9వ తరగతి తెలుగు వాచకము నోట్సు పూర్తిగా PDF

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 100

తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 1

తెలుగు అభ్యాసదీపిక
తెలుగు పరిమళం - 9
(9వ తరగతి తెలుగు వాచకము నోట్సు )

రూపకల్పన :
మామిడిశెట్టి శ్రీనివాసరావు,
ఎమ్.ఏ; టి.పి.టి; నెట్; స్లెట్;
పాఠశాల సహాయకుడు (తెలుగు),
జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల, కె.పెదపూడి,
అంబాజీపేట మండలం, డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 2

తెలుగు పరిమళం - 9
తొమ్మిదో తరగతి - తెలుగు(ప్రథమ భాష)
విషయ సూచిక
పద్యభాగం
క్రమసంఖ్య పాఠం పేరు ప్రక్రియ కవి/రచయిత పుటలు

1 ధర్మబో ధ ప్రా చీన పద్యం నన్నయభట్టు 3 - 11

2 చైతన్యం గేయ కవిత తాపీ ధర్మారావు 12 - 18

3 హరివిల్లు వర్ణ న వివిధ కవులు 19 - 25

4 ఆత్మకథ వచన కవిత ఎండ్లూ రి సుధాకర్ 26 - 31

5 స్నేహం ప్రా చీన పద్యం వివిధ కవులు 32 - 41

6 తీర్పు ఆధునిక పద్యం జంధ్యాల పాపయ్యశాస్త్రి 42 - 47

7 మాట మహిమ ఆధునిక పద్యం కొలకలూరి స్వరూపరాణి 48 - 56

గద్యభాగం
క్రమసంఖ్య పాఠం పేరు ప్రక్రియ కవి/రచయిత పుటలు

1 ఇల్ల లకగానే కథానిక పి. సత్యవతి 57 - 61

2 రంగస్థ లం వ్యాసం తనికెళ్ల భరణి 62 - 67

3 ప్రియమైన నాన్నకు లేఖ పింగళి బాలాదేవి 68 - 74

4 ఆశావాది ముఖాముఖి ఆశావాది ప్రకాశరావు 75 - 80

5 ఏ దేశమేగినా యాత్రా సాహిత్యం ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ 81 - 86

6 నా చదువు స్వీయచరిత్ర శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 87 - 93

7 ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం డేవిడ్ లివింగ్స్టన్ 94 - 100

నా విన్నపము
విజ్ఞు లైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు నా నమస్సులు 🙏
. నేను పాఠ్య పుస్త కాన్ని మాత్రమే
ఆధారంగా చేసుకుని, నా అవగాహన మేరకు ఈ నోట్సును రూపొ ందించడం జరిగింది. ఇది ఏ ఒక్క స్ట డీ
మెటీరియల్సుకు అనుకరణ కాదు. ఎక్కడైనా దో షాలు గమనించినచో సహృదయంతో సవరించుకోగలరు.
ఎల్ల వేళలా మీ ఆదరణను ఆశిస్తూ ..
మామిడిశెట్టి శ్రీనివాసరావు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 3

1.ధర్మబో ధ
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
1. పద్యాలను రాగయుక్త ంగా పాడండి, వాటి భావాలు చెప్పండి.
జ). (ఉపాధ్యాయుడు పద్యాలను రాగయుక్త ంగా పాడేటప్పుడు విద్యార్థు లు శ్రద్ధగా గమనించి, అదే విధంగా
పాడటానికి ప్రయత్నిస్తా రు. పద్యాల భావాలను సొ ంతమాటల్లో చెబుతారు.)
2. అనుకూలవతి అయిన భార్యను గూర్చి కవి ఏం చెప్పాడు?
జ). భార్య అనుకూలవతి అయితే ఆ పురుషుడు గృహస్థ విధులైనట్టి యజ్ఞ ం, అగ్నిహో త్రం, అతిథిపూజ
మొదలైన సమస్త కర్మలు ఆచరించగలుగుతాడు. అతనికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. మంచి సంతానం
పొ ందగలుగుతాడు. ఎల్ల ప్పుడూ గృహస్థ ధర్మాన్ని ఆచరించే గృహస్థు అందుకోవలసిన ఫలితాన్నంతటినీ
అందుకోగలుగుతాడు. ఈ విధంగా అనుకూలవతి అయిన భార్యను గురించి నన్నయకవి చక్కగా చెప్పారు.
3. శకుంతల రాజుతో "కొడుకును కరుణా దృష్టితో చూడుము" అని అన్నది. కరుణా దృష్టితో అంటే ఏమిటి?
జ). శకుంతల దుష్యంత మహారాజుకు సత్య వాక్య గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ మాటలు అన్నది.
శకుంతల భార్య అయిన తనను, తమకు పుట్టిన సంతానమైన భరతుని గుర్తు లేనట్లు గా ప్రవర్తిస్తు న్న దుష్యంత
మహారాజుకు కణ్వమహర్షి ఆశ్రమంలో ఆయన చేసిన ప్రతిజ్ఞ లను గుర్తు చేసింది. వాటిని నెరవేర్చి, భరతుని కొడుకుగా
స్వీకరించి, అతనిని కరుణా దృష్టితో చూడమని చెప్పింది. కరుణా దృష్టి అంటే దయతో, జాలితో చూడడం అని అర్థం.
తండ్రి ఎవరో తెలియని పిల్లవాడికి సమాజంలో విలువ ఉండదు. కాబట్టి తమ పిల్లవాడైన భరతుడు తండ్రి ఎవరో
తెలియని పిల్లవాడిగా ఉండకూడదని శకుంతల భావించింది. అందుకే శకుంతల దుష్యంత మహారాజుతో తమ
కొడుకును కరుణా దృష్టితో చూడమని అన్నది.
4. "ధర్మాలన్నింటి కంటే సత్యమే గొప్పది" ఎందుకు?
జ). ధర్మం కాలానుగుణమైనది. సత్యం సర్వకాలాలలోనూ మార్పు చెందక స్థిరంగా ప్రకాశవంతమైనదిగా
ఉంటుంది. ఒక త్రా సులో వేయి అశ్వమేథ యాగాలు చేసిన ఫలితాన్ని ఒకవైపు, సత్యాన్ని మరొకవైపు ఉంచి తూచితే
సత్యం వైపుకు ముళ్ళు మొగ్గు చూపుతుంది. సమస్త తీర్థా లను సేవించడం కంటే, వేదాలన్నింటినీ అధ్యయనం
చేయడం కంటే సత్యం గొప్పది. ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్ల ప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని
అంటారు. సమస్త జగత్తు కు సత్యమే మూలం. కాబట్టి . "ధర్మాలన్నింటి కంటే సత్యమే గొప్పది" అని చెప్పవచ్చు.
5. శకుంతల మాటలు విని దుష్యంతుడు ఏమని సమాధానమిచ్చాడు.?
జ). శకుంతల మాటలు విని దుష్యంతుడు "ఓ శకుంతలా! మహారాజునైన నేనెక్కడ? ఆశ్రమంలో ఉన్న
నువ్వెక్కడ? కుమారుడెక్కడ? ఇంతకుముందు నిన్ను ఏనాడూ నేను చూడలేదు. స్త్రీలు అసత్యాలు చెప్తా రన్నట్లు గా
ఇలా మాట్లా డడం నీకు తగునా? ఇది నీకు సముచితం కాదు" అని సమాధానం ఇచ్చాడు.
6. కింది ప్రతిపదార్ధా న్ని చదవండి. పువ్వు గుర్తు ఉన్న పద్యాలకు ప్రతిపదార్థం రాయండి. (2,8,10 పద్యాలు)
i). విమలయశోనిధీ! పురుషవృత్త మెరుంగుచునుండుc జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముcడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండగా నరుcడు దక్కొననేర్చునె తన్ను మ్రు చ్చిలన్.
*ప్రతిపదార్థం :
విమల = నిర్మలమైన
యశోనిధీ = కీర్తికి నిలయమైన వాడా!
వేదములును = నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం)
పంచ భూతములు = భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే అయిదూను
ధర్మువు = ధర్మమున్నూ (ఆచరింపబడేది ధర్మం)
సంధ్యలు = ఉదయ సంధ్య, సాయం సంధ్య (రెండు ప్రొ ద్దు లకు మధ్యకాలం)
అంతః + ఆత్మయున్ = హృదయమూ (మనస్సూ)
యముడును = యమధర్మరాజూ (మృత్యువుకు అధిదేవత)
చంద్రసూర్యులు = చంద్రు డూ, సూర్యుడూ
అహంబును = పగలునూ
రాత్రియున్ = రాత్రీ
అన్ = అనెడి
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 4

మహత్ = చాలా గొప్పవైన


పదార్థములు = పదార్థా లూ
పురుషవృత్త ము = మానవులు చేసే పనులను
ఎరుంగుచున్ = తెలుసుకుంటూ
ఉండున్+ చూవె= ఉంటాయి సుమా
ఇవి ఉండగాన్ = ఈ మహాపదార్థా లు ఉండగా
నరుడు = మానవుడు
తన్ను = తనను తాను
మ్రు చ్చిలన్ = వంచింపగా (మోసగించుకొనుటకు)
తక్కు + ఒనన్ = అబద్ధ మాడడానికి
నేర్చునె = పూనుకొనునా (వేరే విధంగా చేయడానికి ప్రయత్నించడు)
భావం : నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడవైన దుష్యంతుడా! వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు,
హృదయం, యముడు, చంద్రసూర్యులు, పగలు, రాత్రి అనే మహాపదార్థా లు నరుల వర్త నాన్ని ఎప్పుడూ
గమనిస్తూ నే ఉంటాయి సుమా! ఆ మహాపదార్థా లు ఉండగా నరుడు తనంతట తాను వంచించుకోగలడా!
(వంచించుకోలేడని భావం)
ii). విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! ఈ పుత్త ్ర గా
త్రపరిష్యంగసుఖంబు సేకొనుము ముక్తా హార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుc జందనముcజంద్రజ్యోత్స్నయుంబుత్త ్ర గా
త్ర పరిష్యంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.
*ప్రతిపదార్థం :
ఉర్వీనాథ = భూమియొక్క పతివైన ఓ రాజా!
విపరీత = విరుద్ధా లైన
ప్రతిభాషలు+ఏమిటికిన్ = మారుమాటలు ఎందుకు?
ఈ పుత్త ్ర = ఈ కుమారుని యొక్క
గాత్ర = శరీరాన్ని
పరిష్యంగ = కౌగిలించు కోవడం వలన
సుఖంబు = హాయిని
చేకొనుము = స్వీకరించుము (అనుభవించుము)
ముక్తా హార = ముత్యాల హారాలూ
కర్పూర = పచ్చ కర్పూరపు
సాంద్ర = దట్ట మైన
పరాగ = పొ డియొక్క
ప్రసరంబున్ = వ్యాపనమునూ
చందనమున్ = మంచి గంధమునూ
చంద్ర జ్యోత్స్నయున్ = వెన్నెలయునూ
జీవులకున్ = ప్రా ణులకు
పుత్త ్ర = కుమారుని
గాత్ర = శరీరాన్ని
పరిష్యంగమున్+అట్లు =కౌగిలించుకొన్నట్లు
హృద్యంబు + ఏ = మనస్సుకు ఆహ్లా దాన్ని కలిగించునా?
కడున్ = మిక్కిలి
శీతమే = చల్ల దనంగా ఉండునా? (ఉండదని భావం)
భావం : ఓ రాజా! విరుద్ధా లైన మారుమాటలు ఎందుకు? ఈ పుత్రు డిని కౌగిలించుకొని ఈతడి కౌగిలి వలన కలిగే
సుఖాన్ని అనుభవించుము. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్ట మైన పొ డి ప్రసారం, మంచిగంధము, చల్ల ని
వెన్నెల జీవులకు పుత్రు నికౌగిలి వలె మనసుకు సుఖాన్ని, మంచి చల్ల దనాన్ని కలిగించలేవు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 5

iii). నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత


వ్రత! యొక బావి మేలు; మరి బావులు నూఱిటికంటె నొక్కస
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృతవాక్యము మేలు సూడcగన్.
*ప్రతిపదార్థం :
సూనృత వ్రత = నిజము మాట్లా డడమే నియమంగా కలవాడా!
నుత జల = మంచినీటి చేత
పూరితంబులు + అగు = నిండినవైన
నూతులు= చేదుడు బావులు
నూఱిటి కంటెన్= వందకంటే
ఒక బావి = ఒక దిగుడుబావి
మేలు = ఉత్త మం
మరి = అటువంటి
బావులు = దిగుడుబావులు
నూఱిటి కంటెన్ = వందకంటే
ఒక్క = ఒక
సత్+ క్రతువు + అది = మంచి యజ్ఞ ం అనేది
మేలు = ఉత్త మం
తత్ = అటువంటి
క్రతుశతంబున కంటెన్ = వంద యజ్ఞా ల కంటే
సుతుండు= కొడుకు
మేలు = ఉత్త మం
తత్ = అటువంటి
సుత శతకంబు కంటెన్= వందమంది కొడుకులకంటే
చూడగన్ = పరిశీలించగా
ఒక = ఒక
సూనృత వాక్యము = సత్యవాక్యం
మేలు = ఉత్త మం.
భావం : సత్యవ్రతం గల ఓ రాజా! మంచినీటితో నిండిన నూరు చేదుడుబావులు కంటే ఒక దిగుడుబావి మేలు.
అటువంటి నూరు దిగుడుబావులు కంటే ఒక మంచి యజ్ఞ ం మేలు. అటువంటి నూరు యజ్ఞా లు కంటే ఒక పుత్రు డు
మేలు. అటువంటి పుత్రు లు నూరుమంది కంటే ఒక సత్యవాక్యం మంచిది.
ఆ). కింది పద్యం చదవండి. మహాభారతంలో ధర్మం గురించి, సత్యం గురించి తిక్కన సో మయాజి ఏం చెప్పారో
గమనించండి.
"సారపు ధర్మమున్ విమల సత్యముc బాపము చేత బొ ంకు చేc
బారముc బొ ందలేక చెడ బారిదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుcగాని ధర్మని
స్తా రక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్."
(- ఉద్యోగపర్వం, ఆశ్వాసం - 3, పద్యం - 273)
భావం : ధర్మం కాలానుగుణమైనది. ఉత్త మమైనది. సత్యం సర్వకాలాలలోనూ మార్పు చెందక స్థిరంగా
ప్రకాశవంతమైనదిగా ఉంటుంది. ధర్మం, సత్యం అనే రెండూ పాపం చేతను, అబద్ధ ం చేతను కప్పిపుచ్చడానికి
ప్రయత్నం చేస్తే అపుడు అవి చెడిపో వడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఆ స్థితిలో ధర్మాన్ని, సత్యాన్ని రక్షించడానికి
సమర్థు లై ఉండి కూడా నిర్ల క్ష్యంగా ఉంటే అది వారికే హానికరమవుతుంది. అప్పుడు భగవంతుడు ధర్మాన్ని
ఉద్ధ రించడానికీ, సత్యానికి శుభం కలిగించడానికి ముందుకు వస్తా డు. ధర్మాన్ని, సత్యాన్ని కప్పి పుచ్చడం ఎవరికీ
సాధ్యం కాదు అని భావం.
*ప్రశ్నలు :
1. ధర్మం కాలానుగుణమైనది అంటే ఏమిటి?
జ). ధర్మం కాలాన్ని బట్టి మారుతుంటుంది. అంటే ఇది స్థిరంగా ఉండదు అని అర్థం.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 6

2. సమర్థు లైనవారు ధర్మం విషయంలో నిర్ల క్ష్యంగా ఉంటే ఏమవుతుంది?


జ). అది వారికే హానికరమవుతుంది. అప్పుడు భగవంతుడు ధర్మాన్ని ఉద్ధ రించడానికి ముందుకు వస్తా డు.
3. పద్యంలో అబద్ధ ం అని అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). పద్యంలో "బొ ంకు" అనే పదం అబద్ధ ం అనే అర్థా న్ని ఇస్తు ంది.
4. సమర్థు లు అనే పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి. ( ఇ )
అ). అవివేకులు ఆ). అధర్ములు ఇ). అసమర్థు లు ఈ). అపరాదులు
5. పై పద్యానికి శీర్షికను నిర్ణ యించి రాయండి.
జ). సత్యం వద - ధర్మం చర
ఇ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
20వ శతాబ్ద ంలో తమ రచనల ద్వారా, ఆచరణ ద్వారా, సంఘసేవ ద్వారా ఆంధ్రజాతిని ప్రభావితం చేసిన
మహనీయులలో - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ చర్ల గణపతిశాస్త్రిగారు ఒకరు. వీరు
ప్రా చీన గ్రంథాల అనువాదకుడు, సంపాదకుడు, గాంధేయవాది, శతాధిక గ్రంథకర్త . తమ రచనలను దేశసేవకు
వినియోగించాలని 1950లో ఆర్షవిజ్ఞా నపరిషత్తు ను స్థా పించారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్
ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన వాటిలో చురుకుగా పాల్గొ న్నారు. సర్వోదయమండలి
ఉద్యమ నాయకులు, వినోబాభావే అనుచరులుగా పాదయాత్ర చేసి తమ ఐదు ఎకరాల భూమిని దానం చేసిన
త్యాగశీలి. స్వాతంత్ర్య సమరయోధుల పింఛను, ఉద్యోగ పింఛను వద్ద ంటూ "నా తల్లికి సేవ చేసి డబ్బు
తీసుకుంటానా?" అని ప్రశ్నించారు. హో మియో వైద్యం, ప్రకృతి వైద్యం ఉచితంగా చేసేవారు. రాట్నం వొడికేవారు.
స్త్రీలు మాతృభూమితో సమానమని తలచి వారికి చేయూతనిచ్చి, ఉపాధి కల్పించి మహిళా సాధికారతకు కృషి
చేశారు. రాత్రిపూట ఒక లాంతరుతో గ్రా మాలకు వెళ్లి వయోజన విద్య, పారిశుద్ధ ్యం గురించి నేర్పి చైతన్యపరిచేవారు.
తమ ఇంటిని ఆశ్రమంగా మలిచి వృద్ధు లకు, అనాథలకు ఆశ్రయమిచ్చారు. ఇది కులమతాలకు అతీతంగా ఈనాటికి
నడుస్తో ంది. వీరి తుదిశ్వాస వరకు సేవాతత్పరతతో జీవించారు.
(- చర్ల గణపతి శాస్త్రి జీవిత చరిత్ర నుండి)
*ప్రశ్నలు :
1. పాదయాత్రలో చర్ల గణపతిశాస్త్రి ఎవరిని అనుసరించారు?
జ). పాదయాత్రలో చర్ల గణపతిశాస్త్రి, సర్వోదయమండలి ఉద్యమ నాయకులైన వినోబాభావే ను అనుసరించారు.
2. శతాధిక గ్రంథకర్త అంటే అర్థం ఏమిటి?
జ). శతాధిక గ్రంథకర్త అంటే వందకు పైగా పుస్త కాలు రాసిన రచయిత అని అర్థం.
3. పై పేరాలో స్త్రీ అనే పదానికి సమానార్థక పదాలు చూసి రాయండి.
జ). స్త్రీ = మహిళ
4. భూమిని దానం చేసిన త్యాగశీలి గణపతి శాస్త్రి. ( అ )
( ఈ వాక్యంలో త్యాగశీలి ఏ సమాసమో గుర్తించండి.)
అ). బహువ్రీహి ఆ). ద్విగు ఇ). పంచమీ తత్పురుష ఈ). అవ్యయీభావం
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). వినిబాభావే ఎవరు?/ సర్వోదయ మండలి నాయకులు ఎవరు?
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. "విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథా" పద్యభావాన్ని మీ సొ ంతమాటల్లో రాయండి.
జ). భావం : ఓ రాజా! విరుద్ధా లైన మారుమాటలు ఎందుకు? ఈ పుత్రు డిని కౌగిలించుకోండి. ఇతని ఆలింగనం వలన
కలిగే సుఖాన్ని అనుభవించండి. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్ట మైన పొ డి ప్రసారం, మంచిగంధము, చల్ల ని
వెన్నెల ఇవి ఏవీకూడా పుత్రు ని కౌగిలించుకోవడం వలన మనసుకు కలిగే సుఖాన్ని, మంచి చల్ల దనాన్ని
కలిగించలేవు.
2. సత్యవాక్యం గొప్పతనం గురించి రాయండి.
జ). ఒక త్రా సులో వేయి అశ్వమేథ యాగాలు చేసిన ఫలితాన్ని ఒకవైపు, ఒక్క సత్యాన్ని మాత్రమే మరొకవైపు
ఉంచి తూచితే సత్యం వైపుకే ముల్లు మొగ్గు చూపుతుంది. సమస్త తీర్థా లను సేవించడం కంటే, వేదాలనన్నింటిని
అధ్యయనం చేయడం కంటే సత్యం గొప్పది. ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్ల ప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే
గొప్పదని అంటారు. సత్యానికి సాటి రాగలది ఈ లోకంలో మరొకటి లేదు. సమస్త జగత్తు కు సత్యమే మూలం. అని
శకుంతల సత్యవాక్య గొప్పదనాన్ని గురించి దుష్యంత మహారాజుతో పలికింది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 7

3. పుత్రగాత్ర పరిష్యంగం అంటే ఏమిటి?


జ). పుత్రగాత్ర పరిష్యంగం అంటే పుత్రు ని శరీరాన్ని కౌగిలించుకోవడం అని అర్థం. పిల్లవాడిని ప్రేమతో దగ్గ రగా
చేరదీసి, అతడిని గుండెలకు హత్తు కోవడం ద్వారా కలిగే సుఖానుభూతిని మాటల్లో వర్ణించలేము. ముత్యాలహారాలు,
పచ్చకర్పూరపు పొ డి, మంచిగంధము, చల్ల ని వెన్నెల ఇవి ఏవీ కూడా పుత్రగాత్ర పరిష్యంగం వలన మనసుకు కలిగే
సుఖాన్ని కలిగించలేవు.
4. శకుంతల దుష్యంత మహారాజును అనేక విశేషణాలతో సంబో ధించింది కదా! ఆ సంబో ధనలకు అర్ధా లు
రాయండి.
జ). శకుంతల దుష్యంత మహారాజును విమల యశోనిధీ!, లోకస్తు త!, ఉర్వీనాథ!, ఉదార ధర్మప్రియ!,
సారమతీ!, సూనృతవ్రత! వంటి అనేక విశేషణాలతో సంబో ధించింది. విమల యశోనిధీ అంటే నిర్మలమైన కీర్తికి నిధి
వంటివాడు. లోకస్తు త అంటే ప్రజలచేత కీర్టింపబడేవాడు. ఉర్వీనాథ అంటే భూమికి పతియైన రాజు. ఉదార
ధర్మప్రియ అంటే ఉత్త మమైన ధర్మము నందు ప్రీతి కలవాడు. సారమతీ అంటే పటిష్టమైన చలనములేని బుద్ధి
కలవాడు. సూనృతవ్రత అంటే సత్యాన్ని మాట్లా డడమే వ్రతంగా కలవాడు.
5. ధర్మబో ధ పాఠాన్ని రాసిన కవిని గురించి రాయండి.
(లేదా)
నన్నయ గురించి మీరు తెలుసుకున్న విషయాలు రాయండి. (అదనపు అంశం)
జ). ధర్మబో ధ అనే పాఠాన్ని రాసిన కవి నన్నయభట్టు . ఈయన 11వ శతాబ్దా నికి చెందిన కవి.
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పుచాళుక్యరాజు రాజరాజ నరేంద్రు ని
ఆస్థా నకవి. కవిత్రయంలో మొదటివాడు. మహాభారతంలోని ఆది,సభాపర్వాలు, అరణ్యపర్వంలోని సగభాగం
ఆంధ్రీకరణ, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, ఆంధ్ర శబ్ద చింతామణి అనేవి నన్నయ రచనలు. ఆదికవి,
వాగనుశాసనుడు అనే బిరుదులు కలవు. అక్షరరమ్యత, ప్రసన్న కథా కలితార్ధ యుక్తి, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం
నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు.
6. ధర్మబో ధ పాఠ్యాంశ నేపథ్యం రాయండి. (అదనపు అంశం)
జ). విశ్వామిత్రు డు బ్రహ్మర్షి కావాలని చేస్తు న్న తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను పంపారు.
వారిద్దరికీ ఒక బాలిక పుట్టింది. ఆ బాలికను 'శకుంత' అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకు "శకుంతల"
అని నామకరణం చేసి కణ్వమహాముని పెంచుకున్నాడు. ఒకరోజు దుష్యంతుడు వేటకోసం వెళుతూ కణ్వాశ్రమం
దగ్గ ర ఆగి, శకుంతలను చూసాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని, తిరిగి తన రాజ్యానికి
వెళ్ళిపో యాడు.కొంతకాలానికి శకుంతలకు భరతుడు జన్మించాడు. తల్లీబిడ్డ లను కణ్వుడు అత్త వారింటికి
పంపించాడు. నిండుకొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు.అతని మాటలు విని కలత చెందిన శకుంతల
రాజుకు ధర్మబో ధ చేయడమే ఈ పాఠం నేపథ్యం.
7. ఇతిహాసం ప్రక్రియ గురించి రాయండి.(లేదా) ప్రా చీన పద్యం ప్రక్రియ గురించి రాయండి.
జ). ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు అధిక ప్రా ధాన్యం
ఉంటుంది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. ఇతిహాసాలలోని మూలకథను తీసుకొని వర్ణ నలతో
ఛందో బద్ధ ంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలను
వెల్లడిస్తా యి. అద్భుత కథాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్రను వేస్తా యి.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. పాఠం ఆధారంగా శకుంతల వేదనను మీ సొ ంతమాటల్లో కవితగా రాయండి.
జ). పుట్టినప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యా!
ఇప్పుడు కట్టు కున్న భర్త కు కూడా భారమయ్యా!
ఏమిటి నాకీ గతి! ఎందుకొచ్చిందీ పరిస్థితి!
ఆశ్రమంలో ఆనందంగా గడుపుతున్న నన్ను
మాయమాటలు చెప్పి మనువాడిన తను
బిడ్డ పుట్టా క నేనెవరో తెలియదంటున్నాడే!
ఇదేనా న్యాయమార్గ ం! ఇదేనా రాజధర్మం!
అయ్యో! ఇప్పుడీ బిడ్డ కు తండ్రి ఎవరని చెప్పుకోవాలి?
బిడ్డ కు తండ్రి ఎవరో తెలియదంటే సమాజం హర్షిస్తు ందా?
నలుగురి ముందూ నా పాతివ్రత్యం నిలుస్తు ందా?
ఓ పంచభూతాల్లా రా! మీరే కదా మా పెళ్లి కి సాక్షి
మీ సాక్ష్యానికే లోకంలో విలువ లేకుంటే
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 8

నన్ను కాపాడటానికి ఇంక ఎవరు దిక్కు?


ఎప్పటికైనా సత్యమే గెలిచి నిలుస్తు ంది
నన్ను, నా బిడ్డ ను ఆ సత్యమే కాపాడుతుంది
ఆ నమ్మకంతోనే ఎంతకాలమైనా ఎదురుచూస్తా !
ఎప్పటికైనా నాభర్త దుష్యంతుని చెంతకు చేరుతా!
2. పాఠం ఆధారంగా శకుంతల, దుష్యంతుల మధ్య జరిగిన సంఘటనను సంభాషణగా రాయండి.
జ). శకుంతల : ఓ దుష్యంత మహారాజా! నేను నీ భార్య శకుంతలను!
దుష్యంతుడు : నీవు ఎవరో నాకు తెలియదు. ఇంతకు ముందెప్పుడూ నేను నిన్ను చూడలేదు కూడా!
శకుంతల : మహారాజులైన మీకు ఇది తగునా?
దుష్యంతుడు : ఇంతకీ నీకు ఏమి కావాలి? ఎందుకొచ్చావిక్కడికి?
శకుంతల : కణ్వ మహర్షి ఆశ్రమంలో నాకు చేసిన ప్రతిజ్ఞ ను నెరవేర్చి, మనకు పుట్టిన ఈ పిల్లవాణ్ణి మీ బిడ్డ గా
స్వీకరించండి.
దుష్యంతుడు : మీరెవరో నాకు తెలియదంటున్నా కదా! ఇంకా అనవసరపు మాటలెందుకు?
శకుంతల : అయ్యో! కట్టు కున్న భర్తే నన్ను కాదంటే నాకింక దిక్కెవరు?
దుష్యంతుడు : అయినా మహారాజునైన నేనెక్కడ? సామాన్యులైన మీరెక్కడ?
శకుంతల : సత్యాన్ని కాపాడాల్సిన ప్రభువులే అసత్యం మాట్లా డితే ఎలా? ఎప్పటికైనా ధర్మమే గెలుస్తు ంది.
దుష్యంతుడు : ఇంతవరకూ చెప్పింది చాలు! ఇక నీవు వెళ్ళవచ్చు.
శకుంతల : ఓ పంచభూతాల్లా రా! మీరైనా రాజుకు గతాన్ని గుర్తు చేసి,నాకు న్యాయం జరిగేలా చెయ్యండి.
(పంచభూతాలు రాజుకు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తా యి. ఆ తరువాత…)
దుష్యంతుడు : శకుంతలా! నన్ను మన్నించు. పంచభూతాలు నా కళ్ళు తెరిపించాయి. నేటినుండి నిన్ను నా
భార్యగా, ఈ బిడ్డ ను మన పుత్రు నిగా స్వీకరించి ప్రేమగా చూసుకుంటాను.
3. మీరు నిజం చెప్పినపుడు మీ తల్లిదండ్రు లుగానీ, ఉపాధ్యాయులుగానీ, మిత్రు లుగానీ మిమ్మల్ని
ప్రశంసించినపుడు మీరు ఎలా అనుభూతి చెందారో తెల్పుతూ వ్యాసం రాయండి.
జ). నా పేరు శ్రీను. నేను ఐదవ తరగతి చదివేటప్పుడు నాకు కలిగిన ఒక చక్కని అనుభూతి నాకు
ఇప్పటికీ గుర్తు ంది. నా పక్కన కూర్చునే కాశీ అనే పిల్లవాడు పుస్త కాలు కొనుక్కుందామని వాళ్ళ నాన్నగారిని
అడిగి ఇరవై రూపాయలు తెచ్చుకున్నాడు. వాడికి తెలియకుండా వాటిని నేను దొ ంగిలించాను. వాడు తన డబ్బులు
ఎవరో తీసేసారని మా తెలుగు మాష్టా రికి పిర్యాదు చేశాడు. అప్పుడు మాష్టా రు ఆ డబ్బులు సంపాదించడం కోసం
తల్లిదండ్రు లు ఎంత కష్ట పడతారో వివరంగా చెప్పారు. ఇతరుల డబ్బులుగాని, వస్తు వులు గాని తీయడం చాలా పెద్ద
తప్పని, కాశీ డబ్బులు ఎవరైనా తీస్తే ఇచ్చివేయమని చెప్పారు.
నేను ఎంత పెద్ద తప్పు చేశానో అప్పుడు నాకు తెలిసింది. నేను దొ ంగిలించిన డబ్బులు కాశీకు
ఇచ్చివేసి,చేసిన తప్పుకు మన్నించమని అడిగాను. అప్పుడు చేసిన తప్పును ఒప్పుకుని, నిజం చెప్పినందుకు
నన్ను మాష్టా రు ప్రశంసించారు. తరగతిలోని తోటి విద్యార్థు లు చప్పట్ల తో అభినందనలు తెలిపారు. తప్పులు
అందరూ చేస్తా రని, కానీ నిజం కొందరే ఒప్పుకుంటారని, అలా నిజం ఒప్పుకున్న శ్రీను చాలా గొప్పవాడని మా
మాష్టా రు అందరిముందూ అంటుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఆ ఆనందానుభూతిని మాటల్లో
వర్ణించలేను. నిజం చెప్పడంలో ఎంతటి ఆనందం ఉందో అప్పుడే నాకు తెలిసింది.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాలు చదివి, ఎరుపురంగులో ఉన్న పదానికి అర్థ ం రాసి, వాటిని ఉపయోగించి సొ ంతవాక్యాలు రాయండి.
ఉదా : కౌరవపాండవులకు ద్రో ణుడు విలువిద్య నేర్పిన ఆచార్యుడు.
ఆచార్యుడు = గురువు
*గురువును గౌరవించాలి.
1. కరోనా సమయంలో ప్రజలు విపత్తు లకు గురి అయ్యారు.
జ). విపత్తు = ఆపద
*ఆపద సమయంలో మన వెన్నంటి ఉండేవాడే నిజమైన మిత్రు డు.
2. శకుంతల రాజుతో సూనృత వాక్యం మేలు అన్నది.
జ). సూనృతం = సత్యం
*సత్యం కలకాలం నిలిచిఉంటుంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 9

3. తెలుగు పద్యం హృద్యంగా ఉంటుంది.


