Kavya

You might also like

Download as txt, pdf, or txt
Download as txt, pdf, or txt
You are on page 1of 5

విజయనగరం జిల్లా ...

శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రి మృతురాలి బంధువు ధర్నా,

ఉదయం తీసుకోచ్చిన మృతదేహకు ఇప్పటివరకు పంచనామా చేయకపోడంతో ఆగ్రహింవహిన మృతురాలి బంధువులు,

గిరిజనులంటే అంత చుకలనా మాపై ఎందుకు అంత చిన్న చూపు అంటూ నినాదాలు,

ఇప్పటివరకు ఎందుకు పంచనామా చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తు న్న గిరిజనులు,

డాక్టర్స్ ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు,


Rahul Gandhi:
గ్యారెంటీగా చెబుతున్న మోడీ మరోసారి ప్రధాని కావడం కష్టమే..
అగ్నిపథ్‌తో దేశ సైనికులను అవమానించారన్న రాహుల్ గాంధీ...
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం..

రాహుల్ గ్యారంటీ

కేంద్రంలోని మోడీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో BJP ఓడిపోవడం ఖాయమని
జోస్యం చెప్పారు. తనను తాను నిజమైన దేశభక్తు డిగా ప్రకటించుకుంటున్న ప్రధాని మోడీ.. అగ్నిపథ్‌ పథకంతో జవాన్లను
అవమానించారని ఆరోపించారు. దేశం కోసం భగవంతుడు తనను ఇక్కడికి పంపించాడని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడంపై రాహుల్‌
మండిపడ్డా రు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ ప్రయత్నిస్తు న్నారని పేర్కొన్నారు. ఆయన మళ్లీ ప్రధాని కావడం
కష్టమే. ఇది రాహుల్‌ గ్యారంటీ అని చెప్పారు.

===========
Election Manifesto

మ్యానిఫెస్టోలో వాగ్దా నాలను అవినీతిగా పరిగణించలేం


చట్టం కిందకు రావని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ..

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసే వాగ్దా నాలు ఎన్నికల చట్టా ల ప్రకారం అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు పేర్కొంది.
అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుందని, అంతేకాకుండా పార్టీ అభ్యర్థి కూడా అవినీతి చేయడంతో
సమానమని పిటిషనర్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది.

======================
Pune Porsche accident: పోర్షే కార్‌ యాక్సిడెంట్‌.. ‘వ్యాస రచన పోటీ’తో కాంగ్రెస్‌ వినూత్న నిరసన
Eenadu
~3 minutes

Pune Porsche accident: పోర్షే ప్రమాద ఘటనలో అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యువజన
విభాగం వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

Updated : 27 May 2024 17:43 IST

Pune Porsche accident | ముంబయి: మహారాష్ట్రలోని పుణెలో జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్‌ ఘటన దేశవ్యాప్తంగా
సంచలనం సృష్టించింది. మద్యం మత్తు లో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తు ల మరణానికి కారణమైన బాలుడి వ్యవహారం గురించి
చర్చించుకుంటోంది. ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశాలపై సర్వత్రా
విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి తండ్రి ఓ ప్రముఖ బిల్డర్‌ కావడంతో పోలీసులు ఈ కేసును నీరుగారుస్తు న్నారన్న ఆరోపణలూ
వినిపిస్తు న్నాయి. ఈనేపథ్యంలో అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం వినూత్న రీతిలో నిరసన
తెలిపింది.

కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో వ్యాస రచన పోటీని నిర్వహించింది. ‘ఒకవేళ మా నాన్న బిల్డర్‌ అయితే?’, ‘ఆల్కహాల్‌ వల్ల కలిగే
దుష్పరిణామాలు’ ‘అధికార వ్యవస్థ నిద్ర పోతోందా?’ వంటి అంశాలపై వ్యాస రచన పోటీ ఏర్పాటు చేసింది. ఆదివారం నిర్వహించిన ఈ
పోటీకి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆకట్టు కునేలా వ్యాసం రాసిన వారికి రూ.11 వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు
చొప్పున బహుమతులు కూడా ప్రదానం చేశారు. వీటిని హోంమంత్రితో పాటు, పుణె పోలీసు కమిషనర్‌కు పంపిస్తా మని నిర్వాహకులు
తెలిపారు.
======================
Amit shah on Rahul gandhi
రాహుల్‌ వచ్చాక కాంగ్రెస్‌ ప్రమాణాలు పడిపోయాయి..
అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డా రు. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. రాహుల్‌ కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీ
రాజకీయ స్థా యి పాతాళానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు.

ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా మాట్లా డుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రతీ విషయానికి సమావేశాలకు హాజరుకాకుండా
పార్లమెంటును అగౌరవ పరుస్తుందని అసహనం వ్యక్తంచేశారు. కేంద్రం చేసిన చట్టా లపై వారు లేవనెత్తే ప్రతీ ప్రశ్నకు తాము సమాధానం
చెప్తా మని, అయినా కూడా సమావేశాల మధ్యలో లేచి వెళ్లిపోవడం, చర్చలు జరగకుండా ఆపడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు
పాల్పడతారని దుయ్యబట్టా రు. ఇవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కావా అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావడంతో ఆ పార్టీ కార్యకలాపాల్లో మార్పు వచ్చిందని, అప్పటినుంచి పార్టీ ప్రమాణాలు
పడిపోయాయన్నారు. గత 20 ఏళ్లు గా వారు పార్లమెంటును బహిష్కరించడానికి రకరకాల సాకులు చెప్తు న్నారన్నారు. ‘‘రాష్ట్రపతి
ప్రసంగానికి ప్రధానమంత్రి సమాధానం ఇస్తు న్నప్పుడు గంటన్నర పాటు ఆయనకు అంతరాయం కలిగించడం నా రాజకీయ చరిత్రలో
నేనెప్పుడూ చూడలేదు. దేశ ప్రజలు తమ ఓట్లతో నరేంద్ర మోదీ (PM Modi)ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టా రు. ఆయనను
అగౌరవపరచడం రాజ్యాంగ వ్యవస్థను అగౌరవపరచడంతో సమానం’’అని షా పేర్కొన్నారు.
==================

Cyclone Remal
బలహీన పడిన రెమాల్‌ తూపాన్
ఊపిరి పీల్చుకున్న బెంగాల్‌

రిలీఫ్

రెమాల్ తుపాను బలహీన పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ దళాలు
రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టా యి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తు గా సుమారు లక్షకుపైగా మందిని సురక్షిత
ప్రాంతాలకు అధిరారులు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో తీర రాష్ట్రం ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. నిలిపివేసిన విమాన
సర్వీసులు.. 21 గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పట్టా లపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో మెట్రో సర్వీసులకు
అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.
==============
Pune Car Crash
పుణె కారు యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌
నిందితుడి బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌నే మార్చేసిన ఫోరెన్సిక్‌ వైద్యులు

ట్విస్ట్

మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ పోర్ష్‌ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో అనుకోని ట్విస్ట్‌ను దర్యాప్తు
అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన మైనర్‌ రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు గుర్తించారు. సాసూన్‌
ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ అజేయ్‌ తావ్‌రే, డాక్టర్‌ శ్రీహరి హార్నూర్‌ను పుణె క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు. పుణెలోని ప్రభుత్వ
ఆస్పత్రిలో డాక్టర్‌ తావ్‌రే ఫోరెన్సిక్‌ విభాగానికి అధిపతిగా పనిచేస్తు న్నారు. డాక్టర్లను అదుపులోకి తీసుకొన్నారు. రక్త పరీక్షల సమయంలో
మైనర్‌ నమూనాలను పారేసి.. మరో వ్యక్తి నమూనాలను వీరు అక్కడ పెట్టినట్లు అనుమానిస్తు న్నారు.
==========================
Game zone fire: ‘నాలుగేళ్లు గా నిద్రపోయారా? మీపై నమ్మకం లేదు’ - గుజరాత్‌ ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం
Eenadu
3–4 minutes

రాజ్‌కోట్‌ వీడియో గేమ్‌ జోన్‌ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి అక్కడి మునిసిపల్‌ అధికారుల తీరుపై ఆ రాష్ట్ర హై కోర్టు తీవ్ర ఆగ్రహం
వ్యక్తంచేసింది.

