Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

ఈనాడు
వికీపీడియా నుండి
ఈనాడు తెలుగు రాష్ట్రా లలో అత్య ధిక సర్క్యు లేషన్
కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్
గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 పత్రిక
అమ్మ కాలతో దేశంలో ఎనిమిదవ స్థా నంలో నిల్చింది.
1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు
పత్రికారంగంలో విప్లవాత్మ క మార్పు లు తెచ్చింది.

విషయాలు
ప్రారంభం
రకం దిన పత్రిక
ఎడిషన్
రూపం తీరు బ్రాడ్ షీట్
ప్రస్థా నం యాజమాన్యం ఉషోదయ ఎంటర్ప్రై జెస్
అమ్మ కాలు, చదువరులు ప్రైవేటు లిమిటెడ్

భాష ప్రచురణకర్త రామోజీరావు

శీర్షికలు, విశిష్టతలు సంపాదకులు తెలంగాణ ఎడిషన్ ఎడిటర్:


డి.ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్
పాత శీర్షికలు, విశిష్టతలు
ఎడిషన్ ఎడిటర్: ఎం.
పరిశోధనా విభాగం నాగేశ్వ రరావు [1]
జర్న లిజం స్కూ ల్ స్థా పించినది ఆగష్టు 10,1974
ఆన్ లైన్ వెర్షన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
కేంద్రం హైదరాబాద్,తెలంగాణ
ప్రముఖులు
Circulation 16,56,933 [2]
విమర్శ లు
జాలస్థలి ఈనాడు జాలస్థలి (http://www.e
మూలాలు enadu.net)
బయటి లింకులు

ప్రారంభం
1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మ ధార పక్క న నక్క వానిపాలెం అనే
ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్స రం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్
చేయబడింది.[3][4]

చాలా సాధారణంగా, ఏ ఆర్భా టాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థా నం మొదలైంది.
ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యే కతలుండేవి. అప్ప ట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కు వగా
ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే
అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్ప టి వరకు ప్రజలకు అందుబాటులో లేని
కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్క లా

https://te.wikipedia.org/wiki/ఈనాడు 1/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

తప్పించి మిగిలిన రాష్ట్రం


మొత్తమ్మీ ద పత్రికలు
వచ్చే సరికి బాగా ఆలస్యం
అయ్యే ది; కొన్ని చోట్ల
మధ్యా హ్నం అయ్యే ది.
అలాంటిది తెల్లవారే సరికి
గుమ్మంలో దినపత్రిక
అందించడమనే కొత్త
సంప్రదాయానికి ఈనాడు
శ్రీకారం చుట్టింది. ఈ కొత్త హైదరాబాదు, సోమాజీగూడలో ఈనాడు
ప్రధాన కార్యా లయం తర్వా త రామోజీ
అనుభవాన్ని ప్రజలు
ఫిల్మ్ సిటీకి మార్చా రు
ఈనాడు వ్య వస్థా పకుడు ఆనందంతో స్వీ కరించారు.
అలాగే తెలుగు పత్రికల
పేర్లు - ఆంధ్రజ్యో తి, ఆంధ్రప్రభ, మొదలైనవి - తెలుగు భాషకు
సహజమైన చక్క టి గుండ్రటి అక్షరాలతో అచ్చ య్యే వి. అయితే ఈనాడు ఈ సంప్రదాయాన్ని
పక్క నపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా
అనిపించింది. విశాఖపట్నంలో ముఖ్య దినపత్రికలేవీ అచ్చ వని ఆ రోజుల్లో ఈనాడు స్థా నిక వార్తలకు
ప్రాధాన్య తనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థా నిక
వార్తలను అందిస్తూ రావడమే ఒక ప్రధాన కారణం.

ఎడిషన్
ఆంధ్రప్రదేశ్ లో 12, తెలంగాణాలో 7, దేశంలో ఇతర తెలుగువారు వుండే ప్రాంతాలలో 4, మొత్తం 23
ఎడిషన్లు ముద్రిస్తున్నా రు.

ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురము, రాజమహేంద్రవరం,


గుంటూరు, నెల్లూ రు, శ్రీకాకుళం, కర్నూ లు, తాడేపల్లిగూడెం, కడప, ఒంగోలు
తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, సూర్యా పేట,వరంగల్, నిజామాబాదు, ఖమ్మం, మహబూబ్
నగర్
ఇతర ప్రాంతాలు: చెన్నై , బెంగుళూరు, ముంబై, ఢిల్లీ,

ప్రస్థా నం
పాత్రికేయుడైన ఏ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. ఆయన నిర్వ హణలోను, ఆ
తరువాత కూడా, ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో రెండవ
ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా
మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్య ధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా
పత్రికలలో మూడవ స్థా నానికి చేరింది.

సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్ఠమైన సమాచార సేకరణ వ్య వస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని
సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్య మైన తెరవెనుక కారణాలు కాగా, స్థా నిక
వార్తలకు ప్రాధాన్య తనివ్వ డం, క్రమం తప్ప కుండా ప్రతిరోజు కనిపించే కార్టూ న్లు, పేజీలో వార్తల
అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు.

పరిశోధనాత్మ క వార్తలకు ఈనాడు పేరెన్ని కగన్న ది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మ క
పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. సిమెంటు కుంభకోణం, టిటిడిలో మిరాశీదార్ల
అక్రమాలు, భూకబ్జా లు మొదలైన వాటినెన్ని టినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో తెలుగు
దేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ముఖ్య పాత్ర పోషించింది.
రామారావు పర్య టనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది.[5] 1993, 1994లలో జరిగిన

https://te.wikipedia.org/wiki/ఈనాడు లో లో 2/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

మధ్య నిషేధ ఉద్య మంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్య మం కొరకు
ఒక పేజిని ప్రత్యే కించింది, ఈనాడు. గుజరాత్ భూకంపం, హిందూ మహాసముద్ర సునామి వంటి ప్రకృతి
విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.

1989 జనవరి 26న గ్రామీణ వార్తల కొరకు మినీ ఎడిషన్లని ప్రారంభించింది. గ్రామీణ స్థా యిలో విలేకరుల
వ్య వస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పేరుపొందింది. తన రాష్ట్రం, తన జిల్లా వార్తల వరకే
పరిమితమైన తెలుగు పాఠకులు తన గ్రామంలో జరిగిన వార్తలను కూడా పత్రికలలో చదవడం
మొదలు పెట్టా రు. ఈ సంప్రదాయాన్ని మిగిలిన పత్రికలూ అనుసరించాయి.

ఆదివారం అనుబంధాన్ని 28 పిభ్రవరి 1988 నుండి వారపత్రిక రూపంలో ప్రచురించటంతో బాగా


ప్రాచుర్యం పొంది మిగతా దినపత్రికలు కూడా ఆ పద్ధతినే అవలంబించాయి. 1992 సెప్టెంబరు 24న
మహిళల కోసం ప్రత్యే కంగా వసుంధర పేజీని ప్రారంభించింది. 1994 ఏప్రిల్ 15 న ఉద్యో గవకాశాల
కథనాలతో "ప్రతిభ" శీర్షికను ప్రారంభించింది. 1985 ఆగష్టు నుండి రైతేరాజు శీర్షికతో రైతాంగానికి
సంబంధించిన సమాచారం అందజేస్తున్న ది.[6] ఈనాడులో 2010 తరువాత ఆదివారము
అనుబంధంలో రాశి ఫలాలు చేర్చా రు

అమ్మ కాలు, చదువరులు


అమ్మ కాలు

ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, ఈనాడు పత్రిక సగటున 16,56,933 పత్రిక అమ్మ కాలతో
దేశంలో ఎనిమిదవ స్థా నంలో నిల్చింది. [2]2018 సంవత్స రపు ఇదేకాలంతో పోల్చి తే 8.3% తగ్గుదల
కనబడింది.>[7] 2018 గణాంకాలను 2017 సంవత్స రపు ఇదేకాలంతో పోల్చి తే 2.9% తగ్గుదల
కనబడింది. 2006 జనవరి-జూన్ గణాంకాల ప్రకారం సగటున 11,76,028 ప్రతిదినం పత్రిక
అమ్మ కాలుండేవి.[8]

చదువరులు

ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం ఈనాడుకు తెలుగు రాష్ట్రా ల్లో రోజువారి సగటున
పత్రిక చదివేవారి సంఖ్య 58,23,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య
1,39,46,000 గా వుంది. గత త్రైమాసికంతో పోల్చి తే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 11.5%
తగ్గింది.[9] NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, అప్ప ట్లో దేశంలోనే
తృతీయ స్థా నంలో నిలచింది.[10]

