Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 15

రాకాసి పిండం

(నిసాచరతో కలిసి ఒక తాత కూర్చుని ఉంటాడు)

నిశాచర: “దాము నేను చెప్పినట్టు చెయ్యు..ఇదే నీకు ఆఖరి అవకాసం..ఈ సారి నిన్ను ఆ భగవంతుడు కూడా

కాపాడలేడు..అర్ధమయ్యిందా..?”

మీసాల తాత: “అర్ధమయ్యింది గురుదేవా..మీ ఆశీస్సులు ఉంటే తప్పక నేను విజయంతో తిరిగి వస్తా ..నేను బయలుదేరుతా

స్వామి..?”

అని వెళ్లిపోబోతుండగా..అక్కడకి మంత్రాల అవ్వ వచ్చి..

మంత్రాల అవ్వ: “నిశాచర గురు దేవా ఎలా ఉన్నారు..బేతాళ కొండ నుండి వెళ్తూ..వెళ్తూ..మిమ్మల్ని పలకరించి వెళ్దాం అని

ఇలా వచ్చా..”

నిశాచర: “నేను బానే ఉన్నా మంగమ్మా..వీడు నా శిష్యుడు దాము..దాము..

ఈమె మంత్రాల అవ్వ..”

మీసాల తాత: “హో..పెద్దమ్మ..మీ కోసం,మీ గొప్పతనం కోసం చాలా కధలు విన్నా..మిమ్మల్ని కలిసినందుకు చాలా

సంతోషంగా ఉంది..మీరు ఎదురు వచ్చారు..ఇంక నాకు అంతా శుభమే..వెళ్ళొస్తా పెద్దమ్మా..”

అని మీసాల తాత వెళ్ళిపోయాడు..

మంత్రాల అవ్వ: “ఎవరు నిశాచర ఈయన..వయసులో నాకన్నా పెద్దగా ఉన్నాడు..నన్నే పెద్దమ్మా అని పిలుస్తు న్నాడు..”

నిశాచర: “హహహ...వాడి వయసు 21 సంవత్సరాలు మంగమ్మా..”

మంత్రాల అవ్వ(shock): “హ...చూస్తే 121 సంవత్సరాలు వాడి లా ఉన్నాడు..21 సంవత్సరాలా..?!”

నిశాచర: “వాడు ఇప్పుడు గుప్తా (రహస్య) జీవనంలో ఉన్నాడు..వాడి సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తా ..”

అని యోగ క్షేమాలు మాట్లా డుకుని..

మంత్రాల అవ్వ అక్కడనుండి మధిర బయలుదేరింది..

కొన్ని రోజులకి సోంపేట్ ఊరు నుండి పిల్లోడు పరుగున మంత్రాల అవ్వ దగ్గరకి వచ్చి..

పిల్లోడు: “అవ్వ మా నాన్నని నువ్వే కాపాడాలి..నీ కోసం మా స్నేహితుడు చెప్తే వచ్చా..”

మంత్రాల అవ్వ: “ఇంతకీ ఏం అయ్యిందిరా బుడ్డోడా...”

పిల్లోడు: “మా నాన్నకి దెయ్యం పట్టింది..ఏ మంత్రాలకి ఆ దెయ్యం లోన్గతం లేదు..”


రాకాసి పిండం

మంత్రాల అవ్వ: “సరే..సరే..పద మీ ఊరు..”

అని ఆ పిల్లోడుతో కలిసిసోంపేట్ బయలుదేరింది..ఊరి పొలిమేర దారిలో వెళ్తూ ఉంటే..

(surround ASMR లో claps sound రావాలి)

ఆ చప్పట్ల శబ్దా నికి పిల్లోడు వెనక్కి తిరగబోయాడు..

మంత్రాల అవ్వ: “వెనక్కి తిరగకు..తిన్నగా పదా..ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి చూడకు..పద..”

(only hands ఒక్కటే claps కొడుతున్నట్టు చూపిస్తాం..చెట్టు పక్క నుండి or green screen shot)

పిల్లోడికి పట్టిన దెయ్యాన్ని వదిలించి (action shot) దానిని గాజు సీసాలో బంధించింది..

(ఇంట్లో దూలంకి తల క్రిందులుగా0020 వ్రేలాడుతూ ఉన్నాడు..)

దెయ్యం పట్టిన వాడిని అవ్వ తన మంత్రం తో కిందకి దింపి..

మంత్రాల అవ్వ: “మంత్రం”

మంత్రాల అవ్వ: “వెంటనే వెళ్లి ఇత్తడి బిందెతో నీళ్ళు తెచ్చి అందులో బొగ్గులు వెయ్యండి..ఇది స్త్రీముఖ ప్రేతం..మగవాడిని

ఆవహించి పీల్చి పిప్పు చేసి చంపేస్తుంది..దీనిని హతమార్చలేము..కానీ బంధించగలం..”

narration: “బొగ్గుతో నింపిన ఇత్తడి బిందెలో నీళ్ళు వేసి మంత్రం చదవగానే బిందెలో నుండి మంటలు వస్తు న్నాయి..”

మంత్రాల అవ్వ: “మంత్రం”

narration: “నీటితో తడిసిన బొగ్గులు పెళ పెళ మంటూ మండుతూ ఉంటే అందరు ఆశ్చర్యం తో చూస్తూ ఉన్నారు..ఆ

బిందెలో నుండి వచ్చిన పొగ దెయ్యం పట్టిన వాడిని కమ్మేసింది..వాడు ఎగిరి వచ్చి బిందెలో కాళ్ళు పెట్టి బందీ అయ్యాడు..”

(గట్టిగా బయంకరంగా అరుపులు)

దెయ్యం పట్టిన వాడు: “అరుపులు”

(వాడి నోటిలో నుండి పొగ వచ్చి సీసాలో దూరింది)

narration: “వాడిలో ఉన్న ప్రేతాత్మ పొగ లాగా బయటకి వచ్చి సీసాలో దూరింది..దానిపై మూత పెట్టి ప్రేతాత్మని

బంధించింది మంత్రాల అవ్వ..ఇదంతా చూస్తు న్న గ్రామపెద్ద, మంత్రాల అవ్వ శక్తికి దాసోహం అయ్యాడు..”

