బాప్తిస్మము ఎలా పొందాలి

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

www.biblesamacharam.

com

బాప్తిస్మము ఎలా పొందాలి ?


1. నమ్మి, బాప్తిస్మము పొందాలి.
(మార్కు సువార్త) 16:16
16.నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష
విధింపబడును.
16:16 బాప్తిసం గురించి నోట్ మత్తయి 3:6. రక్షణ, పాపవిముక్తి విశ్వాసం
మూలంగానే (యోహాను 3:16; 5:24; 6:47; అపొ కా 16:31; రోమ్ 1:17;
3:22, 25; గలతీ 2:16; ఎఫెసు 2:8-9). విశ్వాసం తప్ప మరి దేనికీ అందులో
పాత్ర లేదు. రక్షణ కలగడానికి బాప్తిసం అవసరం లేదు. అయితే
యేసుప్రభువును ప్రభువుగా రక్షకుడుగా నమ్మినవారు బాప్తిసం తీసుకొని తమ
నమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి తాను క్రీస్తు ను
నమ్ముకున్నానని చెప్పి, బాప్తిసాన్ని పొందేందుకు నిరాకరిస్తే అతని నమ్మకాన్ని
సందేహించేందుకు మనకు న్యాయమైన కారణం ఉంది.
“బాప్తిసం పొందని వ్యక్తికి”- శిక్షావిధి కలుగుతుంది అనలేదు యేసు. ఇది
గమనించండి. నమ్మనివ్యక్తికి శిక్షావిధి కలుగుతుందనే చెప్పాడు. యోహాను
3:17-18 పోల్చి చూడండి. ఇక్కడ “శిక్షావిధి” అంటే నరకం.
16:16 మత్తయి 28:19; మార్కు 1:15; లూకా 8:12; యోహాను 1:12-13;
3:5, 15-16, 18-19, 36; 5:24; 6:29, 35, 40; 7:37-38; 8:24; 11:25-
26; 12:46-48; 20:31; అపొ కా 2:38, 41; 8:36-39; 10:43; 13:39,
46; 16:30-32; 22:16; రోమ్ 3:6; 4:24; 10:9-14; 2 తెస్స 1:8; 2:12;
హీబ్రూ 10:38-39; 1 పేతురు 1:21; 3:21; 1 యోహాను 5:10-13; ప్రకటన
20:15; 21:8
2. మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందాలి.
(అపొస్తలుల కార్యములు) 2:38
www.biblesamacharam.com
38.పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధా త్మ
అను వరము పొందుదురు.
2:38 పశ్చాత్తా పం, బాప్తిసం గురించిన నోట్స్ మత్తయి 3:2, 6; మార్కు
16:16; లూకా 13:3. యోహాను ఇచ్చిన బాప్తిసం లాగా కాక క్రైస్త వ బాప్తిసం
యేసు పేరుతో, పవిత్రాత్మ అనే దేవుని ఉచిత వరంతో సంబంధం గలది. 19:5
కూడా చూడండి. పాపక్షమాపణ కావాలంటే బాప్తిసం తప్పకుండా
తీసుకోవాలని పేతురు ఉపదేశించడం లేదు. క్షమాపణ మనుషులు చేయగల ఏ
క్రియమీదా, ఏ ఆచారం, ఏ సంస్కారం మీదా ఆధారపడదని అతనికి బాగా
తెలుసు. క్షమాపణ దేవుని కృపమూలంగానే కలుగుతుంది, నమ్మకంద్వారానే
కలుగుతుంది. క్షమాపణ గురించి మత్తయి 6:12; 9:5-7; 12:31; 18:23-
25; ఎఫెసు 1:7; 1 యోహాను 1:9; యెషయా 55:7 నోట్స్ చూడండి.
ఇక్కడ పేతురు మాటల భావం స్పష్టంగా ఉంది. ఈ మాటలలో ఆ భావాన్ని
చెప్పవచ్చు – “యేసును గురించి మీరు మనసు మార్చుకొని, ఆయనను
ఇస్రాయేల్ అభిషిక్తు డుగా, దేవుని కుమారుడుగా నిరాకరించిన పాపంనుంచి
మళ్ళుకొని ఆయనను స్వీకరించండి. ఆయన పేర, అంటే ఆయన స్వభావం,
పదవి, అధికారం ప్రకారంగా, ఆయనలో ఉన్న మీ నమ్మకానికి బహిరంగ
సూచనగా బాప్తిసం పొందండి. అది తనమీద నమ్మకముంచినవారికి ఆయన
ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణకు కూడా సూచనగా ఉంటుంది”.
పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందడం పాపక్షమాపణ దొరికేలా బాప్తిసం
పొందడమని అర్థం కాదు. ఈ వచనం మత్తయి 3:11 తో పోల్చి చూడండి.
యోహాను బాప్తిసం ఇచ్చిన కారణం ప్రజలు పశ్చాత్తా ప పడినందువల్లే.
“యేసుక్రీస్తు పేర” బాప్తిసం అంటే ప్రభువుగా అభిషిక్తు డుగా ఉన్న ఆయన
అధికారం చొప్పున బాప్తిసం (వ 36). విశ్వాసులకు బాప్తిసమిస్తూ ఉన్నప్పుడు
ఇచ్చేవారు పలకవలసిన మాటలను పేతురు ఇక్కడ ఇవ్వడం లేదు. మత్తయి
28:19 పోల్చి చూడండి.
www.biblesamacharam.com
దేవుడు పవిత్రాత్మను ఉచితంగా, కృపావరంగా ఇస్తా డని గమనించండి.
యోహాను 7:37-39; 14:16-17; గలతీ 3:2 పోల్చి చూడండి. అపొ కా
10:44-48 చూడండి. కొర్నేలి, అతనితో ఉన్నవారు బాప్తిసం పొందకముందే
పవిత్రాత్మను (పాపక్షమాపణను కూడా) పొందారు.
2:38 A యెషయా 44:3-4; 59:21; యెహె 36:25-27; జెకర్యా 12:10;
మత్తయి 3:2, 8-9; 4:17; 21:28-32; 28:19; మార్కు 1:15; 16:16;
లూకా 24:47; అపొ కా 2:16-18; 3:19; 5:31; 8:12, 15-17, 20, 36-38;
10:44-45, 48; 17:30; 19:4-5; 20:21; 22:16; 26:18, 20; రోమ్ 6:3;
1 కొరింతు 1:13-17; 1 పేతురు 3:21; B యెషయా 32:15; యెహె 39:29;
యోవేలు 2:28-29; అపొ కా 16:15, 31-34; తీతు 3:5; C లూకా 15:1-32