జ). హృద్యం = మనస్సుకు ఆహ్లా దాన్ని కలిగించడం
*నిండు పున్నమి నాడు చంద్రు ని కాంతి మనస్సుకు ఆహ్లా దాన్ని కలిగిస్తు ంది.
4. గాంధీ మహాత్ముని యశస్సు దిగంతాలకు వ్యాపించింది.
జ). యశస్సు = కీర్తి
*శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా కీర్తి గడించారు.
5. వృద్ధు లకు చేతి కర్ర ఊతగా ఉంటుంది.
జ). ఊత = ఆధారం
*మా కుటుంబానికి నా నాన్నగారి సంపాదనే ఆధారం.
ఆ). కింది వాక్యాలు చదవండి. అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి. (పర్యాయపదాలు)
1. రైతులు భూమిని సాగు చేస్తా రు. పాడిపంటలకు నిలయమైన వసుధ మీద ఎన్నో
జీవరాసులు నివసిస్తు న్నాయి. ఈ పుడమిని కాపాడుకోవడం మన బాధ్యత.
జ). భూమి, వసుధ, పుడమి
2. తల్లిదండ్రు లకు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్దతనంలో పిల్లలే ఆధారం.
జ). ఆసరా, ఆధారం
3. భార్య ఇంటిని అందంగా అలంకరిస్తు ంది. సతిని కళత్రం అంటారు. దారాపుత్రు లతో
ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది.
జ). భార్య, సతి, కళత్రం, దార
4. తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రు లకు మురిసిపో తారు.పుత్రు డు పున్నామ
నరకం నుండి తప్పిస్తా డని నమ్ముతారు. సుతుడు జన్మించాలని పూజలు చేస్తా రు.
కొడుకైనా, కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి.
జ). తనయుడు, పుత్రు డు, సుతుడు, కొడుకు
5. ఏనుగు భూమిమీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తు ంది.
వెలగపండును కరి తింటుంది. మాతంగం మావటివాని మాట వింటుంది.
జ). ఏనుగు, కరి, మాతంగం
ఇ). కింది వేరు వేరు అర్థా లనిచ్చే పదాలను గుర్తించి జతపరచండి. (నానార్ధా లు)
1. క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు ( ఆ ) అ). ఆశ
2. పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి ( ఇ ) ఆ). ధార
3. మానవుడు, అర్జు నుడు ( ఉ ) ఇ). ధర్మం
4. దిక్కు, కోరిక, నమ్మకం ( అ ) ఈ). వంశం
5. కులం, వెదురు, పిల్లనగ్రో వి ( ఈ ) ఉ). నరుడు
ఈ). కింది ప్రకృతులకు - వికృతులను, వికృతులకు - ప్రకృతులను రాయండి.
1.పుస్త కం 2. నీరము 3. జన్నము 4. విద్దె 5. గృహము
6.దివ్వె 7. సత్యము 8.దమ్మము 9. రేడు 10. కావ్యం
జ). ప్రకృతి - వికృతి
పుస్త కం - పొ త్త ం
నీరము - నీరు
యజ్ఞ ము - జన్నము
విద్య - విద్దె
గృహము - గీము
దీపము - దివ్వె
సత్యము - సత్తెము
ధర్మము - దమ్మము
రాజు - రేడు
కావ్యం - కబ్బం
ఉ). కింది పదాలకు వ్యుత్పత్త ్యర్ధా లు రాయండి.
1. పుత్రు డు 2. ధర్మం 3. పతివ్రత 4. జ్యోత్స్న

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 10

1. పుత్రు డు : పున్నామ నరకం నుండి తప్పించేవాడు. (కుమారుడు)


2. ధర్మం : లోకం చేత ధరింపబడేద.ి
3. పతివ్రత : పతిని సేవించుటయే వ్రతముగా కలిగినది. (సాధ్వి)
4. జ్యోత్స్న : కాంతిని కలిగి ఉండేద.ి
ఊ). కింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలు రాయండి.
1. చేసి X చేయక 2. వస్తా డు X రాడు 3. తింటే X తినకపో తే
4. వినండి X వినకండి 5. చెప్పి X చెప్పక

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

అ). కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.


1. వంతలెల్ల = వంతలు + ఎల్ల = ఉత్వసంధి
2. క్రతువది = క్రతువు + అది = ఉత్వసంధి
3. లేరని = లేరు + అని = ఉత్వసంధి
4. భాషలేమిటి = భాషలు+ ఏమిటి = ఉత్వసంధి
5. పూరితంబులగు = పూరితంబులు + అగు = ఉత్వసంధి
ఆ). కింది పదాలను కలిపి రాసి, సంధి పేరు రాయండి.
1. కణ్వ+ ఆశ్రమం = కణ్వాశ్రమం = సవర్ణ దీరస్ఘ ంధి
2. తీర్థ + అభిగమనం = తీర్థా భిగమనం = సవర్ణ దీరస ్ఘ ంధి
3. ధర+ అధినాథుడు = ధరాధినాధుడు = సవర్ణ దీరస ్ఘ ంధి

💥సమాసాలు :
4. సభ + ఆసదులు = సభాసదులు = సవర్ణ దీరస ్ఘ ంధి

అ). కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.


1. సూర్యచంద్రు లు = సూర్యుడునూ, చంద్రు డునూ - ద్వంద్వ సమాసం
2 ఇహపరాలు = ఇహమునూ, పరమునూ - ద్వంద్వ సమాసం
3. రాత్రింబవళ్ళు = రాత్రియునూ, పగలుయునూ - ద్వంద్వ సమాసం

💥అలంకారాలు :
4. శకుంతలాదుష్యంతులు = శకుంతలయునూ, దుష్యంతుడునూ - ద్వంద్వ సమాసం

అ). ఉపమాలంకారం : ఒక వస్తు వును ప్రసిద్ధమైన మరొక వస్తు వుతో పో ల్చి రమ్యంగా చెబితే అది
ఉపమాలంకారం.
దీనిలో ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమానధర్మం అనే నాలుగు అంశాలు ఉంటాయి.
ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం

ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది

నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది


👉కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.
1. ఒక దీపంనుండి మరొకదీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రిరూపం పుత్రు నిలో ఉంటుంది.
జ). ఈ వాక్యంలో ఉపమాలంకారము ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో "తండ్రి రూపం పుత్రు నిలో ఉండడం అనేది" ఉపమేయం. "ఒక దీపం నుండి మరొక
దీపం పుట్ట డం" అనేది ఉపమానం. "అట్లు " అనేది ఉపమావాచకం. "వెలుగొందడం" అనేది సమానధర్మం. ఇక్కడ
ఉపమేయమైన తండ్రి రూపం పుత్రు నిలో ఉండడం అనే దానిని, ఉపమానమైన ఒక దీపం నుండి మరొక దీపం
పుట్ట డం అనే దానితో పో ల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఉపమాలంకారం అయినది. ( నాలుగు లక్షణాలూ
ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణో పమాలంకారం).
2. ఆకాశంలో మేఘం వెండికొండలా తెల్లగా ఉంది.
జ). ఈ వాక్యంలో ఉపమాలంకారము ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో "ఆకాశంలో మేఘం" అనేది ఉపమేయం. "వెండికొండ" అనేది ఉపమానం. "లా"
(వలె/లాగ) అనేది ఉపమావాచకం. "తెల్లగా" అనేది సమానధర్మం. ఇక్కడ ఉపమేయమైన ఆకాశంలో మేఘాన్ని,

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 11

ఉపమానమైన వెండికొండతో పో ల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఉపమాలంకారం అయినది. ( నాలుగు

💥ఛందస్సు :
లక్షణాలూ ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణో పమాలంకారం).

పాఠంలోని కింది పద్య పాదాలకు గురు - లఘువులను పరిశీలించండి. పద్య లక్షణాలను అన్వయం చేయండి.
IIU U I I UI U I I I UU U I U U I U
విపరీ | త ప్రతి | భాష లే | మిటికి | నుర్వీనా | థ! ఈ పు | త్త గ
్ర ా
స భ ర న మ య వ

I IU U I I U I U I I I U UU I UU I U
త్ర పరి | ష్యంగసు |ఖంబు సే | కొనుము | ముక్తా హా | ర కర్పూ | ర సాం
స భ ర న మ య వ

IIU UI I U I U I I I U UU I U U I U
ద్రపరా | గ ప్రస | రంబు జం | దనము | జంద్రజ్యో | త్స్నయుం బు | త్త గ
్ర ా
స భ ర న మ య వ

I IU U I I UI U I I I U U U I U U IU
త్ర పరి | ష్యంగము | నట్లు జీ | వులకు | హృద్యంబే | కడున్ శీ | తమే
స భ ర న మ య వ
పై పద్య పాదాలు గమనించండి. ప్రతి పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి కదా!
ప్రతి పాదంలోనూ 14వ అక్షరం (వి - ర్వీ, త్ర - క్తా , ద్ర - ద్ర, త్ర - ద్యం) లకు యతి చెల్లి ంది. ప్రతి పాదంలో ప్రా స రెండవ
అక్షరం "ప" ఉంది. ఈ లక్షణాలు ఉంటే అది మత్తేభపద్యం అవుతుంది.
@మత్తేభ పద్య లక్షణాలు :
1. మత్తేభం వృత్త జాతి పద్యం. 2. నాలుగు పాదాలు ఉంటాయి.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 4. ప్రా స నియమం ఉంది.
5. ప్రతి పాదంలో స - భ - ర - న - మ - య - వ అనే గణాలు వరుసగా వస్తా యి.

👉
6. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థా నం.
కింది పద్య పాదాలకు గురు - లఘువులను గుర్తించండి. మత్తేభ పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
IIU UI I U I U I I I UUU IUU I U
1. అవనీ | చక్రము | సంచరిం | పగది | వంబల్లా | డనాశా | చయం
స భ ర న మ య వ
*సమన్వయం : ఈ పద్య పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి. పాదానికి 20
అక్షరాలున్నాయి. పద్య పాదంలోని 14వ అక్షరం (అ - బ) లకు యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదం మత్తేభం
పద్యానికి చెందినదని చెప్పవచ్చు.
I IU U I I UI U I I I UUU I U U I U
2. తమకా | ర్యంబు బ | రిత్యజిం | చియుబ | రార్ధప్రా | పకుల్ స | జ్జ నుల్
స భ ర న మ య వ
*సమన్వయం : ఈ పద్య పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి. పాదానికి 20
అక్షరాలున్నాయి. పద్య పాదంలోని 14వ అక్షరం (త - ర్ధ) లకు యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదం మత్తేభం
పద్యానికి చెందినదని చెప్పవచ్చు.
IIU U I I U I U I I I UUU IUU I U
3. అదిగో | ద్వారక | యాలమం | దలవి | గోనందం | దుగోరా | డున (య్య)
స భ ర న మ య వ
*సమన్వయం : ఈ పద్య పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి. పాదానికి 20
అక్షరాలున్నాయి. పద్య పాదంలోని 14వ అక్షరం (అ - నం) లకు యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదం మత్తేభం
పద్యానికి చెందినదని చెప్పవచ్చు.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 12

2.చైతన్యం
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. రాయండి.
1. గేయాన్ని లయబద్ధ ంగా పాడండి. ప్రా స పదాలను గుర్తించి రాయండి.
జ). (గేయాన్ని ఉపాధ్యాయుడు పాడుతున్నప్పుడు విద్యార్థు లు ఆలకించి,లయబద్ధ ంగా పాడటానికి
ప్రయత్నిస్తా రు).
*ప్రా స పదాలు : పో కురా - కాకురా, పో యెరా - మానరా, శాసించవేమిరా - పురికొల్పవేమిరా, మానరా - పూనరా,
కాదురా - నూదరా, వీడరా - పాడరా, నుంకించరా - నురికించరా, కట్ట రా - పో గొట్ట రా, మీవెరా - చూపరా, చేయరా -
పేర్మోయరా, కాదురా - రాదురా, ఊగింపరా - తొలగింపరా
2. కవి తనకున్న రచనా శక్తితో ఏమి చేయాలని తెలియజేస్తు న్నాడు?
జ). కవి తనకున్న రచనా శక్తితో స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం రచనలు చేయాలని
తెలియజేస్తు న్నాడు. బడుగుల జీవన పో రాటాన్ని చూసి, వారిలో నూతనోత్తేజాన్ని నింపేలా రచనలు చేయాలి.
దుర్మార్గు ల కుతంత్రా లతో చరితల ్ర ో జరిగిన ఎన్నో యుద్ధా లలో ధైర్య సాహసాలు చూపిన వారి గురించి, వారు చేసిన
త్యాగాల గురించి కవి రచనలు చేయాలి. ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తు ందో తెలియక భీతిల్లు తున్న
దీనుల గుండెల్లో కవి తన రచనల ద్వారా ధైర్యాన్ని నింపాలి. ఎందరో మహనీయుల త్యాగఫలాలు కొందరు
దుర్మార్గు లు చేసే కుట్రల ఫలితంగా వృథాకాకుండా చూడాలి. నిత్యమూ ఆకలితో అలమటిస్తూ , బండబారిన బడుగు
జీవుల గుండెల్లో కవి తనకున్న రచనా శక్తితో స్ఫూర్తిదాయకమైన భావాలను నింపి వారిని చైతన్య పరచాలి.
3. కవి తన పేరును సార్ధకం చేసుకోవాలంటే ఏమి చేయాలి?
జ). విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం కవికి ఉంటుంది. అటువంటి రచన శక్తి కవికి మాత్రమే
సొ ంతం. కాబట్టి కవి స్వప్రయోజనం కోసం కాకుండా సమాజహితం కోసం రచనలు చెయ్యాలి. స్వార్థంతో చేసే ఏ పని
వలన ప్రయోజనం ఉండదని తెలుసుకొని,కవి ప్రజల కలల సాకారానికి పూనుకొని తన పేరును సార్థకం చేసుకోవాలి.
4. కింది వాక్యాలు చదివి గేయంలో ఆ వాక్యాల భావాలు వచ్చే పంక్తు లను గుర్తించి రాయండి.
అ. అన్ని దిక్కుల నుంచి కష్టా లు కమ్ముకొని వస్తు న్నాయి.
జ). తూర్పు పడమరలనక దొ ర్లు కొని వచ్చేటి దుఃఖవాహిని
ఆ. దుర్మార్గు ల కుతంత్రా ల వలన ఘోరమైన యుద్ధా లు జరిగాయి.
జ).క్రూ రులై కల్పించు ఘోర యుద్ధా లలో
ఇ. భయం భయంగా బ్రతుకుతున్న వాళ్ల ందరినీ ఒక్కటి చేయాలి.
జ). అదురుబెదురుల గుండెలన్నీ యొక్కటి చేసి
ఆ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
'యోగ్యతాపత్రం' ఇది తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న ముందుమాట. అక్షర దివిటీలు చేపట్టి
పదాల ఫెళఫెళార్భాటాలతో తెలుగుకవితను కొత్త పుంతలు తొక్కించిన యుగకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థా నం కావ్యానికి
మరో మహాకవి చలం రాసిన ముందుమాట ఇది. తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని
తూచేరాళ్లు తన దగ్గ ర లేవు అన్నాడు చలం. తూచవద్దు అనుభవించి ఫలవరించమన్నాడు శ్రీశ్రీ. తనకీ, ప్రపంచానికీ
సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్ బహిర్ యుద్ధా రావమే కవిత్వం అంటాడు చలం. నెత్తు రునూ, కన్నీళ్ల నూ
తడిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేశారు శ్రీశ్రీ. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనానికి పాటల
రూపాన్నివ్వడం అతనికి తెలుసు. మాటల్ని కత్తు లూ, ఈటెలూ, మంటలుగా మార్చడం అతనికి చేతనవును.
పద్యాలు చదువుతుంటే అవి మాటలు కావు, అక్షరాలూ కావు, ఉద్రేకాలు, బాధలు, యుద్ధా లు - అతని
హృదయంలోంచి మన హృదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తు రు కాలువలు అనిపిస్తు ంది. ఎందుకంటే
కృష్ణ శాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తా డు. శ్రీశ్రీ కవిత్వము, పాల్ రోబ్సన్
సంగీతము ఒకటే రకం అంటుంది సౌరీస్. ఆ రెండింటికీ హద్దు లూ, ఆజ్ఞ లూ లేవు. అప్పుడప్పుడూ లక్షణాలనూ,
రాగాలను మీరి చెవి కిర్రు మనేలా అరుస్తా రిద్దరూ. ఆ అరుపుల్లో ఎగిరిపడే సముద్రం, తుఫాను గర్జనం, మర ఫిరంగుల
మరణధ్వానం గింగురుమంటాయి. కంఠం తగ్గించి మూలిగారా, ఆ మూలుగులు దిక్కులేని దీనుల మూగవేదన,
నీళ్లు లేక ఎండుతున్న గడ్డిపొ లం ఆర్త నాదం వినిపింపజేస్తా యి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి,
శాంతించి, రక్షించే అపూర్వ వ్యక్తి మీ చేతుల్లో ఉన్న ఈ పుస్త కం. ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు ఉంది? ఏం
చేస్తో ంది? అని దిబ్బరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్త రం. (మహాప్రస్థా నం ముందుమాట నుండి)

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 13

*ప్రశ్నలు :
1. మహాప్రస్థా నం కావ్యానికి ముందుమాట రాసింది ఎవరు?
జ). మహాప్రస్థా నం కావ్యానికి చలం ముందుమాట రాశారు.
2. శ్రీశ్రీ కవిత్వాన్ని సౌరీస్ ఎవరితో పో ల్చారని చలం చెప్పారు?
జ). శ్రీశ్రీ కవిత్వాన్ని సౌరీస్, పాల్ రోబ్సన్ సంగీతముతో పో ల్చారని చలం చెప్పారు.
3. సాయంకోరి బిగ్గ రగా అరవడం అని అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). ఆర్త నాదం అనే పదం సాయంకోరి బిగ్గ రగా అరవడం అనే అర్థా న్నిస్తు ంది.
4. వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేయడం అంటే ఏమిటి?
జ). నిస్తేజంగా ఉన్న ప్రజల్లో చైతన్యం కలిగించేలా కవిత్వం రాయడం.
5. పై గద్యానికి ఒక శీర్షిక (పేరు) పెట్టండి.
జ). "యోగ్యతాపత్రం" అనే పేరు ఈ గద్యానికి చక్కగా సరిపో తుంది.
ఇ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
"ఆపరేషన్ అవకముందు నా మాటలో స్పష్ట త తగ్గ టం మొదలయింది. నా సన్నిహితులకే నా మాటలు
అర్థమయ్యేవి. అప్పుడు కనీసం ఆలోచనలైన వినిపించగలిగే వాడిని. సెకట ్ర రీకి డిక్టేషన్ ఇవ్వడం వల్ల సైంటిఫిక్
పేపర్లు రాయగలిగేవాడిని. నా మాటలను మరొకరు స్పష్ట ంగా మళ్ళీ పలుకుతుంటే సెమినార్ల లో ఉపన్యాసాలు
ఇవ్వగలిగేవాడిని. కానీ ట్రా కియాటమీ ఆపరేషన్ నా మాట్లా డే శక్తిని పూర్తిగా తగ్గించింది. కొద్దికాలం పాటు ఎవరైనా
అక్షరాలను చూపుతుంటే, నాకు కావాల్సిన అక్షరం చూపగానే కనుబొ మ్మలెత్తి సైగ చేయడం ద్వారా నేను
చెప్పాలనుకున్నది చెప్పేవాడిని. ఇలా మాట్లా డటమే అతి కష్ట మైన విషయం. ఇక సైంటిఫిక్ సెమినార్ల లో మాట్లా డడం
కుదరని పని. అయితే కాలిఫో ర్నియాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు 'వాల్ట్ వోల్టే జ్' ప్రత్యేకంగా నాకోసం
ఈక్విలైజర్ అనే ప్రో గ్రా ం రాసి పంపాడు. ఇందువల్ల తెరపై ఉన్న పదాలను నా చేతిలోని మీటను నొక్కడం వల్ల
ఎంచుకోగలుగుతాను. నేను చెప్పాలనుకున్న పదాలను ఎంచుకొని స్పీచ్ సింతసైజర్ కు పంపుతాను. నా మాటలను
కంప్యూటర్ పలుకుతుంది".
ప్రపంచ ప్రఖ్యాత శాస్త వ ్ర ేత్త స్టీఫెన్ హాకింగ్ బ్లా గు 'హాకింగ్ డాట్ ఆర్గెట్ యు.కె' లో హాకింగ్ అంతరంగ
భావవ్యక్తీకరణ ఇది. మానవమేధ భౌతిక పరిమితులకు లొంగదని నిరూపించిన శాస్త వ ్ర ేత్త హాకింగ్. శరీరం కదలికలు
లేక చక్రా ల కుర్చీకి పరిమితమైనా, అతని మేధ మాత్రం అనంత విశ్వరహస్యాలను అత్యద్భుతమైన రీతిలో
పరిశోధించి ఆవిష్కరించింది. స్టీఫెన్ హాకింగ్ రచించిన 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' ఆధునిక కాస్మాలజీని సామాన్య
మానవునికి చేరువచేసిన మహత్త ర పుస్త కం. కాల్పనిక నవలలకన్నా అధికంగా అమ్ముడుపో యిందీ శాస్త వ ్ర ేత్త
సిద్ధా ంత గ్రంథం. దీనిని 'కాలం కథ' పేరుతో తెలుగులోకి అనువదించారు. (- కాలం కథ నుండి)
*ప్రశ్నలు :
1. హాకింగ్ సైంటిఫిక్ పేపర్లు ఎలా రాయగలిగేవారు?
జ). హాకింగ్ తన సెకట ్ర రీకి డిక్టేషన్ ఇవ్వడం వల్ల సైంటిఫిక్ పేపర్లు రాయగలిగేవారు.
2. వాల్ట్ వోల్టే జ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం తయారుచేసిన ప్రో గ్రా ం ఏమిటి?
జ). వాల్ట్ వోల్టే జ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం "ఈక్విలైజర్" అనే ప్రో గ్రా ం తయారుచేశారు.
3. హాకింగ్ జీవితంలో నిన్ను ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటి?
జ). శరీరం సహకరించకపో యినా మేధ మాత్రం అనంత విశ్వరహస్యాలను అత్యద్భుతమైన రీతిలో పరిశోధించి
ఆవిష్కరించడం హాకింగ్ జీవితంలో నన్ను ఆశ్చర్యపరిచిన అంశం.
4. స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్త కం పేరేమిటి?
జ). 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' అనేది స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్త కం పేరు.
5. పై పేరా నుంచి ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). స్టీఫెన్ హాకింగ్ బ్లా గు పేరేమిటి?
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. ఒక పౌరుడుగా కవి కర్త వ్యం ఏమిటని నీవు భావిస్తు న్నావు?
జ). కవి స్వేచ్ఛాజీవి. కవి తనకున్న రచనా శక్తితో స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం
రచనలు చేయాలి. బడుగుల జీవన పో రాటాన్ని చూసి, వారిలో నూతనోత్తేజాన్ని నింపేలా రచనలు చేయాలి..
ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తు ందో తెలియక భీతిల్లు తున్న దీనుల గుండెల్లో కవి తన రచనల ద్వారా
ధైర్యాన్ని నింపాలి. నిత్యమూ ఆకలితో అలమటిస్తూ , బండబారిన బడుగు జీవుల గుండెల్లో కవి తనకున్న రచనా

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 14

శక్తితో స్ఫూర్తిదాయకమైన భావాలను నింపిలా కవిత్వం రాసి, వారిని చైతన్య పరచడం కవి కర్త వ్యమని నేను
భావిస్తు న్నాను.
2. "స్వార్థ గానము మానరా! ఓ కవీ సార్ధకానికి పూనరా!" ఈ గేయ పంక్తు ల భావాన్ని మీ సొ ంతమాటలలో
వివరించండి.
జ). ఓ కవీ! విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉంది. అటువంటి రచనాశక్తి నీకు మాత్రమే
సొ ంతం. స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం నువ్వు రచనలు చేయాలి. స్వార్థంతో చేసే ఏ పని
వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు స్వార్థా న్ని విడిచిపెట్టి ప్రజల కలల సాకారానికి పూనుకోవాలి.
3. చైతన్యం పాఠాన్ని రాసిన కవిని గురించి రాయండి.
జ). చైతన్యం అనే పాఠాన్ని రాసిన కవి శ్రీ తాపీ ధర్మారావు గారు. 20వ శతాబ్దా నికి చెందిన ప్రముఖ కవి.
పాతపాళీ, కొత్త పాళీ, దేవాలయాల మీద బూతుబొ మ్మలెందుకు, పెళ్లి దాని పుట్టు పూర్వోత్త రాలు, రాలూ - రప్పలూ,
ఇనుప కచ్చడాలు, సాహితీ మొర్మరాలు మొదలైనవి ఆయన రచనలు. చేమకూర వేంకటకవి విజయవిలాస
ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లా స వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
4. గేయకవిత ప్రక్రియను గురించి రాయండి.
జ). గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. ఇది మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తు ంది.
లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సునూ, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే
గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు.
5. చైతన్యం పాఠ్యభాగ నేపథ్యం గురించి రాయండి.
జ). కవిత్వానికి ఉండవలసిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలోని అసమానతల్ని
రూపమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా
నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొ ంత లాభం కోసం కాకుండా పరుల మేలుకోరి పనిచేయాలని
ప్రేరణనిస్తూ కవి తన ఆకాంక్షను వ్యక్త ం చేయడం ఈ పాఠ్యాంశానికి నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏమి చేయాలో వివరిస్తూ వ్యాసం రాయండి.
జ). కుల,మ‌త,లింగ‌, వ‌ర్గ‌, వ‌ర్ణా ల కార‌ణంగా ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అని ప‌రిగ‌ణించ‌డ‌మే
అస‌మాన‌త‌. ఇది తొల‌గాలంటే మ‌నుషులంతా స‌మాన‌మే అనే భావ‌నను ప్రతి ఒక్కరిలో బలపరచాలి. భార‌త
రాజ్యాంగం ఇచ్చిన‌ పౌరులకు ఇచ్చిన ప్రా థ‌మిక హ‌క్కులు ఖ‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చూడాలి. అంటరానితనం
అమానుషమనే భావనను విస్త ృతంగా ప్రచారం చేయాలి.
ఆణగారిన వ‌ర్గా ల అభివృద్ది కోసం వారికి మెరుగైన విద్య‌, వైద్య స‌దుపాయాల‌ను ఉచితంగా
అందించి వారిని ప్రో త్సాహించాలి. ప్ర‌భుత్వాలు ఆర్థికంగా వారికి అండగా నిలవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో
పేదలకు ప్రా ధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వాలు, స్థితిమంతులు అన్నార్తు లను అనాథలను ఆదుకోవాలి. ప్రతి ఒక్కరూ
తమకున్న దానిలో ఎంతో కొంత నిరుపేదలకు, నిర్భాగ్యులకు దానం చేయాలి. మన మనసుల్లో అనాదిగా
నాటుకుపో యిన ధనిక,పేద,కుల,మత, వర్గ భేదాలను పూర్తిగా చెరిపేయాలి.
2. నీవే కవివైతే ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎలాంటి కవితను రాస్తా వు.
జ). నేనేగనుక కవినైతే అనాదిగా ప్రజల హృదయాలలో నాటుకుపో యిన కుల,మత,వర్గ భేదాలను రూపుమాపాలని
చెబుతూ, ప్రజల్లో చైతన్యం కలిగించేలా నాకున్న జ్ఞా నంతో ఒక కవిత రాస్తా ను.
జ). ఇకనైనా మారదాం….!
మనిషిగ పుట్టిన ఓ మనిషీ
మారొద్దు నువ్వు రాక్షసునిగా!
కులాల పేరుతో కుమ్ములాటలు సృష్టించి
మతాల పేరుతో మానవత్వాన్ని మంటగలిపి
వర్గా ల పేరుతో వైషమ్యాలు పెంచి
ఆ నెత్తు టి మంటల్లో చలి కాచుకుంటున్నావు.
కులమన్నది కూడు పెట్టదు
మతమన్నది మంచిని పెంచదు
వర్గ మన్నది వరాల్ని కురిపించదు
అనే అసలు నిజాన్ని మరిచి
మనుషుల మధ్య అంతరాల్ని పెంచుతున్నావు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 15

సాటి మనిషిని హేళన చేస్తు న్నావు


ఇకనైనా మారదాం…
సాటి మనిషిని బాధించే సంస్కృతిని విడనాడదాం
కులాల గోడలు కూలగొడదాం
మతాల పునాదులు పెకలిద్దా ం
మనమంతా ఒకే కులం
మనదంతా ఒకే మతం
అదే భరతమాత అభిమతం
అని ఎలుగెత్తి చాటుదాం.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాలు చదివి, ఎరుపు రంగు గల పదానికి అర్థం రాసి, దానిని ఉపయోగించి సొ ంతవాక్యాలు
రాయండి.
1. పూల వాసనలు నింపుకున్న మారుతం మనసుకు హాయినిస్తు ంది.
జ). మారుతం = గాలి
*సొ ంతవాక్యం : తుఫాను సమయంలో గాలి భయంకరంగా వీస్తు ంది.
2. నిత్యము చింతతో రగిలే మనిషికి సుఖం ఉండదు.
జ). చింత = బాధ
*సొ ంతవాక్యం : భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు ఓర్చుకోవాలి.
3. మనం చేసే మంచి పనుల వలన స్థిరమైన పేరు సంపాదిస్తా ం.
జ). స్థిరమైన = శాశ్వతమైన
*సొ ంతవాక్యం : లక్ష్మణుడు అన్న మాట జవదాటని తమ్మునిగా శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు.
4. ఎవరైతే తమ మానసమును అదుపులో పెట్టు కుంటారో వాళ్ళే గొప్పవాళ్ళవుతారు.
జ). మానసము = మనసు
*సొ ంతవాక్యం : మనసు పెట్టి చదివితే చదువు బాగా వస్తు ంది.
5. క్రూ రులతో స్నేహం ప్రా ణానికే ప్రమాదం.
జ). క్రూ రులు = మూర్ఖు లు
*సొ ంతవాక్యం : మూర్ఖు లతో వాదించడంకంటే మౌనంగా ఉండటం మేలు.
ఆ). కింది వాక్యాల్లో ఒకే అర్థా న్నిచ్చే పదాల్ని గుర్తించి వాటిని వేరుచేసి రాయండి.(పర్యాయపదాలు)
1. అబ్రములు వర్షిస్తే పంటలు పండుతాయి. జలధరముల కోసం రైతన్నలు ఎదురు చూస్తా రు. ఆకాశంలో
మేఘములు కదులుతుంటే చూడముచ్చటగా ఉంటుంది.
జ). అబ్రములు,జలధరములు, మేఘములు
2. యుద్ధ ం వల్ల నష్ట ం. సమరం చేస్తే మరణాలు సంభవిస్తా యి. పో రు లేనపుడే లాభం పొ ందుతాం.
జ). యుద్ధ ం, సమరం,పో రు
3. ఆకాశంలో చుక్కలు మెరుస్తు ంటాయి. ఎందరో కవులు తారలు గురించి వర్ణించారు. పౌర్ణ మిరోజు చంద్రు ని
చుట్టూ నక్షత్రా లు సందడి చేస్తా యి.
జ). చుక్కలు, తారలు, నక్షత్రా లు
4. కోరికలు శోకానికి మూలం. దుఃఖానికి దూరమైతే సంతోషం దగ్గ రవుతుంది. ఏడుస్తూ కూర్చుంటే గెలుపు
దూరమవుతుంది.
జ). శోకం, దుఃఖం, ఏడుపు
ఇ). కింది పదాలకు వేరువేరు అర్థా లను గుర్తించి జతపరచండి. (నానార్ధా లు)
1. దిక్కు ( ఉ ) అ). జగత్తు , చూపు, గుంపు
2. వర్షం ( ఈ ) ఆ). పేరు, బొ ట్టు
3. నామం ( ఆ ) ఇ). నది, సైన్యం
4. వాహిని ( ఇ ) ఈ). వాన, సంవత్సరం
5. లోకం ( అ ) ఉ). దిశ, ఉపాయం, మార్గ ం

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 16

ఈ). కింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి - వికృతి పదాలను గుర్తించి రాయండి.