గ్రామపెద్ద: “అవ్వ..అవ్వ..మీ శక్తి అద్బుతం..ఇలా దెయ్యం పట్టి గత 5 సంవత్సరాల్లో సుమారు 50 కి పైగా మా ఊరి వాళ్ళు

చనిపోయారు..ఎంతో మంది సిద్ధు లు,భూత వైద్యులు వచ్చినా కూడా కాపాడలేకపోయారు..మీరు కాపాడారు..మీకు


రాకాసి పిండం

ఎప్పటికి రుణపడి ఉంటాము..”

మంత్రాల అవ్వ: “అది సరే కానీ దీనితో మీ ఊరుకి పట్టిన సమస్య పూర్తిగా పోయినట్టు కాదు..అసలు మీ ఊరుకి సమస్య

ఎక్కడ ఉందో తెలుసుకోవాలి..అప్పుడు కానీ సమస్యకి పరిష్కారం దొరకదు..”

గ్రామపెద్ద: “దీనికి నేను ఏం చెయ్యాలో చెప్పండి అవ్వ..?”

మంత్రాల అవ్వ: “దీప దిగ్బంధనం”(eco)

narration: “చీకటి పడ్డా క ప్రతి ఇంటినుండి వెలిగించిన నూనే కాగడా ఊరి చుట్టూ పొలిమేరలో పాతి పెట్టి..ఊరు లోకి

వచ్చే మార్గంలో జ్వాల స్తంభాలు పెట్టి ఊరు మధ్యలో కపాల ముగ్గు వేసి అవ్వ కూర్చుంది..”

మంత్రాల అవ్వ: “అందరు ఇళ్ళలోకి వెళ్లి తలుపులు మూసుకోండి..ప్రేతాత్మని వదలబోతున్నా...బుడ్డోడా నేను చెప్పినట్టు

చెయ్యు..నా మంత్రదండం ఉండగా నీకు ఏమీ కాదు..బయపడకు..”

narration: “అలా అనగానే పరుగున ఊరులో వాళ్ళు ఇల్ల లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు..ఒక్క సారిగా నిశ్శబ్దం..

(areal shot లో ఊరు చుట్టూ వెలిగిపోతున్న దీపాలు చూపిస్తాం)

బుడ్డోడు అవ్వ ఇచ్చిన మంత్ర దండం తీసుకుని..బుజాన పెట్టు కుని ఊరు మొత్తం తిరుగుతూ..డమరు కొడుతూ..”

బుడ్డోడు: “అందరు తలుపులు మూసుకోండి..బద్రం..బద్రం..!!”

narration: “అని ప్రతి ఇంటిని చూసి..అందరు తలుపులు మూసుకున్నాక అవ్వ దగ్గరకి వచ్చి..”

బుడ్డోడు: “అందరు తలుపులు మూసుకున్నారు అవ్వ..”

మంత్రాల అవ్వ: “సరే..అయితే..నా పక్కనే నిల్చో..”

మంత్రాల అవ్వ: “మంత్రం”

narration: “అలా మంత్రం చదువుతూ సీసా మూత తియ్యగానే..అందులో ప్రేతాత్మ తప్పించుకుందాం అని..ఎవరో ఒకర్ని

ఆవహిద్దాం అని ప్రతి ఇంటిని వెతుకుతూ..తలుపులు కొడుతూ ఉంది..కానీ ఎవరు తలుపులు తియ్యడం లేదు..”

(ఇంటి లోపల నుండి తలుపుని దభీ..దభీ మణి బాదుతూ ఉన్నారు)

మంత్రాల అవ్వ(voice over): “ఈ రాత్రి ఎవరు పిలిచినా పలకడ్డు ..తలుపులు తియ్యోద్దు ..తలుపులు తీస్తే ఈ ప్రేతాత్మని

మీరే ఇంట్లోకి ఆహ్వానించినట్టు ..”

narration: “ప్రేతాత్మ ఎంత తలుపులు కొట్టినా ఎవరు తలుపులు తియ్యకుండా దుప్పటి కప్పుకుని పడుకున్నారు..ప్రేతాత్మ
రాకాసి పిండం

ఊరులో ఏదో ఒకమూల దాక్కుందాం అని చుట్టూ తిరుగుతూ ఉంది..కానీ దీపాలు వల్ల ఎటూ వెళ్ళలేక పొలిమేర దారిలో

జ్వాలా స్తంభాలు దాటి పొలిమేరలో వెళ్తూ ఉంది..అవ్వ దాని వెనుకే వెళ్తూ ఉంది..ప్రేతాత్మ పొలిమేరలో పాడు బడ్డ మొండి

గోడల ఇంట్లోకి వెళ్లిపోయింది..”

మంత్రాల అవ్వ: “ఓహ్..అయితే సమస్య ఇక్కడ ఉందన్నమాట..”

narration: “అని అవ్వ మొండి గోడలి ఇంట్లోకి వెళ్ళగానే చాలా ప్రేతాత్మలు ఎగిరిపోయాయి..మూడు ప్రేతాత్మలని సీసాలో

బంధించి అదే శిధిల పడ్డ ఇంట్లో పాతిపెట్టి..ఊర్లోకి వచ్చేసింది..

మరుసటి రోజు పొలిమేరలో శిధిల పడ్డ ఇంటి గోడపై ప్రమాదం అని రాయించి..”

మంత్రాల అవ్వ: “ఈ ఇంటిని పగలగొట్టినా,అందులో ఒక్క ఇటుకని కదిలించినా కూడా శాపం

తగులుతుంది..ఎందుకంటే..ఈ ఇంటి గల అవాడు మనవాడు కాదు...గాడిద కడుపునా పుట్టిన కురూపి..గర్భక(eco)”


(add a scene that encounters him in that ruined house..)

అవ్వ పట్టు క్కున్న పిశాచాలు అవ్వ కోసం వెతుకుతూ ఉన్నాయి..

