తెలంగాణ ఉద్యమం - వికీపీడియా

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 21

తెలంగాణ ఉద్యమం

తెలంగాణ ఉద్యమంభాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన
కొన్ని జిల్లా లను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం . ఇది దాదాపు 60
సంవత్సరాలు కొనసాగింది.

నేపధ్యము
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెంబరులో, రాష్ట్రాల పునర్విభజన కమిషనును
నియమించడం జరిగింది.[1] ప్రజాభిప్రా యం ప్రకారం ఈ కమిషన్ హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించి అందులో
మరాఠీ భాష మాట్లా డే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రం లోనూ , కన్నడ భాష మాట్లా డే ప్రాంతాలను మైసూరు
రాష్ట్రం లో కలిపివేయాలని సిఫారసు చేసింది. ఈ కమిషన్ నివేదిక (SRC) లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు
మాట్లా డే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం వలన కలిగే లాభనష్టా లను చర్చించి
విలీనానికి మద్ద తు ఆంధ్రభాగంలో ఎక్కువగా వున్నప్పటికి, తెలంగాణా భాగంలో స్పష్టంగా లేకపోవటంతో
తెలంగాణా భాగాన్ని హైద్రా బాదు రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత హైదరాబాద్
రాష్ట్రం ప్రజాభిప్రా యం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి మూడింట రెండువంతుల ఆధిక్యత వస్తే
విలీనం జరపాలని సూచించారు.

అయినప్పటికీ, జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా
తెలంగాణ భద్రతలను అందించడం తర్వాత 1956, నవంబరు 1 న ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ విలీనం ద్వారా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది.
1969 తెలంగాణ ఉద్యమం
1948లో పోలీస్‌యాక్షన్‌తర్వాత 1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌రాష్ట్ర
పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌అధికారుల పాలనలో ఉండటంవల్ల ఆంధ్ర ప్రాంతంనుంచి వలసలు
నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ
అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. అప్పటికే హైదరాబాద్‌రాష్ట్రంలో అమల్లో ఉన్నా ముల్కీ
నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్‌రాష్ట్రంలో
విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థా నికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థా నికేతరుల
పరమవుతూవచ్చాయి. పెద్ద మనుషుల ఒప్పందంను గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ
నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ లోని థర్మల్‌స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర
ప్రాంతం వారు కావడంతో 1969, జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ
ప్రా రంభానికి పాల్వంచనే పాదు వేసింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ రక్షణలను అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార
దీక్షకు దిగాడు. దీంతో ఉద్యమం జిల్లా కేంద్రం ఖమ్మం పట్ట ణానికి పాకింది. జనవరి 9న పట్ట ణంలో బి.ఎ .
స్టూ డెంట్‌, నేషనల్‌స్టూ డెంట్స్‌యూనియన్‌నాయకుడైన రవీంధ్రనాథ్‌గాంధీచౌక్‌దగ్గర నిరవధిక దీక్ష
ప్రా రంభించాడు. అతనితో పాటు ఖమ్మం మున్సిపాల్టీ ఉపాధ్యక్షుడు, కవి అయిన శ్రీ కవిరాజమూర్తి కూడా
నిరాహారదీక్షలో పాల్గొ న్నారు.

తెలంగాణ రక్షణ సమితి పేరుతో సంస్థ ను స్థా పించి తెలంగాణ అభివృద్ధి కోసం వంద కోట్లు ఖర్చు చేయాలని,
పోచంపాడు ప్రా జెక్ట్‌నిర్మాణానికి ప్రా ధాన్యత ఇవ్వాలని, పారిశ్రా మిక అభివృద్ధిలో తెలంగాణకు ప్రా ముఖ్యత
ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థా నాల్లో తెలంగాణ నిరుద్యోగులను నింపాలని
తీర్మానాలు చేశారు. ఆ మరునాడు అంటే జనవరి 10న ఉద్యమం నిజామాబాద్‌కు పాకింది. ఉద్యమంలోకి
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థు లు చేరారు.

జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో 'తెలంగాణ విద్యార్థు ల కార్యాచరణ సమితి' ఏర్పడింది. ఆ రోజు
మొట్ట మొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థు లు ప్రకటించుకున్నారు. విద్యార్థు ల
కార్యాచరణ సమితి మెడికల్‌విద్యార్థి మల్లిఖార్జు న్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్థు లు ఎలాంటి
త్యాగాలకైనా సిద్ధం కావాని మల్లిఖార్జు న్‌పిలుపునిచ్చారు. జనవరి 13న నగర ప్రముఖులందరు ఒక సమావేశం
ఏర్పాటు చేసి తెలంగాణ పరిరక్షణ కమిటీని స్థా పించారు. విద్యార్థు లకు పూర్తి మద్ద తును ప్రకటించారు.
జనవరి 20న శంషాబాద్‌లో పాఠశాల విద్యార్థు పై తొలిసారిగా కాల్పులు జరిపారు.

ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగుల నిధు లెక్కలు తేల్చాలని జస్టిస్‌భార్గవ
అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణలను అమలు చేయడానికి ప్రభుత్వం జి.వో జారీ
చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్‌ముల్కీ ఉద్యోగును వాపస్‌పంపిస్తా మని, జి.వోను నిర్లక్ష్యం చేసే అధికారుపై
చర్యు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిగాయి. ఈ
కాల్పుల్లో 14 మంది గాయపడ్డా రు. గాయపడ్డ వారిలో 17 ఏళ్ల శంకర్‌మరుసటి రోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స
పొందుతూ చనిపోయాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్‌.

కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌
సమితిని ఏర్పాటు చేశారు. జూన్‌4న తెంగాణలో పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ
హైదరాబాద్‌నగరానికి వచ్చి విద్యార్థి నాయకులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపింది.
దాదాపు ఏడాది పాటు తెలంగాణ ఉద్యమం యుద్ధ భూమిని తలపించింది. పెద్ద ఎత్తు న ఆస్తి నష్టం , ప్రా ణ నష్టం
జరిగాయి. మొత్తం 95 సార్లు కాల్పులు జరిగాయి. హైదరాబాద్‌, వరంగల్‌నగరాల్లో కర్ఫ్యూ విధించారు.

ఉద్యమంలో 369 మంది చనిపోగా, ప్రభుత్వ లెక్కలు మాత్రం 57 మంది చనిపోయినట్టు గా చెప్పాయి.
తెలంగాణ ప్రజా సమితి నేతతో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబరులో మర్రి చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి
వచ్చిన తర్వాత విద్యార్థు లు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి , విద్యార్థి నాయకుడు మల్లికార్జు న్‌గౌడ్‌
ఒక ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూ నే ఉద్యమంలో పాల్గొ నాని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా
ఉద్యోగులను, విద్యార్థు ను ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు.

తెలంగాణా ఉద్యమ ప్రస్థా నం 2001


ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్‌27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు
చెయ్యడంతో ప్రా రంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం
ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది.

ఏప్రిల్‌27: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖర రావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి,


తెలుగుదేశం పార్టీ ప్రా థమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర స్థా పనకై ఉద్యమించాడు.
ఇందుకు గాను తెలంగాణా రాష్ట్ర సమితి పేరిట ఒక రాజకీయ పార్టీని ప్రా రంభించాడు. శాసనసభకు పూర్వపు
సభాపతి - జి నారాయణ రావు కూడా ఆయనతో విలేకరుల సమావేశంలో పాల్గొ న్నాడు. మే 17 న కరీంనగర్‌లో
నిర్వహించే తెలంగాణా సింహగర్జన ద్వారా తమ బలప్రదర్శన చేస్తా మని ఆయన ప్రకటించాడు. మే 2:
తెలంగాణా రాష్ట్రం కొరకు జరిపే ఉద్యమం శాస్త్రీయం గా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా
జరుగుతుందని, ఇతర ప్రాంతాల ప్రజలు భయపడనవసరం లేదని చంద్రశేఖర రావు చెప్పాడు.