1. అగ్ని ప్రమాదకరం కాబట్టి పిల్లలు అగ్గితో ఆటలు ఆడకూడదు.
జ). అగ్ని (ప్రకృతి) - అగ్గి (వికృతి)
2. అడవికి రాజు సింహం. జంతువులకు సింగం అంటే చాలా భయం.
జ). సింహం (ప్రకృతి) - సింగం (వికృతి)
3. లంకిణి ఒక రాక్షసి. హనుమంతుడు ఆ రక్కసిని జయించాడు.
జ). రాక్షసి (ప్రకృతి) - రక్కసి (వికృతి)
4. తలపెట్టిన కార్యములు సాధించాలి. ఆటంకాలు ఎదురైనా కర్జమును విడువరాదు.
జ). కార్యము (ప్రకృతి) - కర్జము (వికృతి)
5. ఆకాశంలో నల్ల ని మేఘాలు కమ్ముకున్నాయి. అవి పెద్ద వానకురిసే మొయిళ్లు లా ఉన్నాయి.
జ). మేఘం (ప్రకృతి) - మొయిలు (వికృతి)

💥సంధులు :
ii).వ్యాకరణాంశాలు :

@గుణసంధి : "అ" కారానికి ఇ,ఉ,ఋ లు పరమైతే వరుసగా ఏ,ఓ,అర్ లు ఏకాదేశంగా వచ్చి గుణసంధి
జరుగుతుందని కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా!
అ). కింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.
1. రాజేశ్వరి = రాజ + ఈశ్వరి = గుణసంధి
2. పరోపకారం = పర + ఉపకారం = గుణసంధి
3. మహర్షి = మహ + ఋషి = గుణసంధి

💥
4. నూతనోత్సాహం = నూతన + ఉత్సాహం = గుణసంధి

👉
సమాసాలు :
కర్మధారయ సమాసం : విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికి) సమాసం జరిగితే దాన్ని కర్మధారయ
సమాసం అంటారు. దీనిని సమానాధికరణం అని కూడా పిలుస్తా రు. ఈ పాఠంలో కర్మధారయ సమాసాలను గురించి

👉
తెలుసుకుందాం.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం : విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా: తెల్ల చొక్కా - తెల్లనైన చొక్కా
తెల్లని - విశేషణం (పూర్వపదం - మొదటి పదం)
చొక్కా - నామవాచకం (ఉత్త ర పదం - రెండవ పదం)
పై ఉదాహరణను గమనిస్తే తెల్ల - చొక్కా అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం "తెల్ల" విశేషణం,
రెండో పదం "చొక్కా" నామవాచకం. ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికి) సమాసం జరిగింది కాబట్టి
'కర్మధారయ సమాసం'.
అ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసనామం తెలపండి.
1. పాత రోజులు - పాతవైన రోజులు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. మంచి దారి - మంచిదైన దారి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. కొత్త పుస్త కం - కొత్త దైన పుస్త కం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. నల్ల పూసలు - నల్ల నైన పూసలు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. కొత్త కోక - కొత్త దైన కోక - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6. ఎర్ర గులాబి - ఎర్రదైన గులాబి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

👉
7. లేత మొగ్గ - లేతదైన మొగ్గ - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం : విశేషణం ఉత్త రపదంగా (రెండవ పదంగా) ఉంటే ఆ సమాసాన్ని
"విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం" అంటారు.
ఉదా: కపో తవృద్ధ ము - వృద్ధ మైన కపో తము
కపో తము - నామవాచకం (ఉత్త రపదం - మొదటి పదం)
వృద్ధ ము - విశేషణం (ఉత్త రపదం - రెండవ పదం)

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 17

పై ఉదాహరణలో కపో తము, వృద్ధ ము అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం కపో తము
నామవాచకం(విశేష్యం) రెండో పదం వృద్ధ ము మొదటి పదం గుణాన్ని తెలుపుతుంది కాబట్టి విశేషణం. విశేషణ పదం
ఉత్త రపదంగా రావడం వలన ఇది విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం.
ఆ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసనామం తెలపండి.
1. తమ్ముకుఱ్ఱ - కుఱ్ఱ యైన తమ్ము - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
2. కవి శ్రేష్టు డు - శ్రేష్టు డైన కవి - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
3. ముఖ పద్మము - పద్మము వంటి ముఖము - ఉపమాన ఉత్త రపద కర్మధారయ సమాసం
4. కార్మిక వృద్ధు డు - వృద్ధు డైన కార్మికుడు - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం

👉
5. వృక్ష రాజము - రాజమైన వృక్షము - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం : సమాజంలోని రెండు పదాలు విశేషణాలై ఉంటాయి.
ఉదా: శీతోష్ణ ం - శీతం, ఉష్ణ ం
శీతం - విశేషణం (పూర్వపదం - మొదటి పదం)
ఉష్ణ ం - విశేషణం (ఉత్త ర పదం - రెండవ పదం)
పై ఉదాహరణను గమనిస్తే శీతం, ఉష్ణ ం అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం శీతం (విశేషణం),
రెండో పదం ఉష్ణ ం (విశేషణం). ఇలా రెండు పదాలూ విశేషణాలే కావడం వలన ఈ సమాసం విశేషణ ఉభయపద
కర్మధారయ సమాసం అయింది.
ఇ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం నామం తెలపండి.
1. మృదుమధురం : మృదువు,మధురం - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
2. సరసగంభీరం. : సరసం,గంభీరం - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
3. నిమ్నోన్నతం : నిమ్నం,ఉన్నతం - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

💥అలంకారాలు :
4. ఎగుడు దిగుడు : ఎగుడు,దిగుడు - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

అ). అంత్యానుప్రా స అలంకారం : కింది తరగతిలో నేర్చుకున్న అంత్యానుప్రా స అలంకారం - గుర్తు చేసుకుందాం.
"భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథయే ముక్తి"
పై కవితలో పాదాలన్నింటి చివర ఒకే లయతో కూడిన ప్రా స పదాలు వచ్చాయి కదా! ఇలా అన్ని
పాదాలలోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యానుప్రా స అలంకారం అవుతుంది. పై
ఉదాహరణలో "క్తి" అనే అక్షరం చివర ప్రా సగా వచ్చింది.
"వేదశాఖలు వెలిసెనిచ్చట
ఆదికావ్యం బలరెనిచ్చట"
పై ఉదాహరణలో 'ఇచ్చట' అనే పదం చివరలో ప్రా సగా రావడం జరిగింది. పాదాంతంలో లేదా పంక్తి
చివరలో ఒకే ఉచ్ఛారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని 'అంత్యానుప్రా స అలంకారం' అంటారు.
ఆ). పాఠాన్ని పరిశీలించండి. అంత్యాను ప్రా స కలిగిన పాదాలను గుర్తించి రాయండి.
ఉదా: పుట్టు గ్రు డ్డిగ పో కురా
వట్టి మ్రో డువు కాకురా
1. పాత రోజులు పో యెరా
రోత పాటలు మానరా!
2. స్వార్థగానము మానరా
సార్థకానికి పూనరా!
3. మెత్తదనమును వీడరా
కత్తి సామును పాడరా!
4. వెనుకాడగా కాదురా
వెనుక తరుణము రాదురా!
5. లోకాల నూగింపరా
శోకాల తొలగింపరా!

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 18

💥
👉
ఛందస్సు:
ఈ కింది చంపకమాల పద్య పాదాలకు గణవిభజన చేస,ి పద్య లక్షణాలు రాయండి.
I II I UI U I I I UI I UI I UI U I U
అ). జనిత| పరాక్ర| మ!క్రమ| విశార| ద!శార| దకంద| కుందచం
న జ భ జ జ జ ర

I I I I UI U I I I UI IUI I U I U I U
ఆ). దన ఘ| న సార| సార య| శ! దాశ| రథీ క| రుణా ప| యోనిధీ
న జ భ జ జ జ ర

👉
*ఈ రెండు పద్య పాదాలూ చంపకమాల పద్యానికి చెందినవి.
చంపకమాల పద్య లక్షణాలు :
1. చంపకమాల వృత్త పద్యం.
2. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
3. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో "న - జ - భ - జ - జ - జ - ర" అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థా నం.
6. ప్రా స నియమం ఉంటుంది.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 19

3.హరివిల్లు
I). అవగాహన - ప్రతిస్పందన:
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
1. కోలాహలాద్రి తన పేరును ఎలా సార్ధకం చేసుకుంది?
జ). కోలాహల పర్వతంపై ఒకవైపు రకరకాల పక్షుల రాగాలాపన, మరొకవైపు నెమళ్ల క్రేంకార ధ్వనులు,
ఒక దిక్కునుండి అందమైన చిలకల పలుకులు, మరొక దిక్కునుండి వన దేవతల గానలహరి వినిపిస్తూ ఉంటాయి.
నిరంతరం దేవదేవేరుల వీణా వాయిద్యాలు, గోరువంకల సంభాషణలు, పక్షిపిల్లల స్తు తి వాక్యాలు, ఝుమ్మని
తుమ్మెద గుంపు చేసే అవ్యక్త మధుర గానాలు, అరటి పందిళ్లలో కిన్నెర కాంతల సంగీత కోలాహలంతో ఆ పర్వతం
ఎల్ల ప్పుడూ వీనుల విందు చేస్తు ంటుంది. ఈ విధంగా కోలాహలాద్రి నిత్య కోలాహలంతో తన పేరును సార్ధకం
చేసుకుంది.
2. మేఘాలను కవి ఎలా వర్ణించాడు?
జ). మేఘాలు దిక్కులనే ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఈనిన పిల్లలు ఆకాశమంతా వ్యాపించాయా
అన్నట్లు ఉన్నాయి. పెద్దపెద్ద పర్వతాలు పెనుగాలి తాకిడికి పెకలించుకుపో యి ఆకాశంలోకి ఎగిరినట్లు గా ఉన్నాయి.
పాతాళంలో ఉన్న దట్ట మైన చీకట్లు సూర్యుడ్ని మింగేయడానికి వచ్చినట్లు గా ఉన్నాయి. భూమికి నాలుగు వైపులా
ఉన్న సముద్రా లు అలలతో ఆకాశంపైకి వెలుతున్నట్లు గా ఉన్నాయి. ఈ విధంగా ఎఱ్ఱ న తన హరివంశం కావ్యంలో
మేఘాలను చక్కగా వర్ణించాడు.
3. అరణ్య వర్ణ నలో మీకు ఆశ్చర్యం కలిగించిన అంశం ఏది?
జ). చిగుళ్ల కోసం ఏనుగు తొండం పైకెత్తి నపుడు దాని దంతకాంతి చుట్టూ ప్రసరించినట్లు గా వర్ణించిన
విధానం మాకు ఆశ్చర్యం కలిగించింది. పెద్ద పులులు వేట మాంసం తిని మత్తు గా పొ దలలో పడుకుంటే వాటి
మూతినుండి కారుతున్న చొంగ వాసనకు అడవి ఈగలు ముసిరినట్లు గా చెప్పిన వర్ణ న మాకు ఆశ్చర్యం కలిగించింది.
ఇలా పెద్దన 'మనుచరిత'్ర లో చేసిన అరణ్య వర్ణ నలో ప్రతి అంశం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ). కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
మందారమకరందమాధుర్యమునc దేలు
మధుపంబు వోవునే? మదనములకు
నిర్మలమందాకినీవీచికలc దూcగు
రాయంచ చనునె? తరంగిణులకు
లతితరసాలపల్ల వఖాది యై చొక్కు
కోయిల సేరునే? కుటజములకుc
బూర్ణేందుచంద్రికాస్ఫురితచకోరక
మరుగునే? సాంద్రనీహారములకు
అంబుజోదరదివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుc జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయునేల?
*ప్రశ్నలు:
1. ఈ పద్యంలో పేర్కొన్న పక్షుల పేర్లు రాయండి.
జ). రాయంచ, కోయిల, చకోర పక్షులు ఈ పద్యంలో పేర్కొన్న పక్షులు.
2. పై పద్యంలో పొ గమంచు అని అర్థం వచ్చే పదం ఏది?
జ). పై పద్యంలో "నీహారిక" అనే పదం పొ గమంచు అనే అర్థా న్ని ఇస్తు ంది.
3. తుమ్మెదలు దేనిని ఆస్వాదిస్తా యి?
జ). తుమ్మెదలు మందార పుష్పములోని మకరందాన్ని ఆస్వాదిస్తా యి.
4. అంబుజోదరుడు - సమాసం తెల్పండి.
జ). అంబుజము ఉదరముగా గలవాడు - బహువ్రీహి సమాసం.
5. "లేత మామిడి చిగుళ్ళను తినే కోయిల కొండమల్లెలను కోరుకోదు" - ఇలాంటి మరొక
వాక్యాన్ని మీ సొ ంతంగా రాయండి.
జ). జంతువులను వేటాడి తినే పెద్దపులి పచ్చగడ్డి కోసం ప్రా కులాడదు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 20

ఇ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


శ్రీనగరంలో కెల్లా ప్రశస్త మైన సరోవరం దాల్ సరస్సు ••••••••••••••••• నా మెదడులో చకచకా మెరిసే
ఊహలు. (నాయని కృష్ణ కుమారి - కాశ్మీర దీపకళిక నుండి) (పూర్తి గద్యానికి పాఠ్య పుస్త కం చూడగలరు.)
*ప్రశ్నలు :
1. దాల్ సదస్సులో నీరు వెండి రేకులా ఉందని రచయిత్రి అన్నారు. నీవు అయితే దేనితో పో లుస్తా వు?
జ). నేనైతే దాల్ సరస్సులోని నీటిని నిర్మలమైన ఆకాశంతో పో లుస్తా ను.
2. సరస్సుకు అవతల వైపునున్న పర్వతాల వరుస ఎలా ఉంది?
జ). ఠీవిగా నిల్చుని సరస్సు అందాన్ని తదేకంగా చూస్తు న్న రస హృదయుడైన వ్యక్తిలా ఉంది.
3. పడవ నడిపే వాని పాట మరింత మనోజ్ఞంగా ఎందుకనిపిస్తో ంది?
జ). దాల్ సరస్సులోని జల తరంగాలను అనుసరిస్తూ చెవులను తాకడం వలన పడవ నడిపే వాని పాట మరింత
మనోజ్ఞంగా అనిపిస్తో ంది.
4. కదిలిపో యే కెరటాలను రచయిత్రి దేనితో పో ల్చారు?
జ). కదిలిపో యే కెరటాలను రచయిత్రి తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి పో యే పసిపిల్లల పాదాలతో పో ల్చారు.
5. పై గద్యభాగానికి సరైన శీర్షిక పెట్టండి.
జ). దాల్ సరస్సు సో యగం.
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.
1. పాఠంలో సూర్యోదయ, సూర్యాస్త మయాల్ని కవులు ఎలా వర్ణించారో మీ సొ ంతమాటల్లో రాయండి.
జ). ఆకాశమనే పొ లంలో నక్షత్రా లనే పంట పండింది. తూర్పుదిక్కు అనే రైతు ఆ పంటను కోసి
తూర్పారబడుతున్నాడు. అని "వసుచరిత"్ర లో రామరాజ భూషణుడు సూర్యోదయాన్ని వర్ణించాడు. ఇక్కడ పంట
చంద్రకాంతిని, తూర్పారబట్టినపుడు వచ్చేధాన్యం రంగు సూర్యకాంతిని,తెల్లని పొ ల్లు వెలవెలబో యిన వెన్నెలని
సూచిస్తు న్నాయి.
కాలం అనే వర్త కుడు ఆకాశం అనే త్రా సులో ఒకవైపు పెద్ద కెంపును, మరొకవైపు ముత్యాలను ఉంచి
తూకం వేద్దా మనుకున్నాడు. గుత్తి లాగ ఉండే త్రా సు బిళ్ల గా జాబిల్లిని తీసుకుని, గుత్తి పట్టు కుని త్రా సును పైకి
లేపాడు. కెంపు ఉన్న పళ్ళెం కిందికి కుంగిపో యింది. కెంపు ఉన్న పళ్ళెం కుంగిపో వడమే సూర్యాస్త మయంగా కవి
వీవూరి వేంకటాచార్యుడు సూర్యాస్త మయాన్ని అందంగా వర్ణించారు.
2. వెన్నెల వెల్లు వ దేవతలను సైతం ఎలా భ్రా ంతికి లోను చేసిందో వివరించండి.
జ). వెన్నెల లోకమంతా అలముకోవడం వల్ల ఆ కాంతిలో నల్ల నివన్నీ తెల్లగా కనిపించాయట. ఆ వెన్నెల
ప్రవాహంలో యముని వాహనమైన దున్నపో తుని చూసి ఇంద్రు డు తన వాహనమైన ఐరావతం అని పొ రబడ్డా డు.
అగ్ని దేవుని వాహనం మేకపో తును చూసి పరమశివుడు తన వాహనమైన నందిగా పొ రబడ్డా డు. కుమారస్వామి
వాహనమైన నెమలిని చూసి బ్రహ్మదేవుడు తన వాహనమైన హంసయే కాబో లు అనుకున్నాడు. నిజానికి
దున్నపో తు, మేకపో తు, నెమలి నల్ల గా ఉంటాయి. వెన్నెల నల్ల ని వాటిని కూడా తెల్లగా కనిపించేలా తన కాంతిని
ప్రసరింపజేసి దేవతలను సైతం భ్రా ంతికి లోనుచేసింది.
3. కోలాహల పర్వతం గురించి రాయండి.
జ). కోలాహలం (కోలాహలుడు) ఒక పర్వతం. అది మామూలు పర్వతం కాదు. అది ఒక క్రీడా పర్వతం. ఈ
కోలాహలుడు శుక్తిమతి అనే నదిని అల్ల రి చేస్తా డు. నదీ ప్రవాహానికి అడ్డు గా ఉన్న కోలాహలుని, వసు మహారాజు
దూరంగా విసిరేసి, అడ్డు తొలగిస్తా డు. శుక్తిమతిని అల్ల రి చేసినందుకు అతని కొమ్ములు విరిచి మదం అణచివేస్తా డు.
ఈ పర్వతం ఎల్ల ప్పుడూ పక్షుల కిలకిలారావాలతో, దేవతల వీణా వాయిద్యాలతో, కిన్నెర కాంతల సంగీత
సవ్వడులతో కోలాహలంగా ఉంటుంది.
4. హరివిల్లు పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జ). మానవుడు కల్పనాశిల్పి. తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించాడు. నన్నయ
మొదలుకొని నేటి కవుల వరకు తమ కావ్యాలలో ప్రకృతి వర్ణ నలకే పెద్దపీట వేశారు. ఈ వర్ణ నలు స్వాభావిక
వర్ణ నలు, భావాత్మక వర్ణ నలు అని రెండు రకాలు. కవులు వివిధ సందర్భాలలో కథానుగుణంగా వర్ణించిన ప్రకృతి
దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనాశైలిలోని వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం
రూపొ ందింది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 21

5. వర్ణ న ప్రక్రియను గురించి రాయండి. (లేదా) హరివిల్లు పాఠ్యాంశ ప్రక్రియను పరిచయం చేయండి.
జ). కవి చెప్పిన విషయం పాఠకుని మనసును తాకి, అతడిలో భావ సంచలనాన్ని కలిగించాలి.
ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తా డు. దీనిని వర్ణ న అంటారు. కావ్యాలలో
అష్టా దశ వర్ణ నలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణ నలకు పుట్టినిల్లు . కవిత్వమేదైనా వర్ణ నలతోనే రచనకు భావపుష్టి
కలుగుతుంది.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. వర్షం కురిసినప్పుడు మీరు పొ ందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రు డికి లేఖ రూపంలో రాయండి.
జ). ఎస్. మూలపొ లం,
18-08-2023.
ప్రియమిత్రు డు చక్రవర్తికి,
ఉభయకుశలోపరి .నీ లేఖ మొన్ననే నాకు అందినది. చాలా సంతోషం. ముఖ్యముగా
రాయునది ఏమనగా ఈ సంవత్సరం జూలై మాసంలో మా ప్రా ంతంలో వర్షా లు చాలా ఎక్కువగా కురిశాయి. మా
ఇంటి ముందరి ఖాళీస్థ లంలో నీరు బాగా నిలిచిపో యింది. నేను, మా పక్కింటి శంకర్ కాగితపు పడవలు చేసుకుని
ఆ వాననీటిలో వేసి ఎంతో ఆనందంగా గడిపాము. వాననీటిలో గెంతులువేస్తూ ,నీటిని ఒకరిపై ఒకరం
చిమ్ముకుంటుంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేను. పచ్చని చెట్లపై నుండి జారిపడుతున్న వర్షపునీరు
పూలవానలా కనిపించి మనసుకు ఆహ్లా దాన్ని కలిగించింది. వర్షం కురిసినప్పుడు నీవు పొ ందిన అనుభూతిని
వర్ణిస్తూ తిరిగి లేఖ రాయగలవు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు చెప్పు. ఉంటాను మిత్రమా!
ఇట్లు
నీ ప్రియమిత్రు డు,
శ్రీనివాస్.
చిరునామా :
ఎమ్. చక్రవర్తి,
9వ తరగతి,
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల,
కె.పెదపూడి, అంబాజీపేట మండలం,
డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్- 533239
2. ఈ పాఠంలో దాశరథి చీకటిని వర్ణించిన తీరులో మీరు గుర్తించిన విశేషాలను రాయండి.
జ). చీకటి వెలుగుల సంగమమే జీవితం. చీకటి లేకపో తే వెలుగు ప్రా ధాన్యతని గుర్తించలేము. చీకటిని చాలామంది
నిరసనకి, అజ్ఞా నానికి, పాపానికి సంకేతంగా భావిస్తా రు. కానీ దాశరథి చీకటిలోని అందాన్ని గుర్తించి, కమనీయంగా
వర్ణించాడు.
దాశరథి "అమృతాభిషేకం" కావ్యంలో చీకటిని చంద్రబింబం వంటి ముఖం మీద పెట్టిన కస్తూ రి బొ ట్టు లా
వర్ణించారు. స్త్రీ కనుబొ మ్మలనే విల్లు కు తొడిగిన బాణంలా, స్త్రీ బంగారు చెక్కిలి మీద పెట్టిన అగరు చుక్కలా,
వెండికొండ మీద మబ్బులా చీకటిని వర్ణించారు.
ఇంకా చీకటిని చంద్రు డనే పొ లంలో జింకలా, ఆదిశేషుని మీద పడుకున్న విష్ణు వులా వర్ణించారు. ఇక్కడ
దాశరథి వర్ణ నకు తీసుకున్న వస్తు వులన్నీ నల్ల నివే. నల్ల ని చీకటిని కూడా పాఠకుల మనసుకు హత్తు కునేలా
వర్ణించిన తీరు నన్ను బాగా ఆకట్టు కుంది.
3. సాహిత్యంలో కవులు ప్రకృతి వర్ణ నకు ఎందుకింతటి ప్రా ధాన్యతనిచ్చారో వివరిస్తూ వ్యాసం రాయండి.
జ). సృష్టికర్త రచించిన మనోజ్ఞమైన మహాకావ్యమే ప్రకృతి. కొండలూ, గుట్ట లూ, నదులూ, పశుపక్ష్యాదులు
ప్రకృతిలో భాగమే. ప్రకృతి జీవ వైవిధ్యానికి నిలయం. అనాదిగా మనిషికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది.
ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, పారే సెలయేరు, చిరుగాలి సవ్వడి, చిమ్మచీకటి, చల్ల ని వెన్నెల ఇలా
ప్రకృతిలోని ప్రతీదీ మనిషిని ఆకర్షిస్తు ంది. ఇటువంటి ప్రకృతిని ఆదికవి మొదలు నేటి ఆధునిక కవుల వరకూ ప్రతి
ఒక్కరూ తమ కావ్యాలలో ఎంతో మనోహరంగా వర్ణించారు.
ప్రకృతి అందాలకు పరవశించిన మనిషి ఆనందాశ్చర్యాలలో మునిగి తనను తానే మరచిపో తాడు.
మనిషికి హృదయానందాన్ని పంచే ఈ ప్రకృతి రమణీయతను కవులు బంగారు నగలో వజ్రా న్ని పో దిగినట్లు గా
పొ ందుపరిచారు. "విశ్వ శ్రేయః కావ్యమ్" అన్న పెద్దల వాక్కు ప్రకారం సమాజహితం కోసం రాసిన కావ్యం ప్రజా

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 22

హృదయాలను ఆకర్షించాలి. అప్పుడే కావ్య ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే జన జీవనంలో మమేకమైపో యిన
ప్రకృతి వర్ణ నలకు సాహిత్యంలో కవులు అధిక ప్రా ధాన్యతను ఇచ్చి ఉంటారు.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, దానిని ఉపయోగించి సొ ంతవాక్యం రాయండి.
1. భానుడు తూర్పున ఉదయిస్తా డు.
జ). భానుడు = సూర్యుడు
*సొ ంతవాక్యం : సూర్యుడు సమస్త విశ్వానికి వెలుగును ప్రసాదిస్తు న్నాడు.
2. శివుని తాండవం చూస్తే ఆనందం కలుగుతుంది.
జ). తాండవం = నాట్యం
*సొ ంతవాక్యం : మా అక్క కూచిపూడి నాట్యం చాలా బాగా చేస్తు ంది.
3. నాకు అమ్మ భాష అంటే మిక్కిలి ఇష్ట ం.
జ). మిక్కిలి = ఎక్కువ
*సొ ంతవాక్యం : నాకు గుత్తి వంకాయ కూరంటే ఎక్కువ ఇష్ట ం.
4. జింక తత్త రపాటుతో పొ దలోకి దూకింది.
జ). తత్త రపాటు = కంగారు
*సొ ంతవాక్యం : మా అన్నయ్య కుక్కను చూసి కంగారుపడి సైకిల్ పై నుండి కింద పడ్డా డు.
5. సాయంకాలం కాగానే సూర్యబింబం కనుమరుగైంది.
*జ). కనుమరుగవ్వు = కనిపించకుండా పో వు, మాయమవ్వు
సొ ంతవాక్యం : కాలుష్యం వల్ల పిచ్చుక జాతి కనిపించకుండా పో యే ప్రమాదం ఉంది.
ఆ). కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా: నభం = ఆకాశం,గగనం
*ఆకాశంలో నక్షత్రా లు మెరుస్తు న్నాయి. రాజు గగనం వైపు ఆశ్చర్యంగా చూస్తు న్నాడు.
1. ధనువు = ధనుస్సు, విల్లు
*శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టా డు. ఆ విల్లు పెళపెళమంటూ శబ్ద ం చేస్తూ విరిగిపో యింది.
2. పయోధరము = మేఘము, అభ్రము
*ఆకాశంలో మేఘాలు దట్ట ంగా వ్యాపించాయి. ఆ అభ్రములు కరిగి వానగా కురిశాయి.
3. కేదారము = పొ లము, పంటభూమి
*మా ఊరిలో ఒకప్పుడు పచ్చని పొ లాలు ఉండేవి. ఇప్పుడు ఆ పంటభూములు చేపల చెరువులుగా
మారిపో యాయి.
4. సస్యము = పంట, పైరు
*వర్షా లు కురిస్తే పంటలు పండుతాయి. మా చేనులోని పైరు చూడముచ్చటగా ఉంది.
5. వెల్లు వ = ప్రవాహం, వెల్లి
*వెన్నెల ప్రవాహం చూడముచ్చటగా ఉంటుంది. ఆ వెల్లి లో ఆడుకోవడమంటే నాకు చాలా ఇష్ట ం.
6. నెచ్చెలి = సఖి, స్నేహితురాలు.
* నా ప్రియసఖి లాస్య చాలా మంచి అమ్మాయి. ఆమె తన స్నేహితురాలికి ఎప్పుడూ సాయం చేస్తు ంది.
ఇ). కింది పదాలకు నానార్థా లు రాయండి.
1. ధర = భూమి, వెల
2. పంక్తి = వరుస, గుంపు
3. తారక = నక్షత్రం, కన్ను
4. చుక్క = నక్షత్రము, బిందువు
ఈ). కింది పదాలకు వ్యుత్పత్తు లు రాయండి.
1. సూర్యుడు = సమస్త కార్యములందు జీవులను ప్రేరేపించువాడు. (భానుడు)
2. ధర = సమస్త మును ధరించునది. (భూమి)
3. తోయజము = నీటియందు పుట్టినది. (తామర)
4. శైలము= శిలలతో కూడి ఉండునది. (పర్వతము)

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 23

ఉ). కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి.