(గ్లా స్ జార్ లో)

పిశాచి 1: “మమ్మల్ని వదిలిపెట్టు ..మేము ఇంక ఎప్పుడు ఇటు రాము..”

పిశాచి 2: “అయినా ఆ గర్భక గాడిని వదిలేసి మమ్మల్ని పట్టు కుంటే ఏంటి ఉపయోగం..?”

మంత్రాల అవ్వ: “గర్భాకానా..?!”

పిశాచి 3: “ఇది ఇల్లు కాదు..లమషి మండపం...”

అని గర్భక ప్రేతం కోసం వివరంగా చెప్పి..వాటిని వదిలి పెట్టమని వేడుకున్నాయి..”

మంత్రాల అవ్వ: “సరే వదిలి పెడతా..ఆ గర్భక ని బంధించడం ఎలా..? వాడిని కనిపెట్టడం ఎలా..?”

పిశాచి 3: “వాడు మనిషిని ఆవహిస్తే తప్ప వాడిని కనిపెట్టలేం అవ్వ..”

పిశాచి 1: “వాడు మనిషిని ఆవహించాడు..మనిషిలో జీవిస్తా డు..21 సంవత్సరాల వరకు వాడికి కూడా తెలియదు..వాడు

మనిషిని ఆవహించాడు అన్న విషయం...”

మంత్రాల అవ్వ: “హమ్..అదీ చూస్తా ...మనుషుల జోలికి వస్తే మీ అంతు చూస్తా ..మీరు పొండి..”

narration: “అని సీసాల మూతలు తియ్యగానే మూడు పిశాచాలు తుర్రు మంటూ ఎగిరిపోయాయి..”
రాకాసి పిండం

గ్రామపెద్ద: “ఆ పాడు బడ్డ ఇంట్లోకి ఎవరు వెళ్ళకుండా నేను చూసుకుంటాలే అవ్వ..అయితే మా ఊరుకి పట్టిన దెయ్యం పీఢ

పోయినట్టేనా..?”

మంత్రాల అవ్వ: “మీ ఊరుకి పట్టిన పీడ ప్రస్తు తానికి పోయినట్టే..కానీ మీ ఊరుకి వచ్చే దారిలోనే అసలు ప్రమాదం ఉంది..ఈ

ఊరు పొలిమేర దారి దెయ్యాల దారి...(eco)”

గ్రామపెద్ద: “హ..దెయ్యాలా పొలిమేరా...?ఇప్పుడెలా అవ్వ..చుట్టూ కొండలు..మాకు ఉన్న ఒకే ఒక్క సులువైన మార్గం ఇది

ఒక్కటే...”

మంత్రాల అవ్వ: “మరేం పరవాలేదు..పొలిమేర నియమాలు పాటిస్తే సరిపోతుంది..జ్వాలా దీపాలు నిరంతరం వెలిగేలా

చూసుకోండి..అలాగే పొలిమేర లో గ్రామ దేవత శక్తి మండపం నిర్మించండి..నేను మళ్ళీ రెండు వారాల్లో మీ ఊరు వస్తా ..”

అని చెప్పి అవ్వ మధిర బయలుదేరి వెళ్లిపోయింది..”

(అంజన దర్పణం ముందు నిల్చుని )

మంత్రాల అవ్వ: “అంజన దర్పణ జమరిని చూపించు..”

(జమరి దర్పణం లో కనిపిస్తా డు..)

జమరికి సోంపేట పొలిమేరలో జరిగింది అంతా వివరంగా చెప్పి..

మంత్రాల అవ్వ: జమరి..మీకు లమషి కోసం తెలుసా..?”

జమరి: “తెలుసు..!!జన్మ జన్మల వరకు వెంటాడి..వేదించే శక్తి కల పిశాచి శక్తి అది..దానితో తలపడడం చాలా ప్రమాదం

అవ్వ..”

మంత్రాల అవ్వ: “అవును..లమషి ఉనికి సొంపేట్ పొలిమేర దారిలో ఉంది..శిధిల మండపంలో ఉండి..దానిని మేల్కొపిన

వాడు గర్భక..వాడిని చూసే లోపే తప్పించుకున్నాడు...”

జమరి: “అయితే ఇప్పుడెలా అవ్వ..?వాడు ఎవరినైనా ఆవహిస్తేనే కానీ మనం వాడిని అంతం చెయ్యలేము..”

మంత్రాల అవ్వ: “నేను బేతాళ తంత్రం తో వాడిని ఆవాహన చెయ్యడానికి ప్రయత్నించా..కానీ వాడు నా తంత్ర ముగ్గులోకి

రాలేదు..అంజనం లో చూసా..కానీ కనిపించలేదు..ఇంకో మార్గం ఉందేమో అని తెలుసుకోవడానికి నిశాచర తాంత్రిక్ దగ్గరకి

వెళ్తు న్నా..”

జమరి: “సరే..నేను ఈ విషయం లోఖికి,పొట్టిదెయ్యంకి చెప్తా ..”


రాకాసి పిండం

narration: “అని చెప్పి జమరి దర్పణంలో నుండి మాయం అయిపోయాడు..మంత్రాల అవ్వ ఒక్కర్తే నిసాచార్ తాంత్రిక్

దగ్గరకి వెళ్లి సొంపేట్ ఊరి సమస్య అంత చెప్పి..లమషి ని మేల్కోకుండా చేసే మార్గం ఉంటే చెప్పమని అడిగింది..”

నిశాచర: “లమషిని నిద్దు ర లేవకుండా చూడాలి..పొరపాటున లేస్తే దాని రక్త దాహానికి నువ్వు చెప్తు న్న సొంపేట్ ఊరు

మొత్తా న్ని చంపుకు తినడానికి దానికి ఒక్క రాత్రి చాలు..”

మంత్రాల అవ్వ: “మరి దానిని ఆపే శక్తి మనకి లేదా...?”