Updated : 27 May 2024 20:53 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వీడియో గేమ్‌జోన్‌ అగ్ని ప్రమాద ఘటనలో 28 మంది ఆహుతైన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర
విషాదం నింపింది. అందులో చిన్నారులు ఉండటం, వారంతా గుర్తించలేనివిధంగా కాలిపోవడం తీవ్రంగా కలచివేసింది. ఈ పరిణామాల
నేపథ్యంలో స్థా నిక మునిసిపల్‌ అధికారుల తీరుపై ఆ రాష్ట్ర హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన
తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర యంత్రాంగంపై తమకు విశ్వాసం లేదని పేర్కొంది.

అగ్నిప్రమాదం కేసుపై గుజరాత్‌ హై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎంసీ)
అధికారులపై తీవ్ర స్థా యిలో మండిపడింది. ‘‘మీ పరిధిలో ఇంతటి భవనం ఉందని మీకు తెలియదా? కళ్లు మూసుకున్నారా? ఫైర్‌ సేఫ్టీ
లేకుండా రెండున్నరేళ్లు గా ఇది ఉందని ఎలా చెబుతారు. టికెట్‌ వసూలు చేసేటప్పుడు వినోద పన్ను గురించి తెలియదా?’’ అని జస్టిస్‌
బైరెన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కూడా
పాల్గొన్నట్లు మీడియా కథనాలను చూపిస్తూ.. ఆ అధికారులు ఎవరు? వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లా రా? అని ప్రశ్నించారు.
========================

Papua New Guinea


పాపువా న్యూగినీలో విరిగిపడిన కొండ చరియలు...
2 వేల మంది సజీవ సమాధి

ఘోర విషాదం..

పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి వేలకు చేరింది. ఈ
విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2 వేల మంది ప్రజలు సజీవ సమాధి
అయ్యారు పేర్కొంది. 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తు న శిథిలాలు కుప్పలు
పడినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో.. శిథిలాల కిందే ఉండిపోయిన క్షతగాత్రు ల ప్రాణాలకు,
సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలకు సవాల్‌గా మారింది.

====================
Rishi Sunak
సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసిన రిషి దంపతులు..
దాంపత్య జీవితంలో ఇద్దరి అభిరుచులు, విలువల గురించి చెప్పిన సునాక్, అక్షతామూర్తి

ఆసక్తికర పోస్ట్

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఆయన సతీమణి అక్షతామూర్తి సంయుక్తంగా సోషల్‌మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టా రు. దాంపత్య
జీవితంలో వారి అభిరుచులు, అనుసరిస్తు న్న విధానం, విలువల గురించి తెలియజేశారు. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు
చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఉంది. అదే విలువలను పంచుకోవడం.
జీవితంలో ఏ స్థా యిలో ఉండాలో మన కష్టమే నిర్ణయిస్తుంది. దాన్నే తామిద్దరం విశ్వసిస్తా మని పేర్కొన్నారు.
====================
China Tiwan
తైవాన్‌కు చేరుకొన్న అమెరికా కాంగ్రెస్‌ బృందం
చైనాకు హెచ్చరికలు పంపేలా అగ్రరాజ్యం చర్యలు

అగ్నికి ఆజ్యం..

తైవాన్‌ విషయంలో చైనాను హెచ్చరించేలా చర్యలను అమెరికా చేపట్టింది. కాంగ్రెస్‌ సభ్యులను తైపీకి పంపింది. ఆ బృందం ఇక్కడ రెండు
రోజులపాటు పర్యటించనుంది. కొత్త అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌తో అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు కూడా
జరపనుంది. అంతేకాదు.. వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, పెట్టు బడులు, పరస్పర ప్రయోజనాలు వంటి అంశాల పై కూడా దృష్టి
పెట్టనుంది.