1. సంధ్య = సంజ
2. దిశ = దెస
3. ఆకాశం = ఆకసం
4. చంద్రు డు = చందురుడు
5. ముత్యము = ముత్తెము/ముత్తి యము
6. మేఘము - మొయిలు

💥
ii). వ్యాకరణాంశాలు :

👉
సంధులు :

👉సూత్రం : "సంధి లేనిచోట స్వరంబు కంటె పరంబయిన స్వరంబునకు యడాగమంబగు." "ఆగమంబనగా


యడాగమ సంధి :

వర్ణా ధిక్యంబు"
ఉదా : మా + అమ్మ = మాయమ్మ

👉
మీ + ఇల్లు = మీయిల్లు
సూత్ర వివరణ : సంధి జరగనప్పుడు అచ్చు కంటే పరమైన అచ్చుకు యడాగమం వస్తు ంది. స్వరం అంటే అచ్చు.
యట్+ఆగమం = య. "య"లో అకారం ఉచ్చారణానికి చేర్చబడింది. "య్" అనేది ఆగమమవుతుంది.
తెలుగు భాషలో పూర్వపదాంత దీర్ఘా చ్చులకు సాధారణంగా సంధి జరగదు. ఇతర అచ్చులకు కూడా
కొన్ని సందర్భాలలో సంధి జరగదు. రెండు అచ్చుల్ని వరుసగా ఉచ్చరించడం కష్ట ం. కాబట్టి ఉచ్చారణ సౌకర్యం కోసం
వాటి మధ్యలో "య"కారం చేరుతుంది. దీన్నే యడాగమం అంటారు.
వర్ణా ధిక్యం అంటే ఒక వర్ణ ం అధికంగా వచ్చి చేరడం. "మిత్రవదాగమః" అని లక్షణం. ఆగమం మిత్రు ని
వంటిద.ి కాబట్టి ఒక వర్ణ ం మిత్రు నివలె పక్కకు వచ్చి చేరడం ఆగమమని గ్రహించాలి.
రూప సాధన : మా + అమ్మ
'మా' లోని 'ఆ' పూర్వ స్వరం. అమ్మలోని 'అ' కారం స్వరం కంటే పరమైన స్వరం.కాబట్టి దానికి ముందు 'య్' అనేది
ఆగమం అవుతుంది.
మా + అమ్మ = మా + య్ + అమ్మ = మాయమ్మ
మీ + ఇల్లు = మీ + య్ + ఇల్లు = మీయిల్లు
ఈ యడాగమం కళలకు మాత్రమే అని గుర్తు ంచుకోవాలి. ద్రు తప్రకృతికాలకు సంధి లేనిచోట నుగాగమం
వస్తు ంది. (ద్రు తప్రకృతికాలు కాని వాటిని కళలు అంటారు.)
అ). కింది పదాలను విడదీసి సంధుల పేర్లు రాయండి.
1. ఇందుండేగి = ఇందుండు+ ఏగి = ఉత్వసంధి
2. అయ్యెడన్ = ఆ + యెడన్ = త్రికసంధి
3. సుధాంశుడు = సుధ + అంశుడు = సవర్ణ దీరస ్ఘ ంధి
4. బ్రహ్మాదులు = బ్రహ్మ + ఆదులు = సవర్ణ దీరస ్ఘ ంధి
5. దుగ్ధా ంబునిధి = దుగ్ధ+ అంబునిధి = సవర్ణ దీరస ్ఘ ంధి
ఆ). పాఠం చదివి కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి.
1. సవర్ణ దీరస ్ఘ ంధి :
i). మధురానుభూతి = మధుర + అనుభూతి
ii). వేంకటాచార్యుడు = వేంకట+ ఆచార్యుడు
iii). రామాయణం = రామ + ఆయణం
2. ఉత్వసంధి :
i). చదువుతున్నప్పుడు= చదువుతు + ఉన్నప్పుడు
ii). కావ్యమనే = కావ్యము + అనే
iii). తినిపిస్తు ంటే = తినిపిస్తు + ఉంటే
3. త్రిక సంధి :
i). అయ్యెడ = ఆ + యెడ

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 24

💥సమాసాలు :
అ). ఖాళీలను పూరించండి.
సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు

కాలవర్త కుడు కాలమనెడి వర్త కుడు రూపక సమాసం

నాల్గు చెరగులు నాల్గు సంఖ్య గల చెరగులు ద్విగు సమాసం

మృగనేత్రి మృగ నేతమ


్ర ుల వంటి నేత్రా లు కలది బహువ్రీహి సమాసం

చుక్కలరేడు చుక్కలకు రేడు షష్ఠీ తత్పురుష సమాసం

మహో దధి గొప్పదైన ఉదధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

శుకపికములు శుకమును, పికమును ద్వంద్వ సమాసం


@ 💥అలంకారాలు :
అ). ఉత్ప్రేక్షాలంకారం :
లక్షణం : ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్ల యితే ఉత్ప్రేక్షాలంకారం
అవుతుంది.
ఉదాహరణ : ఈ వెన్నెల పాలవెల్లి యో అన్నట్లు ంది.
సమన్వయం : పై ఉదాహరణలో వెన్నెల పాలవెల్లి (పాలసముద్రం)గా ఊహించబడింది. కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం

💥
అయ్యింది.

👉
ఛందస్సు :

👉పాఠంలోని కింది పద్య పాదాలకు గురు,లఘువులను పరిశీలించండి.


శార్దూ ల పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం.

మ స జ స త త గ
UUU I I U I U I I I U U U I U U I U
ఉదా : తారాస| స్యముపం| డినన్ గ| గనకే| దారంబు| నంజంద్ర| కా
*శార్దూ ల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 13వ అక్షరం యతి స్థా నం.

👉
6. ప్రా స నియమం ఉంది.
కింది పద్య పాదాలకు గురు - లఘువులను గుర్తించండి. పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
I I I IUI U I I I U I I U I IUI U I U
1. ఉదయ| ధరాధ| రంబుప| యినుండి| హుటాహు| టినేగు| దెంచుచో
న జ భ జ జ జ ర
జ). ఇది చంపకమాల పద్యపాదము.
*చంపకమాల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థా నం.
6. ప్రా స నియమం ఉంటుంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 25

*సమన్వయం : ఈ పద్య పాదంలో 21 అక్షరాలు ఉన్నాయి. న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా


వచ్చాయి. యతిస్థా నం 11వ అక్షరంగా ఉంది (ఉ - ను).కాబట్టి ఇది చంపకమాల పద్యపాదము అని చెప్పవచ్చు.
UII UIU I I I U I I U I I U I U I U
2. అల్ల న| కాలవ| ర్త కుడు| నయ్యెడ| గెంపును| ముత్తి యం| బులున్
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్య పాదము.
*ఉత్పలమాల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థా నం.
6. ప్రా స నియమం ఉంటుంది.
*సమన్వయం : ఈ పద్య పాదంలో 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా
వచ్చాయి. యతిస్థా నం 10వ అక్షరంగా ఉంది (అ - న). కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదము అని చెప్పవచ్చు.
UII U IU I I I UII UII UI U I U
3. శారద| రాత్రు లు| జ్జ ్వలల| సత్త ర| తారక| హారపం| క్తు లం
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్య పాదము.
*సమన్వయం : ఈ పద్య పాదంలో 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా
వచ్చాయి. యతిస్థా నం 10వ అక్షరంగా ఉంది (శా - స). కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదము అని చెప్పవచ్చు.
4. తారాసస్యము పద్యంలోని మిగిలిన పాదాలకు గణవిభజన చేయండి.
2వ పాదము :
UUU IIU IUI I IU UUI UUI U
నీరంబా| రగగో| సితద్రు | చఫలా| నీకంబు| ప్రా తర్మ| హా
మ స జ స త త గ
3వ పాదము :
UUU I I U I U I I I U U U I U U I U
సీరిగ్రా | మణితూ| రుపెత్తె| ననదో | చెందూర్పు| నందెల్పు| త (ద్దూ )
మ స జ స త త గ
4వ పాదము :
U UU I IU IUI I I U U UI U U I U
ద్దూ రన్య| స్త పలా| లరాశి| క్రియనిం| దుండేగె| నిస్సారు| డై
మ స జ స త త గ
తారాసస్యము.. అనే పద్యం శార్దూ ల వృత్తా నికి చెందినది
*సమన్వయం : ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి. ప్రతి పాదములోనూ 19 అక్షరాలు చొప్పున ఉన్నాయి.
ప్రతి పాదములోనూ మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి. ప్రతి పాదములోనూ యతిస్థా నం
13వ అక్షరంగా ఉంది(తా - దా, నీ - నీ, సీ - చె, దూ - దు). ప్రా సనియమం ఉంది(రా - రం - రి - ర). కాబట్టి ఇది
శార్దూ లము పద్యము అని చెప్పవచ్చు.
*******
,

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 26

4.ఆత్మకథ
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. శాలువా కప్పినప్పుడు కవికి ఎవరెవరు గుర్తు కు వచ్చారు? చెప్పండి.
జ). శాలువా కప్పినప్పుడు కవికి ఒంటినిండా బట్ట లేని వాళ్ళ జేజమ్మ మసకరూపం గుర్తు కువచ్చింది. ఆమె
రూపం గుర్తు కు వచ్చినప్పుడల్లా తన గుండెల్ని కోస్తు న్నట్లు గా కవిగారికి ఎంతో బాధగా అనిపిస్తు ంటుంది.
2. సన్మానం పొ ందుతున్నప్పుడు కవికి తన తాత రూపం ఎలా కనిపించింది?
జ). సన్మానం పొ ందుతున్నప్పుడు కవికి తన తాత రూపం ఊరి పొ లిమేర దగ్గ రే నిలబడ్డ ట్లు గా కనిపించింది.
3. ఆత్మకథ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జ). ఆత్మకథ పాఠ్యభాగ రచయిత డాII.ఎండ్లూ రి సుధాకర్. ఈయన 1959వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా
రావికుంటపల్లెలో పుట్టా రు. పొ ట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో
ఆచార్యునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. వర్త మానం, మల్లెమొగ్గ ల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం,
నల్ల ద్రా క్షపందిర,ి ఆటాజనిగాంచె, జాషువా సాహిత్యం పై విశ్లేషణ వీరి రచనలు. కవిరత్న, నవయుగ వచన కవితా
చక్రవర్తి అనేవి వీరి బిరుదులు.
ఆ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అమెరికాలోని శ్వేత జాతీయులు నల్ల వారిపై చూపే జాతి వివక్షకు వ్యతిరేకంగా పో రాడిన యోధుడు
మార్టిన్ లూథర్ కింగ్. ••••••••••••••••••••••••• 35 ఏళ్ళకే నోబెల్ శాంతి బహుమానం పొ ందాడు.
@ప్రశ్నలు :
1. మార్టిన్ లూథర్ కింగ్ భవిష్యత్తు ను గురించి ఏం కలకన్నాడు?
జ). అన్యాయం, అణచివేతలతో ఎడారి అయిన మిసిసిపి రాష్ట ం్ర స్వేచ్ఛ, న్యాయాల ఒయాసిస్సులను పొ ందే రోజు
వస్తు ందని మార్టిన్ లూథర్ కింగ్ భవిష్యత్తు ను గురించి కలకన్నాడు.
2. ఉద్యమాల ద్వారా అతను సాధించిన విజయాలేమిటి?
జ). పౌర హక్కుల కోసం పో రాటం చేసిన యోధుడిగా ప్రపంచం చేత గుర్తించబడ్డా డు. నల్ల జాతి ప్రజలను నడిపించిన
శక్తిగా కీర్తి పొ ంది, 35 ఏళ్ల కే నోబెల్ శాంతి బహుమానం పొ ందాడు.
3. పై పేరాలో 'కల' అని అర్థా న్నిచ్చే పదం ఏది?
జ). పై పేరాలో స్వప్నం అనే పదం కల అనే అర్థా న్ని ఇస్తు ంది.
4. ఆకలింపు చేసుకోవడం అంటే? ( ఆ )
అ). ఆవలించడం ఆ). అర్థం చేసుకోవడం ఇ). పో రాడడం
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు?
ఇ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
20వ శతాబ్ద ం స్వేచ్ఛా స్వాతంత్ర్య ఉద్యమాలకు ఆలవాలం.•••••••••••••••••••• నాగప్పగారి సుందర్రా జు,
కొలకలూరి స్వరూపరాణి, చల్ల పల్లి స్వరూపరాణి, జాజుల గౌరి, వినోదిని మొదలైన వారు దళిత కథా సాహిత్యాన్ని
పరిపుష్ట ం చేశారు.
@ప్రశ్నలు :
1. ప్రజల హక్కుల కోసం కవులు ఏమి చేస్తా రు?
జ). ప్రజల హక్కుల కోసం కవులు వ్యథార్థ జీవుల గాథలకు పట్ట ం కడుతూ రచనలు చేయడం మొదలెట్టా రు.
2. రాయలసీమ ప్రా ంతంలో దళిత జీవితాన్ని చిత్రించిన కథకులు ఎవరు?
జ). శాంతి నారాయణ, చిలుకూరి దేవపుత్ర
3. ప్రా తః స్మరణీయుడు అంటే అర్థం ఏమిటి?
జ). వేకువజామునే తలుచుకోదగిన మహనీయుడు అని అర్థం.
4. పై పేరా చదివి రచయిత్రు ల పేర్లు రాయండి.
జ). కొలకలూరి స్వరూపరాణి, చల్ల పల్లి స్వరూపరాణి, జాజుల గౌరి, వినోదిని
5. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). "ఊరబావి" కథను ఎవరు రాశారు?

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 27

II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :


అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.
1. కాలం నా పాదాలకు నమస్కరిస్తు ంది అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జ). కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి అది తన రూపురేఖలను మార్చుకుంటూ ఉంటుంది.
గడిచిన కాలంలో కవి గారి పూర్వీకులంతా కుల పరంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అదే కులంలో పుట్టి
బాగా చదువుకుని, ఆచార్యునిగా, గొప్ప కవిగా, మేధావిగా ఎదిగిన కవిగారిని అదే సమాజం గౌరవిస్తూ , సత్కారాలు
చేస్తు ంది. అంటే సమాజం కులాన్ని బట్టి విలువ ఇచ్చే స్థా యి నుండి చదువును, గుణాన్ని బట్టి విలువ ఇచ్చే
స్థా యికి అభివృద్ధి చెందిందని కవిగారి ఉద్దేశం అయి ఉండవచ్చు.
2. కవి నేడు సమాజంతో సత్కారం పొ ందడానికి తోడ్పడిన అంశాలేమిటి?
జ). కవి గారు ఎన్నో కష్టా లకోర్చి, స్వయంకృషితో చదివి, వీధిబడి నుండి విశ్వవిద్యాలయంలో ఆచార్యుని
స్థా యికి చేరుకున్నారు. ఎందరో విద్యార్థు లకు విద్యాదానం చేశారు. తన ప్రతిభ, పాండిత్యాలు, వాక్చాతుర్యంతో
సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగా, మానవతా శక్తిగా తనను తాను నిరూపించుకున్నారు. కవిగా
తన రచనలతో సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. ఈ అంశాలే కవి నేడు సమాజంతో సత్కారం పొ ందడానికి
తోడ్పడ్డా యి.
3. కవి తన పూర్వీకులు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఏమి ఆలోచిస్తా డో (ఆలోచించాడో ) రాయండి.
జ). కవి గారికి సన్మానం జరుగుతున్న సమయంలో ఆయనకు తన పూర్వీకులు ఎదుర్కొన్న సవాళ్లు
గుర్తు కు వచ్చాయి. తనను వేదికపై కూర్చోబెట్టినప్పుడు ఊరి చివర నిలబడ్డ తన తాత మొహం గుర్తు కొచ్చింది.
తనకు శాలువా కప్పుతున్నప్పుడు ఒంటినిండా బట్ట లు లేని తన జేజమ్మ రూపం గుర్తు కొచ్చింది. తనకు పట్టు
బట్ట లు బహుకరిస్తు న్నప్పుడు చిరిగిపో యిన ముతక పంచెలు కట్టు కున్న తన తాత రూపం గుర్తు కొచ్చింది. అందరూ
తనకు నమస్కరిస్తు ంటే చెప్పులు కూడా లేని తన తాతల కాళ్లు గుర్తు కొచ్చాయి.
4. 'ఆత్మకథ' పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జ). వ్యక్తి తన స్వతంత్వానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణచివేయాలని ప్రయత్నిస్తే
తిరగబడతాడు. తనకు సాటి మనుషుల మధ్య గుర్తింపును కోరుకుంటాడు. సమాజంలో ఉన్న కొన్ని నిరంకుశ
భావాలు, కట్టు బాట్లు మనిషి స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తా యి. అతడు వాటిని తెంచుకొని తనలో ఉన్న సృజనాత్మక శక్తిని
ప్రపంచానికి చాటుకుంటాడు. జీవితంలో ఎదురైన సమస్యలకు కృంగిపో క ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టు బడిగా
జ్ఞా న శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే ఆత్మకథ పాఠ్యభాగ నేపథ్యం.
5. ఆత్మకథ పాఠం ఆధారంగా 'వచన కవిత' ప్రక్రియను గురించి రాయండి.
జ). పద్యాల్లో , గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో లయాత్మకంగా
సాగే కవితను వచన కవిత అంటారు. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత.
రచయిత తాను చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్ట ంగా చెప్పడం వచన కవిత ప్రత్యేకత. శ్రీశ్రీ నుండి నేటి
వరకు ఎందరో కవులు వచన కవితకు పట్ట ం కట్టా రు.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
1. ఆత్మకథ పాఠ్యభాగంలో కవి వెలువరించిన బాధామయ జీవితాన్ని మీ మాటల్లో రాయండి.
జ). కవిగారి 'ఆత్మకథ' గ్రంథం ఆవిష్కరించిన తరువాత ఆయనకు సన్మానం చేస్తు న్నారు. ఈ సందర్భంలో
ఆయనకు గతంలో తాను, తన పూర్వీకులు ఎదుర్కొన్న అవమానాలు గుర్తు కొస్తు న్నాయి. తన తాతను
అంటరానివాడిగా చూస్తూ , ఊరిలోనికి రానిచ్చేవారు కాదు. మంచినీళ్లు తాగాలంటే మోకాళ్ళపై వంగి, దో సిల్లతో
తాగాల్సి వచ్చేది. తన జేజమ్మకు ఒంటి నిండా కట్టు కోవడానికి బట్ట లు కూడా ఉండేవి కాదు.
తన తాత బట్ట ల్లేక చిరిగిన ముతక పంచెలే కట్టు కునేవాడు. తన తాతల కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు.
చిన్నప్పుడు తాను పశువుల పాకలో అన్నం తిన్నాడు. తన పూర్వీకులు చేయని తప్పులకు కూడా ఎన్నో కొరడా
దెబ్బలు తిన్నారు. వేదాలు వినకూడదని చెవుల్లో సీసం పో సేవారు. నిందలు మోపి శరీరంలోని అవయవాలు
కోసేయడం వంటి భయంకర శిక్షలు విధించేవారు. ఈ విధంగా కవి తన, తన పూర్వీకుల బాధామయ జీవితాన్ని
గురించి చెప్పారు.
2. కాలం నా ఆత్మకథను పాఠ్యగ్రంథంగా చదువుతుందని అనడంలో కవి ఆలోచనల గురించి రాయండి.
జ). కవిగారి 'ఆత్మకథ' గ్రంథం ఆవిష్కరణ సందర్భంగా ఆయనకు సన్మానం జరుగుతుంది. ఆ సందర్భంలో
ఆయనకు గతంలో తన తాతముత్తా తలు కులపరంగా ఎదుర్కొన్న అవమానాలు గుర్తు కొచ్చాయి. ఆ నాటి
సమాజంలో కొన్ని కులాల వారిని ఎంతో హీనంగా చూస్తూ అవమానాలకు గురిచేసేవారు. అలా అవమానాలు

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 28

మౌనంగా భరించిన వారి కులంలో తరువాతి తరాలవారు కష్ట పడి చదువుకుని నలుగురికీ ఆదర్శవంతంగా
నిలిచారు. అందరిచేత సన్మానం చేయించుకునే స్థా యికి ఎదిగారు. విద్య వారిలోని అంటరానితనాన్ని పో గొట్టింది.
ఒకప్పుడు కులపరంగా అవమానించిన సమాజం నేడు వారిని విద్యావంతులుగా ఎంతో గౌరవిస్తు ంది.
ఇది కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో వచ్చిన మార్పుగా కవిగారు భావించారు. ఇదంతా విద్య
ద్వారానే సాధ్యమయ్యిందని నమ్మారు. అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత స్థితికి చేరుకున్న తన జీవితమే
అందరికీ ఆదర్శవంతం కావాలని కవిగారు భావించారు. అందుకే 'కాలం నా ఆత్మకథను పాఠ్యగ్రంథంగా
చదువుతుంద'ని కవిగారు అని ఉంటారు.
3. తమ గురించి తాము చెప్పుకోవడమే ఆత్మకథ. ఏదైనా ఒక వస్తు వు/ పక్షి/ జంతువును ఎంపిక చేసుకుని అవి
తమ గురించి తాము ఏమేమి చెప్పుకుంటాయో ఊహించి ఆత్మకథలా రాయండి.
జ). "నల్ల బల్ల ఆత్మఘోష"
హాయ్ పిల్లలూ..! నన్ను గుర్తు పట్టా రా! నేను..నల్ల బల్ల ను. నన్ను ఎక్కడో చూసినట్లు గుర్తు కొస్తు ంది కదూ!
గతంలో నేను పాఠశాలల్లో ని ప్రతి తరగతి గదిలోనూ ఉండేదాన్ని. నన్ను ఆంగ్ల ంలో బ్లా క్ బో ర్డ్ అంటారు. ఒకప్పుడు
మీ తాతలకు, తండ్రు లకు విద్యాబుద్ధు లు నేర్పింది నేన.ే మీకు చదువుచెప్పే ఉపాధ్యాయులకు చదువు నేర్పింది
కూడా నేన.ే నా పైన సుద్ద ముక్కలతో వ్రా సి ఉపాధ్యాయులు విద్యార్థు లకు పాఠాలు బో ధించేవారు. నాపై వ్రా సిన
వ్రా తను నేర్చుకుని ఎంతోమంది వారి తలరాతను ఉన్నతంగా మలచుకున్నారు. ఇదంతా గతం.
ప్రస్తు తకాలంలో సాంకేతిక పరిజ్ఞా నం పేరుతో వస్తు న్న పెను మార్పుల ప్రభావం వల్ల నా ఉనికే
ప్రశ్నార్థకమయ్యింది. గత కొంతకాలంగా గ్రీన్ బో ర్డు లు, ఐ.ఎఫ్.పి ప్యానల్లు నా స్థా నాన్ని ఆక్రమించాయి. కొత్త దనాన్ని
స్వాగతించడం మంచిదే కానీ ఆ వంకతో పాతను పూర్తిగా పాతిపెట్టడం మంచిది కాదు కదా! ఇక్కడ అందరూ ఒక్కటి
గమనించాలి నేను మన్నినంత కాలం ఇవేవీ మన్నలేవు. ఇది మాత్రం వాస్త వం. నా చరిత్ర రాబో యే తరాలవారికి ఒక
కథగానైనా చెప్పుకుంటారని ఆశపడుతున్నాను. నన్ను ఇంతకాలం ఆదరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
తెలుపుకుంటూ హృదయవేదనతో నిష్క్రమిస్తు న్నాను. ఇక సెలవు.
4. 'మనుషులందరూ సమానమే' అనే అంశంపై ఐదు నినాదాలు రాయండి.
జ). మనమంతా మనుషులం - లేదు మన మధ్య అంతరం
కులం వద్దు , మతం వద్దు - మానవత్వమే మనకు ముద్దు
ఐకమత్యమే మన బలం - అదే మన ఆయుధం
వైషమ్యాలు వదిలేద్దా ం - సొ దరుల్లా కలిసి జీవిద్దా ం
సంపదలు ఉన్నా, లేకున్నా - కలిసిమెలిసి జీవిద్దా ం
మమతను అందరికీ పంచుదాం - మనుషులమని చాటుదాం
మనమధ్య ఎలాంటి స్పర్థలూ వద్దు - సమానత్వమే దానికి హద్దు
III).భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింద ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం తెలుసుకొని సొ ంతమాటల్లో రాయండి.
1. నాలుగు రోడ్ల చౌరస్తా లో జాతీయ జెండా ఎగురవేశారు.
జ). చౌరస్తా = కూడలి
*అమలాపురం గడియారస్త ంభం కూడలిలో గాంధీ విగ్రహం ఉంది.
2. ఊరి గుడిసె అగ్నికి అర్పణం అయ్యింది.
జ). అర్పణం = సమర్పించడం/ఇవ్వడం
*వేంకటేశ్వరస్వామికి భక్తు లు విలువైన కానుకలు సమర్పించుకుంటారు.
3. ఆ పిల్లలు తెలివితేటల్లో చురకత్తు ల్లా ఉన్నారు.
జ). చురకత్తు లు = పదునైన కత్తు లు
*రాజులు యుద్ధా లు చేసేటప్పుడు పదునైన కత్తు లు ఉపయోగించేవారు.
ఆ). కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. స్వర్ణ ం = బంగారం, కనకం, పుత్త డి
2. సూర్యుడు = రవి, భాస్కరుడు, భానుడు
3. కళ్ళు = నయనాలు, నేత్రా లు
4. దేహం = కాయం, మేను, శరీరం

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 29

ఇ). కింది పదాలకు నానార్థా లు రాయండి.


1. తల = శిరస్సు, చోటు
2. కాలం = సమయం, మరణం
3. క్రియ = పని, చర్య
4. రామ = రాముడు, స్త్రీ
ఈ). కింది ప్రకృతి పదాలకు వికృతులను జతపరచండి.
1. భోజనం ( సి ) ఎ). కత
2. బ్రధ్న ( డి ) బి). పువ్వు
3. కథ ( ఎ ) సి). బో నము
4. పుష్పం ( బి ) డి). ప్రొ ద్దు

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

💥
👉
ఆమ్రేడిత సంధి :
ఈ కింది ఉదాహరణలను పరిశీలించండి.
ఔరౌర = ఔర + ఔర
ఓహో హో = ఓహో + ఓహో

👉
ఏమేమి = ఏమి + ఏమి
సూత్రం - 1 : ఈ పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తు ంది. ఇలా

👉
రెండు ఒక విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు.
సూత్రం - 2 : ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపం బహుళంగా వస్తు ంది.
ఉదా : అప్పటికిన్ + అప్పటికిన్ = అప్పటప్పటికిన్
అక్కడన్ + అక్కడన్ = అక్కడక్కడన్
అ). కింది పదాలు విడదీసి, సంధి పేరు తెలపండి.
1. పావనమైనది = పావనము + ఐనది = ఉత్వసంధి
2. ధర్మమొకటి = ధర్మము + ఒకటి = ఉత్వసంధి
3. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు = అత్వసంధి

💥
4. గుర్తు కొస్తు ంది = ఈ పదం తప్పుగా ఇవ్వబడింది.

👉
సమాసాలు :

👉
తత్పురుష సమాసం : ఉత్త ర పద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం.
ప్రథమా తత్పురుష సమాసం : ప్రథమా విభక్తి చివర కలిగిన పూర్వపదం, ఉత్త ర పద అర్ధ ప్రా ధాన్యత కలిగినది
ప్రథమా తత్పురుష సమాసం. ప్రథమా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (డు, ము, వు, లు)
ఉదా : మధ్యాహ్నము - అహ్నము మధ్య భాగము

👉
నడిరేయి - రేయి నడిమి భాగము
ద్వితీయా తత్పురుష సమాసం : ద్వితీయా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (నిన్, నున్, లన్, కూర్చి,
గురించి)
ఉదా : కృష్ణా శ్రితుడు - కృష్ణు ని ఆశ్రయించినవాడు

👉
నెలతాల్పు - నెలను తాల్చినవాడు
తృతీయా తత్పురుష సమాసం : తృతీయా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (చేతన్, చేన్, తోడన్, తోన్)
ఉదా : వాక్కలహము - వాక్కు చేత కలహము

👉
విద్యాహీనుడు - విద్య చేత హీనుడు
చతుర్థీ తత్పురుష సమాసం : చతుర్థీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కొరకున్, కై)
ఉదా : ధనాశ - ధనము కొరకు ఆశ

👉
పొ ట్ట కూడు - పొ ట్ట కొరకు కూడు
పంచమీ తత్పురుష సమాసం : పంచమీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (వలనన్, కంటెన్, పట్టి)
ఉదా : దొ ంగభయం - దొ ంగ వలన భయం
పాప విముక్తు డు - పాపము వలన విముక్తు డు

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 30

👉షష్ఠీ తత్పురుష సమాసం : షష్ఠీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్)
ఉదా : రాజపుత్రు డు - రాజు యొక్క పుత్రు డు

👉
యజ్ఞ ఫలం - యజ్ఞ ము యొక్క ఫలం
సప్త మీ తత్పురుష సమాసం : సప్త మీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (అందున్, నన్)
ఉదా : నీతి పారగుడు - నీతి యందు పారగుడు
మాటనేర్పరి - మాట యందు నేర్పరి
ఆ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి.
1. మేలు వస్త్రా లు - మేలైన వస్త్రా లు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
*వస్త్రా లు (నామవాచకం), మేలు (విశేషణం)
2. ముతక పంచెలు - ముతకవైన పంచెలు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. కొత్త దేవుళ్ళు - కొత్త వారైన దేవుళ్ళు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. వక్రధ్వనులు - వక్రమైన ధ్వనులు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

💥అలంకారాలు :
5. నాలుగు పంక్తు లు - నాలుగు సంఖ్యగల పంక్తు లు - ద్విగు సమాసం

అ). రూపకాలంకారం :
(i)"మా అమ్మ చేతి వంట అమృతం".
పై వాక్యంలో అమ్మ చేతి వంట ఉపమేయం, అమృతం - ఉపమానం. అమ్మ చేతి వంటకు - అమృతానికి
భేదం లేదని (అభేదం) చెప్పడం కనిపిస్తు ంది.
*నిర్వచనం : ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అని అంటారు.
ఉదా : ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే!
*సమన్వయం : ఇక్కడ మహారాజు ఉపమేయం, ఈశ్వరుడు ఉపమానం. 'సాక్షాత్తు ' అనే పదం రాజుకు, ఈశ్వరునికి
భేదం లేదు అని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
(ii)"నా కడుపులో అవమానాల చురకత్తు లు గుచ్చుకుంటాయి".
అవమానాల చురకత్తు లు - అవమానాలనెడి చురకత్తు లు
*సమన్వయం : అవమానం - ఉపమేయం, చురకత్తు లు - ఉపమానం

💥
అవమానాలు - చురకత్తు లకు భేదం లేదని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.