భాష
ఒక్కొ క్క వ్య క్తికి ఒక ప్రత్యే కమైన శైలి ఉండే మాట నిజం. అయితే పత్రికా ప్రచురణ ఎవరో ఒక
వ్య క్తి చేయగలిగింది కాదు. అందులోనూ దినపత్రికల విషయంలో అసలు సాధ్యం కాదు.
రకరకాల అనుభవాలూ, విద్యా సంస్కా రాలు ఉన్న వ్య క్తు లు పత్రికల్లో పనిచేస్తుంటారు.
వారంతా ఒక ప్రాంతంవారు గాని, ఒక మతం వారు గాని కారు. విద్య , కులం, మతం, వృత్తి,
ప్రాంతం వంటివన్నీ భాషలో బేధాలు తెచ్చి పెట్టేవే. భాషలో ఉన్న ప్రత్యే కత వైవిధ్యంలో
ఏకత్వం, భిన్న వ్య క్తు లు రాసే భాషలో ఏకత్వం సాధించటం అంటే భిన్న మాండలికాల
నుంచి ఒక సాధారణ భాషా లక్షణాన్ని ఏర్ప రుచుకోవటమే. ఒకే పత్రిక భిన్న ప్రాంతాల
నుంచి ఏక కాలంలో వెలువడేటప్పు డు ఆ పత్రికా భాషలో సాధ్య మైనంత ఏకరూపత
లేకపోతే అది ఒకే పత్రిక అనిపించదు. అందువల్ల అందరూ పాటించవలసిన కొన్ని
నియమాలు ఏర్ప రుచుకోవాలి. ప్రపంచ భాషా పత్రికలన్నింటికీ భాషా విషయకంగా కూడా
కొన్ని నియమనిబంధనలున్నా యి. అలాగే ఈనాడుకూ కావాలి

—బూదరాజు రాధాకృష్ణ

లో
https://te.wikipedia.org/wiki/ఈనాడు లో 3/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

ఈనాడులో ఉపయోగించే భాష విషయంలో నియమాలు రూపొందించుకుని, పూర్తిస్థా యి భాషా శైలిని


రూపొందించుకున్నా రు. ఈ భాషా శైలిని రూపొందించడంలో భాషాశాస్త్రజ్ఞుడు, పాత్రికేయుడు
బూదరాజు రాధాకృష్ణ కృషి ఉంది. అతను ఈనాడు భాషా స్వ రూపం అన్న పుస్తకాన్ని కూడా ఈ
విషయంపై రాశాడు. ఈ నిబంధనలు రూపొందించుకోవడంతో పాటుగా, అమలుచేయడంలో కూడా
ఈనాడు సంస్థ పలు విధానాల్లో కృషిచేసింది. పత్రికల్లో పలు ప్రాంత, మత, కుల, విద్య నేపథ్యా లకు
చెందినవారు పనిచేసినా ఇదంతా ఒకటే పత్రిక అన్న భావన పాఠకుడికి రావడానికి ఈ భాషా శైలి, ఆ
భాషా శైలిని అమలుచేసి పత్రికా భాషలో ఏకరూపత తీసుకురావడం ఉపయోగపడతాయి. అత్యంత
సంక్లిష్టమైన ఏకరూపతను ఈనాడు పత్రిక సాధించి, నిలబెట్టుకుంది. "భాషా ప్రయోగం విషయంలో
ఈనాడు సాధించిన ఏకరూపత లేదా తనదైన ప్రత్యే క శైలిని మరో పత్రిక సాధించినట్లు కనిపించదు."
అని కాసుల ప్రతాపరెడ్డి పేర్కొ న్నా డు.[11]

భాష విషయంలో ఈనాడు తెలుగు పత్రికలలో ఒక ఒరవడి సృష్టింది. సాధారణంగా ఇంగ్లీషులో


అందుకునే వార్తలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తా రు. అయితే సమయం తక్కు వగా ఉండటం
చేతగాని, ఒక పద్ధతికి అలవాటు పడటం వలనగానీ మిగిలిన పత్రికలలో భాష క్లిష్టమైన పదాలతో కూడి,
సరళంగా ఉండేది కాదు. ఈనాడు, అనువాదాన్ని సరళతరం చేసి, సహజమైన, సులభమైన భాషలో
వార్తలను అందించింది.

https://te.wikipedia.org/wiki/ఈనాడు లో 4/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

తెలుగు భాష కొరకు ఆదివారం పుస్తకంలో ప్రత్యే క శిర్షికలను ఈనాడు అందిస్తూ ఉంది. మామూలుగా
దినపత్రికలు అందించే కథలు, కథానికలే కాక, భాష విస్తృతికి దోహదం చేసే శీర్షికలను ప్రచురించింది.
వాటిలో కొన్ని : తెలుగులో తెలుగెంత, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక,
మాటలు, మార్పు లు మొదలైనవి.