తీవ్రత
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గత 50 సంవత్సరాలనుండి పలు ఉద్యమాలు జరుగుతూనే
ఉన్నాయి, కానీ 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాల్చాయి.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖరరావు 2009, నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రా రంభించాడు.[2][3]
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాష్ట్రం
కోసం 2009 డిసెంబరు 3వ తేదీన ప్రా ణత్యాగం చేసిన తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి. ప్రొ ఫెసర్
కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణసమితి ఆధ్వర్యంలో వివిధ
ఉద్యమాలని రూపొందించారు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగినవి. ఈ ఉద్యమాల
ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమి 2009 డిసెంబరు 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
ప్రా రంభమైందని అధికారికంగా ప్రకటించింది.[4] ఈ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు మిన్నంటి
సమైక్యాంధ్ర ఉద్యమం ఏర్పాటుకు పరిస్థితులు దారితీసాయి.

మిలియన్ మార్చి సందర్భంగా నిరసనకారులు


హైదరాబాద్, ట్యాంక్‌బండ్ పై ప్రతిష్ఠించిన 12
వ శతాబ్దం నాయకుడు పలనాటి
బ్రహ్మనాయుడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తు న్న
చిత్రం

సకలజనుల సమ్మె
సమ్మెకు ఒక రోజుముందు, 2011 సెప్టెంబరు 12 న టి ఆర్ ఎస్ ప్రజా సదస్సు కరీంనగర్ లో నిర్వహించింది.
దీనిలో టిజెఎస్ నాయకులు, బిజెపి, న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొ న్నారు.[5]

2011 సెప్టెంబరు 13 నుండి ప్రా


రంభమై 42 రోజులపాటు జరిగిన సమ్మెలో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు,
న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ
ఉద్యోగులు ఈ సకలజనుల సమ్మెలో పాల్గొ న్నారు.దీని ప్రభావం వలన తెలంగాణ ప్రాంతంలోని అన్ని
విద్యాసంస్థ లు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డా యి.[6][7][8][9][10]

దీనిలో భాగంగా రైళ్ల నిలిపివేత చేపట్ట బడింది. విద్యుత్ ఉద్పాదన తగ్గింది. ఢిల్లీలో ప్రధానమంత్రితో
సంప్రదింపులు జరిగినవి.[11][12][13][14][15][16]

2011 అక్టో బరు 16 న రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా తదుపరి ఇతర సంఘాలు కూడా
సమ్మె విరమించాయి.ప్రొ ఫెసర్ కోదండరాం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందని ఉద్యమం
వేరేవిధంగా కొనసాగుతుందని ప్రకటించాడు.[17]

జులై 31 2013 ప్రకటన


2013 జూలై 31 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో,
సమైక్యాంధ్ర ఉద్యమం మరల రగిలింది.

రాజకీయ పార్టీలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పలు రాజకీయ పార్టీలు ఏర్పడ్డా యి. మచ్చుకు కొన్ని

తెలంగాణ రాష్ట్ర సమితి - కల్వకుంట్ల


చంద్రశేఖరరావు
జై తెలంగాణా - ఇంద్రా రెడ్డి
నవ తెలంగాణ ప్రజా పార్టీ - దేవేందర్ గౌడ్
తెలంగాణ నగారా - నాగం జనార్ధన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో అమరులైన
వ్యక్తు లు
కానిస్టేబుల్ కిష్టయ్య
కాసోజు శ్రీకాంతచారి
సిరిపురం యాదయ్య
మీగడ సాయికుమార్ యాదవ్
ఇశాంత్‌రెడ్డి
వేణుగోపాల్‌రెడ్డి