===============
Battle Tank Championship
రష్యాలో ఆర్మీ యుద్ధ ట్యాంకుల రేసు...
దూసుకుపోయిన భారత యుద్ధ ట్యాంకు
యుద్ధ ట్యాంకుల చాంపియన్ షిప్ లో నెంబర్ వన్ గా భారత్

మిలిటరీ గేమ్స్

అంతర్జా తీయ వేదికపై భారత సైనిక పాటవం మరోసారి నిరూపితమైంది. రష్యాలో జరిగిన మిలిటరీ గేమ్స్ లో భారత్ యుద్ధ ట్యాంకుల
రేసులో విజేతగా నిలిచింది. యుద్ధ ట్యాంకుల చాంపియన్ షిప్ లో భాగంగా కఠినమైన విభిన్న ఉపరితలాలపై రేసు నిర్వహించగా...
భారత ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్ దీప్ సింగ్ తన యుద్ధ ట్యాంకును పరుగులు తీయించాడు. 50 టన్నుల బరువున్న ట్యాంకును
ఎంతో ఒడుపుగా నడిపి ప్రథమస్థా నంతో విజేతగా నిలిచాడు.

==============
IMD
తెలంగాణలో పలు జిల్లా లకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశం
ఎల్లో అలర్ట్

తెలంగాణలోని పలు జిల్లా లకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు
వీచే అవకాశముందని తెలిపింది. ఇవాళ హై దరాబాద్‌తో పాటు పలు జిల్లా ల్లో వర్షం కురవవచ్చునని వెల్లడించింది. హై దరాబాద్, మేడ్చల్,
రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్
తదితర జిల్లా ల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
=====================

Mamata Banerjee
ఎన్నికలు, ఫలితాలు, కూటమి భవిష్యత్తు పై చర్చించేందుకు ఢిల్లీలో కూటమి భేటీ
హాజరు కావడం లేదని చెప్పిన బెంగాల్ సీఎం మమతాబెర్జీ
బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నందున వెళ్లలేమని స్పష్టం చేసిన దీదీ

నేను రాను

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరిదశ పోలింగ్ జరగనున్న జూన్ 1 న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ కానుంది. అయితే ఈ
భేటీకి తాము హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలు, జూన్
4 న ఫలితాలు, కూటమి భవిష్యత్తు పై చర్చించనున్నారు. బెంగాల్లో 9 లోక్ సభ స్థా నాల్లో అదేరోజు ఎన్నికలు ఉన్నందున సమావేశానికి
వెల్లడం లేదని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. తనకు తుపాను సహాయ కార్యక్రమాలే తనకు తొలి ప్రాధాన్యత అన్నారు.
========================
Student Rammed By Car
దేశంలో పెరుగుతున్న హిట్ అండ్ రన్ కేసులు..
నోయిడాలో రోడ్డు దాటుతున్న విద్యార్ధిని కారు ఢీ..
క్షేమంగా బయటపడిన స్టూడెంట్.. వీడియో వైరల్..

తప్పిన ప్రమాదం

ఇటీవల హిట్‌ అండ్‌ రన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. లక్నోలో రోడ్డు దాటుతున్న ఒక విద్యార్థిని కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ
అతడు క్షేమంగా బయటపడ్డా డు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన
జరిగింది. హ్యుందాయ్ క్రెటా కారు టర్న్‌ తీసుకుని మరీ ఆ విద్యార్థిని ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇది చూసి అక్కడున్న వారు షాక్‌ అయ్యారు.
------------
PRIYANKA GANDHI
బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీ...
కాషాయ పార్టీ తీరుపై ప్రియాంక గాంధీ ఫైర్..

