Abhijit Lagnam

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

13/01/2024, 23:00 (16) Quora

అభిజిత్ లగ్నం అంటే ఏమిటి?


చాలా సమాధానాలు చూసాను…అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి…ఎలా లెక్క వేయాలి అనేది రాశారు కానీ ఈ అభిజిత్
అంటే ఏంటి….ఆ పేరు రావడం వెనుక పురాణ వచనం ఏంటి అనేది నేను చెప్తా ను వినండి.
*అభిజిత్ లగ్నం అంటే…*
అభిజిత్ అనేది కాంతిలేని నక్ష త్రం. పురాణాల్లో దీని వెనుక ఓ ఆసక్తి కర కథ కూడా ఉంది.
అందరూ టక్కున చెప్పే సమాధానం ఇరవై ఏడు అని. కానీ అభిజిత్ అనే ఓ నక్ష త్రం ఉందనీ, దానికి కొంత ప్ర త్యేకత
ఉందని ఎంతమందికి తెలుసు?
ఆ విశేషాలేమిటో మనం తెలుసుకుందాం….
అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్ష త్రం అనేది కూడా
ఒక్కటి కాదు…. అనేక నక్ష త్రా ల సమూహం.
వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు నిర్ణ యించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే
ఉత్త రాషాఢ నక్ష త్రం చివరి పాదం, శ్ర వణా నక్ష త్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్ష త్రం అంటారు.
ఈ నక్ష త్రం వెనుక ఓ పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం….
మనకున్న 27 నక్ష త్రా లనూ దక్ష ప్ర జాపతి కుమార్తె లుగా చెబుతారు. దక్షు డు వీరిని చంద్రు డికి ఇచ్చి పెళ్లి చేశాడు.
అందరికన్నా రోహిణి మీదే చంద్రు డికి ప్రే మ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్ష త్రా లు ఊరుకున్నా
శ్ర వణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థా నంలో ఉంచి చంద్రు డి వ్యవహారం తేల్చడానికి
తండ్రి దగ్గ రకు వెళ్లింది.
శ్ర వణా నక్ష త్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు . అది 28వ నక్ష త్రంగా ఏర్పడింది.
ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్ర మైన స్థా నం కూడా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తి ఈ నక్ష త్రా నికి వచ్చింది.
ప్ర తి రోజూ ఈ నక్ష త్రా నికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు
చూద్దాం….
ఈ పదం ఒకప్పుడు పల్లె టూళ్ల కు కొత్త కాదు. కాలంమారింది కాబట్టి ఇప్పుడది అంతగా వినపడటం లేదు. అభిజిత్
లగ్నాన్ని పల్లె టూళ్ల లో అలా పిలిచేవారు. గడ్డ పలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ
పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్ట మధ్యాహ్నం అన్నమాట.
ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థా నంలో ఉంటాడని, ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం.
నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం.
ప్ర స్తు తం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమిపూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారంటే
దీనికున్న ప్రా ధాన్యం ఏపాటిదో ప్ర త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు.
ఈ ముహూర్తం మధ్యాహ్నం 11-45 నుండి 12-30 వరకు ఉంటుంది.
ఈ ముహూర్తం లోనే శివుడు త్రి పురాసుర వధ చేశాడు.
ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం ప్రా రంభించారు.
ఈ శుభ ముహూర్తం లోనే ఇంద్రు డు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు.
https://te.quora.com 1/2
13/01/2024, 23:00 (16) Quora

శ్రీ రాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థి తుడై ప్రా ణాలను విడిచిపెట్టి న సమయం…
ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి.
ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టా లు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ
శుభకార్యం చేపట్టి నా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు.
ఇంకా ఈ ముహూర్తా నికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయంలో దక్షి ణ దిక్కుకు ప్ర యాణం
మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది.
దక్షి ణం యమస్థా నం కాబట్టి బుధవారం మాత్రం ఆ దిక్కుకు వెళ్ల రాదని నారద సంహిత పేర్కొంది.
అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.
ఆ నక్ష త్రా ధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షి ణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్ర యాణం
చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలనూ ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ
సంహిత పేర్కొంది. ముహూర్త వల్ల రి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్ర యాణాలకే తప్ప ఇతర కార్యాలకు
పనికిరాదని అంటోంది. ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్ట మని బ్ర హ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ఎన్ని
భిన్నాభిప్రా యాలు ఉన్నా అభిజిత్ లగ్నం సర్వశ్రే యోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

https://te.quora.com 2/2

You might also like