శీర్షికలు, విశిష్టతలు

వారం శీర్షిక వివరాలు

సోమవారం విద్య కు సంబంధించి, నూతన కోర్సు ల గురించి సమాచారం[8]

ఆరోగ్యంనకు, జబ్బు లు సంబంధించి వైద్యు లతో నివారణ చర్య లు, చర్చ ,


మంగళవారం
సూచనలు ఆరోగ్య సంరక్షణ గురించి సమాచారం

ప్రపంచ ఆటలు, క్రీడల గురించి సమగ్ర సమాచారం, విశ్లేషణ ఆటలలో గత


బుధవారం
రికార్డులు, జరగబోవు క్రీడల సమాచారం.

కంప్యూ టర్, సమాచార సాంకేతికాంశాలు గురించి సమాచారం, ప్రశ్న లు-


గురువారం
జవాబులు, ఉపయోగకరమైన వెబ్సై ట్ల వివరాలు

ఆర్ధిక అంశాలు పన్ను లు, వడ్డీలు, మ్యూ చువల్ ఫండులు, ఆర్థిక నేరాలు-
శుక్రవారం
మోసాలు తీసికోవలసిన జాగ్రత్తలతో నిపుణులతో సూచనలు, మెలకువలు

యువతారానికి సంబంధించిన విషయాలు, విజయాలు, వ్య క్తిత్వ వికాసానికి


శనివారం సంబంధించిన నిపుణుల సూచనలు, వ్యా సాలు.
స్థిరాస్తుల గురించి 4 పుటల ప్రత్యే క అనుభందంలో గృహ రుణాలు, రాష్ట్రం,
దేశంలోని రియల్ ఎస్టేట్ సమాచారం, నిపుణుల సూచనలు, ప్రకటనలు.

చదువకునే బాలబాలికలు ఆసక్తి కలిగించే బొమ్మ లకు రంగులద్దడం, బొమ్మ లు


ఆదివారం
గీయడం, చిక్కు ప్రశ్న లు లాంటివి వుంటాయి.

ఆదివారం ప్రత్యే క అనుబంధాన్ని పుస్తకం రూపంలో అందించే సంప్రదాయాన్ని


తెలుగులో మొదలు పెట్టింది ఈనాడే. 1988 ఫిబ్రవరి 28నాడు ఇది మొదలైంది.
సరదా పఠనం ఈ పుస్తకంలోని శీర్షికల ముఖ్య ఉద్దేశం సరదా సంగతులు,
ఆదివారం
కార్టూ నులు, వ్య క్తు ల గురించి వ్యా సాలు, పర్యా టక క్షేత్రాల వివరాలు, చిన్న
పిల్లలకు కావలసిన వినోదం మొదలగు సమాచారం.
తదుపరి ఇతర పత్రికలు కూడా ఈ బాటనే నడిచాయి.

స్త్రీలకు ప్రత్యే కించిన ఈ అనుబంధంలో బహుళ ప్రచారం పొందిన మహిళల


గురించే కాక, రాష్ట్రంలోని, దేశ విదేశాలలోని వార్తలకెక్క ని గొప్ప స్త్రీల గురించిన
విజయాలు, విశేషాలు, స్త్రీ ఆరోగ్య , సౌందర్య చిట్కా లు, గృహాలంకరణ, ఉద్యో గ
ప్రతిదినం
జీవితం మొదలగు సమాచారం ప్రచురిస్తా రు.
ఇప్పు డు చాల తెలుగు దినపత్రికలు స్త్రీల కోసం ప్రత్యే క అనుబంధాలు
ప్రచురించే సంప్రదాయానికి ఈ వసుందర శీర్షిక ప్రేరణ అని చెప్ప వచ్చు .

పూర్తిగా రెండు పేజీలలో వ్యా పార సంబంధ సమాచారం, మార్కె ట్ కబుర్లు,


ప్రతిదినం ప్రస్తుత విదేశీ మారకపు రేట్లు, బంగారం, వెండి ధరలు, షేర్ల ధరల సూచిక,
మాట-మంతి మొదలగు వివరాలు.