నిశాచర: “ఉంది..ఆత్మ త్యాగం చెయ్యాలి..బేతాళ కిరీటం ఉన్న వాడు బలి అవ్వాలి..ఇదిగో ఈ బేతాళ గొడ్డలి తీసుకో..ఆ

గర్భక గాడి శరీరంని దీనితో మాత్రమే నరుకు..”

narration: “అని ఏం చెయ్యాలో వివరంగా చెప్పి..అవ్వకి బేతాళ గొడ్డలి ఇచ్చి పంపాడు..

అక్కడ సొంపేట్ ఊరులో రహదారి మండపం కట్టించి..ఊరులో వాళ్ళందరూ అవ్వ కోసం ఎదురు చూస్తు న్నారు..

అవ్వ చెప్పినట్టే రెండు వారాల తరవాత వచ్చి మండపంలో మహా జ్వాల దీపం వెలిగించింది..”

మంత్రాల అవ్వ: “మీ ఊరు పొలిమేర లో ఉన్న దుష్ట ప్రేతాలు అన్నీ ఆ శిధిల పడ్డ లమషి మండపంని ఆవాహం చేసుకుని మీ

ఊరి వాళ్ళని పీడిస్తు న్నాయి..

మీ ఊరి చుట్టూ జ్వాలా కంచె వలన, ఈ పొలిమేర మండపం వలన మీ ఊరుకి ఏ సమస్య ఉండదు..కానీ కచ్చితంగా చీకటి

పడగానే..చుట్టూ ఉన్న జ్వాలా కాగడాలు వెలుగుతూ ఉండాలి..పొలిమేరలో జ్వాలా స్తంభాలు వెలగాలి..నిరంతరం ఈ

పొలిమేర మండపం జ్వాల వెలుగుతూనే ఉండాలి..”

ఊరులో ఒకడు: “ఎంతకాలం ఈ కట్టు బాట్లు పాటించాలి అవ్వ..?”

మంత్రాల అవ్వ: “గర్భక అనే ప్రేతాత్మ ని అంతం చేసేవరకు తప్పదు...”

గ్రామపెద్ద: “అయితే ఇంకా మేము ఊరు వదిలి వెళ్ళకూడదా అవ్వ..?”

మంత్రాల అవ్వ: “వెళ్ళొచ్చు..కానీ ఆచారాలు పాటించాలి..అవే పొలిమేర నియమాలు..”

ఒకటి: “మీరు పొలిమేర లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మల మూత్ర విసర్జన చెయ్యకూడదు..కనీసం ఉమ్ము కూడా

వెయ్యకూడదు..అలా చేస్తే మిమ్మల్ని దెయ్యం ఆవహించవచ్చు..”

రెండు: “మిట్ట మధ్యానం,అర్ధరాత్రి పొలిమేరలో వెళ్ళే తప్పుడు మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలిచినట్టు చప్పట్లు కొట్టి పిలుస్తు న్నట్టు

అనిపించవచ్చు...ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదు..అలా చేస్తే ప్రేతాత్మ ఆవహిస్తుంది..”


రాకాసి పిండం

మూడు: “పొలిమేర దాటి ఊరు లోకి వచ్చే ముందు తప్పని సరిగా జ్వాలా మండపంలో అడుగు పెట్టి కాని ఊరు లోకి

వెళ్ళకూడదు..పొరపాటున పొలిమేరలో భూత,ప్రేత,పిశాచాలు ఏవైనా మిమ్మల్ని ఆవహిస్తే జ్వాలా మండపంలో అడుగు

పెట్టగానే వదిలేస్తా యి..”

గ్రామపెద్ద: “కానీ అవ్వ..జ్వాలా స్తంభాల్ని,జ్వాలా కంచెని దాటి రాగలవా అవి..?”

మంత్రాల అవ్వ: “వాటంతట అవి తలుపు వేసి ఉన్న ఇంట్లోకి కూడా రాలేవు..కానీ మనిషిని ఆవహిస్తే..వాడిలో నుండి అవి

ఎక్కడికైనా వెళ్ళగలవు..

పొలిమేర లో లమషిని పూర్తిగా అంతం చేసే వరకు మీ ఊరుకి ఈ నిబంధనలు తప్పవు జాగ్రత్త..!!

నేను చెప్పిన పొలిమేర కట్టు బాట్లు పాటించండి..”

narration: “అని చెప్పి మంత్రాల అవ్వ వాళ్ళ ఊరు వెళ్లిపోయింది..

సొంపేట్ లో అవ్వ చెప్పిన నియమాలని అన్నింటిని ఒక చెక్కపై రాయించి పొలిమేర మండపం పక్కనే పెట్టించారు..”

(ఒకడు నడుచుకుంటూ వెళ్తు న్నాడు..చప్పట్లు కొడుతూ sound)

దెయ్యం: “కుమారు..నిన్నే..ఒరేయ్ కుమారు...”

కుమార్: “అమ్మ బాబోయ్ నన్ను పిలుస్తు న్నారు అంటే తప్పకుండా దెయ్యం అయి ఉంటుంది..తిరగను..”

దెయ్యం: “కుమారు..నిన్నే..ఒరేయ్ కుమారు...”

మంత్రాల అవ్వ చెప్పిన నియమాలు పాటిస్తూ అందరు బయం బయం గా జీవిస్తూ ఉన్నారు..

(ఊరిలో ఒకడు)

ఒకడు: “ఏంటిరా ఇలా ఎన్నాళ్ళు బ్రతికేది..? ఎప్పుడు ఏమవుతుందో అన్న బయంతో..”

ఇంకొకడు: “అలా అని ఊరు బ్వదిలి వెళ్లిపోలేము కదరా..సొంత ఇల్లు ,పొలం,గొడ్లు వదిలి పోలేము..తప్పదు మరి..”

narration: “అలా చీకటి పడకుండానే కాగడాల కంచె వెలిగించి..జ్వాలా స్తంభాలు కూడా వెలిగించి అందరు ఇళ్ళలోకి

వెళ్ళిపోతారు..ఎంతో అవసరం ఉంటే తప్ప ఆఉరులో వాళ్ళు ఇళ్ళు వదిలి బయటకి రారు..ఇది ఇలా ఉండగా ఒక రోజు

బయటి ఊరు వాడు ఒకడు పొలిమేర దారిలో వస్తు వస్తు ..”