👉
ఛందస్సు :
కింది పద్య పాదాలకు గురు - లఘువులను గుర్తించండి. శార్దూ ల పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
ఉదా : U U U I I U I U I I I U U U I U U I U
ఆనందం| బుననా| ర్ధరాత్ర| ముల జం| ద్రా లోక| ముల్ కాయ| గా
మ స జ స త త గ

👉
* ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
శార్దూ లము పద్య లక్షణాలు :
1.ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి
2. ప్రతి పాదంలోనూ వరుసగా మ , స , జ , స , త , త , గ అనే గణాలు వస్తా యి.
3. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలోను 1 - 13 అక్షరాలకు యతి కుదురుతుంది.
5. ప్రా సనియమం ఉంటుంది.
*సమన్వయం: పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (ఆ - ద్రా ) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూ ల వృత్తా నికి
చెందినదని చెప్పవచ్చు.
U UU I IU I UI I I U UU I U U I U
1. మాయామే |య జగం| బె నిత్య| మని సం| భావించి| మోహంబు| నన్
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 31

*సమన్వయం: పైన ఇచ్చిన పద్యపాదంలో……..


1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (మా - భా) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూ ల వృత్తా నికి
చెందినదని చెప్పవచ్చు.

UU U I I U I U I I I U UU I U UI U
2. బావా యె| ప్పుడు వ| చ్చితీవు| సుఖులే| భ్రా తల్సు| తుల్ చుట్ట | ముల్
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (బా - భ్రా ) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి పైన ఇచ్చిన పద్య పాదము శార్దూ ల
వృత్తా నికి చెందినదని చెప్పవచ్చు.

UUU I IU IUI I I U U U I U U I U
3. ప్రా కారం| బు గదా| ప్రహార| ముల ను| త్పాటించి| యంత్రంబు| లున్
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (ప్రా - త్పా) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూ ల వృత్తా నికి
చెందినదని చెప్పవచ్చు.

U U U II U I U I I I U UU I U UI U
4. కంటిన్ జా| నకి బూ| ర్ణ చంద్ర| వదనన్| గల్యాణి| నాలంక| లో
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (క - గ) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూ ల వృత్తా నికి
చెందినదని చెప్పవచ్చు.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 32

5.స్నేహం
I).అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
1. పాఠంలోని పద్యాలను రాగయుక్త ంగా పాడండి.
జ). (ఉపాధ్యాయుడు రాగయుక్త ంగా పాడుతున్నప్పుడు గమనిస్తూ , విద్యార్థు లు పాడటానికి ప్రయత్నిస్తా రు.)
2. పాఠంలో మీకు నచ్చిన స్నేహం గురించి మాట్లా డండి.
జ). ఈ పాఠంలో నాకు కృష్ణ కుచేలుల స్నేహం బాగా నచ్చింది. కృష్ణు డు, కుచేలుడు చిన్నతనంలో సాందీపుని
వద్ద విద్యాభ్యాసం చేశారు. అప్పుడు ఏర్పడ్డ వారి స్నేహం జీవితాంతం కొనసాగింది. కాలక్రమంలో కుచేలుడు పరమ
దారిద్య్ర స్థితికి చేరుకున్నాడు. ఒకరోజు తన బాల్యమిత్రు డైన శ్రీకృష్ణు ని దర్శించడానికి కుచేలుడు అతని మందిరానికి
చేరుకున్నాడు. బాల్య స్నేహితుడిని చూడగానే శ్రీకృష్ణు డు హంసతూలికా తల్పం నుండి దిగి పరుగు పరుగున వచ్చి
అతనిని కౌగిలించుకున్నాడు. తన హంసతూలికా తల్పంపై కుచేలుడిని కూర్చోబెట్టు కున్నాడు. ఈ విధంగా వారిద్దరి
స్నేహం ధనిక, పేద భేదం చూపకుండా జీవితాంతం కొనసాగింది. కాబట్టి నాకు కృష్ణ కుచేలుల స్నేహం బాగా
నచ్చింది.
3. కింది మాటలు ఎవరు, ఎవరితో, ఎందుకన్నారో పాఠం ఆధారంగా రాయండి.
అ). మీ చిన్ననాటి మిత్రు ని వద్ద కు వెళ్లి రా!
జ). ఈ మాటలు కుచేలునితో అతని భార్య అన్నది. కుచేలుని కుటుంబం పరమ దారిద్య్ర స్థితిని
అనుభవిస్తు న్నది. ఆగర్భ శ్రీమంతుడైన శ్రీకృష్ణు డు కుచేలునికి బాల్యమిత్రు డు. అందువల్ల అతని వద్ద కు వెళితే
ఏమైనా సహాయం చేస్తా డేమో అనే ఉద్దేశంతో ఆమె ఈ మాటలు అన్నది.
ఆ). మీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
జ). ఈ మాటలు హనుమంతుడు శ్రీరామునితో అన్నాడు. మహా పరాక్రమవంతుడైన శ్రీరాముడు, సర్వ
సమర్ధు డైన సుగ్రీవుల మధ్య స్నేహం కుదిరితే వారిరువురికీ లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో హనుమంతుడు ఈ
మాటలు అన్నాడు.
ఇ). నిశ్చలమైన ప్రేమతో ఇచ్చేదేదైనా స్వీకరిస్తా ను.
జ). ఈ మాటలు శ్రీకృష్ణు డు తన బాల్య మిత్రు డైన కుచేలునితో అన్నాడు. శ్రీకృష్ణు డు ఆగర్భ శ్రీమంతుడు.
కుచేలుడు కటిక దరిద్రు డు. అయినప్పటికీ కుచేలుడు తెచ్చిన అటుకుల మూటను విప్పి శ్రీకృష్ణు డు ఆత్రంగా
తిన్నాడు. దీని ద్వారా శ్రీ కృష్ణు డు స్నేహానికి ధనిక, పేద భేదం లేదని, నిశ్చలమైన ప్రేమ ఉంటే చాలనే గొప్ప
సందేశాన్ని సమాజానికి చాటాడు.
ఆ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేద.ి •••••••••••••• కొత్త గా వచ్చిన వారిని నమ్మరాదనీ,
దీనితో మనకు మైత్రి మంచిది కాదనీ తెలిపింది.(పంచతంత్ర కథ)(పూర్తి గద్యానికి పాఠ్య పుస్త కంలో 66వ పుట చూడగలరు)
@ప్రశ్నలు :
1. ఈ కథలో మంచి మిత్రు లు ఎవరు?
జ). ఈ కథలో కాకి, లేడి మంచి మిత్రు లు.
2. జింక నక్కను చూసి ఏమని భావించింది?
జ). జింక నక్కను చూసి 'ఆపదలో ఉన్నవారినైనా, ఆతిథ్యం కోరి వచ్చిన వారినైనా, స్నేహం ఆశించి వచ్చిన
వారినైనా ఆదరించడం కనీస ధర్మమని' భావించింది.
3. పై పేరాలో 'స్నేహం' అనే అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). పై పేరాలో "మైత్రి" అనే పదం స్నేహం అనే అర్ధా న్నిస్తు ంది.
4. నక్క స్వభావం ( అ )
అ). జిత్తు లమారి ఆ). మంచి గుణం కలది ఇ). తనపని తాను చేసుకొనేది.
5. పై పేరా ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి.
జ). కొత్త గా వచ్చిన వారిని నమ్మరాదని కాకి ఎవరితో అన్నది?
ఇ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
భారతదేశ స్వాతంత్రో ద్యమపు రోజులవి. ••••••••••••••••పేదరికంలో పుట్టినా న్యాయవాదిగా,
రాజకీయవేత్తగా,రాష్ట ్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మహో న్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం.(నా జీవితయాత్ర నుండి).
(పూర్తి గద్యానికి పాఠ్య పుస్త కంలో 66, 67 పుటలు చూడగలరు.)

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 33

@ప్రశ్నలు :
1. టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు ఏమిటి?
జ). "ఆంధ్రకేసరి" అనేది టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు.
2. ప్రకాశం తల్లిదండ్రు ల పేర్లు రాయండి.
జ). సుబ్బమ్మ, గోపాలకృష్ణ య్య గార్లు ప్రకాశం గారి తల్లిదండ్రు లు.
3. ఇమ్మానేని హనుమంతరావు గారు ఈ వృత్తి కి చెందినవారు. ( ఆ )
అ). వైద్యుడు ఆ). అధ్యాపక(ఉపాధ్యాయ) ఇ). వ్యవసాయం
4. పై పేరాలో నామవాచకాలను గుర్తించి రాయండి.
జ). భారతదేశం, బొ ంబాయి, మద్రా సు, పార్థసారథి, టంగుటూరి ప్రకాశం, సుబ్బమ్మ, గోపాలకృష్ణ య్య, ఇమ్మానేని
హనుమంతరావు నాయుడు. …..
5. పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి.
జ). సైమన్ కమీషన్ బొ ంబాయిలో ఎప్పుడు అడుగు పెట్టింది?
II).వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. శ్రీరామ, సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి.
జ). హనుమంతుడు తన వాక్చాతుర్యంతో శ్రీరాముడు, సుగ్రీవుల మధ్య స్నేహాన్ని కుదిర్చాడు. తాము
ప్రా ణాలతో ఉన్నంతకాలం తమ స్నేహం కొనసాగుతుందని శ్రీరామ సుగ్రీవులు ఇరువురు ప్రతిజ్ఞ చేశారు. సీతను
వెతకడంలో సుగ్రీవుడు ముఖ్య పాత్ర పో షించాడు. శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి
రాజుగా చేశాడు. ఈ విధంగా ఒక సమర్ధు డు మరొక సమర్ధు నితో స్నేహం చేసి స్వకార్యాన్ని, మిత్రకార్యాన్ని
చక్కబెట్టు కున్నారు. లోక కళ్యాణానికి కారకులయ్యారు. సమర్థు ల స్నేహానికి చక్కని ఉదాహరణగా శ్రీరామ,
సుగ్రీవుల మైత్రిని చెప్పవచ్చు.
2. మంచి స్నేహం వలన కలిగే ప్రయోజనాలు రాయండి.
జ). స్నేహానికి సమానమైన ధర్మం ఈ భూమండలంలో లేదు. స్నేహం ఎంతో పవిత్రమైనది. మంచి స్నేహం
వివేకాన్నిస్తు ంది. మనలో ధైర్యాన్ని నింపుతుంది. మంచి స్నేహం వలన ఇరువురకూ మేలు జరుగుతుంది. కలలో
కూడా ఎటువంటి మోసం తలపెట్టకుండా ప్రా ణం ఉన్నంత వరకు స్నేహితులిద్ద రిని కలిపే ఉంచుతుంది. మనుషుల
మధ్య కుల, మత, వర్గ , ప్రా ంతీయ భేదాలను తొలగిస్తు ంది. మంచి స్నేహం వలన వ్యక్తిగత ప్రయోజనంతో పాటు
సమాజాభివృద్ధి కూడా జరుగుతుంది.
3. శ్రీకృష్ణ కుచేలులు మంచి స్నేహితులనడానికి కారణాలు రాయండి.
జ). శ్రీకృష్ణు డు, కుచేలుడు చిన్నతనంలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశారు. శ్రీకృష్ణు డు ఆగర్భ
శ్రీమంతుడు. కుచేలుడు పరమ దారిద్య్ర స్థితిని అనుభవిస్తు న్నాడు. ఒకరోజు తన బాల్య మిత్రు డైన శ్రీకృష్ణు ని
దర్శించడానికి కుచేలుడు అతని మందిరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణు డు ఆప్యాయంగా ఆదరించి తన హంసతూలికా
తల్పంపై కుచేలుడిని కూర్చోబెట్టు కుని, అతడు తెచ్చిన అటుకుల మూటను విప్పి ఆత్రంగా తిన్నాడు. ఈ విధంగా
వారిద్దరి స్నేహం ధనిక, పేద భేదం చూడకుండా జీవితాంతం కొనసాగింది. ఈ సంఘటన ఆధారంగా శ్రీకృష్ణ కుచేలులు
మంచి స్నేహితులని చెప్పవచ్చు.
4. ద్రు పదుడు చేసిన తప్పు ఏమిటి? దాని వలన కలిగిన ఫలితమేమిటి?
జ). ద్రు పదుడు, ద్రో ణాచార్యుడు బాల్య స్నేహితులు. కాలక్రమంలో ద్రు పదుడు రాజయ్యాడు. ద్రో ణాచార్యుడు
అస్త శ్ర స్త ్ర విద్యలు నేర్పే గురువయ్యాడు. ఒకసారి ద్రో ణుడు తన బాల్యమిత్రు డైన ద్రు పదునితో తన పేదరికాన్ని గురించి
చెప్పి, ఒక ఆవును దానంగా ఇమ్మని కోరాడు. దానికి ద్రు పదుడు అతని పేదరికాన్ని అవహేళన చేస్తూ , తమ
ఇద్ద రిమధ్య ఎప్పటికీ స్నేహం కుదరదని ద్రో ణుని నిందించాడు. ఈ మాటలను మనసులో ఉంచుకుని ద్రో ణుడు
అర్జు నుని మంచి విలుకానిగా తయారుచేశాడు. అర్జు నిని ద్వారా ద్రు పదుని బంధింపజేసి తనకు జరిగిన
అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
5. "పద్యం" ప్రక్రియను గురించి రాయండి.
జ). సాహిత్య ప్రక్రియలలో విశిష్ట మైనది పద్యం. ఇది ఛందో బద్ధ మైనది. లయాత్మకంగా, గానయోగ్యంగా
ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రా చీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య
రచనకు ప్రా ముఖ్యత ఇచ్చారు. కవి తన రచనలలో భావవ్యక్తీకరణకు అనువుగా వృత్తా లు, జాతులు, ఉపజాతులు
అనే కొన్ని పద్య శైలులను ఎంచుకుంటాడు. పద్యం పఠితకు రసానుభూతిని, మానసిక ఆనందాన్ని కలిగిస్తు ంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 34

6. కింది కవుల గురించి రాయండి.


i).నన్నయ : ఈయన 11వ శతాబ్దా నికి చెందినవాడు. రాజరాజ నరేంద్రు ని ఆస్థా న కవి. కవిత్రయంలో మొదటివాడు.
ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర మహాభారతంలోని రెండున్నర పర్వాలు నన్నయ రచనలు. ఆదికవి, శబ్ద శాసనుడు
అనేవి నన్నయ బిరుదులు.
ii). తిక్కన : ఈయన 13వ శతాబ్దా నికి చెందినవాడు. మనమసిద్ధి ఆస్థా న కవి. కవిత్రయంలో రెండవవాడు.
నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతంలోని విరాటపర్వం మొదలు స్వర్గా రోహణ పర్వం వరకు 15 పర్వాలు
తిక్కన రచనలు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రు డు అనేవి తిక్కన బిరుదులు.
iii). బమ్మెర పో తన : ఈయన 15వ శతాబ్దా నికి చెందినవాడు. శ్రీమదాంధ్ర మహాభాగవతం, భోగినీ దండకం,
నారాయణ శతకం, వీరభద్ర విజయం పో తన రచనలు. ఈయనకు సహజ పండితుడు అనే బిరుదు కలదు.
iv). విశ్వనాథ సత్యనారాయణ : ఈయన 20వ శతాబ్దా నికి చెందినవాడు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి శిష్యుడు. వీరి
రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞా నపీఠ్ పురస్కారం వచ్చింది. వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, ఏకవీర
మొదలైనవి వీరి ఇతర రచనలు. కవి సమ్రా ట్ అనే బిరుదు కలదు.
v). కందుకూరి రుద్రకవి : ఈయన 16వ శతాబ్దా నికి చెందినవాడు. సుగ్రీవ విజయం అనే యక్షగానం రచించాడు.
vi).తెనాలి అన్నయ్య కవి: ఈయన 16వ శతాబ్దా నికి చెందినవాడు.సుదక్షిణా పరిణయం అనే కావ్యాన్ని రాశాడు.
ఆ). కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. పాఠం ఆధారంగా మనం ఎలాంటి స్నేహాన్ని ఎంచుకోవాలో తెలుపుతూ వ్యాసం రాయండి.
జ). స్నేహానికి సమానమైన ధర్మం ఈ భూమండలంలో లేదు. స్నేహం ఎంతో పవిత్రమైనది. శ్రీకృష్ణు డు,
కుచేలుడు చిన్నతనంలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆగర్భ శ్రీమంతుడైన శ్రీకృష్ణు డు, పరమ దారిద్ర్యాన్ని
అనుభవిస్తు న్న కుచేలుడు మధ్య స్నేహం ధనిక, పేద భేదం చూపకుండా కలకాలం నిలిచి అందరికీ
ఆదర్శప్రా యమైంది. శ్రీరామ, సుగ్రీవుల మైత్రి వారిద్దరికీ ప్రయోజనం చేకూర్చడంతో పాటు లోక కల్యాణానికి
దో హదపడింది.
ద్రు పదుడు, ద్రో ణాచార్యుడు చిన్ననాటి స్నేహితులు. పేదరికం కారణంగా ఒక ఆవును దానంగా అర్ధించి
వచ్చిన ద్రో ణుని, రాజైన ద్రు పదుడు అవమానపరిచాడు. అవమాన భారాన్ని మనసులో పెట్టు కుని ద్రో ణుడు తన
శిష్యుడైన అర్జు నిని ద్వారా ద్రు పదుని బంధింపజేశాడు. ఇక తనను అంగరాజ్యానికి రాజుగా చేసినందుకు కృతజ్ఞ తగా
కర్ణు డు, దుర్యోధనునితో జీవితాంతం స్నేహంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. దుష్టు డైన దుర్యోధనునితో స్నేహం వలన
కర్ణు డు నాశనమయ్యాడు.
కాబట్టి మనం స్నేహాన్ని ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలి.
ధనిక, పేద, జాతి భేదాన్ని చూపని కృష్ణ -కుచేలుల, శ్రీరామ-సుగ్రీవుల వంటి స్నేహాన్ని ఎంచుకోవాలి. ఎల్ల ప్పుడూ
మనలో వివేకాన్ని పెంచి, ధైర్యాన్ని నింపుతూ కలకాలం నిలిచే స్నేహాన్ని ఎంచుకోవాలి.
2. శ్రీరామ సుగ్రీవుల మధ్య స్నేహాన్ని ఏర్పరచడంలో హనుమ సంభాషణను రాయండి.
జ). హనుమంతుడు : మహావీరులకు నమస్కారం!
శ్రీరాముడు : ఎవరు నీవు?
హనుమంతుడు : నన్ను హనుమంతుడు అంటారు. నేను వానరరాజు సుగ్రీవుని మంత్రిని. మీరు..?
శ్రీరాముడు: మేము దశరథ మహారాజు పుత్రు లం. నన్ను రాముడంటారు. ఇతడు మా తమ్ముడు లక్ష్మణుడు.
హనుమంతుడు : మహావీరులైన మీరు ఇలా రావడానికి గల కారణం ఏమిటో?
శ్రీరాముడు : నా భార్య సీతను ఎవరో అపహరించారు. ఆమెను వెతుక్కుంటూ మేము ఇటువచ్చాము.
హనుమంతుడు : అయ్యో! మా రాజైన సుగ్రీవుడు తమ వంటి వీరులతో స్నేహం కోరి నన్ను పంపాడు.
శ్రీరాముడు : మేముకూడా ఇప్పుడు అటువంటి వారి స్నేహహస్త ం కోసమే ఎదురుచూస్తు న్నాము.
హనుమంతుడు : అయితే ఇక ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఈ విషయాన్ని మా రాజుకు చెబుతాను.
శ్రీరాముడు : మా ఇద్ద రి స్నేహం మేము ప్రా ణాలతో ఉన్నంత వరకూ నిలచి ఉంటుంది.
హనుమంతుడు : హమ్మయ్య! సమర్థు లైన ఇద్ద రు వీరుల మధ్య స్నేహం కుదిరింది. నాకు ఇప్పుడు చాలా
సంతోషంగా ఉంది.
3. కింది పద్యాలకు ప్రతి పదార్థా లు, భావాలు రాయండి.
అ). వరదుడు సాధుభక్త జన వత్సలు డార్త శరణ్యుడిందిరా…….. యిచ్చుననూన సంపదల్.
జ). *ప్రతిపదార్ధం :
వరదుడు = కోరిన కోర్కెలు తీర్చేవాడు
సాధుభక్త జన వత్సలుడు = మంచి భక్తు ల యందు వాత్సల్యం కలవాడు
ఆర్త శరణ్యుడు = దీనులను రక్షించేవాడు
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 35

దయాపయోధి = సముద్రమంత దయ గలవాడు (ఎక్కువ జాలి గలవాడు)


భగవంతుడు = భక్తు లను కాచేవాడు ( దేవుడు)
కుశస్థ లీ పురమున = కుశస్థ లీ అనే పట్ట ణము నందు
యాదవ ప్రకరముల్ = యాదవ వంశస్థు ల సమూహాలు
భజియింపగన్ = సేవింపగా
ఉన్నవాడు = ఉన్నవాడైన
ఇందిరావరుడు = లక్ష్మీదేవి భర్త యైన
కృష్ణు డు = శ్రీ కృష్ణు డు
అప్పుడు = ఆ సమయంలో
నీవు = నీవు (కుచేలుడనే నీవు)
అరిగిన = వెళ్ళగానే
మిమ్మున్ = నిన్ను (కుచేలుడిని)
చూచి = చూసి
విభుండు = ఆ ప్రభువు
తాన్ = తాను
అనూన సంపదల్ = వెలకట్ట లేని సంపదలు
ఇచ్చున్ = ఇస్తా డు
భావము: ఆశ్రితులను రక్షించేవాడైన శ్రీకృష్ణు డు సజ్జ నులైన భక్తు ల పట్ల వాత్సల్యము కలవాడు. దయాసముద్రు డు.
కుశస్థ లీపురములో యాదవులు తనను సేవిస్తు ండగా ఉన్నవాడు. ఒక్కసారి, ఆ శ్రీకృష్ణు ని దర్శించండి. మిమ్మల్ని
(కుచేలుని) చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తా డు.
ఆ). కని డాయంజను నంత గృష్ణు డు దళత్కంజాక్షు డప్పేదవి……. దిగెన్ దల్పమున్.
జ). *ప్రతిపదార్ధం :
అంత = ఆ సమయంలో
అశ్రా ంత = ఎడతెగని
దరిద్ర = బీదతనముతో
పీడితున్ = పీడింపబడువానిని
కృశీ భూతాంగున్ = చిక్కిపో యి ఉన్నవానిని
జీర్ణ = శిథిలమైన (చినిగిన)
అంబరున్ = వస్త మ ్ర ులు కలవానిని
ఘన = మిక్కుటమైన
తృష్ణ = ఆశచేత
ఆతుర = ఆతృత చెందిన
చిత్తు న్ = మనస్సు కలవానిని
హాస్య = హాస్యమైన
నిలయున్ = స్వభావము కలవానిని
ఖండ = చిరిగిన
ఉత్త రీయున్ = పైబట్ట కలవానిని
ఆ + పేద = ఆ బీద
విప్రు నిన్ = బ్రా హ్మణుని
కుచేలునిన్ = కుచేలుడిని
డాయన్ = దగ్గ రకు
చనున్ = వచ్చుచుండగా
కని = చూసి
దళత్ = వికసించుచున్న
కంజ + అక్షుడు= పద్మములవంటి కన్నులు కలవాడైన
కృష్ణు డు = కృష్ణు డు
అల్ల ంతనె = అంత దూరమునుండె
సంభ్రమ = తొట్రు పాటుతో
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 36

విలోలుండు + ఐ = చలించువాడై
చూచి = చూసి
తల్పమున్ = పానుపును
దిగెన్ = దిగాడు
భావము : నిరంతర దారిద్య్ర పీడితుడు, కృశించిన అంగములు కలవాడు, చినిగిన వస్త మ ్ర ులు ధరించినవాడు,
ఆశాపూరిత చిత్తు డు, హాస్యానికి చిరునామా ఐనవాడు, అయిన కుచేలుడు వస్తు ంటే అల్ల ంత దూరంలో చూసిన
పద్మాల రేకులవంటి కన్నులుగల శ్రీకృష్ణు డు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు.
4. స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏఏ విషయాలలో జాగ్రత్త వహించాలి?
జ). స్నేహం పవిత్రమైనది. స్నేహానికి సమానమైన ధర్మం ఈ లోకంలో లేదు. స్నేహితుని ఎంపిక
చేసుకోవడంలో అనేక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మన పక్కన చేరి, మనల్ని పొ గుడుతూ ఉండేవారంతా
నిజమైన స్నేహితులు కాదని తెలుసుకోవాలి. కష్టా లు ఎదురైనప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండేవాడే
నిజమైన మిత్రు డని గ్రహించాలి. మనకి చెడు అలవాట్లు నేర్పే వారిని స్నేహితులుగా ఎంచుకోకూడడు. మనకి బాధ
కలిగినప్పుడు మనలో ధైర్యాన్ని నింపేవారే నిజమైన స్నేహితులని తెలుసుకోవాలి.
స్వార్థంతో ఆలోచించే వారితో స్నేహం చేయకూడదు. తమ మధ్య ఉన్న చిన్నచిన్న స్పర్థలను ఇతరులకు
చెప్పని వారిని స్నేహితులుగా ఎంచుకోవాలి. స్నేహం కోసం ధనాన్ని వదులుకోవడానికి, కోరికలను అదుపులో
ఉంచుకోవడానికి సిద్ధపడేవారిని స్నేహితులుగా ఎంచుకోవాలి. ప్రతీ చిన్న విషయానికీ తగవులాడుతూ విడిపో వాలని
చూసే వారిని స్నేహితులుగా ఎంచుకోకూడదు. ధనిక, పేద, కుల, మత, వర్గ , ప్రా ంతీయ భేదాల్ని చూపకుండా
నిస్వార్థంగా స్నేహం చేసేవారిని స్నేహితులుగా ఎంచుకోవాలి.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధా న్ని రాసి, వాటితో సొ ంత వాక్యాలు రాయండి.
ఉదా : మానవులు సంపదను మంచి మార్గ ంలో సంపాదించాలి.
జ). సంపద = ధనం
*ధనాన్ని అనవసర పనులకు ఖర్చు పెట్టరాదు.
1. ద్వారకా నగరంలో సౌధములు బంగారు వర్ణ ంతో మెరుస్తు న్నాయి.
జ). సౌధము = భవనము
*మాకు రెండు అంతస్తు ల భవనము ఉంది.
2. కృష్ణు నికి, కుచేలుడు తండులములు బహుకరించాడు.
జ). తండులములు = వరి అటుకులు
*వరి అటుకులను నానబెట్టి, బెల్లం కలిపి దేవుని ప్రసాదంగా పంచుతారు.
3. శ్రీరామ సుగ్రీవులు స్నేహం కోసం ప్రతిజ్ఞ చేశారు.
జ). ప్రతిజ్ఞ = శపథం
*సైనికులు దేశరక్షణకు కట్టు బడి ఉంటామని శపథం చేస్తా రు.
4. చెడ్డ వారితో సఖ్యం మంచిది కాదు.
జ). సఖ్యం = స్నేహం
*ఎల్ల ప్పుడూ మంచివారితోనే స్నేహం చెయ్యాలి.
ఆ). కింది వాక్యాలు చదివి పర్యాయపదాలను గుర్తించి రాయండి.
1. మంచి మిత్రు లతో స్నేహం చేయాలి. నేస్తా లతో సరిగా నడుచుకోవాలి. ఆ స్నేహితులే ఆపదలలో
ఆదుకుంటారు.
జ). మిత్రు లు, నేస్తా లు, స్నేహితులు
2. ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి.ఆ శయ్యలు మెత్తనైనవి.ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది.
జ). తల్పము, శయ్య, పరుపు
3. స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది. ఆ అంబరములంటే తనకు చాలా ఇష్ట ం. పుట్టినరోజున కొత్త వస్త్రా లు
ధరించింది.
జ). వసనములు, అంబరములు, వస్త్రా లు
4. ప్రతి ప్రా ణికి ఉదకం అవసరం. సలిలము లేనిదే మనుగడ లేదు. కావున జలమును వృధా చేయకూడదు.
జ). ఉదకం, సలిలం, జలం

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 37

5. తామర పత్రం నీటి బిందువులతో మెరుస్తు ంది. అందువల్ల ఆ దళం మరింత అందంగా కన్పిస్తు ంది.
ఆ ఆకుతో పూల పొ ట్ల ం కడతారు.
జ). పత్రం, దళం, ఆకు
ఇ). కింది పదాలకు సరియైన నానార్థా లను గుర్తించి రాయండి.
1. విభుడు ( ఆ ) అ). పండు, కార్యం, పరిణామం
2. కను ( ఇ ) ఆ). ప్రభువు, శివుడు, బ్రహ్మ
3. దళం ( ఈ ) ఇ). చూచు, వెదకు, జన్మనిచ్చు
4. ఫలం ( అ ) ఈ). ఆకు, భాగం, దండు
ఈ). కింది పదాలకు సరైన వ్యుత్పత్త ్యర్థా లను గుర్తించి రాయండి.
1. గురువు ( ఉ ) అ). మరణం లేనిది. (సుధ)
2. మిత్రు డు ( ఇ ) ఆ). గృహాన్ని ధరించేది. (ఇల్లా లు)
3. మోక్షం ( ఈ ) ఇ). సర్వభూతాల పట్ల స్నేహభావం గలవాడు. (సూర్యుడు)
4. పురంధ్రి ( ఆ ) ఈ). జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. (ముక్తి)
5. అమృతం ( అ ) ఉ). అజ్ఞా నమనే అంధకారమును చేదించువాడు. (ఉపాధ్యాయుడు)
ఉ). కింది పదాలను వివరించి రాయండి.
1. బ్రహ్మానందం : మాటల్లో చెప్పలేనంత ఆనందం అని అర్థం. మనం ఊహించిన దానికంటే అధిక ఆనందం
కలిగిన సందర్భంలో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు.
2. చక్రపాణి : చక్రము పాణి (చేయి) యందు గలవాడు అనే అర్థంలో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు. అనగా
విష్ణు మూర్తిని తెలియజేసే పదంగా ఈ చక్రపాణి అనే పదం వాడుకలో ఉంది.
3. కుంభవృష్టి : కుండపో తగా వర్షం కురవడం, ఎక్కువగా వర్షం కురవడం అనే అర్థా లలో ఈ పదబంధాన్ని
ఉపయోగిస్తా రు.
4. తళతళలాడు : ఎక్కువగా మెరుపు కలిగి ఉండటం, కళ్ళు మిరిమిట్లు గొలిపేలా మెరవడం అనే అర్థా లలో
ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు.
5. ప్రచండ వాయువు : గాలి బాగా ఎక్కువగా, భయంకరంగా వీస్తు న్నది అని తెలియజేయడానికి
ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు.
ఊ). కింది వాక్యాలలో గల ప్రకృతి, వికృతులను గుర్తించి రాయండి.
1. హనుమంతుడు కార్యముకై రాముని దగ్గ రకు వెళ్ళెను. ఆ కర్జమును సాధించుకొని వచ్చెను.
జ). కార్యము (ప్రకృతి) - కర్జము (వికృతి)
2. రాజ గృహము బంగారు మయం. ఆ గీము సూర్య కాంతులతో మెరుస్తు న్నది.
జ). గృహము (ప్రకృతి) - గీము (వికృతి)
3. పెద్దల పట్ల గౌరవం కలిగివుండాలి. వారిని గారవించడం మన సంప్రదాయం.
జ). గౌరవం (ప్రకృతి) - గారవం (వికృతి)
4. రాముడు ధర్మం కలవాడు. ఆ దమ్మమే అతనిని కాపాడింది.
జ). ధర్మం (ప్రకృతి) - దమ్మం (వికృతి)
5. లక్ష్మి అంటే సంపద. ఆ లచ్చితో మన కష్టా లు తీరుతాయి.
జ). లక్ష్మి (ప్రకృతి) - లచ్చి (వికృతి)

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు:

అ). లు,ల,న,ల సంధి ఆధారంగా కింది పదాలను విడదీసి రాయండి.