ఉద్యమంలో పాల్గొ న్న వ్యక్తు లు


వసుంధర రెడ్డి
కొల్లూ రి చిరంజీవి
పుస్తకాలు
బాటిల్‌గ్రౌండ్ తెలంగాణ

ఇవీ చూడండి
తెలంగాణా ఉద్యమ ప్రస్థా నం 2005
సమైక్యాంధ్ర ఉద్యమము

మూలాలు
1. "SRC submits report" (https://web.archive.
org/web/20060301045415/http://www.hi
ndu.com/2005/10/01/stories/200510010
0040900.htm) . The Hindu. Chennai, India.
1 October 2005. Archived from the
original (http://www.hindu.com/2005/10/
01/stories/2005100100040900.htm) on
1 మార్చి 2006. Retrieved 9 October 2011.
2. వి6 (29 November 2017). "దీక్షా దివస్..
తెలంగాణను నిలబెట్టిన దీక్ష" (https://web.arch
ive.org/web/20180913095257/http://telu
gu.v6news.tv/%e0%b0%a6%e0%b1%80%e
0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b
0%be-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b
5%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a4%
e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%
b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%
a8%e0%b1%81-%e0%b0%a8) . Archived
from the original (http://telugu.v6news.t
v/%E0%B0%A6%E0%B1%80%E0%B0%9
5%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BE-
%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E
0%B0%B8%E0%B1%8D-%E0%B0%A4%E
0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%
B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B
0%A8%E0%B1%81-%E0%B0%A8) on 13
సెప్టెంబరు 2018. Retrieved 6 December
2018. {{cite news}}: More than one
of |archivedate= and |archive-
date= specified (help); More than one of
|archiveurl= and |archive-url=
specified (help)

3. 10టీవి (29 November 2016). "టీ.ఎస్ దీక్షా


దివస్ డే." (https://web.archive.org/web/20
161201104537/http://10tv.in/7-Years-Co
mpletion-For-KCR-s-Hunger-Strike-Deeksh
a-Diwas-Telangana-71870) Archived
from the original (https://10tv.in/7-Years-
Completion-For-KCR-s-Hunger-Strike-Deek
sha-Diwas-Telangana-71870) on 1
డిసెంబరు 2016. Retrieved 6 December
2018.
4. టి.ఆర్.ఎస్. పార్టీ వెబ్సైట్. "నేడు దీక్షా దివస్" (htt
p://trspartyonline.org/nedu-deeksha-dhiva
as) . trspartyonline.org. Retrieved 6
December 2018.

5. "Telangana is angry and will erupt in


flames: KCR" (http://www.rediff.com/new
s/report/telangana-is-angry-and-will-erupt
-in-flames-kcr/20110912.htm) .
Rediff.com. Retrieved 9 October 2011.
6. "Telangana: Administrative work affected"
(https://web.archive.org/web/201210171
95916/http://ibnlive.in.com/news/telanga
na-administrative-work-affected/183823-
60-114.html) . IBNLive.com India.
Archived from the original (http://ibnlive.i
n.com/news/telangana-administrative-wo
rk-affected/183823-60-114.html) on 17
అక్టో బరు 2012. Retrieved 9 October 2011.
{{cite web}}: More than one of
|archivedate= and |archive-
date= specified (help); More than one of
|archiveurl= and |archive-url=
specified (help)
7. "Strike at Singareni Collieries may hit
power production" (http://www.thehindub
usinessline.com/industry-and-economy/a
rticle2450632.ece) . The Hindu Business
Line. Retrieved 9 October 2011.

8. "Telangana collieries strike hits power


supplies in south India" (https://web.archi
ve.org/web/20121014021110/http://ww
w.daijiworld.com/news/news_disp.asp?n_
id=115879) . Daijiworld Media Pvt Ltd.
Archived from the original (http://www.dai
jiworld.com/news/news_disp.asp?n_id=1
15879) on 14 అక్టో బరు 2012. Retrieved 9
October 2011.
9. "Govt teachers join hands for Telangana"
(https://web.archive.org/web/201209271
83231/http://articles.timesofindia.indiati
mes.com/2011-09-17/hyderabad/301689
12_1_telangana-region-swamy-goud-telan
gana-protagonists) . The Times of India.
India. 17 September 2011. Archived from
the original (http://articles.timesofindia.in
diatimes.com/2011-09-17/hyderabad/30
168912_1_telangana-region-swamy-goud-
telangana-protagonists) on 27 సెప్టెంబరు
2012. Retrieved 9 October 2011. {{cite
news}}: More than one of
|archivedate= and |archive-
date= specified (help); More than one of
|archiveurl= and |archive-url=
specified (help)
10. "Transport employees' strike paralyse
Telangana" (http://articles.timesofindia.in
diatimes.com/2011-09-19/hyderabad/30
175479_1_rtc-management-rtc-strike-sep
arate-telangana-state) . The Times of
India. India. 19 September 2011.
Retrieved 9 October 2011.