ఈనాడు సినిమాలో కొత్త సినిమాల ప్రారంభోత్స వాలు, షూటింగ్ జరుపుకుంటున్న


ప్రతిదినం సినిమాల విశేషాలు, కబుర్లు, ఇంటర్వ్యూ లు, వ్యా సాలు, నటీ, నటుల, సాంకేతిక
నిపుణుల ఫోటోలు ఉంటాయి.

పాత శీర్షికలు, విశిష్టతలు


https://te.wikipedia.org/wiki/ఈనాడు 5/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

వారం శీర్షిక వివరాలు

ఈ శీర్షిక క్రింద పత్రిక మొదటి పుటలో ఎడమవైపు క్రింద వ్యంగ్య


చిత్రకారుడు శ్రీధర్ నిర్వ హణలో చిన్న వ్యంగ్య చిత్రం(కార్టూ న్)
వర్తమాన సంఘటనల మీద (ఎక్కు వగా రాజకీయాల మీద)
ప్రచురించారు. శ్రీధర్ తొలి కార్టూ న్ 22 ఆగస్టు 1981 నాడు
ముద్రించగా, 30 ఆగస్టు 2021 న ఈనాడునుంచి
వైదొలిగాడు.[12]చివరి కార్టూ న్ 13 ఆగస్టు 2021 నాడు
ముద్రితమైంది. [13]

మన బళ్లలో
కూడా తెలుగు
పెట్టా లి సార్‌
ప్రతిదినం (ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ
పాఠశాలలలో
ఆంగ్ల
మాధ్య మం
ప్రవేశపెట్టా లన్న
ప్రభుత్వ
నిర్ణయం మీద 3
జూలై 2008
నాటి వ్యంగ్య
చిత్రం)

పరిశోధనా విభాగం
ఈనాడుకు ఒక స్వంత పరిశోధనా విభాగం (రీసెర్చి అండ్ రిఫరెన్స్ గ్రూప్) ఉంది. ఇది ఈనాడుకు
సమాచార నిధి వంటిది. దేశ విదేశాలనుండి ఎన్నో పత్రికలు వస్తా యి. ప్రపంచ వ్యా ప్తంగా జరిగే
పరిణామాలు, వార్తల విశ్లేషణకు, వివరణకు అవసరమైన సమాచారం ఇక్క డి నుండే వస్తుంది.

జర్న లిజం స్కూ ల్


1991 లో జర్న లిజం స్కూ ల్ ప్రారంభించి ఔత్సా హికులకు శిక్షణ నిచ్చి తమ సంస్థలో ఉపాధి
కల్పి స్తున్న ది.[6]

ఆన్ లైన్ వెర్షన్


తొలి కాలపు ఈనాడు వెబ్సై ట్ లో యాజమాన్య హక్క లు గల
ఈనాడు ఖతిని వాడారు. ఆ ఖతిని పొందటానికి వెబ్ పేజీలో
లింకు వుండేది. ఈ ఖతికి తోడ్పా టు విండోస్ లో వుండేది. లినక్స్
వాడుకరులు పద్మ అనే ఎక్స్టెన్షన్ స్థా పించుకోవటం ద్వా రా
ఫైర్ఫా క్స్ విహరిణిలో ఈనాడు చదువుకోవటానికి వీలైంది. వెబ్సై టు
2015 డిసెంబర్ 14న యూనికోడ్ ఖతికి మార్చ బడింది,[14]
అసలయిన పేపర్ లాగే ఉన్న ది ఉన్న ట్టుగా పత్రికను పిడీయఫ్
ఫార్మా ట్ (.pdf format)[15]
దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు . కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఈనాడు ఆన్లైన్ వెబ్ పేజీ
ఆ ఎన్ను కున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. తెరపట్టు(Circa 2008)
2008లో అంతర్జా తీయంగా విశ్వ సనీయమయిన వెబ్ సైట్ ట్రాఫిక్

https://te.wikipedia.org/wiki/ఈనాడు 6/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

ర్యాంకులు ప్రచురించే సంస్థ (ఆన్ లైన్ వెబ్ సైట్) ఎలేక్సా (Alexa) వారి ప్రకారం ఈనాడు ట్రాఫిక్
రాంకు 827 గా ఉంది.[16] 2010 లో ఈనాడు.నెట్, నెలలో 5 కోట్ల (50 మిలియన్లు) పైగా పేజీ వీక్షణలు,
80 లక్షలపైగా నిర్దిష్ట వాడుకరి సందర్శ నలు [17] కలిగివున్న ది