సోము: “అరేయ్ బాబోయ్ చాలా జోరుగా వచ్చేసింది..ఇక్కడే ఎక్కడో పని కానిచ్చేయ్యాలి..లేదో పంచె తడిసిపోఎలా

ఉంది..”
రాకాసి పిండం

అని శిధిలపడ్డ గోడల చాటుకు వెళ్లి మూత్రం పోస్తు న్నాడు..

(వాడు whistle వేస్తూ ఉన్నాడు)


(spooky wisperings)

(వాడి వెనుక ఒక ఆత్మ వస్తు ఉంది..)

(వాడి లోకి దూరిపోయింది)

back ground(మంత్రాల అవ్వ): “ఎట్టి పరిస్థితుల్లో..పొలిమేరలో మూత్రం(eco)”

వాదిలోకి ప్రేతాత్మ దూరిపోయింది అన్న ఆవిషయం కూడా తెలియదు వాడికి..సొంపేట్ కి ఇదే మొదటి సారి వాడు

రావడం...అందు వలన ఈ ఊరు కట్టు బాట్లు తెలియక పొలిమేర లో మూత్రం పోసాడు..సరిగ్గా పొలిమేర మండపం

ముందు నుండి వెళ్లిపోతు ఉండగా ఆ ఊరు లో వాళ్ళు చూసి..

ఒకడు: “ఎవరు బాబు నువ్వు..ఈ ఊర్లోకి అడుగు పెట్టా లి అంటే ఖచ్చితంగా మండపం లో అడుగు పెట్టి కానీ రాకూడదు..”

అని వాడిని బలవంతంగా మండపంలో అడుగు పెట్టిన్చాగానే

(వికృతంగా అరుపులు)

గాలిలో గిల గిల కొట్టు కుంటూ..అంత ఎత్తు లేచి ఎగిరి పడ్డా డు..వాడిలో ప్రేతాత్మ పొలిమేర లోకి ఎగిరిపోయింది..

ఇలా రోజులు గడుస్తు ఉన్నాయి...

ఆరోజు చంద్ర గ్రహణం..

ఆ విషయం తెలియని భువన్ భార్యతో కలిసి అత్తవారి ఇంటినుండి వాళ్ళ ఊరు సొంపేట్ బయలుదేరాడు..

సాయంత్రంకి పొలిమేర చేరుకున్నారు..

(చంద్ర గ్రహణం చూపిస్తాం..)

భువన్: “ఇదేంటి ఈరోజు త్వరగా చీకటి పడింది..మూడు నెలల తరవాత ఇదే రావడం మా ఊరుకి..త్వరగా నడువు

శ్యామలా..”

శ్యామల: “నేనేమైనా వట్టి మనిషినా అండి..కడుపుతో ఉన్నా..అందులోను దాహంగా ఉంది..”

అని సీసాలో మంచి నీళ్ళు తాగి..నీళ్ళు పుక్కిలించి ఉమ్మి ఇద్దరు బయలు దేరారు..

(ఉమ్మిన చోట నీటిని కాంచన movie లో లాగా దెయ్యం ప్రత్యక్షం అయ్యి నాలుకతో నాకింది)(scary sound)
రాకాసి పిండం

శ్యామల ఊరిలో అడుగు పెట్టబోతుండగా ఆ ప్రేతం శ్యామలని ఆవహించింది..

ఊరంతా నిర్మానుషంగా ఉంది..దీప స్థంభం,మండపం,కాగడాలు చూస్తూ పక్కనే ఉన్న గమనిక చదవకుండా మండపంలో

అడుగు పెట్టకుండా ఊరు లోకి వచ్చేసాడు..”

శ్యామలకి తెలియకుండానే తనతో పాటు బయంకరమైన ప్రేతాత్మని తనలో ఊరు లోకి తీసుకు వచ్చేసింది..

(ఒక పిండం ఇంకో పిండంని తినేస్తు ఉండడం చూపిస్తాం)

మరుసటిరోజు తను ఊరులో లేనప్పుడు పొలిమేరలో జరిగింది అంతా స్నేహితుల ద్వారా తెలుసుకుని భువన్ పరుగున

ఇంటికి వచ్చి..

భువన్: “శ్యామలా మనం పొరపాటు చేసాం..జ్వాలా మండపంలో అడుగుపెట్టి ఊరు లోకి రావాలంట..ఎవరు అడిగినా

మనం మండపంలో అడుగు పెట్టి వచ్చాం అనే చెప్పు..”

శ్యామల: “అసలు ఆ జ్వాలా మండపం ఏంటండి..?”

వాళ్ళు ఊర్లో లేనప్పుడు జరిగింది మొత్తం పూసా గుచ్చినట్టు చెప్పాడు..

శ్యామల: “ఓస్..దీనికి బయపదాల్సింది ఏముంది..ఈరోజే మనిద్దరం వెళ్లి మండపంలో అడుగు పెట్టి వద్దాం..ఒక వేల మనకి

దెయ్యం పట్టి ఉంటే మండపంలో అడుగు పెట్టగానే వదిలేస్తుంది..ఏమంటారు..?”

భువన్: “అమ్మో ఎన్ని తెలివితేటలో నా పెళ్ళానికి...పద ఇప్పుడే వెళ్దాం...”

అని ఇద్దరు పొలిమేర లో ఉన్న జ్వాల మండపంలో అడుగు పెట్టా రు..

(close up shot of శ్యామల ఫుట్ స్టెప్)

narration: “శ్యామల అడుగు పెట్టబోతుండగా ఆమె లోనుండి ప్రేతాత్మ బయటకి వచ్చేసింది..వాళ్ళు మండపం నుండి

బయటకి రాగానే మళ్ళీ ఆవహించేసింది...

