అర్ధనారీశ్వరుడు

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

అర్ధనారీశ్వరుడు.

శివునికి ఆపేరు ఎలా వచ్చింది.

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి

కాలి బొ టన వేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరి సగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము.

అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి,

పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీ పరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి

ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా

... ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలో నూ, నిర్మాణాలలోనూ ఒకటిగా

చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను

ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి

ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి.

అర్ధనారీశ్వరుడు

లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తా రని

పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే,

స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా

దర్శనమిస్తా రు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణు ని

(సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణు ని (నిర్గు ణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు

కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష

రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గు ణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.


అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహాశివరాత్రి నాడు

ఆది దంపతులు - జగత్పితరులు

'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తు తిస్తుంటారు. జగత్తు కంతటికీ తల్లిదండ్రు లలాంటి వారు ఆ

పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా

అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా

కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ

కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రు డైన

సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో

సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రా ణులను రూపొందిస్తూ జీవం పో స్తూ ఎంతకాలంగా తన పనిని తాను

చేసుకుపో తున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు

పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.

బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ

శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి

అనేక విధాల స్తు తించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని

తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది.

బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తు తించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన

కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రా ర్థించాడు. ఆమె బ్రహ్మను

అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొ మల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి

అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన

కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లు గానే అనంతరం

ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.
సృష్టి ఆవిర్భావం స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని,

ప్రతివారు స్త్రీ మూర్తు లను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి

ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ

కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థి తి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా

సృష్టిని ప్రా రంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పో యిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన

తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్త మైందని ఈ కథ వివరిస్తోంది.

ఆది దంపతులను చూసైనా మనం నేర్చుకోవద్దూ ?

By
Published : Mar 11, 2021, 5:11 PM IST

వందలో రెండు యాభైలు ఉంటాయి ఏ యాభై ఎక్కువా కాదు.. తక్కువా కాదు.. రెండూ
సమానమే.. సంసారంలో ఆలుమగలూ అంతే! ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు. ఈ
సూత్రా న్నే అర్ధనారీశ్వర తత్త్వంగా అర్థవంతంగా ప్రదర్శించారు ఆది దంపతులు. ఆ జంట అందరికీ
ఆదర్శం.. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి యేటా కల్యాణంతో మళ్లీ ఒక్కటవుతున్న
పార్వతీపరమేశ్వరుల జీవనం అనునిత్యం ఆచరణీయం..
shiva
భార్యంటే బానిస కాదు. భర్తంటే భరించేవాడనీ కాదు. పెనిమిటిని సుతారంగా పెనవేసుకున్న తీగ
ఆమె. ఆలి ఆలింగనంతో తరిస్తు న్న తరువు ఆయన. ఆ తీగ పందిరి ఎక్కకున్నా.. ఈ తరువు
బరువుగా భావించి కుంగిపో యినా దాంపత్యం భారమవుతుంది. ఒకరికొకరు అవకాశం కల్పిస్తూ
అల్లు కుపో వడమే దాంపత్య రహస్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే సంసార సూత్రం.
ఈగోల గోల ఎందుకు?

చిలిపి చిరాకులు, వలపులో పరాకులు ఎరుగని మంద భాగ్యులు సంసారాన్ని చదరంగంతో పో ల్చారు.
కష్టనష్టా లు దాటలేని అసమర్థు లు సంసారం సాగరమని తీర్మానించారు. మూడు ముళ్లు
వేస్తు న్నప్పుడు కలిగే ఆనందాన్ని కడదాకా కొడిగట్టకుండా చూసుకోగలిగితే.. దాంపత్యం ఎలాంటి
ఒడిదొడుకులు లేకుండా ఉంటుంది. ఏడడుగులు వేసినప్పుడు ఉన్న స్ఫూర్తితోనే జీవన యానం
చేస్తే .. సంసారం నల్లే రు మీద బండి నడకలా సాగిపో తుంది. తలంబ్రా లప్పుడు ఒకరిపై ఒకరు పైచేయి
సాధించినా సరదాగా స్వీకరించిన అప్పటి వైఖరిలో మార్పు రాకుంటే.. ఈగోల గోల పొ డచూపదు. అది
గొడవల దాకా రాదు. పైచేయి గురించి ఎందుకు పేచీ? గిల్లికజ్జా లను గోడలు వినేదాకా తెచ్చుకొని,
గల్లీలోకి ఈడ్చుకొని.. కోర్టు దాకా లాక్కున్నాక గానీ తెలియదు.. సాధించేది ఏమీ ఉండదని !

అమ్మ మహిమ అది !

