.. మరీ మీ పేరెంట్స్? ఆనంద్ :

actually 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కూడా ఇక్కడే

ఉండేవారు. మా నాన్న వైజాగ్ లో కంపెనీ స్టా ర్ చేసి.,

దాన్ని డెవలప్ చేయాలని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు.

నేను ఇక్కడ ఉన్న కంపెనీ చుస్కుంటూ ఇక్కడే

ఉండిపోయాను. దివ్య : హో! ఆనంద్ : నా గురించే

చెప్తు న్నా మీ గురించి ఏమైనా చెప్పండి. దివ్య : మా


గురించి పెద్దగా ఏం లేదు.. నేను **** కాలేజ్ లో బి.టెక్

4 ర్త్ ఇయర్ చదువుతున్నా., మా అక్క పేరు ఆద్య.,

తను **** కంపెనీ లో జాబ్ చేస్తుంది. హాస్టల్ లో

ఉండటం ఇష్టం లేక , ఇలా రెంట్ హౌస్ లో

ఉంటున్నాం.. ఇంతలో, ఆద్య కి టీ తాగాలి అనిపించి,

బయటికి వస్తూ ఆనంద్ ఉన్నాడా , లేడా? అని డోర్ ఓపెన్

చేసి, తొంగి తొంగిచూస్తూ ఉంటుంది.. ఆనంద్ : తను

అలా చూడటం ఆనంద్ చూస్తా డు. చిన్నగా తనలో తానే

నవ్వుతాడు. (చందమామ లాంటి అందమైన మొహం పై

ఆ నవ్వు ఎంతో బాగుంటుంది.) కానీ తను ఎందుకలా

చూస్తుందో అర్థం కాదు ఆనంద్ కి. ఆద్య : ఆనంద్ ని

చూసిన ఆద్య, తన నువ్వుని చూసి, కొంచెం షై గా ఫీల్

అయి, ఏమీ తెలియనట్టు గా మళ్ళీ రూం లోకి

వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దర్ని పట్టించుకోని దివ్య


మాట్లా డుతూనే ఉంది., ఇంతలో చంద్ర నుండి ఫోన్

వస్తుంది దివ్య కి. దివ్య : నాన్న ఫోన్ చేస్తు న్నారు.. మీతో

తర్వాత మాట్లా డుతాను. అని చెప్పి దివ్య వెళ్ళిపోతుంది.

దివ్య వెళ్ళిపోయాక ఆనంద్ తన రూం లోకి వెళ్తా డు.

రూం లోకి వెళ్ళిన ఆనంద్ కి తన నాన్న గుర్తు కొచ్చి, ఫోన్

చేస్తా డు భాస్కర్ కి. భాస్కర్ : ఎంతో ఆనందంగా ఫోన్

లిఫ్ట్ చేసి., హలో నాన్న.. ఆనంద్.. నువ్వేనా? ఆనంద్ : హా

నేనే నాన్న. ఎలా ఉన్నారు? భాస్కర్ : (చాలా

సంతోషంగా) మేము బాగున్నామ్ నాన్న, నువ్వెలా

ఉన్నావు రా? ఆనంద్ : నేను బాగానే ఉన్నాను నాన్న.

అమ్మ ఎలా ఉంది? భాస్కర్ : బానే ఉంది నాన్న., మీ

అమ్మతో మాట్లా డుతావా? కరుణా... కరుణా....

ఇదిగో... ఎవరు ఫోన్ చేసారో చూడు. కరుణ :

ఎవరండీ? భాస్కర్ : ఆనంద్.... కరుణ : హలో నాన్న..


ఎలా ఉన్నావు రా? ఆనంద్ : బాగున్నా అమ్మ. నువ్వెలా

ఉన్నావు? కరుణ : బాగున్నా రా..నాన్న.. నిన్ను

చూడాలని ఉంది రా.. ఆనంద్ : ఇప్పుడు చాలా వర్క్

ఉందమ్మా, రావడం కుదరదు.. కరుణ : పోనీ, మేమే

వస్తాం రా.. ఆనంద్ : పర్లేదమ్మ వీలు చూసుకొని నేనే

వస్తా లే., నాకు వీలు కుదరకపోతే మీరే వద్దు రు గానీ..,

నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా లే.. ఉంటాను అమ్మ. కరుణ :

అలాగే రా జాగ్రత్త.. (ఫోన్ కట్ చేసి ఇద్దరూ చాలా

సంతోషపడుతారు.) ఆనంద్ : ఫోన్ కట్ చేసి, ఆద్య

గురించి ఆలోచిస్తూ ఉంటాడు, తను ఇంతకుముందు

ఎందుకు అలా చేసిందోనని.. అసలు ఈ అమ్మాయి

నన్ను చూసి ఎందుకు భయపడుతుంది? నేనేం

అన్నాను? అని అనుకుంటూ ఉంటాడు.

You might also like