మండపంలో అడుగు పెట్టినా కూడా ఏమీ అవలేదు కనుక వాళ్లకి ఏ దెయ్యం పట్టలేదు అన్న బ్రమతో ఇంటికి వెళ్లిపోతు

ఉన్నారు..”

back ground voice(మంత్రాల అవ్వ): “ఒక సారి పొరపాటున పిశాచి ఆవహించిన వాళ్ళు పొలిమేర మండపంలో అడుగు

పెట్టకుండా జ్వాల స్తంభాలు దాటితే..మీలో ఉన్న పిసాచిని ఊరులోకి తీసుకువచ్చేసినట్టే..

తరవాత ఎన్ని సార్లు మండపంలోకి వెళ్లినా కూడా ఉపయోగం ఉండదు..ఊరు లోకి అడుగు పెట్టనంత వరకే మండపంలో
రాకాసి పిండం

జ్వాలా శక్తి దెయ్యాన్ని వదిలించడంలో పని చేస్తుంది..

తనలోని ప్రేతం ఉన్న విషయం తెలియని శ్యామల ఎప్పటిలానే భర్తతో సంతోషంగా ఉంది..

నెలలు గడుస్తు న్నాయి..తన కడుపులో ఉన్న కవల పిండాల్లో ఒక దానిలో గర్భక ప్రవేశించింది..

నెలలు గడుస్తు న్న కొద్ది రెండో పిండాన్ని కొద్ది కొద్దిగా తినేస్తు ఉంది..

9 వ నెల దాటాక శ్యామలకి బాబు పుట్టా డు..

మంత్రసాని: “ఇదేంటి ఇది ఈ పిల్లోడు విచిత్రంగా ఉన్నాడు..అమ్మో వీడేదో దుష్ట శక్తి లా ఉన్నాడు..”

ఆ మంత్రసాని మాటకి బయపడుతూ బాబు వైపు చూసింది శ్యామల...చాతిలో నుండి అదనంగా ఇంకో చెయ్యి ఉంది..”

భువన్: “మన బాబుకి మూడు చేతులు ఉన్నాయేంటి శ్యామల..”

మంత్రసాని: “ఇదేదో అరిష్టంలా ఉంది నేను వెంటనే ఊరిలో చెప్తా ..”

narration: “అని మంత్రసాని మూడు చేతుల బాబు కోసం ఊరిలో అందరికి చెప్పింది..అలా విచిత్రంగా పుట్టిన పిల్లోడి వల్ల

ఊరుకి ముప్పు వస్తుంది అని కంగారు పడ్డ గ్రామపెద్ద పరుగున మధిర వెళ్లి ఈ విషయం మంత్రాల అవ్వకి చెప్పి..వెంట

పెట్టు కుని వచ్చాడు..(ఎద్దు ల బండిలో)

ఆ మూడు చేతుల పిల్లవాడిని చూసి..

మంత్రాల అవ్వ: “కంగారు పడకండి..ఇదేమి అరిష్టం కాదు...గ్రహణం లో బయట తిరగడం వలన ఇలా పుట్టి ఉండచ్చు..”

అని ఊర్లో వాళ్లకి సర్ది చెప్పి..వెనక్కి బయలుదేరింది..

(అంజన తంత్రంలో)

మంత్రాల అవ్వ: “ఆ రోజు మీరు చెప్పినట్టే విచిత్ర పిండం పుట్టింది నిసాచర..ఇప్పుడు ఏం చెయ్యడం..”

నిశాచర: “గర్భక పిసాచి జననం జరిగిందా..?21 స్సంవత్సరాల లో వాడు లమషి ని మేల్కొలుపుతాడు..అది జరగకుండా

చూడాలి.”

మంత్రాల అవ్వ: “ఈ మధ్యలో ఏం చెయ్యలేమా..?”

నిశాచర: “చెయ్యలేము..పుట్టిన వాడికి కూడా తెలియదు వాడే గర్భక అని..20 వ సంవత్సరం లో వాడికి పరిపూర్ణ బలం

వస్తుంది.అప్పుడు వాడు వాడి శవాన్ని బద్రపరిచిన చోటుకి వెళ్తా డు..అప్పటి వరకు వేచి ఉండి వాడిని ఒక కంట కనిపెట్టా లి..”

మంత్రాల అవ్వ: “సరే అయితే..నేను అదే పని మీద ఉంటా..”


రాకాసి పిండం

అని సొంపేట్ లో రమ,నరసింహ దంపతులని పిలిచి ఏం చెయ్యాలో వివరంగా చెప్పింది..

మంత్రాల అవ్వ: “ఈ విషయం ఎవరికీ తెలియకూడదు..మీరు మాత్రమే మీ ఊరుని లంషి నుండి కాపాడగలరు..”

వాళ్ళు వెళ్ళిపోయారు..

నిశాచర ఇచ్చిన బేతాళ గొడ్డలి తీసి దానికి బేతాళ పూజ చేసి

మంత్రాల అవ్వ: “ఈ ఉపద్రవం నుండి నువ్వే కాపాడాలి బేతాళ..”

సంవత్సరాలు గడిచి పోతున్నాయి..కురూపిగా పుట్టి బయంకరంగా పెరుగుతున్న మోహన్ ని చూసి అందరు బయపడే

వాళ్ళు..

వాడితో ఎవరు స్నేహం చెయ్యలేదు..కానీ విమల్ మాత్రం చిన్నప్పటి నుండి మోహన్ తో స్నేహంగా ఉంటున్నాడు..”

మోహన్ కి వాళ్ళ తల్లి దండ్రు ల తరవాత తనని అర్ధం చేసుకుని తనతో స్నేహం చేసిన వాడు విమల్ మాత్రమే..చూస్తూ

ఉండగానే మోహన్ కి 20 సంవత్సరాలు నిండాయి..

ఒక రాత్రి (కలలో)

లమషి: “ఇక చాలు..నా ఆకలి తీర్చరా...మేలుకో..నా సమాధి చేరుకో..రా నాదగ్గరకి..రా నా దగ్గరకి..”

narration: “నిద్ర లోనే నడుచుకుంటూ పొలిమేర దాటి వెళ్ళిపోతున్నాడు..

చీకటి అవ్వడం వలన ఊరంతా నిర్మానుషంగా ఉంది..జ్వాలా స్తంభాలు ధాటి..పొలిమేరలో ఉన్న శిధిల గోడల మధ్యలోకి వెళ్లి

అక్కడే పడిపోయాడు..”

