Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

padi graamula khareedu laksha roopaayalaku parigeDutunna bangaaraanni cooDagaanae asalee

bangaaraanni calaamaNeeloeki teesukoccindi evaraa eppuDaa anae kutoohalam kaligindi. adi


telusukoeni meeku ceppae prayatnamea ee viDiyoe.

saadhaaraNa Saka poorvam aeDoe Sataabdamloe madhya dharaa samudra sameepamloeni


liDiyaa anae praamtamloe unna oka nadi, daggarloe unna konDala nunDi bangaarapu
khanijaanni teesukoccaedi. bangaaram teccaedi anTae buTTalloe teccaedi anukoemaakanDi.
muDi bangaaram neeTi pravaahamtoe koTTukoccaedi. akkaDa gala prajalu aa khanijamloe unna
bangaaraanni vaeru caesi aabharaNaalu, poojaa saamaagri caesae vaaru.

aa samayamloe, aa nadi daggarloe oka vyaktiki kaakataaLiyamgaa dorikina raayi prapamca


caritranae maarcaesindi. adae geeTu raayi.

appaTi daakaa bangaaramtoe aabharaNaalu, vastuvulu tayaaruceasae vaaru kaani, aa vastuvula


naaNyata kanukkoevaDam saadhyam ayyaedi kaadu. geeTu raayitoe aa samasya teeri poeyindi.
naaNyamaina bangaaraanni geeTu raayi meeda geestae oka rakamaina merupu vastae, kaltee
bangaaraanni geeci coostae inkoe rakamaina merupu vaccaedi.

paigaa aa merupulaloe gala taeDaani baTTi vaaTiloe enta kaltee jarigindi aneadi kooDaa
telusukoegalagaDam saadhyam ayindi. antaka mundu vastu maarpiDi paddatiloe ekkuva
vyaapaaram jarigaedi, endukanTae naenu ammina vastuvuki evarainaa bangaaram roopamloe
Dabbu istae adi karigincae daagaa adi enta naaNyamainadoe kanukkoevaDam saadhyam ayyaedi
kaadu. appaTloe venDi, raagi naaNaelu unnaa vaaTi viluva takkuva kaabaTTi pedda mottamloe
vartakam caeyaalanTae bastaalu bastaalu venDi naaNaelu avasaramayyaevi, vaaTini aTu iTu
moesukeLLaDam, dongala nunDi kaapaaDukoevaDam pedda samasya.

geeTu raayitoe aa renDu samasyalu oka debbatoe teeripoeyaayi, naa daggara aa raayi unTae ae
vyaapaari naaku bangaaru naaNaelu iccinaa, okka saari geeki coosi vaaTini pareekshincagalanu,
alaagea bangaaram viluva ekkuva kaabaTTi ekkuva naaNaelu moesuku poeyae avasaram laedu.
anteagaaka ikkaDoe inkoe aDvaanTaeji kooDaa undi.

intaka mundu bangaaramtoe vartakam caeyaalanTae kaevalam nammakastula vadda maatramae


caeyagalam, kotta vaaLLainaa, vaerae daeSastulainaa kaltee kaluputaaraemoenanna bhayamtoe.
ippuDu aa ibbandi laedu, aa geeTu raayi paTTukuni appaTi prapamcamloe unna ae
pradaeSaanikainaa veLLi vyaapaaram caeyagala saamardhyam vaccindi. appaTi daaka natta
naDakana naDicae vyaapaaram parugulu modalu peTTi, prapamcaanni antaTini oka taaTi
kindaki teesuku vaccindi.

aa liDiyaaloe dorikina raayi iccina ooputoe appaTloe roeman saamraajyam bangaarapu naaNealu
viDudala caesindi, adae naaNaelaatoe mana telugu bhoomini paripaalincina Saatavaahanulu
kooDaa vartakam caesaaru.

adi bangaaram katha.

meekoesam kanTenTu maasTaaru. meeku naccina maarpulu caesukuni praakTees caeyanDi.

పది గ్రా ముల ఖరీదు లక్ష రూపాయలకు పరిగెడుతున్న బంగారాన్ని చూడగానే అసలీ బంగారాన్ని

చలామణీలోకి తీసుకొచ్చింది ఎవరా ఎప్పుడా అనే కుతూహలం కలిగింది. అది తెలుసుకోని మీకు చెప్పే

ప్రయత్నమే ఈ విడియో.