1. వజ్రా లు = వజ్రము + లు
2. దేశాలు = దేశము + లు
3. పుస్త కాన = పుస్త కము + న
4. సమయాన = సమయము + న
5. అందాలు = అందము + లు
ఆ). కింది పదాలు కలిపిరాసి సంధి పేరు రాయండి.
1. నిత్య + ఆనందం = నిత్యానందం = సవర్ణ దీరస ్ఘ ంధి
2. వైభవ + ఉన్నతి = వైభవోన్నతి = గుణసంధి

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 38

3. అతి + అంత = అత్యంత = యణాదేశసంధి


4. కానుక + ఏమైన =కానుకేమైన = అత్వసంధి

💥సమాసములు :
5. చెప్పిన + అట్లు = చెప్పినట్లు = అత్వసంధి

అ). కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.


1. ఉత్త మ పురుషుడు : ఉత్త ముడైన పురుషుడు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. ద్వారకా నగరం : ద్వారక అనే పేరు గల నగరం - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
3. భార్యాభర్త లు : భార్యయును, భర్త యును - ద్వంద్వ సమాసం
4. ఫలపుష్పాలు : ఫలమును, పుష్పమును - ద్వంద్వ సమాసం
5. నలుదిక్కులు :నాలుగు సంఖ్య గల దిక్కులు - ద్విగు సమాసం

💥అలంకారాలు :
👉ఛేకానుప్రా సాలంకారం : శబ్దా లంకారాలలో ఛేకానుప్రా సాలంకారం ఒకటి. దీని గురించి తెలుసుకుందాం.
కింది ఉదాహరణను పరిశీలించండి.
1. విచారింపని పని చేయరాదు.
పై ఉదాహరణను పరిశీలిస్తే "పని" అనే పదం వాక్యంలో అర్ధ భేదంతో పునరుక్త మయ్యింది. మొదటి "పని"
అనే పదం 'విచారింపని' లోని పదభాగం. రెండవ "పని" అనే పదం "కార్యం" అనే అర్థా న్నిస్తు ంది. కాబట్టి ఇది
ఛేకానుప్రా సము.
*లక్షణం : పద్యపాదం లేక వాక్యంలో అర్ధ భేదం కలిగిన హల్లు ల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్ల యితే దానిని
"ఛేకానుప్రా సాలంకారం" అంటారు.
*సమన్వయం : పై వాక్యంలో "పని - పని" అనే పదం (హల్లు ల జంట) అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది.

👉
అందువల్ల ఇది ఛేకానుప్రా సాలంకారం.
లాటానుప్రా సాలంకారం : లాటానుప్రా సాలంకారం కూడా శబ్దా లంకారమే. కింది ఉదాహరణ ద్వారా
తెలుసుకుందాం.
1. కమలాక్షు నర్చించు కరములు కరములు.
పై పద్య పాదంలో 'కరములు' అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది.
ఇక్కడ 'కరములు' అంటే చేతులు అని అర్థం. వాక్యంలో 'కరములు కరములు' అని వెంటవెంటనే ప్రయోగించడం వల్ల
"ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలినవేవి చేతులు కావు" అనే తాత్పర్య భేదాన్నిస్తు న్నది. కావున ఇది
లాటానుప్రా సాలంకారం.
*లక్షణం : పద్య పాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థ భేదం లేకుండా తాత్పర్య బేధం కలుగునట్లు వెంట
వెంటనే ప్రయోగిస్తే దానిని లాటానుప్రా సాలంకారం అంటారు.
అ). కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి, లక్షణం సమన్వయం చేయండి.
1. శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ.
జ). ఈ వాక్యంలో లాటానుప్రా సాలంకారం ఉన్నది.
*లక్షణం : పద్య పాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థ భేదం లేకుండా తాత్పర్య బేధం కలుగునట్లు వెంట
వెంటనే ప్రయోగిస్తే దానిని లాటానుప్రా సాలంకారం అంటారు.
*సమన్వయం :ఈ వాక్యములో ప్రయోగించిన "జిహ్వ" అనే పదానికి నాలుక అని అర్థం. అయితే ఇక్కడ
తాత్పర్యం చెప్పేటప్పుడు రెండవసారి ఉపయోగించిన "జిహ్వ" అనే పదానికి నిజమైన నాలుక అని
చెబుతున్నాము. అంటే ఇక్కడ "జిహ్వ" అనే పదానికి రెండుసార్లూ అర్థములో భేదము లేకపో యినప్పటికీ
తాత్పర్యములో భేదము ఉన్నది. కాబట్టి ఈ వాక్యంలో లాటానుప్రా సాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.
2. నీటిలో పడిన తేలు తేలుతుందా.
జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారం ఉన్నది.
**లక్షణం : పద్యపాదం లేక వాక్యంలో అర్ధ భేదం కలిగిన హల్లు ల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్ల యితే దానిని
"ఛేకానుప్రా సాలంకారం" అంటారు.
*సమన్వయం : ఈ వాక్యంలో మొదటి "తేలు" అనే హల్లు ల జంట "వృచ్చికం" అనే అర్థా న్నిస్తు ంది. రెండవ "తేలు"
అనే హల్లు ల జంట "తేలడం" అనే పదంలోని భాగం. ఇక్కడ "తేలు" అనే హల్లు ల జంట వాక్యంలో అర్ధ భేదంతో
పునరుక్త మయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 39

3. రామబాణం తగిలి వాలి వాలిపో యెను.


జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారం ఉన్నది.
**లక్షణం : పద్యపాదం లేక వాక్యంలో అర్ధ భేదం కలిగిన హల్లు ల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్ల యితే దానిని
"ఛేకానుప్రా సాలంకారం" అంటారు.
*సమన్వయం : ఈ వాక్యంలో మొదటి "వాలి" అనే హల్లు ల జంట "వానర రాజు వాలి" అనే అర్థా న్నిస్తు ంది. రెండవ
"వాలి" అనే హల్లు ల జంట "వాలిపో యెను" అనే పదంలోని భాగం. ఇక్కడ "వాలి" అనే హల్లు ల జంట వాక్యంలో అర్ధ
భేదంతో పునరుక్త మయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.
4. కందర్ప దర్పములకు సుందర దరహాసములు.
జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారం ఉన్నది.
**లక్షణం : పద్యపాదం లేక వాక్యంలో అర్ధ భేదం కలిగిన హల్లు ల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్ల యితే దానిని
"ఛేకానుప్రా సాలంకారం" అంటారు.
*సమన్వయం : ఈ వాక్యంలో మొదటి "దర" అనే హల్లు ల జంట "సుందర" అనే పదంలోని భాగం. రెండవ "దర" అనే
హల్లు ల జంట "దరహాసం" అనే పదంలోని భాగం. ఇక్కడ "దర" అనే హల్లు ల జంట వాక్యంలో అర్ధ భేదంతో
పునరుక్త మయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.

💥ఛందస్సు :
👉ఆటవెలది పద్య లక్షణాలు : ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. పద్య లక్షణాలను పరిశీలిద్దా ం.
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
2. 1వ, 3వ పాదాలు ఒక విధంగాను, 2వ, 4వ పాదాలు ఒక విధంగాను ఉంటాయి.
3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
4. 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి.
5. ప్రతిపాదంలో నాల్గ వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లు తుంది.
6. యతిలేని చోట ప్రా సయతి చెల్లు తుంది. 7. ప్రా స నియమం లేదు.
పై లక్షణాలను పరిశీలించినప్పుడు ఆటవెలది పద్యం ఇంద్రగణాలు, సూర్యగణాలచేత ఏర్పడుతుందని
తెలుస్తు ంది. వీటిని గురించి తెలుసుకుందాం.
*ఇంద్రగణాలు 6 - అవి : నల - నగ - సల - భ - ర - త
నలము - I I I I
నగము - I I I U
సలము - I I U I
భగణము - U I I
రగణము - U I U
తగణము - U U I
*సూర్యగణాలు 2 - అవి:
నగణము - I I I

👉
హగణము - U I
కింది ఉదాహరణ ద్వారా ఆటవెలది పద్య లక్షణాలను సమన్వయం చేద్దా ం.
I I I U I UI I I U I I I UI
1. బ్రతుక | వచ్చు | గాక | బహుబంద | నములైన
సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర

U I UI UI U I U I
వచ్చు | గాక | లేమి | వచ్చు | గాక
సూర్య సూర్య సూర్య సూర్య సూర్య

UI I I I UI I I UI I I I I
జీవ | ధనము | లైన | జెడుగాక | పడుగాక
సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 40

U I I I I UI U I I I I
మాట | దిరుగ | లేరు | మాన | ధనులు
సూర్య సూర్య సూర్య సూర్య సూర్య
*పై పద్యపాదాలను గణ విభజన చేయగా ఆటవెలది పద్య లక్షణాలను ఈ విధంగా సమన్వయం చేయవచ్చు.
* 1వ, 3వ పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు ఉండాలి. పై పద్య పాదాలలో అలాగే ఉన్నాయి.
2, 4 పాదాలలో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.ఆ
* ప్రతి పాదంలోని 1వ గణాద్యక్షరానికి - 4వ గణాద్యక్షరానికి యతి చెల్లు తుంది.
పై పద్యంలో…
1వ పాదంలో బ - బ లకు
2వ పాదంలో వ - వ లకు
3వ పాదంలో జీ - జె లకు

👉
4వ పాదంలో మా - మా లకు యతి చెల్లు తున్నది.
పాఠంలో ఉన్న ఆటవెలది పద్యాన్ని గణ విభజన చేస,ి లక్షణాలను సమన్వయం చేయండి.
1. సరస జేరి నిన్ను సంస్త వ మొనరించు ……………….. నిక్కమైన సఖుడు నీకు దలప

III UI UI U II I I U I
సరస | జేరి | నిన్ను | సంస్త వ | మొనరించు
న హ హ భ సల

UI UI I I I U I UI
వార | లెల్ల | సఖులు | గారు | నీకు
హ హ న హ హ

UI UI U I UI U U U I
కష్ట | కాల | మందు | గాచు వా | డొ క్కండె
హ హ హ ర త

UI UI I I I UI I II
నిక్క | మైన | సఖుడు | నీకు | దలప
హ హ న హ న
*సమన్వయం : ఈ పద్యంలో 1వ, 3వ పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు ఉన్నాయి. అలాగే
2వ, 4వ పాదాలలో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
* ప్రతి పాదంలో 1వ గణాద్యక్షరానికి - 4వ గణాద్యక్షరానికి (1వ పాదంలో స - స లకు, 2వ పాదంలో వా - గా లకు,
3వ పాదంలో క - గా లకు, 4వ పాదంలో ని - నీ లకు) యతి చెల్లి ంది.
2. మీరు మీరు కలిసి మిత్రు లౌటయ మాకు…………………యరయ సాధుజన సమాగమంబు

U I U I III UI U I I U I
మీరు | మీరు | కలిసి | మిత్రు లౌ | టయ మాకు
హ హ న ర సల

UI UI UI U I UI
జక్షు | రస్తి | భావ | చారి | తార్థ్య
హ హ హ హ హ

I I I UI U I UI I U U I
మఖిల | సృష్టి | సార | మైనది | యొక్కండె
న హ హ భ త
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 41

I I I U I I I I U I U I
యరయ | సాధు | జన స | మాగ | మంబు
న హ న హ హ
*సమన్వయం : ఈ పద్యంలో 1వ, 3వ పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు ఉన్నాయి. అలాగే 2,
4 పాదాలలో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
* ప్రతి పాదంలో 1వ గణాద్యక్షరానికి - 4వ గణాద్యక్షరానికి (1వ పాదంలో మీ - మి లకు, 2వ పాదంలో జ - చా లకు,
3వ పాదంలో మ - మై లకు, 4వ పాదంలో య - మా లకు) యతి చెల్లి ంది.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 42

6.తీర్పు
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. ఆకాశంలో సంచరిస్తు న్న హంసల గుంపును కవి ఎలా వర్ణించాడో చెప్పండి.
జ). ఒకరోజు రాజకుమారులైన సిద్ధా ర్థు డు, దేవదత్తు డు వన విహారానికి వెళ్ళారు. వారికి ఆకాశవీథిలో
అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే
ఆకాశవీథి ల్లో గొప్ప రసార్ధ్ర భావంతో సంచారం చేస్తు న్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ
ఉన్నాయని కవి హంసల గుంపును మనోహరంగా వర్ణించాడు.
2. హంస ఎలా గాయపడింది?
జ). ఆకాశంలో సంచరిస్తు న్న హంసల గుంపును దేవదత్తు డు చూశాడు. హింసా ప్రవృత్తి తో ఒక పదునైన
బాణాన్ని ఆ హంసల గుంపుపై వదిలాడు. ఆ బాణం ఆ గుంపులోని ఒక హంసకు తగలడంతో అది గాయపడింది.
3. దేవదత్తు డు, గౌతములలో మీకు ఎవరి పాత్ర నచ్చింది? ఎందుకో చెప్పండి.
జ). దేవదత్తు డు, గౌతములలో నాకు గౌతముని పాత్ర బాగా నచ్చింది. ఆకాశంలో ఎగురుతున్న హంసల
గుంపును చూడగానే దేవదత్తు డు ఆ గుంపుపై క్రూ రమైన బాణం వదిలాడు. ఆ బాణం తగిలి గుంపులోని ఒక హంస
గాయపడింది. గాయపడిన హంసను గౌతముడు దయతో తన ఒడిలోకి తీసుకున్నాడు. దానిని బుజ్జ గించి, ప్రేమతో
లాలన చేస,ి దాని దిగులు పో గొట్టా డు. అందుకే హింసా ప్రవృత్తి కలిగిన దేవదత్తు ని కంటే దయాగుణం కలిగిన
గౌతముని పాత్ర నాకు బాగా నచ్చింది.
ఆ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం ఎంతోమందికి మానసిక ఆనందాన్ని, చక్కటి విందును ఇస్తు ంది.
•••••••••••••••• ఆ ధీశాలి ఎవరో కాదు, అనితర సాధ్యమైన పో రాటంతో ఎన్నో దురాచారాలు రూపుమాపిన
సంఘసంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్.
@ప్రశ్నలు :
1. జంతుబలిని అడ్డు కొని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి ఎవరు?
జ). జంతుబలిని అడ్డు కొని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి 'రాజా రామ్ మోహన్ రాయ్'.
2. పై పేరాలో మాట్లా డడం అని అర్థం వచ్చే పదం ఏది?
జ). పై పేరాలో 'ప్రసంగించడం' అనే పదం మాట్లా డడం అనే అర్థా న్నిస్తు ంది.
3. 'విస్తు పో వడం' అనే పదాన్ని ఉపయోగించి సొ ంతవాక్యం రాయండి.
జ). మా అన్నయ్య దొ ంగతనాలు చేస్తు న్నాడనే విషయం తెలిసి మా అమ్మ విస్తు పో యింది.
4. ఆజ్ఞా పించడం అంటే ( ఆ )
అ). ప్రా ర్థించడం ఆ). ఆదేశించడం ఇ). శిక్షించడం ఈ). రక్షించడం
5. పై పేరాకు శీర్షిక రాయండి.
జ). అనితర సాధ్యుడు రాజా రామ్ మోహన్ రాయ్.
ఇ). కింది అపరిచిత గద్యం చదవండి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సభక్త జిన్ పాదుషా మొదట్లో చాలా బీదవాడు. •••••••••••• తదనంతర కాలంలో అతను చక్రవర్తి అయ్యి
గొప్ప కీర్తి ప్రతిష్ఠ లు సంపాదించాడు.
@ప్రశ్నలు :
1. సభక్త జిన్ ఎలా జీవించేవాడు?
జ). సభక్త జిన్ మొదట్లో సిపాయిగా జీవించేవాడు.
2. సభక్త జిన్ తన గుర్రం వెంట పరిగెత్తి వస్తు న్న తల్లి జింకను చూచి ఏమనుకున్నాడు?
జ). దొ రికిపో తానని తెలిసి కూడా పిల్ల కోసం తల్లి జింక పరిగెత్తి రావడాన్ని చూసి సభక్త జిన్ జాలి పడ్డా డు.
3. 'గాలించడం' అంటే అర్థం ఏమిటి?
జ). గాలించడం అంటే వెతకడం అని అర్థం.
4. పై పేరా నుంచి ఏదైనా ఒక ఆలోచనాత్మక ప్రశ్నను రాయండి.
జ). ఏ సన్నివేశం సభక్త జిన్ ను దయాళువుగా మార్చింది?
5. 'హృదయం కరగడం' ఉపయోగించి ఒక సొ ంతవాక్యం రాయండి.
జ). ఆకలితో బాధపడే పేదలను చూసినప్పుడు నా హృదయం కరిగిపో తుంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 43

II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :


అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
1. గౌతముడు, దేవదత్తు ని మధ్య హంస గురించి జరిగిన సంవాదాన్ని రాయండి.
జ). ఆకాశంలో సంచరిస్తు న్న హంసల గుంపుపై దేవదత్తు డు బాణం వదిలాడు. ఆ బాణం తగిలి ఆ గుంపులోని
ఒక హంస గాయపడి, గౌతముని కాళ్ళ దగర పడిపో యింది. గౌతముడు దానిని ఒళ్ళో కూర్చోబెట్టు కొని, బుజ్జ గించి
ప్రేమతో లాలించాడు. హంసను నేను పడగొట్టా ను కాబట్టి అది నాది అని దేవదత్తు డు, నేను రక్షించాను కాబట్టి అది
నాది అని గౌతముడు వారిలోవారు తగవులాడుకున్నారు.
2. హంస గౌతమునిదే అని నిర్ధా రణ ఎలా జరిగిందో మీ సొ ంతమాటల్లో రాయండి.
జ). హంస ఎవరికి చెందుతుందో తేల్చుకోలేక గౌతమ దేవదత్తు లిద్ద రూ దానిని తీసుకుని రాజసభకు
వెళ్ళారు. న్యాయాధికారి హంసను సభామధ్యంలో ఒక రత్నపీఠంపై ఉంచి ఇద్ద రినీ వచ్చి దానిని పిలవమన్నాడు.
హంస ఎవరి చేతులపై వాలితే వారిదవుతుందని తీర్పు చెప్పాడు. దేవదత్తు డు గంభీర స్వరంతో 'ఖగమా ఇటురా!'
అని పిలిచాడు. ఆ పిలుపు విని హంస భయంతో కుంగిపో యింది. గౌతముడు 'చెల్లి రావె, పాలవెల్లి రావె, హంసతల్లి
రావె' అంటూ ప్రేమగా పిలిచాడు. వెంటనే ఆ హంస రివ్వున ఎగిరి గౌతముని చేతిపై వాలింది. న్యాయాధికారి చెప్పిన
తీర్పు ప్రకారం హంస గౌతమునిదే అని నిర్ధా రణ అయ్యింది.
3. గౌతముడు హంసకు చేసిన సపర్యల గురించి రాయండి.
జ). గాయపడిన హంసను గౌతముడు ఎత్తు కొని తన ఒళ్ళో కూర్చోబెట్టు కున్నాడు. దాని రెక్కలు దువ్వి, వీపు
సవరించి, చెక్కిళ్ళు చక్కదిద్దా డు. శరీరాన్ని తడిమి, ప్రేమపూర్వకమైన మాటలు మాట్లా డాడు. దాని దిగులును
పో గొట్టి, బుజ్జ గించి ప్రేమపూర్వకంగా లాలించాడు. ఈ విధంగా గౌతముడు హంసకు సపర్యలు చేశాడు.
4. 'తీర్పు' పాఠ్యభాగ కవిని గురించి రాయండి.
జ). తీర్పు పాఠ్యాంశాన్ని రాసిన కవి జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు. వీరు కరుణశ్రీ అనే కలం పేరుతో
సుపరిచితులు. 1912లో గుంటూరు జిల్లా కొప్పర్రు లో జన్మించారు. గుంటూరు ఏ.సి కాలేజీలో అధ్యాపకులుగా
పనిచేశారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగుబాల శతకం వంటి 76 గ్రంథాలు రచించారు. ఆరుద్ర, పుట్ట పర్తి
నారాయణాచార్యులకు సమకాలికులు. 1992వ సంవత్సరంలో మరణించారు.
5. తీర్పు పాఠ్యభాగ ప్రక్రియ గురించి రాయండి./ఖండకావ్య ప్రక్రియ గురించి రాయండి.
జ). చిన్నకథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. దీనిలో వ్యర్థపదాలకు వర్ణ నలకు
అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని రసవత్త రమైన ఘట్టా లను, పాత్రలను,చారితక ్ర , దేశభక్తి సన్నివేశాలు
మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తా లలో ఛందో బద్ధ ంగా
ఉంటాయి.
6. తీర్పు పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జ). ఒకరోజు రాజకుమారులైన సిద్ధా ర్థు డు, దేవదత్తు డు వన విహారానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక
హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశమార్గ ంలో పయనిస్తు ంది. ఆ దృశ్యాన్ని చూసి సిద్ధా ర్థు డు ఆనందించాడు.
దేవదత్తు డు బాణం సంధించి ఆ గుంపులోని ఒక హంసను నేలకూల్చాడు. దీన్ని చూసిన సిద్ధా ర్థు డు మిక్కిలి వ్యథ
చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్ద రి మధ్య వాదానికి దారి తీసింది. న్యాయం కోసం రాజాస్థా నానికి వెళ్ళారు.
చివరకు హంస ఇద్ద రిలో ఎవరికి చెందుతుందో తీర్పు చెప్పడమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. దేవదత్తు డు, సిద్ధా ర్థు డు హంసను పిలిచిన మాట తీరులోని వ్యత్యాసాన్ని, ఫలితాన్ని సొ ంతమాటల్లో
వ్యక్తీకరించండి.
జ). హంస ఎవరికి చెందుతుందో తేల్చుకోలేక సిద్ధా ర్థ దేవదత్తు లిద్ద రూ దానిని తీసుకుని శుద్ధోదన మహారాజు
సభకు వెళ్ళారు. న్యాయాధికారి హంసను సభామధ్యంలో ఒక రత్నపీఠంపై ఉంచి ఇద్ద రినీ ఒక్కొకరుగా వచ్చి, చేతులు
చాచి దానిని పిలవమన్నాడు. హంస ఎవరి చేతులపై వాలితే వారిదవుతుందని తీర్పు చెప్పాడు. ముందుగా
దేవదత్తు డు కరుకు చేతులతో, గట్టి స్వరంతో, భ్రమించిన మనస్సుతో 'ఖగమా ఇటురా! ఇటురా!' అని గంభీరంగా
పిలిచాడు. ఆ పిలుపు ఫలితంగా హంస భయంతో వెనక్కు తగ్గి కుంగిపో యింది.
ఆ తరువాత సిద్ధా ర్థు డు చేతులు చాచి 'చెల్లి రావె, మంచి మల్లిరావె, కల్పవల్లి రావె, పాలవెల్లి రావె,
చిక్కదనమున్న జాబిల్లి రావె,హంసతల్లి రావె' అంటూ ప్రేమగా పిలిచాడు. ఫలితంగా ఆ హంస రివ్వున ఎగిరి వచ్చి
గౌతముని చేతిపై వాలింది. సభలోని వారందరూ జయజయ ధ్వానాలు చేశారు. న్యాయాధికారి చెప్పిన తీర్పు ప్రకారం
హంస గౌతమునికే దక్కింది..

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 44

2. ఈ కథలో నీకు ఎవరి పాత్ర నచ్చింది?. ఎందుకో రాయండి.


జ). 'తీర్పు' కథలో నాకు గౌతముని(సిద్ధా ర్థు ని) పాత్ర బాగా నచ్చింది. ఆకాశంలో సంచరిస్తు న్న హంసల
గుంపును చూడగానే సిద్ధా ర్థు ని కన్నులలో ఆనందం పొ ంగి తన్మయత్వం పొ ందాడు. ఇంతలో దేవదత్తు డు ఆ హంసల
గుంపుపై, పదునైన బాణాన్ని వదిలాడు. బాణం తగిలి ఒక హంస నేలపై పడి గిజగిజలాడుతుంటే సిద్ధా ర్థు డు దానిని
ఎత్తు కొని తన ఒళ్ళో కూర్చోబెట్టు కున్నాడు.
దాని రెక్కలు దువ్వి,వీపు సవరించి,పాదాలు,చెక్కిళ్ళు చక్కదిద్ది,శరీరాన్ని తడిమి,ప్రేమపూర్వకంగా
మాట్లా డి,దిగులు పో గొట్టి,బుజ్జ గించి ప్రేమతో లాలించాడు. రాజసభలో న్యాయాధికారి తీర్పు చెబుతూ హంసను
పిలవమన్నప్పుడు కూడా సిద్ధా ర్థు డు ఆ హంసను 'చెల్లి రావె, మంచి మల్లిరావె ,హంసతల్లి రావె' అంటూ ప్రేమగా
పిలిచాడు. ఈ సంఘటనలను బట్టి సకల జీవులపట్ల దయాగుణం గల సిద్ధా ర్థు ని పాత్ర నాకు బాగా నచ్చింది.
3. ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు, దేవదత్తు ల సంభాషణను రాయండి.
జ). గౌతముడు : దేవదత్తా ..! ఆకాశంలో బారులుతీరి ఎగురుతున్న హంసలను చూడు. ఎంత అందంగా
ఉన్నాయో కదా!
దేవదత్తు డు: అవును సిద్ధా ర్థా !చాలా అందంగా ఉన్నాయి.(మనసులో హింసాప్రవృత్తి రేగి దేవదత్తు డు పదునైన
బాణంతో ఆ గుంపులోని ఒక హంసను గాయపరిచాడు. అది విలవిల్లా డుతూ గౌతముని పాదాల
వద్ద పడింది) గౌతముడు : అయ్యో! దేవదత్తా ! ఎంతపని చేసావు. నీకు ఏ అపకారము చేయని
ఈ హంసను నిష్కారణంగా గాయపరిచావే! ఇదేనా క్షత్రియధర్మం?(అంటూ గౌతముడు గాయపడిన
హంసకు సపర్యలు చేశాడు)
దేవదత్తు డు : ఓ రాజకుమారా! ఈ హంస నా భుజశక్తికి ఫలితం. కాబట్టి ఈ హంస మాంసం నాకే చెందుతుంది.
గౌతముడు : అదేం కుదరదు. ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిలలాడుతావు. అలాంటిది ఆకాశమార్గ ంలో వెళ్ళే
రాజహంసపై నీ రాక్షసబుద్ధి తగునా? అనవసరంగా జీవులకు బాధలు కలిగించే పనులు మానుకో.
దేవదత్తు డు : ఓ రాజపుత్రా ! అనవసరపు మాటలుమాని నేను కూల్చిన హంసను దాచకుండా నాకుయివ్వు.
గౌతముడు : నేనివ్వను. ఈ హంసను నేను రక్షించాను కాబట్టి ఇది నాకే చెందుతుంది.
దేవదత్తు డు : అలా కుదరదు. ఈ హంసను నేను కూల్చాను కాబట్టి ఇది నాకే చెందుతుంది.
గౌతముడు : మనమధ్య ఈ తగువు తేలదు గానీ, ఈ హంసను తీసుకువెళ్ళి శుధ్ధోదన మహారాజు కొలువులోనే
న్యాయం తేల్చుకుందాం. సరేనా?
దేవదత్తు డు : సరే! అక్కడైతేనే న్యాయం తేలుతుంది. పద వెళ్దా ం. (ఇద్ద రూ న్యాయం కోసం మహారాజు
కొలువుకు వెళ్తా రు)
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాలు చదివి, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, వాటిని ఉపయోగించి సొ ంతవాక్యాలు
రాయండి.
1. పిల్లలు తల్లి అంకమునందు ఆడుకుంటారు.
జ). అంకము = ఒడి
*అమ్మ ఒడి పిల్లలకు తొలిబడి.
2. పక్షులు వినుత్రో వలలో విహరిస్తా యి.
జ). వినుత్రో వ = ఆకాశ మార్గ ము
*ఆకాశ మార్గ ంలో యుధ్ధ విమానాలు విన్యాసాలు చేస్తు న్నాయి.
3. ఉదయిస్తు న్న సూర్యుడు గగనకాంత ఆస్య సిందూర తిలకంలా ఉన్నాడు.
జ). ఆస్యము = ముఖము
*నేను ఉదయానే నిద్రలేచిన వెంటనే మా అమ్మ ముఖము చూస్తా ను.
4. మరాళము మానస సరోవరంలో విరిసిన తెల్లకలువలా ఉన్నది.
జ). మరాళము = హంస
*సరస్వతీదేవి హంస వాహనంపై విహరిస్తు ంది.
5. బాధితుల కళ్ళల్లో బాష్పములు జలజలా రాలుతాయి.
జ). బాష్పములు = కన్నీళ్ళు
*పేదల కష్టా న్ని చూస్తే నాకు కన్నీళ్ళు ఆగవు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 45

ఆ). కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు గుర్తించి రాయండి.
1. ఆకాశంలో మేఘాలు ఆవరించినపుడు గగనం నల్ల గా మారుతుంది.
జ). అంబరము = ఆకాశము, గగనము
2. వేటగాళ్ల కు బాణాలు తయారు చేయడం, అమ్ములు సంధించడం తెలుసు.
జ). శరం = బాణం, అమ్ము
3. సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయలలూగుతున్నాయి.
జ). సరోవరం = సరస్సు, తటాకం
4. సజ్జ నుల మాటలు అమృతతుల్యాలు. వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి.
జ). వాక్కులు = మాటలు, పలుకులు
5. చేతులు భూషణాలకు మాత్రమే కాదు, హస్తా లు శ్రమించడానికి కూడా ఉపకరిస్తా యి.
జ). కరములు = చేతులు, హస్తా లు
ఇ). కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థా లను గుర్తించి రాయండి.
1. లక్ష్మీ ఉన్న ఇంట సంపదకు కొరత ఉండదు.
జ). శ్రీ = లక్ష్మి, సంపద
2. బాణము తగిలి పక్షి గాయపడింది.
జ). ఖగము = పక్షి, బాణము
3. చైతమ ్ర ాసంలో తేనె విస్తా రంగా దొ రుకుతుంది.
జ). మధు = తేన,ె చైతమ ్ర ు
4. ఆ పాత్రలలో నెయ్యి, నీరు నిండుగా ఉన్నాయి.
జ). ఘృతము = నెయ్యి, నీరు
5. పర్వత సానువులపై చంద్రు డు వెన్నెల కురిపిస్తు న్నాడు.
జ). సో మ = చంద్రు డు, పర్వతం
ఈ). ఈ కింది పదాలకు ప్రకృతి - వికృతి పదాలను రాయండి.
ప్రకృతి - వికృతి
1. లక్ష్మీ లక్ష్మి - లచ్చి
2. హంస హంస - అంచ
3. నాయము న్యాయము - నాయము
4. రతనము రత్నము - రతనము
5. అంకము అంకము - అంకె
6. భీతి భీతి - బీతి
7. త్రో వ త్రో వ - తోవ
8. పేనము ప్రా ణము - పేనము/పానము
9. రాక్షసి రాక్షసి - రక్కసి
10. సంతసము సంతోషం - సంతసం

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

అ). కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.