ఇదంతా విమల్ వెంబడిస్తూ గమనిస్తూ ఉన్నాడు..

(విమల్ మెడలో తాయత్తు ఉండాలి)

విమల్(self): “ఏమయ్యింది విమల్ కి..ఇప్పుడు నేను ఏం చెయ్యాలి..?”

narration: “అని ఆ శిధిల ఇంట్లోకి అడుగు పెట్టకుండా గోడ పక్కనుండి గమనిస్తూ ఉన్నాడు..పడి ఉన్న మోహన్ మూడో

చెయ్య పొడుగ్గా సాగుతూ ఉంది..దాని పైన లమషి ఆత్మ మెరుస్తూ కూర్చుని ఉంది..

(లమషి జరిగింది అంతా మోహన్ కి కలలో చెప్తు న్నాడు)

narration(లమషి voice): “నువ్వు నాగ శాపం వలన ౩౩ జన్మల నుండి కురూపిలా పుడుతున్నావ్..నీ ౩౩ వ జన్మలో

ఇంజుఖ తాంత్రికుడు సహాయంతో నన్ను ఈ ఊరులో నెలకొలిపావు..కానీ నన్ను నిద్ర లేపే లోపు పాము కాటు వల్ల
రాకాసి పిండం

చచ్చిపోయావు..”

ఇంజుఖ: “చెప్పా కదా మీ వంశం లో ఎవరో ఒకరు ప్రతి తరంలో ఇలా వికృతంగా కురూపి లా పుడతారు..21 సంవత్సరం

ముందే ఏదో రకంగా చచ్చిపోతారు..”

తల్లి: “అందుకే ఈ తరంలో అయినా ఈ శాపానికి ముగింపు పలకాలి ఇంజుఖా..లమషి ని మేల్కొలపండి..”

ఇంజుఖ: “లమషిని మేల్కొలిపి దాని ఆకలి తీరిస్తే మీ శాపం పోగొడుతుంది..కానీ దాని ఆకలికి ఒక ఊరు ఊరే బలి

అవుతుంది.”

తల్లి: “అయితే అవ్వనివ్వు..నాకేంటి..నా బిడ్డని చూసి నవ్వినాస్ ఊరు వాళ్ళు చస్తే నాకేంటి..?తరవాత తరంలో నా బిడ్డలా

ఎవరు కురూపిలా పుట్టకూడదు..అర్ధ ఆయుష్షు ఉండకూడదు..”

ఇంజుఖ: “అయితే ఒక ఉపాయం ఉంది..వీడి ఆత్మని ప్రేటంగా మార్చి..ఎవరో ఒకరి కడుపులోకి ప్రవేశ పెడతా..వాడు పుట్టి

20 వ సంవత్సరం తరవాత ఈ శరీరం లోకి వచ్చి కొత్త శరీరంని ఒక ఆడపిల్లతో కలిపి లమషికి బలి ఇస్తే..నీ కొడుకుకి కుర్రోపి

రూపం పోయి..శాపం లేకుండా బ్రతుకుతాడు..”

అని ఇంజుఖ నిన్ను నాకు మొక్కి ప్రేతత్మగా మార్చాడు..

చచ్చిన నీ శరీరం చుట్టూ తిరుగుతున్న నీ పంచ ప్రాణాలలో ఒకదానిని ప్రేతత్మగా చేసి ఈ మండపంలో ఉంచాడు..

నీ తల్లి తో కలిసి పనస లోయల్లో క్షుద్ర పూజలు చేసి మిగతా నాలుగు ప్రాణాలని గాడిద లోప్రవేస పెట్టి గాడిద కి పుట్టేలా

చేసాడు.

అనుదుకే నువ్వు గర్భక పిసాచివి అయ్యావు..వెళ్ళు..త్వరగా వెళ్లి నిన్ను నువ్వు నాకు బలిఒ ఇచ్చుకో...నన్ను మేల్కొలుపు..

కలలో వాడి వృత్తాంతం అంతా విన్న మోహన్ కి వాడి అసలు జన్మ గుర్తు కు వచ్చి..

క్షణం ఆలస్యం చెయ్యకుండా పనస లోయలలోకి బయలుదేరాడు..16 గంటలు ప్రయాణం చేసి పనస లోయలలోకి

చేరుకున్నాడు.

గాడిదకి పుట్టిన దేహం అక్కడే గుహలో కుళ్ళి ఎముకల గూడులా ఉంది..తల్లి,ఇంజుఖ మాంత్రికుల శవాలు కూడా కుళ్ళి

ఉన్నాయి..తను బలి అవ్వాలి అంటే అమావాస్య రాత్రి అవ్వాలి..

మోహన్(self): “అమావాస్య అవ్వడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది..అప్పటివరకు ఓపిక పట్టు లమషి..”

ఇదంతా చాటుగా చూస్తు న్న విమల్ కి కాళ్ళు ఒణుకుతున్నాయి..


రాకాసి పిండం

విమల్(self): “వామ్మో ఇదేంటి రాక్షసుడిలా మాట్లా డుతున్నాడు..ఈ విషయం వెంటనే ఊరులో చెప్పాలి...”

అని చీకటిలో వెనక్కి బయలుదేరి..దారిలో కనపడక లోయలో పడిపోయాడు..

(మంజుమ్మల్ boys)

విమల్ కనిపించడం లేదు అని విమల్ తల్లి తండ్రి పరుగున మధిర వెళ్లి మంత్రాల అవ్వకి చెప్పారు..

మంత్రాల అవ్వ: “రమా,నరసింహ మీరు కంగారు పడకండి..నేను చిన్నప్పుడే విమల్ మెడలో కట్టిన తాయత్తు ఉన్నత వరకు

వాడికి ఏమీ కాదు...నేను చెప్పడంతోనే విమల్ ఇన్నాళ్ళు వాడి తో స్నేహంగా ఉన్నాడు..నాకు తెలిసి వాడి వెనుకే వెళ్లి

ఉంటాడు..”