లోక్‌సభ ఎన్నికల తుది విడత పోరుకు ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో కాంగ్రెస్ ర్యాలీలో బీజేపీ లక్ష్యంగా
ప్రియాంక గాంధీ విమర్శలు తీవ్రతరం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎవరిపై కేసులు పెట్టిందో వారి నుంచి బీజేపీ విరాళాలు
తీసుకుని వారి కేసులు తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. కేసులు మోప‌బ‌డిన వారి నుంచి డొనేష‌న్స్ తీసుకుని ఆయా కేసుల‌ను
పెండింగ్‌లో పెట్టడంతో కాషాయ పార్టీ ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీగా అవతరించిందని ఆరోపించారు..

-----------------
Monsoon
రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఐఎండీ..
ఈ సారి సాధారణ కంటే ఎక్కువగానే వానలు
మరో ఐదు రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశం

నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల వాతావరణం ఉందని
భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్‌ ఒకటి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. మరో ఐదురోజుల్లో
కేరళలో ప్రవేశించి.. పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తా యని చెప్పింది.
----------------
Gold Smuggling
గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డు కున్న బీఎస్‌ఎఫ్..
కోటి విలువైన 16 కిలోల బంగారం పట్టివేత...

గోల్డ్‌ స్మగ్లింగ్ ‌
ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు అడ్డు కున్నారు. ఒక ఇంటిని చుట్టు ముట్టా రు. గ్రామస్తు ల సమక్షంలో తనిఖీ చేశారు. కోట్ల
విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా లో జరిగింది.
భారత్‌-బంగ్లా దేశ్‌ సరిహద్దు గ్రామంలోని ఒక ఇంట్లో స్మగ్లింగ్‌ కోసం భారీగా బంగారాన్ని దాచినట్లు బీఎస్‌ఎఫ్‌కు ఇంటెలిజెన్స్ సమాచారంతో
సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నారు.

==============
SOUTH AFRICA vs WINDES
టీ20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ సంచలన ప్రదర్శన...
సొంతగడ్డపై సిరీస్ క్లీన్‌ స్వీప్..
సౌతాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో గెలిచిన కరేబియన్ జట్టు ..

టీ20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ సంచలన ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
సిరీస్ 3-0 తో విండీస్ కైవసమైంది. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 8 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఓడించింది. టాస్ గెలిచి ముందుగా
బ్యాటింగ్ చేసిన సఫారీలు 163 పరుగులు చేశారు. అనంతరం లక్ష్యాన్ని విండీస్ జట్టు అలవోకగా ఛేదించింది. 2 వికెట్లు మాత్రమే
కోల్పోయి 165 పరుగులు చేసింది.

=====================
ANKUSHITHA
ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు అంకుషిత
మంగోలియాకు చెందిన నమున్‌ను మట్టి కరిపించిన భారత క్రీడాకారుణి

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి అవకాశమైన వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత మహిళా బాక్సర్
అంకుషిత బోరో శుభారంభం చేసింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 60 కేజీల కేటగిరీ బరిలోకి దిగిన ఆమె తొలి
రౌండ్‌లో 4-1 తేడాతో మంగోలియాకు చెందిన నమున్ మోంఖోర్‌‌ను మట్టికరిపించింది.
మూడు రౌండ్లలోనూ అంకుషిత స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.

=====================
KAVYA EMOTION
ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లను ఓదార్చిన కావ్య మారన్
తీవ్ర భావోద్వేగానికి లోనైన కావ్య
ఆటగాళ్లకు ధైర్యం చెబుతున్న వీడియో విడుదల

ఐపీఎల్-17 లో సంచలన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హై దరాబాద్ ఫైనల్‌లో మాత్రం సత్తా చాటలేకపోయింది. కోల్‌కతా చేతిలో ఓడి రన్నరప్‌గా
సరిపెట్టింది. ఫైనల్‌లో ఓటమితో ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కన్నీళ్లు పెట్టు కున్న
వీడియోలు వైరల్‌గా మారాయి. మ్యాచ్ తర్వాత ఆమె డ్రెస్సింగ్ రూంకు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ఆ వీడియోను SRH తన
అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ సీజన్‌లో జట్టు టీ 20 క్రికెట్ ఆడే విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, అందరూ మన
గురించే మాట్లా డుకుంటున్నారని చెప్పారు.
==================

You might also like