11. Singh, S. Harpal (19 September 2011).


"Telangana activists block highway" (htt
p://www.thehindu.com/news/states/andh
ra-pradesh/article2467382.ece) . The
Hindu. Chennai, India. Retrieved 9 October
2011.
12. "Statehood protests paralyse transport in
Telangana" (http://articles.economictime
s.indiatimes.com/2011-09-25/news/3020
0846_1_rail-blockade-services-or-local-trai
ns-telangana-joint-action-committee) .
The Times of India. India. 25 September
2011. Retrieved 9 October 2011.

13. "People power driving Telangana


agitation" (http://indiatoday.intoday.in/stor
y/people-power-fuels-agitation-for-telang
ana/1/153130.html) . India Today.
Retrieved 9 October 2011.
14. "Telangana crisis: Bandh in Hyderabad,
talks in Delhi" (https://web.archive.org/we
b/20111010231358/http://www.ndtv.co
m/article/india/telangana-crisis-bandh-in-
hyderabad-talks-in-delhi-137452) . NDTV.
Archived from the original (http://www.ndt
v.com/article/india/telangana-crisis-band
h-in-hyderabad-talks-in-delhi-137452) on
10 అక్టో బరు 2011. Retrieved 9 October
2011.

15. "Telangana issue: PM steps in, meets KCR


and says working on solution" (http://ww
w.indianexpress.com/news/telangana-iss
ue-pm-steps-in-meets-kcr-and-says-worki
ng-on-solution/855001/) . The Indian
Express Limited. Retrieved 9 October
2011.
16. "Telangana stir, energy crisis could hit
economy of Andhra Pradesh" (http://articl
es.economictimes.indiatimes.com/2011-
10-05/news/30246969_1_coal-production
-ntpc-s-ramagundam-heavy-power-cuts) .
The Times of India. India. 5 October 2011.
Retrieved 9 October 2011.

17. "42-day Telangana strike ends" (http://ww


w.thehindubusinessline.com/industry-and-
economy/government-and-policy/article2
568330.ece) . Business Line. Archived (ht
tps://archive.today/20130203220648/htt
p://www.thehindubusinessline.com/indust
ry-and-economy/government-and-policy/a
rticle2568330.ece) from the original on 3
ఫిబ్రవరి 2013. Retrieved 31 October 2011.
బయటి లంకెలు
English Wikisource లో ఈ వ్యాస
విషయానికి సంబంధించిన మూల పాఠ్యం
ఉంది. కింది లింకు చూడండి:
India States Reorganisation
Commission Report Telangana
Andhra

"Regionalism: Telangana Movement (ht


tp://lcweb2.loc.gov/cgi-bin/query/r?fr
d/cstdy:@field(DOCID+in007
5)) ". India: A country study (http://lcwe
b2.loc.gov/frd/cs/intoc.html) . Library
of Congress Federal Research
Division (September 1995).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చరిత్ర (http://ww
w.ap.gov.in/Pages/History.aspx)
తెలంగాణా.ఆర్గ్ (https://web.archive.org/
web/20191207013444/http://www.tela
ngana.org/)
ఈతెలంగాణా.ఆర్గ్ (https://web.archive.or
g/web/20200225055003/http://etelan
gana.org/)
తెలంగాణా రాష్ట్రము ఏర్పాటుకు హామీ
మరియొ అణచివేత (https://www.youtub
e.com/watch?feature=player_embedd
ed&v=j9K3JzT3C2M)

"https://te.wikipedia.org/w/index.php?
title=తెలంగాణ_ ఉద్యమం&oldid=4218103" నుండి
వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 14 మే 2024న 17:03కు
జరిగింది. •
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0
క్రింద లభ్యం

You might also like