అని అనజనంలో విమల్ ఉన్న ప్రదేశం చూసి..విమల్ ని తీసుకు రమ్మని పొట్టి దెయ్యంని,పిల్లి దెయ్యాన్ని పంపించింది..

అవి రెండు సర్రు న ఎగురుకుంటూ వెళ్లి లోయల్లో వెతుకుతున్నాయి..

పిల్లి దెయ్యం: “అన్ని లోయలు ఒక లానే ఉన్నాయి..ఈ కుర్రోడు ఎక్కడరా..?”

పొట్టి దెయ్యం: “ఈ లోయ చూస్తుంటే నాకు ఒకటి గుర్తు కు వస్తోంది...”

పొట్టి దెయ్యం: “మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మామోలు ప్రేమ కాదు..”

పిల్లి దెయ్యం: “అవును..అవును..మామోలు ప్రేమ ఎందుకు అవుతుంది..దెయ్యం ప్రేమ..దిక్కు మాలిన ప్రేమ..”

పొట్టి దెయ్యం: “నా ప్రేమని అర్ధం చేసుకోలేని నీ మనసు కాకి మనసు..కుక్క మనసు”

విమల్(గుహలో నుండి): “మీ పకోడి ప్రేమ తగలెయ్యా..ముందు నన్ను కాపాడండి..పిల్లి దెయ్యం లోయలోకి వెళ్లి విమల్ ని

బయటకి తీసుకువచ్చి..”

పిల్లి దెయ్యం: “బాబు మూత్రం పోసుకోవడానికి ఇంత లోతుకి వెళ్ళాల..ఇంకో చోటే దొరకలేదా..బాబు ఇంత సిగ్గు అయితే

ఎలా..”

విమల్: “సిగ్గు లేదు సింతకాయ లేదు..చాలా ప్రమాదంలో ఉన్నాం..ముందు నన్ను అవ్వ దగ్గరకి తీసుకువెళ్ళు..”

అని అవ్వ దగ్గరకి వెళ్లి తను చూసింది అంతా చెప్పాడు..

అవ్వ: “శబాష్ ర బాబు..నీ ప్రాణాలకి తెగించి ఇదంతా చేసావ్...”

అని పొట్టి దెయ్యంపై కూర్చుని పనస లోయలలోకి వెళ్లి చూస్తే..అమావాస్య చీకటిలో..మోహన్ శరీరం,మొండెం విడిగా పడి

ఉన్నాయి..కుళ్ళిన కళేభరం కళ్ళు తెరిచి..


రాకాసి పిండం

కళేభరం: “హహహ...ఆలస్యం చేసావే ముసలి...నాకు ప్రాణం వచ్చింది...నాకు పూర్తి శరీరం రాగానే అక్కడ లమషి నిద్ర

లేస్తా డు..”

narration: “క్షణం ఆలస్యం చెయ్యకుండా నిశాచర ఇచ్చిన గొడ్డలితో ఆ కళేభరాన్ని ముక్కలు ముక్కలు గా నరికేసింది..”

(బూడిద గా మారిపోయింది)

మంత్రాల అవ్వ: “పొట్టి త్వరగా సొంపేట్ వెళ్ళాలి..నేను బలి అవ్వాలి..లేదో లమషి నిద్ర లేస్తా డు..వేల మంది చస్తా రు..”

పొట్టి దెయ్యం: “నువ్వు బలి అవ్వడం ఏంటి అవ్వ...?నేను ఒప్పుకోను..జమరి,లోఖిని పిలుస్తా ..అందరం కలిసి వాడిని

హతమారుద్దాం..”

మంత్రాల అవ్వ: “అలా అవ్వదు రా...వాళ్లకి చెప్పకు..నా బదులు వాళ్ళు బలి అవుతాం అంటారు..నేను చాలా సంవత్సరాలుగా

బ్రతికే ఉన్నా..ముసలి దానిని నేను బలి అవ్వడమే శ్రేయస్కరం..”

narration: “అని పొట్టి దెయ్యాన్ని ఒప్పించి..గాలిలో ఎగురుతూ బయలుదేరారు..ఇదంతా పిల్లి దెయ్యం చూస్తూ ఉంది..”

పిల్లి దెయ్యం: “అవ్వ బలి అవుతుందా..అలా జరగనివ్వను..”

(అది తుర్రు మంటూ ఎగిరిపోయింది)

పొట్టి దెయ్యం,అవ్వ పొలిమేర చేరుకునే లోపే నెల బీటలు అయ్యి..అందులోనుండి లమషి లేచి అరుస్తూ ఉన్నాడు

మంత్రాల అవ్వ: “నా బలితో లమషి అంతం అవ్వ్వుతాడు..నేను వెళ్లి వస్తా రా పొట్టోడా..”

అని వెళ్ళబోతుండగా..పిల్లి దెయ్యం మీసాల తాతని తీసుకువచ్చింది..(వాడి నెత్తిన బేతాళ కిరీటం ఉంది)
(action scene)

(నలుగురు లమషిని ఆపాలి అని try చేస్తు న్నారు)

మంత్రాల అవ్వ: “లమషి ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు..”

మీసాల తాత: “మీరు కష్ట పడకండి పెద్దమ్మ..నేను ఉన్నా కదా..”

అని తన బేతాళ కిరీటం తీసి లమషి పై పెట్టగానే లమషి భళ్ళున పేలిపోయాడు...

మీసాల తాత తల ఎగిరి ఆకాసంలో పేలిపోయింది..

మంత్రాల అవ్వ: “అసలు ఈ ముసలి తాటకి బేతాళ కిరీటం ఎక్కడిది..?ఇంతకి ఇతను ఎలా వచ్చాడు..?ఎవరు పంపారు..?”

లమషి నాసనంతో సొంపేట్ కి పట్టిన దెయ్యాల పీడ పోయింది..ఊరు చుట్టూ పెట్టిన కాగడాల కంచెని ఆర్పేశారు...
రాకాసి పిండం

అందరు సుఖంగా,బయం లేకుండా జీవించసాగారు...

You might also like