ఈనాడు.నెట్ ఆన్ లైన్ వెబ్ సైట్‌ని దేశాల వారిగా వీక్షించేవారి శాతం ( గూగుల్ ఎనలిటిక్స్ జూలై 2010
ప్రకారం ఈ నాడు మార్కె టింగు సమాచార సైటు నుండి)

భూభాగం శాతం

ఇండియా 41.5%

అమెరికా 38.01%

ఆసియా (ఇండియా కాక) 10.29%

ఐరోపా 5.98%

ఒషేనియా 2.9%

ఆఫ్రికా 1.07%

ఇతరాలు 0.26%

(ట్రాఫిక్ రాంకు: అంటే ప్రతి రోజు సైట్ వీక్షకుల సంఖ్య ని బట్టి వెబ్సై ట్ స్థా నాన్ని నిర్ణయించటం)
మొత్తం ఈనాడు ఆన్ లైన్ వెబ్ సైట్ వీక్షకుల శాతం:

ఈనాడు.నెట్ :93% (లింకు (https://web.archive.org/web/20200224074426/https://www.eenadu.


net/))
ఈ-పేపర్.ఈనాడు.నెట్:7% (లింకు (http://epaper.eenadu.net))

ప్రముఖులు
ఈనాడుకు ఎంతోమంది ఖ్యా తి తీసుకువచ్చా రు. అలాగే ఎంతో మంది ఈనాడు ద్వా రా ఖ్యా తి పొందారు.
వారిలో కొందరు:

ఎ.బి.కె.ప్రసాద్: ఈనాడుకు ప్రథమ సంపాదకుడు. తొలినాళ్ళ లో పత్రిక అభివృద్ధికి దోహదపడ్డా డు.


శ్రీధర్: కార్టూ నిస్టు. ఈనాడు బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూ న్లు ఎంతో
సహాయపడ్డా యి. ఆయన కార్టూ న్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి.
గజ్జెల మల్లా రెడ్డి: "పుణ్య భూమి" శీర్షిక
బూదరాజు రాధాకృష్ణ: "పుణ్య భూమి" శీర్షికను "సి.ధర్మా రావు" అనే కలం పేరుతో కొనసాగించాడు.
ప్రతి ఆదివారం "మాటలూ మార్పు లూ" అనే పేరుతో తెలుగు మాటల తప్పొ ప్పు ల గురించిన శీర్షిక.
చలసాని ప్రసాదరావు: "కబుర్లు"
డి.వి.నరసరాజు: "అక్షింతలు"
కొమ్మి నేని శ్రీనివాసరావు: "రాష్ట్రంలో రాజకీయమ్"
కులదీప్‌నయ్య ర్‌: "లోగుట్టు"

విమర్శ లు
1977లో ఈనాడు సిబ్బంది సమ్మె తో ఇరవై మూడు రోజులు పత్రిక మూతబడింది. సుప్రీం కోర్టు - సమ్మె
చట్ట బద్ధమే అని ఇచ్చి న తీర్పు తో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు
చె ల్లిం చుకోవాల్సి వచ్చింది. [18] ర్గం
తొలిదశలో పాత్రికేయులు సంపాదకవ లో వుండేవారు. ఆ తరువాత
వర్కింగ్ ఎడిటర్ లేకుండా ప్రధాన సంపాదకుడుగా అన్నీ తనే చూసుకోవటం ద్వా రా రామోజీరావు
https://te.wikipedia.org/wiki/ఈనాడు లో 7/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

వర్కింగ్ ఎడిటర్ పదవిని, ప్రాముఖ్యా న్ని తగ్గించిన అపఖ్యా తి పొందాడు. జర్న లిజంలో యజమానే
ఎడిటర్ గా కొనసాగుతూ విమర్శ లు ఎదుర్కొ న్నా డు. ఈనాడు ప్రధాన కార్యా లయాన్ని హైదరాబాద్
నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చ డంతో ఉద్యో గులంతా తీవ్ర మనస్థా పనానికి గురై అసంతృప్తితో
బతుకుతున్నా పట్టించుకోవటట్లేదన్న అపవాదు ఉంది.[19] 2019 డిసెంబర్ 14 నుండి రామోజీరావు
ప్రధాన ఎడిటర్ గా తప్పు కొనగా, తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ గా డి.ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్
ఎడిటర్ గా ఎం. నాగేశ్వ రరావు బాధ్య తలు నిర్వ ర్తిస్తున్నా రు. [1]

