Bhalare Telugu

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

భళారే... తెలుగు!

ఒకప్పుడు ప్ర ముఖ పాత్రి కేయులు శ్రీ భండారు శ్రీ నివాసరావుగారు ఫేస్‌బుక్‌లో ఆసక్తి కరమైన ఈ క్రింది ఆంగ్ల వాక్యాన్ని పోస్ట్ చేశారు:
An Amazing Sentence in English
Remarkable indeed! The person who made this sentence must be a GENIUS in English vocabulary.
"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary
pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's
incomprehensibleness.''
ఈ వాక్యంలో ఇరవై పదాలున్నాయి. ఒకటవ పదంలో ఒక అక్ష రం, రెండవ పదంలో రెండు అక్ష రాలు, మూడవ పదంలో మూడు
అక్ష రాలు, ఈ విధంగా అక్ష రవృద్ధి క్ర మంలో ఇరవయ్యవ పదంలో ఇరవై అక్ష రాలు ఉన్నాయి.
ఇదొక అపురూపమైన చిత్ర రచన. దీనికి ప్ర తిగా తెలుగు భాషకు గల శక్తి ని వెల్ల డిస్తూ ఏల్చూరి మురళీధరరావు గారు ఈ క్రింది
వాక్యాన్ని ప్ర కటించారు:
“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తి కి, సద్గు ణాలంకారవ్యక్తి కి,
రసోచితశబ్దా ర్థ యుక్తి కి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్ర దాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి,
పురుషార్థో చితచిత్త వృత్తి చిత్ర ణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థ కు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
ఉత్కృష్ట లోకసిద్ధా ర్థ మహాపురుషగుణకీర్త నకు, రమణీయార్థ నిర్మితశ్ర వణమనోహరకావ్యలక్ష్మికి,
నానార్థ స్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షి తాన్యపరవాచ్యసంలక్ష్యక్ర మభావధ్వనికి,
శృంగారవీరకరుణహాస్యరౌద్రా ద్భుతశాంతాదిరసప్ర తీతికి, గిరిశిఖరపతన్నిరర్గ ళస్ర వంతీనిరుపమానధారాశుద్ధి కి,
ధర్మజ్ఞా నభక్తి ప్రే మసత్యాద్యుత్త మాదర్శప్ర తిపాద్యవస్తు స్వీకృతికి,
సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్ర పంచశోభాదూరవర్తే !
పై వాక్యంలో 26 అక్ష రవృద్ధి దళాలున్నాయి. మొదటి దళం ఒక అక్ష రం, రెండవ దళం రెండక్ష రాలు, మూడవ దళం
మూడక్ష రాలు.... ఇలా ఇరవై ఆరవ దళం ఇరవై ఆరు అక్ష రాలతో అక్ష రవృద్ధి క్ర మంలో కూర్పబడి ఉన్నాయి.
1. ఏ
2. మంచి
3. కవైనా
4. విశ్వనాథ
5. గ్రంథావళిని
6. చదవకపోతే
7. కవిత్వరచనలో
8. పద్యనిర్మాణశక్తి కి,
9. సద్గు ణాలంకారవ్యక్తి కి,
10. రసోచితశబ్దా ర్థ యుక్తి కి,
11. సుమకోమలభావభావనకు,
12. నవ్యసంప్ర దాయపదగుంఫనకు,
13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,
14. పురుషార్థో చితచిత్త వృత్తి చిత్ర ణకు,
15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,
16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థ కు,
18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
19. ఉత్కృష్ట లోకసిద్ధా ర్థ మహాపురుషగుణకీర్త నకు,
20. రమణీయార్థ నిర్మితశ్ర వణమనోహరకావ్యలక్ష్మికి,
21. నానార్థ స్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,
ర్థ స్ఫో
22. అభిధావివక్షి తాన్యపరవాచ్యసంలక్ష్యక్ర మభావధ్వనికి,
23. శృంగారవీరకరుణహాస్యరౌద్రా ద్భుతశాంతాదిరసప్ర తీతికి,
24. గిరిశిఖరపతన్నిరర్గ ళస్ర వంతీనిరుపమానధారాశుద్ధి కి,
25. ధర్మజ్ఞా నభక్తి ప్రే మసత్యాద్యుత్త మాదర్శప్ర తిపాద్యవస్తు స్వీకృతికి,
26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్ర పంచశోభాదూరవర్తే !
తెలుగు భాషాభిమానుల ఆసక్తి కారణంగా ఈ వాక్యం అచిరకాలంలోనే ఫేస్ బుక్ లోనూ, అంతర్జా లంలోనూ, వాట్సాప్ మాధ్యమం
ద్వారానూ, వివిధ పత్రి కలలోనూ పాతికవేలకు పైగా పర్యాయాలు సంచరిస్తుండటం విశేషం!
భళారే ... తెలుగు!

You might also like