ఉదా : వీధులందు = వీధులు + అందు = ఉత్వసంధి
1. కవీంద్రు డు = కవి + ఇంద్రు డు = సవర్ణ దీర్ఘ సంధి
2. మునీంద్రు డు = ముని + ఇంద్రు డు = సవర్ణ దీర్ఘ సంధి
3. భావాంబరము = భావ + అంబరము = సవర్ణ దీర్ఘ సంధి
4. ప్రేమాంకము = ప్రేమ + అంకము = సవర్ణ దీర్ఘ సంధి

💥సమాసాలు :
5. పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు = గుణసంధి

అ). వాక్యంలో సమాస పదాలు గుర్తించడం ఎలా?


"అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడం సమాసం. ఒక వాక్యంలోని పదాలను నిశితంగా
పరిశీలిస్తే రెండు పదాలు కలిసున్న పదం గుర్తించగలం. గుర్తించిన పదాల్ని విడివిడిగా రాయాలనుకుంటే ఆ పదం

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 46

ముందో , వెనుకో, మధ్యనో ఒక కారకం (ప్రత్యయాలు, విశేషణాలు, ఉపమానాలు, సంఖ్యలు, వ్యతిరేకార్థకాలు)


వస్తు ంది. కారకాన్ని బట్టి అది ఏ సమాసమో గుర్తించగలం.
ఉదాహరణకు - రాజసభ నిండుగా ఉన్నది.
1. రాజసభ - ఇందులో రాజ, సభ అనే పదాలు ఉన్నాయి. ఇవి రెండూ కలిసి రాజసభ అయింది.
ఇది సమాస పదం.
*రాజసభ అంటే రాజుయొక్క సభ - యొక్క అనే ప్రత్యయం షష్ఠీ విభక్తికి చెందుతుంది. కాబట్టి ఇది షష్ఠీ

👉
తత్పురుష సమాసం అవుతుంది.
కింది వాక్యాలలో సమాసపదాలు, సమాసపదాలు కానివి గుర్తించండి.
వాక్యం సమాసంకాని పదాలు సమాస పదాలు

1. ఆకాశంలో కలహంస ఎగురుతున్నది. ఆకాశం, ఎగురుతున్నది కలహంస


2. పిల్లలు చిరునవ్వులు చిందిస్తా రు. పిల్లలు, చిందిస్తా రు చిరునవ్వులు
3. అక్కడి సభాసదులు సంతసించారు. అక్కడి, సంతసించారు సభాసదులు
4. వాడు రక్కసిబుద్ధి కలవాడు. వాడు, కలవాడు రక్కసిబుద్ధి
5. కవులు కావ్యసంపద ఇచ్చారు. కవులు, ఇచ్చారు కావ్యసంపద
ఆ). కింది వాక్యాలలోని ఎరుపు రంగులో ఉన్న పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి.
ఉదా : సమస్త జీవులకు గాలి అవసరం.
జ). సమస్త జీవులు - సమస్త మైన జీవులు - విశేషణ పూర్వపద కర్మధారయం
1. పక్షులు అంబరవీథిలో సంచరిస్తా యి.
జ). అంబరవీథి : అంబరము నందలి వీథి - సప్త మీ తత్పురుష సమాసం
2. సరస్సులో మంజుల మరాళము ఉన్నది.
జ). మంజుల మరాళము : మంజులమైన మరాళము - విశేషణ పూర్వపద కర్మధారయం
3. మహాకవులు కావ్యాలు రచించారు.
జ). మహాకవులు : గొప్పవారైన కవులు - విశేషణ పూర్వపద కర్మధారయం
4. పక్షులు వేటగాళ్ల బాణహతికి చనిపో తూ ఉంటాయి.
జ). బాణహతి : బాణము యొక్క హతి - షష్ఠీ తత్పురుష సమాసం.
5. దేవదత్త శౌద్ధోదనులు స్నేహితులు.

💥అలంకారాలు :
జ). దేవదత్త శౌద్ధోదనులు : దేవదత్తు డును, శుద్ధోదనుడును - ద్వంద్వ సమాసం

అ). కింది ఉదాహరణలు గమనించండి.


1. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావకాశంలో సంచరించే సరస్వతీ పాద
లాస్యంలా ఉంది.
2. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చల్ల ని చంద్రు డు సముద్రంలో పడడంలా ఉంది.
3. బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రు డు చిక్కడంలా ఉంది.

💥
*పై ఉదాహరణలలో ఉపమాన, ఉపమేయాలను పో ల్చడం వల్ల ఉపమాలంకారం అవుతుంది.

👉
పాఠ్య భాగంలోని 2, 6, 8, 22 పద్యాలలోని అలంకారాలను గుర్తించి లక్షణ సమన్వయం చేయండి.
2వ పద్యం : “క్రొ ందలిరాకు సౌరు గయికొన్న…….. తన్మయితా నిమగ్నముల్”
జ). ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నది.
*రూపకాలంకారం లక్షణం : ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు గా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యంలో 3వ పాదంలో ఉపమేయమైన మానసమునకు, ఉపమానమైన అంబుజమునకు

👉
(కలువకు) భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
6వ పద్యం : "రెక్కలు దువ్వి, వీపు సవరించి………. గౌతమ కుమారుడు లాలన సేసె హంసమున్"
జ). ఈ పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
*స్వభావోక్తి అలంకారం లక్షణం : జాతి, గుణ, క్రియాదుల చేత ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి
చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారమంటారు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 47

*సమన్వయం : ఈ పద్యంలో గౌతముడు గాయపడిన హంసకు సపర్యలు చేయడం గురించి చెప్పారు. ఇక్కడ
కరుణామూర్తియైన గౌతముడు హంస రెక్కలు దువ్వడం, వీపు సవరించడం, ప్రేమగా మాట్లా డడం వంటి పనులన్నీ

👉
ఉన్నవి ఉన్నట్లు గా వర్ణించి చెప్పబడ్డా యి. కాబట్టి ఈ పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
8వ పద్యం : "ఎక్కడనో జనించి, పరమేశ్వరుడిచ్చిన……. శరాగ్ను లోర్చునే?"
జ). ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నది.
*రూపకాలంకారం లక్షణం : ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు గా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యంలో 4వ పాదంలో ఉపమేయమైన శరమునకు (బాణానికి), ఉపమానమైన అగ్నికి భేదం

👉
లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
22వ పద్యం : "చెల్లి రావె! మంచిమల్లి రావె……… అంచతల్లి రావె!"
జ). ఈ పద్యంలో వృత్త ్యనుప్రా స అలంకారం ఉన్నది.
*వృత్త ్యనుప్రా స అలంకారం లక్షణం : వాక్యంలో గాని, పద్యంలో గాని, పద్యపాదంలో గాని ఒకే హల్లు అనేకసార్లు
రావడాన్ని వృత్త ్యనుప్రా స అలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యంలో “ల్లి” అనే హల్లు (ద్విత్వ హల్లు ) అనేకసార్లు వచ్చింది. కాబట్టి ఈ పద్యంలో వృత్త ్యనుప్రా స

💥ఛందస్సు :
అలంకారం ఉన్నదని చెప్పవచ్చు

కింది పద్య పాదాలకు గణవిభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి. పద్య లక్షణాలు రాయండి.
U I I UI U I I I U I I U I I U IU I U
1. ఈయది | శాస్త ్ర ధ | ర్మ మొక | యింత స | హించిన | లోక ధ | ర్మమిం
భ ర న భ భ ర వ
*ఇది ఉత్పలమాల పద్య పాదము.
*ఉత్పలమాల పద్య లక్షణాలు :
i). ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
ii). ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వస్తా యి.
iii). ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
iv). ప్రతి పాదంలోనూ 1 - 10 అక్షరాలకు యతి చెల్లు తుంది.
v). ప్రా స నియమం కలదు.
*సమన్వయం : ఈ పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. పాదానికి మొత్త ం 20
అక్షరాలు ఉన్నాయి. 1 - 10 అక్షరాలకు (ఈ - యి) యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్యపాదం ఉత్పలమాల పద్యానికి
చెందినదని చెప్పవచ్చు.

I I I I U I U I I I UI I U I I U I UI U
2. గిలగి | ల మందు | వే యొరు | లు గిచ్చి | న కాలి | కి ముల్లు | గ్రు చ్చినన్
న జ భ జ జ జ ర
*ఇది చంపకమాల పద్యపాదము.
*చంపకమాల పద్య లక్షణాలు :
i). ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
ii). ప్రతి పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా వస్తా యి.
iii). ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి.
iv). ప్రతి పాదంలోనూ 1 - 11 అక్షరాలకు యతి చెల్లు తుంది.
v). ప్రా స నియమం కలదు.
*సమన్వయం : ఈ పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా వచ్చాయి. పాదానికి మొత్త ం 21
అక్షరాలు ఉన్నాయి. 1 - 11 అక్షరాలకు (గి - గి) యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్యపాదం చంపకమాల పద్యానికి
చెందినదని చెప్పవచ్చు.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 48

7. మాటమహిమ
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
1. పద్యాలను రాగయుక్త ంగా పాడండి.
జ). పద్యాలను ఉపాధ్యాయుడు రాగ, భావయుక్త ంగా పాడడం గమనించి, విద్యార్థు లు పాడటానికి
ప్రయత్నిస్తా రు.
2. పుకార్లు ఎలా వ్యాపిస్తా యో చెప్పండి.
జ). ఎక్కడో ఎవరో ఒక మహానుభావుడు ఉన్నవీ, లేనివీ కలిపి పుకార్ల ను పుట్టిస్తా డు. ఆ పుకార్లు పెద్ద
ఏనుగులా బలిసి, రాజసం ఉట్టిపడేలా నాలుగు దిక్కులకు వ్యాపిస్తా యి. అంటే ఎవరో ఎక్కడో పుట్టించిన పుకార్లు
నిజానిజాలతో పనిలేకుండా అతికొద్ది కాలంలోనే దిక్కుల చివరి వరకు వ్యాపిస్తా యి.
3. 'మచ్చలున్న నాలుక' గురించి కవయిత్రి ఏమని చెబుతున్నారు?
జ). మచ్చలున్న నాలుక ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లా డిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు
రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాట్లా డిన మాటలకు చక్కని సంసారాలు కూడా నాశనమైపో తాయి. మచ్చల
నాలుక చెప్పే చాడీలకు జుట్టు జుట్టు పట్టు కొనేదాకా తగాదాలు అవుతాయి.
4. నోటితో మాట్లా డుతూ నొసటితో వెక్కిరించడం అంటే ఏమిటి?
జ). ఈ లోకంలో నోటితో మాట్లా డుతూ, నొసటితో వెక్కిరించే కళాప్రవీణులు చాలామంది ఉంటారు. అంటే వాళ్లు
ఎదుటివారితో పైకి ప్రేమగా మాట్లా డుతున్నట్లు గా నటిస్తూ , మనసులో మాత్రం వారిపై చులకన భావంతో ఉంటారు.
వారు మాట్లా డే మాటల్లో వ్యంగ్యం ఉంటుంది. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
5. పువ్వు గుర్తు ఉన్న పద్యాలకు ప్రతిపదార్థా లు రాయండి.
i). “కనులార మంచిని కాంచుటకేనేమొ ………….. దీని యాంతర్య మేమొ.” (7వ పద్యం - సీస పద్యం)
జ). ప్రతిపదార్థం :
కనులార = కళ్ళతో తనివితీరా
మంచిని = మంచిని
కాంచుటకు + ఏన్+ఏమొ = చూడడానికే కాబో లు
కన్నుదో యి = రెండు కన్నులు
పన్నుగా = అందంగా
అమరెను = కూర్చబడ్డా యి
వీనులార = చెవులారా
సువార్త = మంచిమాట
వినుటకు + ఏ = వినడానికే
కాబో లు = కావచ్చు
శవ్రణయుగము = రెండు చెవులు
సమకూర్చబడియెను = చక్కగా ఏర్పాటుచేయబడ్డా యి
చేతులార = చేతులతో
సుకృతమ్ము = మంచి పనిని
చేయుటకు+ఔను+ఏమో = చేయడం కోసమే కాబో లు
నరులకు = మానవులకు
కర యుగళము = రెండు చేతులు
కలుగుట = ఉన్నాయి
అమలిన పథమున = సన్మార్గ ంలో
గమియించుటకె = నడవడానికే
లెమ్ము = కాబో లు
పద ద్వయంబు = రెండు పాదాలు
తనరారుచుండు = ఆత్రు తపడుతుంటాయి.
అన్ని + అంగాలు = అన్ని అవయవాలు
రెండు + ఏసి = రెండేసి చొప్పున ఉన్నాయి

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 49

అతిపధ్రా న = అత్యంత ముఖ్యమైన


రసనము + ఒకటి = నాలుక మాత్రం ఒకటే ఉంది
హిత పస్రరణకు = మంచిని ప్రచారం చేయడానికి
వలయు = అవసరమైన
పలుకు మాత్రము = మాటను మాత్రం
మితముగా = పరిమిత స్థా యిలోనే (అవసరానికి మించకుండా)
పలుకుము + అన్న = పలకాలనే
తగవు = విషయం
తెలుపుట = తెలియజేయడమే
దీని = దీని
ఆంతర్యము + ఏమొ = నిగూడార్థం కావచ్చు.
ii). “నోట మాటాడుచు నుదిటి తోడను …………… అక్కడే చేటువచ్చు.” (12వ పద్యం - సీస పద్యం)
జ). ప్రతిపదార్థం :
నోట మాటాడుచు = నోటితో మాట్లా డుతూ
నుదుటి తోడను = నొసటితో
వెక్కిరించు కళను = వెక్కిరించే నైపుణ్యాన్ని
రంగరించుకొనియె = అలవరుచుకుంటారు
క్రిందుగా గిల్లి = తొడభాగం పట్టు కుని గిల్లి (బాధపెట్టి)
పైకిని జోలపాడి = పైకి జోలపాడుతూ
వంచించుట = మోసగించుట
వంట జీర్ణించుకొనియె = వంట బట్టించుకుంటారు
చచ్చు వాడి = చావడానికి సిద్ధంగా ఉన్నవాని (బలహీనుని)
కనుల = కనులను
వేళులు = వేళ్ళతో
గ్రు చ్చి = పొ డిచి
కఠిన చర్యకు = క్రూ రమైన పనులు చేయడానికి
కంకణంబు దాల్చె = కంకణం కట్టు కుంటారు
గాలి మూటలు+కట్టి = అసత్యపు మాటలు కల్పించి
గోల పట్టించి = గోల చేసి (ప్రచారం చేస)ి
గోతులు తవ్వు పని = ఇబ్బంది పెట్టే పనిని
వెన్నతోడ నేర్చె = పుట్టు కతోనే నేర్చుకుంటారు
సృష్టికర్త = బ్రహ్మదేవుడు
ఊరక+ఉండక = (అంతటితో) ఊరుకోకుండా
తన లీల = తన మాయతో
కులాలుడై = కుమ్మరియై
సారెపైన = కుమ్మరి చక్రంపై
పెద్దలోక భాండము = ఒక పెద్దపాత్రను
మాయగాచేసె = మాయగా చేశాడు
మూకుడు+ఒకటి = మూతనొకదాన్ని
చేయ మరచెను = చేయడం మరచిపో యాడు
అక్కడే చేటువచ్చె = అందువల్ల నే అసలు సమస్య వచ్చింది.
ఆ). పాఠంలోని పద్యాల్లో ప్రా సపదాలను గుర్తించి రాయండి.
ఉదా : రంగరించుకొనియె
జీర్ణించుకొనియె
i). పలుక లేదు
వచించ లేదు
వాగ్ధా టి లేదు
వాక్సరణి లేదు
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 50

ii). గడుపుకుపో వు నాల్క


ముడిపెట్టి చూచు నాల్క
iii). శ్రవణ యుగము
కర యుగళము
ఇ). కింది వాక్యాలు చదవండి. భావాలకు సరిపో యే పంక్తు లను గేయంలో గుర్తించి రాయండి.
1. మనసులో విషం, మాటల్లో తియ్యదనం.
జ). ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు. (4వ పద్యంలో 4వ పాదంలోని భాగం)
2. మంచి మనసుల్లో కూడా విషం చిమ్ముతుంది.
జ). యమృత హృదయాలలో జిల్కు హాలహలము (5వ పద్యం తేటగీతిలో 4వ పాదం)
3. మాట తీరుని బట్టే మన సంపద ఉంటుంది.
జ). సిరి ప్రవర్తిల్లు చుండును జిహ్వ కొలది. (3వ పద్యంలో మొదటి పాదం)
ఈ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
"దేశమనియెడి దొ డ్డవృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు
పండవలెనోయ్" అన్నాడు గురజాడ. •••••••••••••• చైనాలో ఇంజనీర్లు ఎంతో ప్రతిభావంతులు, ఉల్లా స ప్రవృత్తి
గలవారు, కలివిడితనం కలవాళ్ళు, అతిథి మర్యాద బాగా తెలిసిన వాళ్ళు అని డా. కె. ఎల్. రావు గారు రాశారు.
@ప్రశ్నలు :
1. దేశ ప్రజలు ఎలా ఉండాలని కె. ఎల్. రావు గారు ఆకాంక్షించారు?
జ). దేశ ప్రజలు దేశాభిమానం కలిగి ఉండాలని ఎల్. రావు గారు ఆకాంక్షించారు.
2. చైనా దేశంలోని భారీప్రా జెక్టు గురించి వర్ణించిన ఇంజనీరు ఎవరు?
జ). చైనా దేశంలోని భారీప్రా జెక్టు గురించి వర్ణించిన ఇంజనీరు డాII కె.ఎల్.రావు గారు.
3. 'వృత్తా ంతము' అంటే ఏమిటి?
జ). వృత్తా ంతము అంటే చరిత.్ర
4. కె.ఎల్. రావు గారు చైనా ఇంజనీర్ల ను ( ఆ )
అ). వ్యతిరేకించారు ఆ). ప్రశంసించారు ఇ). తిరస్కరించారు
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). చైనాలో సేద్యపు కాలువ నిర్మాణంలో ఎంతమంది పనివాళ్ళు పాల్గొ న్నారు?
ఉ). కింది పద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మాటలాడవచ్చు మనసు దెల్వc గలేcడు
తెలుపవచ్చుc దన్ను తెలియలేడు
సుడియc బట్ట వచ్చు శూరుcడు కాలేcడు
విశ్వదాభిరామ వినురవేమ!
@ప్రశ్నలు :
1. పై పద్యం ఎవరి గురించి చెబుతున్నది?
జ). మాట తీరు తెలియని వారి గురించి చెబుతుంది.
2. పద్యంలో ఏ పని చాలా కష్ట మని చెప్పారు?
జ). తనను గురించి తాను తెలుసుకోవడం చాలా కష్ట మని చెప్పారు.
3. 'సుడియ' అనగా అర్థం ఏమిటి?
జ). సుడియ అంటే ‘కత్తి ’ అని అర్థం
4. పద్యం నుంచి నీవు నేర్చుకున్న నీతి ఏమిటి?
జ). మనం ఏ పని చేసినా దానిలో నైపుణ్యం సాధించడం ముఖ్యం అనే నీతిని నేర్చుకున్నాను.
5. ఈ పద్యం ఏ శతకంలోనిది?
జ). ఈ పద్యం “వేమన శతకం” లోనిది.
II. వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
1. "మాట వలననే సిరి సంపదలు కలుగుతాయి" అని ఎలా చెప్పగలరు?
జ). మన మాటతీరు వలననే మనకు సిరి సంపదలు కలుగుతాయి. అబద్ధా లు ఆడేచ ోట సంపదకు
దేవతయైన లక్ష్మీదేవి అస్సలు ఉండదు. మాటతీరు బాగుంటే శత్రు వులు కూడా మిత్రు లౌతారు. మాటతీరును బట్టే

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 51

బంధువులు కూడా దగ్గ రౌతారు. మాటతీరు బాగుండటం వల్ల చేస్తు న్న రంగంలో అభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి
మాట వలననే సిరి సంపదలు కలుగుతాయని చెప్పవచ్చు.
2. పాఠంలోని పద్యాల ద్వారా కవయిత్రి ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు?
జ). ఈ లోకములో కొంతమంది మాయమాటలు చెప్పి రోజు గడుపుకుంటారు. కొందరు చాడీలు చెప్పి
తగాదాలు సృష్టిస్తు ంటారు. మరికొందరు రెచ్చగొట్టేలా మాట్లా డి ఎంతోకాలంగా కలిసి ఉన్నవారిని విడిపో యేలా
చేస్తా రు. ఇంకొందరు మనసునిండా విషాన్ని నింపుకొని తియ్యని మోసకారి మాటలతో ఎదుటివారిని నాశనం
చేస్తా రు. కొందరు ఒక్కో మనిషి దగ్గ ర ఒక్కో విధంగా మాట్లా డి అన్ని పనులనూ పాడుచేస్తా రు. ఇటువంటి
మోసపూరిత వ్యక్తిత్వం గల వ్యక్తు లతో జాగ్రత్తగా ఉండాలని కవయిత్రి చెబుతున్నారు.
3. నాలుకను నియంత్రించుకోవాలంటే ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి?
జ). నరం లేని నాలుక ఇష్ట ం వచ్చిన విధంగా మాట్లా డుతుంది. చెవుల ద్వారా విన్న విషయాన్ని నిజమో,
అబద్ద మో కూడా ఆలోచించకుండా ప్రచారం చేస్తు ంది. దానివల్ల మంచితో పాటు చెడుకూడా జరిగే ప్రమాదం ఉంది.
అందుచేత మనం ఏదైనా విషయాన్ని విన్నాగాని, అది ఎదుటివారి మనసుకు బాధ కలిగించేదిగా ఉంటే ఆ విషయం
విననట్లు గా ఊరుకోవాలి. ప్రతి ఒక్కరి పట్ల మనసులో మంచి ఆలోచన కలిగిఉండాలి. ఇలా చేస్తే నాలుకను
నియంత్రించుకోవచ్చు.
4. 'నరము లేని నాలుక' అంటే మీరేమి గ్రహించారో రాయండి.
జ). నరము లేకపో తే శరీర అవయవాలు తమ అదుపును కోల్పోతాయి. మనం తిప్పిన విధంగా
కీలుబొ మ్మల్లా తిరుగుతాయి. నరము లేని నాలుక కూడా ముందు,వెనుక ఆలోచించకుండా ఇష్ట ం వచ్చిన రీతిగా
మాట్లా డుతుంది. ఆ మాటల వల్ల అనేక అనర్థా లు జరుగుతాయి. కాబట్టి నరము లేని నాలుకను మంచి పనులకే
ఉపయోగించాలని నేను గ్రహించాను.
5. నాలుకను ఎలా ఉపయోగించుకుంటే గౌరవింపబడతామో వివరించండి.
జ). పంచేంద్రియాల్లో అత్యంత ముఖ్యమైనది నాలుక. అలాంటి నాలుకను మంచిని పెంపొ ందించడానికి
ఉపయోగించాలి. నాలుకను మితంగా వాడాలి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లా డాలి. ఎదుటి వారిలోని
సుగుణాలను ప్రచారం చేయడానికే నాలుకను వాడాలి. నాలుక ఉందికదా అని మన చెవినబడిన ప్రతీ విషయాన్ని
ప్రచారం చేసెయ్యకుండా, పదుగురికీ మేలు చేసే విషయమైతేనే నలుగురికీ చెప్పాలి. నాలుకను ఈ విధంగా మితంగా
ఉపయోగించుకుంటే సమాజంలో అందరిచేత గౌరవింపబడతాము.
6. 'మాట మహిమ' పాఠ్యాంశ కవయిత్రి గురించి రాయండి.
జ). 'మాట మహిమ' పాఠ్యాంశ కవయిత్రి శ్రీమతి కొలకలూరి స్వరూపరాణి గారు. 1943వ సంవత్సరంలో
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రా మంలో జన్మించారు. పది పన్నెండు సంవత్సరాల వయస్సులోనే
కవిత్వం రాయడం మొదలుపెట్టా రు. ఉపాధ్యాయినిగా పనిచేశారు. స్త్రీల సమస్యలు, వరకట్నం, వైధవ్యం,
సహగమనం వంటి అంశాలపై రచనలు చేశారు. నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం, చంద్ర
గ్రహణం మొదలైనవి వీరి రచనలు. "కవయిత్రి తిలక" అనే బిరుదు పొ ందారు. 2022వ సంవత్సరంలో మరణించారు.
7. ఆధునిక పద్యం ప్రక్రియను పరిచయం చేయండి.
జ). తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిష్ట మైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే
జరిగేవి. ఆధునికమైన వస్తు వును తీసుకుని, ప్రా చీన పద్య లక్షణాలతో రాసే రచనను ఆధునిక పద్యం అనవచ్చు.
ఆధునిక రచయితలు చాలామంది తమ భావాలను ప్రా చీన పద్య శైలిలో స్పష్ట ంగా వ్యక్తీకరిస్తు న్నారు.
8. 'మాట మహిమ' పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జ). మనచుట్టూ ఉన్న మనుషుల్లో ఒక్కొక్కరి మాటతీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరి మాటలు
ప్రేమను పంచితే, కొందరి మాటలు మనసును ముక్కలు చేస్తా యి. కొందరి మాటలు ధైర్యాన్ని నింపితే, మరికొందరి
మాటలు పిరికితనాన్ని నూరిపో స్తా యి. కాబట్టి మోసపు మాటల మాయలో పడకుండా నాలుకను అదుపులో
ఉంచుకొని మాట్లా డే స్వభావాన్ని పెంపొ ందించుకోవాలని తెలపడమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. మాటతీరు సరిగా లేకపో తే కలిగే కష్ట నష్టా లను వివరించండి.
జ). మాటతీరు సరిగా లేకపో తే మన ఇంట సంపదలు ఉండవు. మాట తీరును అనుసరించే స్నేహం
నడుస్తూ ఉంటుంది. మాటతీరు సరిగా లేకపో తే ప్రా ణ స్నేహితులు కూడా మనకు దూరమైపో తారు. శత్రు వులు
పెరిగిపో తారు. అనవసరంగా లేనిపో ని తగవులు జరుగుతాయి. నరం లేని నాలుక ఇష్ట ం వచ్చిన రీతిగా
మాట్లా డుతుంది. అలా ముందు వెనక ఆలోచించకుండా మాట్లా డిన మాటల వల్ల పచ్చగా సాగుతున్న కాపురాల్లో
చిచ్చు రేగుతుంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 52

ఆలోచన లేకుండా మాటలు మాట్లా డితే మనసు విరిగిపో యి, బంధుత్వ సంబంధాలు చెడిపో యి,
కుటుంబాలే నాశనమవుతాయి. మనం మాట్లా డే మాటకు ఎదుటివారి ప్రా ణాలే తీయగలిగేటంతటి శక్తి ఉంటుంది.
కత్తి కి కూడా లేని పదును మన మాటతీరుకు ఉంటుంది. ఒక్కొక్కరి మాటతీరు వల్ల ప్రపంచం మొత్త ం అతలాకుతలం
అయిపో యే పరిస్థితి వస్తు ంది. కాబట్టి మాట్లా డేటప్పుడు ఎదుటివారికి నష్ట ం కలిగించని విధంగా వారి మనసుకు
బాధ కలిగించని విధంగా మాట్లా డాలి.
2. 'మన మాటలే మన గౌరవం' అనే అంశంపై వ్యాసం రాయండి.
జ). మనిషి మనసులోని భావాలను వ్యక్త పరిచే సాధనం మాట, ఒక వ్యక్తి గురించి ఎదుటివారు అతడు
మాట్లా డే మాటలనుబట్టి ఒక అభిప్రా యం ఏర్పరచుకుంటారు. మనం మాట్లా డేటప్పుడు ఎదుటివారి మనసు
నొచ్చుకోకుండా ఉండే విధంగా మాట్లా డాలి. మనం మాట్లా డే మంచి మాటలే మనకు సమాజంలో గౌరవాన్ని
తెచ్చిపెడతాయి.
మనం మాట్లా డే మాటల్లో అసత్యానికి తావివ్వకూడదు. ఈ విషయాన్ని గురించి తైత్తరీయ ఉపనిషత్తు లో
విద్యాభ్యాసం పూర్త యిన విద్యార్థికి, వీడ్కోలు మాటలుగా గురువు 'సత్యం వద, ధర్మం చర' అంటూ సందేశం
ఇవ్వడాన్ని గమనించవచ్చు. సనాతన భారతీయ సంప్రదాయంలో మన పూర్వీకులు ధర్మాచరణకు ఎంత
ప్రా ముఖ్యతనిచ్చారో, సత్యంవాక్కుకూ అంతే ప్రా ధాన్యతనిచ్చారు. ఈ విషయం మాట గొప్పదనాన్ని తెలియజేస్తు ంది.
ఎదుటివాడు మనకన్నా చిన్నవాడా, పెద్దవాడా, మన స్థా యికి తగినవాడా, కాదా అనే విషయాలతో
సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా పలకరించాలి. మర్యాదను ఇచ్చిపుచ్చుకోవాలి. మనం ఎదుటి వారిని
గౌరవిస్తే అదే గౌరవం మనకు తిరిగి లభిస్తు ంది. కాబట్టి మన మాటతీరులోని మంచితనమే మనకు గౌరవాన్ని
తెచ్చిపెడుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలి.
3. పాఠ్యాంశంలోని పద్యాలు ఆధారంగా సారాంశాన్ని ఏకపాత్ర రూపంలో ప్రదర్శించడానికి ప్రదర్శన పాఠం
రాయండి.
జ). నాలుక - ఏకపాత్రా భినయం
మిత్రు లారా! నన్ను గుర్తు పట్టా రా? నేను మిమ్మల్ని అందలానికి ఎక్కించగలను.. అదఃపాతాలానికీ
తొక్కెయ్యగలను. ఆ..! గుర్తొ చ్చాను కదూ! అవును నేన!ే నరంలేని నాలుకనే! నా మాట తీరుతోనే మీ ఇంట
సంపదలు నిలిచి ఉంటాయి. నా మాటతీరును బట్టే వ్యక్తు ల మధ్య స్నేహం చిగురిస్తు ంది. ఈ లోకంలో కొందరు నన్ను
ఉపయోగించి మాయమాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. కత్తి కి లేని పదును నాకు ఉంది. నన్ను
సక్రమంగా ఉపయోగించకపో తే అమృత హృదయాల్లో కూడా విషాన్ని నింపగలను.
నేను కావాలనుకుంటే సత్యాన్ని దాచిపెట్టగలను. అసత్యానికి ప్రచారం కల్పించగలను. నేను మాట్లా డే
మాటలకు ఎదుటివారి ప్రా ణాలే తీయగల శక్తి కూడా ఉంటుంది. మీ మానవులు ఇతరుల సుగుణాలకు గురించి
చెప్పడానికంటే ఇతరులలోని దుర్గు ణాలను బయట పెట్టడానికే నన్ను ఎక్కువగా ఉపయోగిస్తా రు.
నేను మిమ్మల్ని ఏమీ చేయలేను కాబట్టే నన్ను ఎలా కావాలనుకుంటే అలా ఉపయోగించుకొని నా చేత
ఎన్నో క్రూ రమైన పనులు చేయిస్తు న్నారు. ఓ స్వార్థ మానవులారా! మీ స్వార్ధపు ఆలోచనలకు నన్ను పావుగా
వాడుకోకండి. నన్ను మంచి పనులకు ఉపయోగించుకొని మీ గౌరవాన్ని పెంచుకోండి. లోకమంతా గౌరవ
మర్యాదలతో మెలిగితే అదే నాకు ఆనందం. ఆ ఆనందాన్ని నాకు మిగులుస్తా రు కదూ! ఇక సెలవు.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాలు చదివి, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, వాటిని ఉపయోగించి సొ ంతవాక్యాలు
రాయండి.
1. అమలిన పథమున గమియించుటకే లెమ్ము.
జ). పథము = మార్గ ము
*పెద్దలు చూపిన మార్గ ంలో పయనించి, అభివృద్ధి సాధించాలి.
2. పలుకుమాత్రము మితముగా పలుకుమన్న.
జ). మితము = కొంచెం
*కొంతమంది ఎంత సంపద ఉన్నా కొంచెం కూడా దానం చేయరు.
3. సృష్టికర్త కులాలుడై చేసె పెద్ద లోకభాండము.
జ). కులాలుడు = కుమ్మరి (కుండలు చేసేవాడు)
*కుమ్మరి బంకమట్టితో కుండలు చేస్తా డు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 53

4. దుర్గు ణాలు విడనాడితే విజయం లభిస్తు ంది.