మూలాలు
1. " 'ఈనాడు' నుంచి తప్పు కున్న రామోజీరావు" (https://telugu.samayam.com/telangana/news/eena
du-chairman-ramoji-rao-exits-from-its-chief-editor-post/articleshow/72594954.cms). సమయం.
2019-12-14.
2. "Details of most circulated publications for the audit period Jan – Jun 2019" (http://www.auditbu
reau.org/files/JD%202019%20Highest%20Circulated%20(across%20languages).pdf) (PDF).
Audit Bureau of Circulations. Retrieved 22 September 2021.
3. Registrar of Newspapers for Indiaలో వివరాలు వెతుకుపేజీ. (http://rni.nic.in/verified_titles/verifie
d_titles.aspx)
4. నామాల విశ్వే శ్వ రరావు. తెలుగు జర్న లిజం చరిత్ర.
5. "A Newspaper Ensured NTR's Victory - The Onlooker, 01-02-1983" (https://web.archive.org/we
b/20100901001459/http://www.cscsarchive.org:8081/MediaArchive/clippings.nsf/(docid)/89254
53A49DBC9EBE5256B800039F298). Archived from the original (http://www.cscsarchive.org:80
81/MediaArchive/clippings.nsf/(docid)/8925453A49DBC9EBE5256B800039F298) on 2010-09-
01. Retrieved 2008-04-25.
6. బెందాళం, క్రిష్ణా రావు, (2006). "మేటి పత్రికలు-ఈనాడు", వార్తలు ఎలా రాయాలి. ఋషి
ప్రచురణలు. pp. 410–411.
7. "Details of most circulated publications for the audit period Jan – Jun 2018" (http://www.auditbu
reau.org/files/JJ2018%20Highest%20Circulated%20amongst%20ABC%20Member%20Publica
tions%20(across%20languages).pdf) (PDF). Audit Bureau of Circulations. Retrieved
27 December 2018.
8. Eenadu History (http://www.eenaduinfo.com/about.htm) నుండి జులై 05 2008న
సేకరించబడినది.
9. "Indian Readership Survey Q2,2019" (https://web.archive.org/web/20190817055620/http://mru
c.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf) (PDF). 2019-08-14. Archived
from the original (http://mruc.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf)
(PDF) on 2019-08-17.
10. "NRS 2006 – Key Findings" (https://web.archive.org/web/20070202033344/http://www.auditbur
eau.org/nrspress06.pdf) (PDF). 2006-08-29. Archived from the original (http://www.auditbureau.
org/nrspress06.pdf) (PDF) on 2007-02-02. Retrieved 2006-12-09.
11. కాసుల, ప్రతాపరెడ్డి. "తెలుగు దినపత్రికల్లో భాష" (https://telugu.oneindia.com/sahiti/essay/telugu-l
anguage-daily-news-papers-141380.html). Telugu OneIndia. Retrieved 6 June 2018.
12. " 'ఈనాడు'కు కార్టూ నిస్ట్ శ్రీధర్ రాజీనామా" (https://www.prabhanews.com/importantnews/cartooni
st-sridhar-resigned-to-eenadu/). ఆంధ్రప్రభ. 2021-08-31.
13. "ఇదీసంగతి" (https://www.eenadu.net/cartoon/item/2116). ఈనాడు. 2021-08-13. Archived (http
s://web.archive.org/web/20210906095107/https://www.eenadu.net/cartoon/item/2116) from the
original on 2021-09-06.
14. "ఈనాడు (పాఠ్య రూపం)" (https://web.archive.org/web/20190816181244/https://www.eenadu.ne
t/). Archived from the original (http://eenadu.net) on 2019-08-16. Retrieved 2019-08-17.
15. "ఈనాడు ఈపేపర్" (http://epaper.eenadu.net). Retrieved 2019-08-17.
16. "eenadu.net Competitive Analysis, Marketing Mix and Traffic" (https://web.archive.org/web/2008
0403001029/http://www.alexa.com/data/details/traffic_details/eenadu.net). Archived from the

https://te.wikipedia.org/wiki/ఈనాడు 8/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా
original (http://www.alexa.com/data/details/traffic_details/eenadu.net) on 2008-04-03. Retrieved
2008-04-17.
17. "ఈనాడు మార్కె టింగ్ సమాచారము, అలెక్సా మరి ఇతర ఆధారాలతో" (http://eenaduinfo.com/inte
rnet.htm). Retrieved 2010-10-11.
18. వి., హనమంతరావు (2012). ‘జర్న లిస్ట్ అంతర్వీ క్షణం – పాత్రికేయ జీవితంలో ఆరు దశాబ్దా ల
అనుభవాలు – అనుభూతుల’. డేటా న్యూ స్ ఫీచర్స్ .
19. గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 78.