సాధారణ శక పూర్వం ఏడో శతాబ్దంలో మధ్య ధరా సముద్ర సమీపంలోని లిడియా అనే ప్రాంతంలో ఉన్న ఒక

నది, దగ్గర్లో ఉన్న కొండల నుండి బంగారపు ఖనిజాన్ని తీసుకొచ్చేది. బంగారం తెచ్చేది అంటే బుట్టల్లో తెచ్చేది

అనుకోమాకండి. ముడి బంగారం నీటి ప్రవాహంతో కొట్టు కొచ్చేది. అక్కడ గల ప్రజలు ఆ ఖనిజంలో ఉన్న

బంగారాన్ని వేరు చేసి ఆభరణాలు, పూజా సామాగ్రి చేసే వారు.

ఆ సమయంలో, ఆ నది దగ్గర్లో ఒక వ్యక్తికి కాకతాళియంగా దొరికిన రాయి ప్రపంచ చరిత్రనే మార్చేసింది. అదే

గీటు రాయి.
అప్పటి దాకా బంగారంతో ఆభరణాలు, వస్తు వులు తయారుచేసే వారు కాని, ఆ వస్తు వుల నాణ్యత

కనుక్కోవడం సాధ్యం అయ్యేది కాదు. గీటు రాయితో ఆ సమస్య తీరి పో యింది. నాణ్యమైన బంగారాన్ని గీటు

రాయి మీద గీస్తే ఒక రకమైన మెరుపు వస్తే , కల్తీ బంగారాన్ని గీచి చూస్తే ఇంకో రకమైన మెరుపు వచ్చేది.

పైగా ఆ మెరుపులలో గల తేడాని బట్టి వాటిలో ఎంత కల్తీ జరిగింది అనేది కూడా తెలుసుకోగలగడం సాధ్యం

అయింది. అంతక ముందు వస్తు మార్పిడి పద్దతిలో ఎక్కువ వ్యాపారం జరిగేది, ఎందుకంటే నేను అమ్మిన

వస్తు వుకి ఎవరైనా బంగారం రూపంలో డబ్బు ఇస్తే అది కరిగించే దాగా అది ఎంత నాణ్యమైనదో కనుక్కోవడం

సాధ్యం అయ్యేది కాదు. అప్పట్లో వెండి, రాగి నాణేలు ఉన్నా వాటి విలువ తక్కువ కాబట్టి పెద్ద మొత్తంలో

వర్తకం చేయాలంటే బస్తా లు బస్తా లు వెండి నాణేలు అవసరమయ్యేవి, వాటిని అటు ఇటు మోసుకెళ్ళడం,

దొంగల నుండి కాపాడుకోవడం పెద్ద సమస్య.

గీటు రాయితో ఆ రెండు సమస్యలు ఒక దెబ్బతో తీరిపో యాయి, నా దగ్గర ఆ రాయి ఉంటే ఏ వ్యాపారి నాకు

బంగారు నాణేలు ఇచ్చినా, ఒక్క సారి గీకి చూసి వాటిని పరీక్షించగలను, అలాగే బంగారం విలువ ఎక్కువ

కాబట్టి ఎక్కువ నాణేలు మోసుకు పో యే అవసరం లేదు. అంతేగాక ఇక్కడో ఇంకో అడ్వాంటేజి కూడా ఉంది.

ఇంతక ముందు బంగారంతో వర్తకం చేయాలంటే కేవలం నమ్మకస్తు ల వద్ద మాత్రమే చేయగలం, కొత్త వాళ్ళైనా,

వేరే దేశస్తు లైనా కల్తీ కలుపుతారేమోనన్న భయంతో. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, ఆ గీటు రాయి పట్టు కుని

అప్పటి ప్రపంచంలో ఉన్న ఏ ప్రదేశానికైనా వెళ్ళి వ్యాపారం చేయగల సామర్ధ్యం వచ్చింది. అప్పటి దాక నత్త

నడకన నడిచే వ్యాపారం పరుగులు మొదలు పెట్టి, ప్రపంచాన్ని అంతటిని ఒక తాటి కిందకి తీసుకు వచ్చింది.

ఆ లిడియాలో దొరికిన రాయి ఇచ్చిన ఊపుతో అప్పట్లో రోమన్ సామ్రా జ్యం బంగారపు నాణేలు విడుదల

చేసింది, అదే నాణేలాతో మన తెలుగు భూమిని పరిపాలించిన శాతవాహనులు కూడా వర్తకం చేసారు.
అది బంగారం కథ.

You might also like