3. వాక్యము అంగీకరించి బాప్తిస్మము పొందాలి.


(అపొస్తలుల కార్యములు) 2:41
41.కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ
దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
2:41 పేతురు ఇచ్చిన సందేశాన్ని అంగీకరించడం అంటే వారు
యేసుప్రభువులో నమ్మకముంచి ఆయనను ప్రభువుగా, అభిషిక్తు డుగా,
పాపవిముక్తి ప్రధాతగా స్వీకరించారని అర్థం (వ 36,38). నమ్మడం ద్వారా
పాపక్షమాపణ, శాశ్వత జీవం కలిగి (యోహాను 3:16, 36; 5:24; 6:47)
తాము నమ్మిన సంగతికి బహిరంగ సూచనగా బాప్తిసం పొందారు. అలా చేసిన
ఈ 3000 మంది జెరుసలంలో క్రీస్తు ను తిరస్కరించి సిలువ వేసిన నాయకుల
మధ్య ఉన్నారు. అయినా వారు నమ్మి బాప్తిసం పొందారు. క్రీస్తు మరణం
నుంచి లేచాడని రుజువులు అంత సంపూర్ణంగా, తేటగా ఉన్నాయన్నమాట.
పవిత్రాత్మ ద్వారా రాయబారులు చెప్పిన సాక్ష్యం అంత శక్తివంతంగా ఉందన్న
మాట.
www.biblesamacharam.com
2:41 A అపొ కా 2:47; 4:4; B అపొ కా 2:37; 16:31-34; C కీర్తన 110:3;
యోహాను 14:12; అపొ కా 8:6-8; 13:48; D కీర్తన 72:16-17; మత్తయి
13:44-46; లూకా 5:5-7; అపొ కా 1:15; గలతీ 4:14-15; E 1 తెస్స 1:6
4. ప్రార్థన చేసి బాప్తిస్మము పొందాలి.
(అపొస్తలుల కార్యములు) 22:16
16.గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి
ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
22:16 బాప్తిసం గురించి 2:38; మత్తయి 3:2; మార్కు 16:16 నోట్స్
చూడండి. అననీయస్ మాటలను బట్టి చూస్తే బాప్తిసం పాపంనుంచి
అంతరంగ శుద్ధీకరణకు బహిరంగ సూచన. ఈ అంతరంగ శుద్ధి క్రీస్తు రక్తం
మూలంగానే కలుగుతుంది (హీబ్రూ 9:14).
22:16 A అపొ కా 2:38; 1 కొరింతు 6:11; హీబ్రూ 10:22; B అపొ కా
2:21; 1 కొరింతు 12:13; గలతీ 3:27; తీతు 3:5; 1 పేతురు 3:21; C కీర్తన
119:60; అపొ కా 9:14; రోమ్ 6:3-4; 10:12-14; D అపొ కా 9:18; 1
కొరింతు 1:2; E యిర్మీయా 8:14

You might also like