బయటి లింకులు
ఈనాడు సమాచారం (http://www.eenaduinfo.com)
ఈనాడు ఖతి (2007 నాటిది) (eenadu.ttf గా పేరుమార్చి స్థా పించుకోవాలి) (https://web.archive.org/
web/20090630170729if_/http://epaper.eenadu.net:80/eenadu.xyz)

v·t·e తెలుగు పత్రికలు [కుదించు]

ఆంధ్రజ్యో తి · ఆంధ్రప్రభ · ఈనాడు · నమస్తే తెలంగాణ · నవతెలంగాణ · ప్రజాశక్తి ·


దిన పత్రికలు
సాక్షి · సూర్య · వార్త · విశాలాంధ్ర

ఆంధ్రభూమి · జాగృతి · సితార (పత్రిక) · స్వా తి వారపత్రిక · నవ్య · గీటురాయి ·


వార పత్రికలు
ఋషి · శ్రీసాధన పత్రిక · ప్రతిభ

పక్ష పత్రికలు హాసం · తహల్క · విజేత కాంపిటీషన్స్

అనసూయ (పత్రిక) ·
అన్న దాత · అమ్మ నుడి (పత్రిక) · అందరికి ఆయుర్వే దం · కళాజగతి ·
కిన్నె ర · కంప్యూ టర్ ఎరా · గానకళ · గృహలక్ష్మి · గృహశోభ ·
గ్రంథాలయ సర్వ స్వ ము · చిత్ర · చింతామణి · చందమామ · చంపక్ ·

జగతి · జయంతి · డిస్క వరి · తెలుగునాడి · తెలుగు విద్యా ర్థి ·


మాస పత్రికలు తెలుగుజ్యో తి · నది (పత్రిక) · పశునేస్తం · పాడిపంటలు ·
పాలపిట్ట మాసపత్రిక · ప్రకృతినేస్తం · ప్రకృతి · ప్రజాసాహితి ·
బాలభారతి · బాలమిత్ర · బుజ్జా యి · బొమ్మ రిల్లు · భారతి · మానవసేవ ·
మిసిమి · మూసీ · భావవీణ · యువ · యోజన · రచన · రసమయి ·
రైతునేస్తం · వినోదిని · విస్ డమ్ · వేదమాతరమ్ · వండర్ వరల్డ్ · శారద
· స్వ ర్ణపుష్పం ·

స్వా తి మాసపత్రిక
ఋషిపీఠం · సనాతన సారథి · సప్తగిరి · శ్రీ శంకర కృప · శ్రీశైలప్రభ ·
ఆధ్యా త్మి క పత్రికలు
శ్రీ రామకృష్ణ ప్రభ · గీటురాయి · దర్శ నమ్

ఈమాట · కౌముది · విహంగ పత్రిక · తెలుగు జర్న ల్ · నవతరంగం · పొద్దు ·


అంతర్జా ల పత్రికలు
నెచ్చె లి · 64 కళలు

హాస్య పత్రికలు హాస్యా నందం

ఆంధ్రభూమి · ఉదయం · కృష్ణా పత్రిక · ఆంధ్రపత్రిక · తెలుగు వెలుగు ·


మూతబడిన పత్రికలు
ఆంధ్రప్రదేశ్ · బాలభారతం · చతుర · విపుల · కృష్ణా పత్రిక

"https://te.wikipedia.org/w/index.php?title=ఈనాడు&oldid=3893989" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 3 మే 2023న 15:09కు జరిగింది.

https://te.wikipedia.org/wiki/ఈనాడు 9/10
5/13/24, 1:57 PM ఈనాడు - వికీపీడియా

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూ షన్/షేర్-ఎలైక్ లైసెన్సు ; క్రింద లభ్యం అదనపు షరతులు వర్తించవచ్చు . మరిన్ని
వివరాలకు వాడుక నియమాలను చూడండి.

https://te.wikipedia.org/wiki/ఈనాడు 10/10

You might also like