Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ఒక్కమాటలో చెప్పాలంటే, ఒప్పుకొదగిన స్థా యికి మించిన డెవలపర్లు తక్కువ.

1. ఈ కోడ్ ఇలా రాయి, అని స్టెప్ బై స్టెప్ చెప్పినా రాయలేని వాళ్ళను ఎంతో మందిని చూసాను.
2. ప్రోగ్రామింగ్ నేర్చుకోవటం వేరు, నేర్చుకున్నది వాడగలగటం వేరు.
3. నేర్చుకున్నది వాడటం వేరు, తప్పులేకుండా ప్రోగ్రాం రాయటం వేరు.
4. ఇప్పుడు, ప్రోగ్రాంలో తప్పులు లేకుండా రాయటం వేరు, ఎప్పుడో ఏదో తప్పు వస్తుందేమో అని ముందుగా
ఆలోచించి అది రాయటం వేరు.
5. ముందుచూపు ఒక ఎత్తైతే, తాను రాసిన ప్రోగ్రాం, తను లేకపోయినా, పది మంది డాక్యుమెంటేషన్ మరియు
కోడ్ చదివి అర్థం చేసుకునేలా రాయటం వేరు.
6. ఇవన్నీ ఒక ఎత్తైతే , క్లయింట్ కి ఏం కావాలో తెలుసుకొని దాన్ని, కోడ్ లో రాయటం ఒక ఎత్తు . ఇది సరిగ్గా
చెయ్యలేని వారెందరినో చూసాను.
7. అసలు క్లైంటే నాకు ఫలానా విషయం కావాలి అని అడిగినా, వాళ్ళ అసలు సమస్య అర్ధం చేసుకొని, నీకు
కావల్సింది కరివేపాకు కాదు, గోరింటాకు అని చెప్పగలిగిన వారికి జ్ఞాననేత్రం ఉందని నా నమ్మకం.
8. ఇంతా కష్టపడి, ఒక ఏడాది కుటుంబం మీద దృష్టి పెడదాం, అని అనుకుంటే, ఏడాదిలో అతను నేర్చుకున్నది
పాతబడి పోతుంది. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించిన విషయము.
9. వీటన్నింటికీ మధ్యలో, డెడ్లైన్, తోక కాలిన కోతుల్లాంటి మనుషులు, ఎక్కువ డబ్బు వల్ల వచ్చే ఇన్సెక్యూరిటీ.
10. ఇదొక యుద్ధమే - కంటికి కనిపించని శత్రు వుతో, బయటకి కనిపించని యుద్ధం. బయటకి కూల్ గానే
కనిపిస్తా రు.
11. ఏం యుద్ధవీరులంటే మగధీర లో రామ్ చరణ్ లాగా నే ఉంటారా? ఒక చీకటి గదిలో ఒక మూల, గొప్ప
వెలుతురు. అక్కడ చూస్తే, ఒక చిన్న షార్టు , చేతుల బనీను, పెద్ద పొట్ట, చెవిలో లేటెస్టు హెడ్ఫోన్, ఎదురుగుండా
రెండు పెద్ద స్క్రీన్లు , చేతిలో మౌసు. ఇంకా సరిగ్గా గమినిస్తే చుట్టూ కాఫీ గ్లా సుల దగ్గర నుండి లేస్ ప్యాకెట్లు దాకా
రకరకాల నైవేద్యాలు. ఎదో మోహమాటానికి, కొన్నప్పటి నుండి ఎప్పుడు కడగని రాగి చెంబో, బాటిలో
ఉంటుంది. మరి మధ్యలో వీరుడు ?
12. కాసేపు స్క్రీన్ చూస్తా డు. కాసేపు, చుట్టూ పిచ్చి చూపులు చూస్తా డు. కాసేపు కీబోర్డ్ ని దడదడలాడిస్తా డు.
ఒక్కోసారి, ప్రోగ్రాం రన్ చేయటం మొదలుపెట్టి, తను దడదడలాడుతూ హనుమాన్ చాలీసా
మొదలుపెడతాడు. కానీ ఎప్పుడూ కూడా కాళ్ళు ఊపుతూనే ఉంటాడు. తనలో తానే గొణుక్కుంటాడు. ఒకచో
ఆశ, ఒకచో ఆవేశం, ఒకచో నిస్పృహ, ఒకచో వెఱ్ఱి ఆనందం, చాలా సేపు నిర్లిప్తమైన మౌనం. ఏదో ఒకరోజు కీబోర్డ్
కి తల బాదుకుంటూ ఉంటాడు. అదిగో ఆ రోజు కంప్యూటర్ ముఖి అతన్ని పూర్తిగా ఆవహించిందని గుర్తు .
మహిళా ప్రోగ్రామర్లు కొద్దిగా ఒబ్బిడిగా ఉంటారేమో. కానీ పెద్దగా నమ్మకం లేదు. ఈ ప్రోగ్రామర్ జాతే అలాంటిది.
13. హాస్యం పక్కన పెడితే, నేను చూసిన ఎక్కువ జీతం సంపాదించే వాళ్ళలో చాలా మంది దానికి అర్హులు.
14. కొంత మంది మేనేజర్లని కాకా పట్టి పైకొచ్చిన బ్యాచ్. వాళ్ళతో నేను మాట్లా డినప్పుడు, వాళ్ళకి పని
రాకపోవటానికి ముఖ్య కారణం : వాళ్ళ కెరీర్ మొదట్లో మంచి టెక్నికల్ మెంటర్ లేకపోవటం. అందుకని నేను
ప్రత్యేకంగా ఒక నెల పాటు ఒక ఫ్రెషర్ ని చేయి పట్టు కొని నడిపించినట్లు నడిపించాను. వాళ్ళు నెలలోనే బాగా
అందుకొగలిగారు. అనర్హులకు అందలం డెవలపర్లలో చాలా కష్టం. మేనేజర్ అయ్యి డబ్బులు
సంపాదించవచ్చేమో గానీ, డెవలపర్ గా ఉండి , మంచి డబ్బులు సంపాదిస్తు న్నారు అంటే టెక్నికల్ గా బాగా
పట్టు ఉన్నట్టే. ఆషామాషీ వ్యవహారం కాదు!

You might also like