అలగటాలు, ఆటపట్టించడాలు ప్రతి సంసారంలో ఉండేవే. ఉమామహేశ్వరుల మధ్య గిల్లికజ్జా లకేం


కొదవలేదు. యుగయుగాల సంసారం కదా! ఓసారి ప్రమథ గణాలు స్తు తులతో శివుడ్ని ఆకాశానికి
ఎత్తే శారట. తన పక్కనే ఉన్న పార్వతి వంక ఒకింత గర్వంగా చూశాడట పరమేశ్వరుడు. పార్వతి
చిరునవ్వుతో ఓ ఐదు రంధ్రా లున్న పూల బంతి భర్తకు ఇచ్చిందట. ఆ రంధ్రా ల్లో కి చూసిన శివుడికి..
బంతిలో ఐదు బ్రహ్మాండాలు, ఐదు కైలాసాలు, అక్కడ ఐదుగురు రుద్రు లూ కనిపించారట. అంతే!
అమ్మగారి మహిమెంతో తెలిసొ చ్చింది. అయ్యగారి గర్వం సర్వం నిర్వీర్యమైపో యింది. శక్తి లేనిది
పురుషుడు ఎలా ఉండగలడు? భార్య తోడు లేనిది భర్తకు విలువ ఏముంటుంది? ఆలుమగల్లో ఒకరు
ఎక్కువా కాదు.. ఒకరు తక్కువా కాదు.. అనడానికి ఆదిదంపతులు చూపిన లీల ఇది. ఈ
సారాంశాన్ని గ్రహిస్తే .. అవతలి వాళ్లు బెట్టు చేసినప్పుడు ఇవతలి వాళ్లు పట్టు విడుపులు ప్రదర్శించాలి.
ఇవతలి వాళ్లు గర్వానికి పో తే.. అవతలి వాళ్లు యుక్తిగా నెగ్గా లి.

ఇద్దరం సమానమే...
స్నేహితుడిని ఓ మాట అనడానికి ఆలోచిస్తాం. దారినపో యే దానయ్య అమర్యాదగా ప్రవర్తించినా..
అవతలి వ్యక్తి బలాబలాలు తెలుసుకొని ప్రతిస్పందిస్తాం. అదే కట్టు కున్నవారి విషయంలో మాత్రం
నోటికెంత వస్తే అంత అరిచేస్తా రు. బుద్ధి కి ఏది పుడితే అది చేస్తుంటారు. మనసులో ఇద్ద రం సమానం
అనే భావన లేకనే.. ఆధిపత్య ధోరణికి లొంగిపో తారు. అనవసరంగా జీవితాన్ని కుంగదీసుకుంటారు.

అదే అర్ధనారీశ్వర తత్వం !

‘సంసారం అన్నాక సవాలక్ష ఉంటాయి’ అందరూ అనే మాట ఇది. ఇలాంటి సందర్భాలు
ఆదిదంపతుల జీవితంలోనూ వచ్చాయి. కొన్నిసార్లు సర్దు కుపో యారు. ఇంకొన్నిసార్లు
కట్టు కున్నవారిపై నమ్మకంతో చూసీచూడనట్టు గా వదిలేశారు. మరికొన్నిసార్లు ఒకరికొకరు అండగా
నిలిచారు. లోక రక్షణ కోసం పరమేశ్వరుడు హాలాహలం తీసుకుంటుంటే ‘నువ్వు విషం మింగితే నేను
పుట్టింటికి పో తాన’నలేదు పార్వతి. భార్యగా కన్నా.. తల్లిగా తన బిడ్డ ల గురించే ఆలోచించింది.
ఎంతమాత్రం అడ్డు చెప్పలేదు. భర్తపై ఆ ఇంతి నమ్మకం అది. కష్టకాలంలో అతడి వెన్నంటి ఉంది.
పార్వతీదేవి మాంగళ్యంపై శంకరుడికి అచంచలమైన విశ్వాసం. అందుకే ముందూవెనుకా
ఆలోచించకుండా గరళాన్ని గుటుక్కున మింగేశాడు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు విశ్వాసంతో
ఉండాలని చెబుతుందీ సందర్భం.

సరసాల దాంపత్యం, నవరసాల సంసారం కలగలిసిందే జీవితం. ఈ ఆట ఆడే ఆలుమగలిద్ద రూ


సమఉజ్జీ లు అయినప్పుడే.. జీవితం రంజుగా సాగుతుంది. ప్రతి మలుపులోనూ ఇద్దరి గెలుపూ
సాధ్యమవుతుంది. ప్రతి గెలుపునూ ఇద్దరూ ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. అర్ధనారీశ్వర తత్త్వం
తెలియజేసే అసలు సత్యమూ ఇదే!

You might also like