జ). దుర్గు ణాలు = చెడు అలవాట్లు
*చెడు అలవాట్లు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తా యి.
5. పాము గరళము నుండి ఔషధం తయారు చేస్తా రు.
జ). గరళము = విషము
*శివుడు విషమును తన కంఠంలో దాచి లోకాన్ని కాపాడాడు.
ఆ). కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయపదాలు రాసి, వాక్యాలలో ప్రయోగించండి.
ఉదా : సీత, లత మంచి నేస్తా లు.
జ). నేస్తా లు = మిత్రు లు, స్నేహితులు
*మిత్రు లు ఎల్ల ప్పుడూ మన మంచినే కోరుకుంటారు.
*ఎల్ల ప్పుడూ మంచి స్నేహితులతోనే స్నేహం చేయాలి.
1. వహ్వ! మాటల మేదరి జిహ్వగాడు.
జ). జిహ్వ = నాలుక, రసన
*నరం లేని నాలుక ఇష్ట ం వచ్చినట్లు మాట్లా డుతుంది.
*రసనేంద్రియం ద్వారానే మనం రుచిని తెలుసుకోగలం.
2. అందమో చందమో అంబకమొక కంట తిలకించు పల్లెత్తి పలుకలేదు.
జ). తిలకించు = చూచు, వీక్షించు
*కొంతమంది తమ కళ్ళముందు ఎంత ఘోరం జరుగుతున్నా అలా చూస్తూ ఉండిపో తారు.
*మా అక్క ప్రకృతిలోని అందాలను వీక్షిస్తూ ఆనందిస్తు ంది.
3. సిరి ప్రవర్తిల్లు చుండును జిహ్వకొలది.
జ). సిరి = సంపద, ధనం
*నేటి కాలంలో సంపద ఉన్నవారినే అందరూ గౌరవిస్తు న్నారు.
*ధనం లేనివారి బ్రతుకు వ్యర్థం.
ఇ). కింది వాక్యాలను పరిశీలించి ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్ధా లు రాయండి.
1. క్షామము తాళలేక పక్షులు నీరున్న చోటుకు పయనమయ్యాయి.
జ). పయనము = గమనము, ప్రస్థా నము
2. ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు.
జ). అమృతం = సుధ, పాలు
3. కనులార మంచిని కాంచుటకేనేమొ.
జ). కాంచుట = చూచుట, పొ ందుట
ఈ). కింది వాక్యాలలో ప్రకృతి, వికృతులను గుర్తించి రాయండి.
ఉదా : మన ఆంధ్రు ల భాష తెలుగు. ఇది దేశ బాసలలో మేటి.
జ). భాష (ప్రకృతి) - బాస ( వికృతి)
1. విద్యార్థు ల చేతుల్లో పుస్త కాలున్నాయి. ఆ పొ త్త ములు జ్ఞా న భాండాగారాలు.
జ). పుస్త కము (ప్రకృతి) - పొ త్త ము ( వికృతి)
2. ఎంత దూరమైనా నడవాలి. దవ్వు అని ఆలోచించకూడదు.
జ). దూరము (ప్రకృతి) - దవ్వు ( వికృతి)
3. హరివిల్లు లో సప్త వర్ణా లు ఉంటాయి. ఆ వన్నెలు ప్రకృతికే శోభనిస్తా యి.
జ). వర్ణ ము (ప్రకృతి) - వన్నె ( వికృతి)
4. ప్రతి ఎదలో దయ ఉండాలి. అపుడు హృదయమే దేవాలయం అవుతుంది.
జ). హృదయము (ప్రకృతి) - ఎద ( వికృతి)
5. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలి. ఆ సహాయమే మనకు పుణ్యమై రక్షణనిస్తు ంది.
జ). సహాయం (ప్రకృతి) - సాయం ( వికృతి)
ఉ). కింది జాతీయాలను ఉదాహరణలతో వివరించండి.
1. కంకణం దాల్చు : ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పని పూర్త య్యేవరకు పట్టు వదలనని దీక్ష పూనడం
అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తా రు.
ఉదా : మా అన్నయ్య ఈ ఏడాది ఎలాగైనా సరే పదవ తరగతి పరీక్షల్లో పాసవ్వాలని కంకణం దాల్చాడు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 54

2. గిల్లి జోలబాడటం : బాధపెట్టి బుచ్చగించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తా రు.


*ఉదా : కొందరు ఎదుటివారు చేసే పనిలో తలదూర్చి గిల్లి జోలపాడుతుంటారు.
3. జుట్లు ముడిపెట్టటం : ఇద్ద రు వ్యక్తు ల మధ్య అకారణంగా తగువు సృష్టించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని
ఉపయోగిస్తా రు.
ఉదా : కొందరు స్వార్ధపరులు ఎదుటివారి జట్లు ముడిపెట్టి పైశాచికానందం పొ ందుతారు.
4. వంట జీర్ణించుకోవడం: పూర్తిగా అవగాహన చేసుకోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తా రు.
ఉదా : ఉపాధ్యాయులు చెప్పే విషయాన్ని విద్యార్థు లు పూర్తిగా వంట జీర్ణించుకోవాలి.

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

💥ద్విరుక్తటకార సంధి :
*👉సూత్రము 1 : కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దా లలోని ఱ- డ లకు అచ్చు పరమైతే ద్విరుక్త "ట" కారం
ఆదేశంగా వస్తు ంది.
ఉదా : 1. కుఱు + ఉసురు = కుట్ట్ + ఉసురు = కుట్టు సురు
2. చిఱు + ఎలుక = చిట్ట్ + ఎలుక = చెట్టెలుక
3. కడు + ఎదురు = కట్ట్ + ఎదురు = కట్టెదురు
4. నడు + ఇల్లు = నట్ట్ + ఇల్లు = నట్టిల్లు

👉
5. నిడు + ఊరుపు = నిట్ట్ + ఊరుపు = నిట్టూ రుపు
సూత్రము 2 : ఆమ్రేడితం పరమైనపుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణా లకు అదంతమైన ద్విరుక్త టకారం
వస్తు ంది.
ఉదా : 1. పట్ట పగలు = పగలు + పగలు
2. కట్ట కడ = కడ + కడ
3. తుట్ట తుద = తుద + తుద
4. మొట్ట మొదట = మొదట + మొదట
5. చిట్ట చివర = చివర + చివర
*ద్విరుక్త ము అంటే ఒకే హల్లు రెండుసార్లు వచ్చుట.హల్లు కింద అదే హల్లు వచ్చుట.దీనినే ద్విత్వాక్షరం అంటారు.
అ). కింది పదాలు విడదీసి సంధి పేరు తెలపండి.
1. రసనేంద్రియం = రసన + ఇంద్రియం = గుణసంధి
2. పరస్పరానురాగం = పరస్పర + అనురాగం = సవర్ణ దీర్ఘ సంధి
3. పరాధీనము = పర + అధీనము = సవర్ణ దీర్ఘ సంధి

💥సమాసాలు :
4. ఉర్వియెల్ల = ఉర్వి + ఎల్ల = యడాగమ సంధి

అ). కింది పదాలు చదవండి. విగ్రహవాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి.


1. ప్రా ణహాని - ప్రా ణమునకు హాని - షష్ఠీ తత్పురుష సమాసం.
2. అమృత హృదయాలు - అమృతము వంటి హృదయాలు - ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
3. లోకభాండము - లోకమనెడి భాండము - రూపక సమాసం
4. జీతభత్యాలు - జీతమును, భత్యమును - ద్వంద్వ సమాసం
5. చిత్త శుద్ధి - చిత్త ము యొక్క శుద్ధి - షష్ఠీ తత్పురుష సమాసం.
6. మధుర పదార్థం - మధురమైన పదార్థం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
7. కురు వృద్ధు లు - కురు వంశమునందలి వృద్ధు లు - సప్త మీ తత్పురుష సమాసం

💥అలంకారాలు :
8. ధీరోదాత్తు డు - ఉదాత్తు డైన ధీరుడు - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం

💥వృత్త ్యనుప్రా సాలంకారం :


భాషకు సౌందర్యాన్ని కలగజేసేవి అలంకారాలు. వృత్త ్యనుప్రా సాలంకారాన్ని గురించి తెలుసుకుందాం!
లక్షణం : ఒకటిగానీ అంతకంటే ఎక్కువగానీ హల్లు లు అనేకసార్లు వచ్చినట్ల యితే అది "వృత్త ్యనుప్రా సాలంకారం"
అవుతుంది.
ఉదా 1 : కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతసైలమున్.
దీనిలో "క" అనే హల్లు తిరిగి తిరిగి వచ్చినందువలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం" అవుతుంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 55

ఉదా 2 : ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను.


దీనిలో "క్ష" అనే హల్లు పలుమార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం" అవుతుంది.
ఉదా 3 : చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ.

💥
దీనిలో "ట" అనే హల్లు పలుమార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం" అవుతుంది.
కింది ఉదాహరణలలో అలంకారాన్ని గుర్తించండి.
1. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము పో వునే మదనములకు
జ). ఈ పద్యపాదంలో "వృత్త ్యనుప్రా సాలంకారం" ఉన్నది.
వృత్త ్యనుప్రా సాలంకారం లక్షణం : వాక్యంలో గానీ, పద్యపాదంలో గానీ ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని
వృత్త ్యనుప్రా సాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యపాదంలో "మ" అనే హల్లు అనేకసార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం"
అవుతుంది.
2. అడిగెదనని కడువడిజను నడిగిన దన మగడు నుడవడని నడయుడుగన్
జ). ఈ పద్యపాదంలో "వృత్త ్యనుప్రా సాలంకారం" ఉన్నది.
*సమన్వయం : ఈ పద్యపాదంలో "డ" అనే హల్లు అనేకసార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం"
అవుతుంది.
3. దక్షాధ్వర శిక్షా దీక్షా దక్ష విరూపాక్ష నీకృపావీక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్షసేయక
జ). ఈ పద్యపాదంలో "వృత్త ్యనుప్రా సాలంకారం" ఉన్నది.
*సమన్వయం : ఈ పద్యపాదంలో "క్ష" అనే హల్లు అనేకసార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం"

💥ఛందస్సు :
అవుతుంది.

👉కింది ఉత్పలమాల పద్య లక్షణాలను పరిశీలించండి.


UI I U I U I I I UI I UI I UIU IU
ఎక్కడి | మంత్రతం | త్రముల | వెక్కడి | చక్రము | లేడపా | చికల్
భ ర న భ భ ర వ
*సమన్వయం : ఈ పద్యపాదంలో….
1). భ - ర - న - భ - భ - ర - వ అనే గణాలు వచ్చాయి.
2). పాదం మొదటి అక్షరం "ఎ" కి 10వ అక్షరం "వె" లో ఉన్న "ఎ" కి యతి చెల్లి ంది.
3). ప్రా స నియమం కలదు.

👉
4). ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉన్నాయి.
కింది పద్య పాదాలకు గణవిభజన చేసి లక్షణ సమన్వయం రాయండి.
UI I U IU I I I UI I UI I UI U IU
1. చక్కని | కన్యకా | మణికి | జక్కని | వాడగు | ప్రా ణ నా | థుడున్
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
*ఉత్పలమాల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థా నం.
6. ప్రా స నియమం ఉంటుంది.
*సమన్వయం : ఈ పద్యపాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి.
పాదం మొదటి అక్షరం "చ" కి 10వ అక్షరం "జ" కి యతి చెల్లి ంది. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదము అని
చెప్పవచ్చు.
UI I U I U I I I UI I U I I UIU IU
2. ఎక్కడ | నుండి రా | కయిట | కెల్లరు | నున్ సుఖు | లేకదా | యశో
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 56

*సమన్వయం : ఈ పద్యపాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి.


పాదం మొదటి అక్షరం "ఎ" కి 10వ అక్షరం "కె" లో ఉన్న "ఎ" కి యతి చెల్లి ంది. కాబట్టి ఇది ఉత్పలమాల
పద్యపాదము అని చెప్పవచ్చు.

U I I U I U I I I U I I U I I UI U IU
3. ఏ మహ | నీయ సి | ద్ధి కొర | కీ బ్రతు | కున్ ముడి | వెట్టు కుం | టినో
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
*సమన్వయం : ఈ పద్యపాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి.
పాదం మొదటి అక్షరం "ఏ" కి 10వ అక్షరం "కీ" లో ఉన్న "ఏ" కి యతి చెల్లి ంది. కాబట్టి ఇది ఉత్పలమాల
పద్యపాదము అని చెప్పవచ్చు.

UI I UIU I I I U I I U II U I U IU
4. చారు ని | శీధినీ | విమల | సాంద్ర సు | ధాకర | భాతి రో | దసీ
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
*సమన్వయం : ఈ పద్యపాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి.
పాదం మొదటి అక్షరం "చా" కి 10వ అక్షరం "సా" కి యతి చెల్లి ంది. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదము అని
చెప్పవచ్చు.

*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 57

1.ఇల్ల లకగానే
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. రాయండి.
1. స్నేహితురాలు గుర్తు చేసిన ఇల్లా లి గతం ఎలాంటిద? ి చెప్పండి.
జ). తన పేరు తానే మరచిపో యిన ఇల్లా లి పేరు శారద. ఆవిడ పదవ తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చింది.
కాలేజీలో జరిగిన మ్యూజిక్ పో టీల్లో ఫస్ట్ వచ్చింది అప్పుడప్పుడు మంచి మంచి బొ మ్మలు వేసేద.ి ఇదే తన పేరు
తానే మరచిపో యిన శారద అనే ఇల్లా లికి స్నేహితురాలు గుర్తు చేసిన గతం.
2. తన పేరేమిటన్న ఇల్లా లి ప్రశ్నకు పక్కింటావిడ చెప్పిన జవాబేమిటి?
జ). తన పేరేమిటన్న ఇల్లా లి ప్రశ్నకు పక్కింటావిడ కిసుక్కున నవ్వేసింది. ఆవిడ పేరును తాను ఎప్పుడూ
అడగలేదంది. ఆవిడ చెప్పనూ లేదంది. కుడిచేతివైపు తెల్ల మేడావిడ అనో, మందుల కంపెనీ మేనేజరు గారి భార్య
అనో, తెల్లగా పొ డుగ్గా ఉండే ఆవిడ అనో చెప్పుకుంటామని జవాబు చెప్పింది.
3. అజ్ఞా తవాసం అంటే మీకేమి అర్థమైంది?
జ). అజ్ఞా తవాసం అంటే ఎవరైనా తమ ఉనికిని కోల్పోయి, తాము ఎక్కడున్నామో కూడా ఎవ్వరికీ
తెలియకుండా సమాజంలో రహస్యంగా బ్రతకడం అని మేము అర్థం చేసుకున్నాము.
ఆ). ఇచ్చిన గద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గణగణమంటూ స్కూల్ బెల్ మోగింది. పాఠశాల విడిచిపెట్టగానే పిల్లలందరూ తమతో పాటు తెచ్చుకున్న
క్యారేజీలు విప్పి తినడం ప్రా రంభించారు. అందులో ఒక అమ్మాయి మాత్రం తెచ్చుకున్న రొట్టె ముక్కలు, పళ్ళు
తమతో పాటు చదువుతున్న పేద విద్యార్థు లకు పంచి, వారితో కలిసి తింది. తెచ్చుకున్న తినుబండారాలు అందరికీ
సరిపడలేదు. మరుసటి రోజు అమ్మతో "అమ్మా! ఈ మధ్య నాకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటోంది. కాబట్టి నా
క్యారేజీలో నలుగురైదుగురికి సరిపడినంత పెట్టు " అంది . నిజమేననుకుని ఆ తల్లి నలుగురైదుగురికి సరిపడినన్ని
రొట్టెలు, పళ్ళు పెట్టి ఇచ్చింది.
సాయంత్రం ఆ అమ్మాయి స్కూల్ నుండి వచ్చినప్పుడు అమ్మ క్యారేజీ తెరిచి చూసింది. అందులో చిన్న
రొట్టెముక్క గానీ, కనీసం ఒక పండుగానీ మిగల్లేదు. కూతురు ఇన్ని ఎలా తిందా! అని ఆశ్చర్యపో యింది. ఆమె
స్కూల్ టీచర్ని కలిసి తన కూతురు అన్ని పదార్థా లు ఎలా తింటుందో గమనించమని చెప్పింది. "నువ్వేం
భయపడవద్దు . నేను చూస్తా లే" అని టీచర్ ఆమెకు ధైర్యం చెప్పింది. మరునాడు ఆ అమ్మాయి తోటి పిల్లలకు ఆహార
పదార్థా లు పంచడం గమనించి, జరిగిన విషయం ఆమెతో చెప్పింది టీచర్. ఆ అమ్మాయి తల్లి ఎంతగానో
మెచ్చుకుంది. ముద్దు లాడింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రా ంతీయ భేదాలు మరచి, భారత స్వాతంత్ర్యం కోసం
ఎనలేని సేవలందించిన అనిబిసెంట్. చిన్ననాటి నుండి సత్ప్రవర్త న,ప్రేమ,సేవ,త్యాగం వంటి మంచి లక్షణాలను
అలవరచుకోబట్టే ఆమె 'మహామనిషి'గా ఎదిగింది.
*ప్రశ్నలు :
1. పై గద్యంలో 'తినదగిన పదార్థా లు' అనే అర్థం కలిగిన పదాన్ని గుర్తించి రాయండి.
జ). తినుబండారాలు అనే పదం 'తినదగిన పదార్థా లు' అనే అర్థా న్నిస్తు ంది.
2. అనిబిసెంట్ ను తల్లి ఎందుకు మెచ్చుకొని ముద్దు లాడింది?
జ). అనిబిసెంట్ తాను స్కూల్ కి తీసుకెళ్లి న ఆహార పదార్థా లు తోటి పిల్లలకు పంచింది. ఈ విషయం తెలిసి తల్లి,
అనిబిసెంట్ ను మెచ్చుకొని ముద్దు లాడింది.
3. 'దుష్ప్రవర్త న' ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గద్యంలో వెతికి రాయండి.
జ). 'దుష్ప్రవర్త న' ఈ పదానికి వ్యతిరేక పదం సత్ప్రవర్త న.
4. అనిబిసెంట్ భారతదేశానికి ఏ విషయమై సేవలను అందించింది?
జ). అనిబిసెంట్ భారత స్వాతంత్ర్యం కోసం ఎనలేని సేవలందించింది.
5. పై గద్యానికి తగిన శీర్షికను రాయండి.
జ). "మహామనిషి అనిబిసెంట్"
ఇ). కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
బండారు అచ్చమాంబ 1874లో కృష్ణా జిల్లా నందిగామలో పుట్టింది. తండ్రి వెంకటప్పయ్య, తల్లి
గంగమాంబ. ఆమెకు ఆరేళ్ళప్పుడు తండ్రి మరణించాడు. పదేళ్ల వయసులో మాధవరావుతో వివాహం జరిగింది.
పుట్టిన ఇద్ద రు పిల్లలూ ఏడాది వ్యవధిలో మరణించారు. దుఃఖం నుంచి మెల్లగా కోలుకుంది. కన్నీళ్ల ను కాగితాలపై
అక్షరాలుగా మలచింది. స్త్రీ అనంతశక్తిమంతురాలనీ, ఆమెకు విద్యావకాశాలు అందితే జాతికి మార్గ దర్శి కాగలదని

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 58

నిశ్చయంగా నమ్మింది. తినడం, పడుకోవడమే జీవితం కాదని, వెలుగుతూ వెలిగించడమేనని, నరాల్లో ఆవేశం,
గుండెల్లో చైతన్యం ఉబికివచ్చేలా ప్రసంగించేది. మాటలే కాదు చేతల్లో కూడా చేవ ఉన్న అచ్చమాంబ తన జీవితాన
ఎదురైన దుఃఖాన్ని ధైర్యంగా దిగమింగుకుంది. అదే చెప్పింది అందరిక.ీ నీకోసం బతకడం బతుకు కాదని,
నిర్భాగ్యులకు నీడనివ్వడమే పరమార్థమని ప్రసంగించేది. ఆచరించేది. ఓసారి ఓ బిచ్చగాతే ఇద్ద రు పిల్లలతో
అడుక్కుంటుంటే వారిని వారించి, ఓ ఆవును కొనిచ్చి, వారి కాళ్ల పై వారిని నిలబడేలా చేసింది. తన మరిదికి భార్య
చనిపో తే అందరినీ ఎదిరించి, దగ్గ రుండి మరీ ఓ వితంతువును అతనికిచ్చి పెళ్లి చేసింది. 1905లో మహారాష్ట ల
్ర ో ప్లేగు
వ్యాధి వ్యాపించింది. ఓ గర్భిణి రోగాన పడింది. ఎవరూ తోడు లేరు. దగ్గ రుండి తానే పురుడు పో సింది అచ్చమాంబ.
ఆ మహమ్మారి ఆమెనూ కబళించింది. 1905 జనవరి 18న మూడు పదుల వయస్సులోనే అచ్చమాంబ
కన్నుమూసింది.
*ప్రశ్నలు :
1. అచ్చమాంబకు వివాహమైన తరువాత కలిగిన దుఃఖం ఏమిటి?
జ). ఆమెకు పుట్టిన ఇద్ద రు పిల్లలూ ఏడాది వ్యవధిలోనే మరణించడం.
2. 'మార్గ దర్శి కావడం' అంటే ఏమిటి?
జ). మార్గ దర్శి కావడం అంటే ఇతరుల జీవితాలకు ఒక మంచి దారి చూపే వ్యక్తిగా ఎదగడం. లేదా నలుగురూ
అనుసరించే వ్యక్తిగా ఎదగడం.
3. ఏ మహమ్మారి అచ్చమాంబను కబళించింది? ( ఇ )
అ). కలరా ఆ). మలేరియా ఇ). ప్లేగు ఈ). టైఫాయిడ్
4. 'కన్ను మూయడం' అనే పదాన్ని దేనికి పర్యాయపదంగా వాడుతారు?
జ). కన్ను మూయడం అనే పదాన్ని చనిపో వడం, మరణించడం అనే పదాలకు పర్యాయపదంగా వాడుతారు.
5. 'తన కాళ్ళపై తాను నిలబడడం' అంటే మీకేమి అర్థం అయ్యింది?
జ). 'తన కాళ్ళపై తాను నిలబడడం' అంటే తమ సొ ంత సంపాదనపై ఆధారపడి బతకడమని నాకు
అర్థమయ్యింది.
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో జవాబులు రాయండి.
1. "నా పేరేమిటో చెప్పమ్మా" అన్న ఇల్లా లికి తల్లి చెప్పిన చరిత్ర ఏమిటి?
జ). "నా పేరేమిటో చెప్పమ్మా!" అన్న ఇల్లా లితో ఆమె తల్లి "అదేమిటమ్మా! నువ్వు మా పెద్దమ్మాయివి.
నీకు బి.ఏ దాకా చదువు చెప్పించి, యాబైవేలు కట్నమిచ్చి పెళ్లి చేశాం. రెండు పురుళ్ళు పో శాం. ప్రతి పురిటికి
ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం. నీకు ఇద్ద రు పిల్లలు. మీ ఆయనకి మంచి ఉద్యోగం. చాలా మంచివాడు
కూడాను. నీ పిల్లలు బుద్ధిమంతులు." అంటూ చరిత్ర మొత్త ం చెప్పుకొచ్చింది.
2. "అమ్మయ్య నువ్వొచ్చావు. ఇంక మాకు పండగేనోయ్" అన్న శారద భర్త మాటలను బట్టి మీరు ఏమి
గ్రహించారు?
జ). "అమ్మయ్య నువ్వొచ్చావు. ఇంక మాకు పండగేనోయ్" అన్న శారద భర్త మాటలను బట్టి శారద
ఇల్ల ంతటినీ ఎంతో చక్కగా తీర్చిదిద్దేదని గ్రహించాము. ఆవిడ ఇంట్లో లేకపో తే కనీసం ఆ ఇంటిని అలికి ముగ్గు లు
పెట్టేవారు కూడా అక్కడ ఎవరూ లేరని మేము గ్రహించాము. శారద రెండు రోజులు పుట్టింటికి వెళ్లే సరికి ఇంట్లో ని
సామాన్ల న్నీ గజిబిజిగా పడి ఉన్నాయి. కాబట్టి శారద వాటినన్నింటినీ సర్ది, ఇంటిని అందంగా ఉంచుతుందనే
ఉద్దేశంతో శారద భర్త ఈ మాటలను అని ఉంటాడని మేము గ్రహించాము.
3. ఇల్లా లు తన పేరు తానే మరచిపో వడానికి గల కారణాలు రాయండి.
జ). పెళ్లయిన వెంటనే ఇల్లా లుతో ఆమె భర్త "ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది" అని చెప్పాడు. వెంటనే ఆమె
ఆ ఇంటిని అందంగా అలికి ముగ్గు లు పెట్టింది. దానికి ఆమె భర్త మెచ్చుకుని "నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి.
ముగ్గు లు వేయడంలో అంతకన్నా నేర్పరివి. శభాష్!" అంటూ మెచ్చుకుని భుజం తట్టా డు. దాంతో ఆ ఇల్లా లు తెగ
మురిసిపో యి ఇల్ల లకటమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె భర్త ఆమెను ఎప్పుడూ పేరు పెట్టి
పిలవలేదు. ఏమోయ్! అనే పిలిచేవాడు. పనిమనిషేమో అమ్మగారు అని పిలిచేద.ి పిల్లలు అమ్మా! అని పిలిచేవారు.
బయటి వాళ్ల ందరూ మిసెస్ మూర్తి అనేవారు. ఆవిడను అసలు పేరెట్టి ఆ ఇంటిలోగాని, బయట గానీ పిలిచే పరిస్థితి
లేకుండా పో యింది. దానితో ఆ ఇల్లా లు ఇంటిపనుల్లో లేనమైపో యి తన పేరును తానే మరచిపో యింది.
4. ఇల్ల లకగానే పాఠ్యాంశ రచయిత్రి గురించి రాయండి.
జ). 'ఇల్ల లకగానే' పాఠ్యాంశ రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి గారు. 20వ శతాబ్ది కి చెందిన రచయిత్రి. సత్యవతి
కథలు, ఇల్ల లకగానే, మత్తు నగరి, మెలకువ, రాగభూపాలం మొదలైన కథా సంపుటాలు; పడుచుదనం, రైలుబండి,

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 59

గొడుగు, ఆ తప్పు నీది కాదు వంటి నవలలు రాశారు. ఉర్దూ రచయిత్రి 'ఇస్మత్ చుగ్తా య్' కథలను తెలుగు
అనువాదం చేశారు. చాసో స్ఫూర్తి పురస్కారం,తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, ఆంధ్రపద ్ర ేశ్ ప్రభుత్వం
నుంచి 'కళారత్న' ఉగాది పురస్కారం వంటి పురస్కారాలు పొ ందారు.
5. కథ ప్రక్రియను పరిచయం చేయండి.
జ). తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ
పాత్ర ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో, గుండెకు హత్తు కొనేలా చెప్పే వచన రచనే కథ. ప్రస్తు తం కథ, కథానిక అనే
రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని
పరిపుష్ట ం చేస్తు న్నారు.
ఆ). కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. కథలో ఇల్లా లు తన పేరు మరచిపో వడాన్ని మీరు సమర్థిస్తా రా? ఎందువల్ల ?
జ). 'ఇల్ల లకగానే'పాఠంలోని ఇల్లా లు పెళ్లయిన కొత్త లో 'ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది' అని చెప్పిన భర్త
మాటలకు పొ ంగిపో యి, వెంటనే ఇంటిని అందంగా అలికి ముగ్గు లు పెట్టింది. ఆమె అలుకుని, ముగ్గు లను భర్త
మెచ్చుకోవడంతో తెగ మురిసిపో యి ఇల్ల లకటమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఈ హడావిడిలో ఆమె
తన పేరుని మరచిపో యింది. ఆ ఇల్లా లు చదువుకునే రోజుల్లో పదవ తరగతి స్కూలు ఫస్ట్ వచ్చింది. కాలేజీలో
జరిగిన మ్యూజిక్ పో టీల్లో కూడా ఫస్ట్ వచ్చింది. అప్పుడప్పుడు మంచి మంచి బొ మ్మలు వేసేద.ి
ఆమెలోని ఆ జ్ఞా నమంతా పెళ్ళికాగానే ఇంటి పనుల్లో పడిపో యి కనుమరుగైపో యింది. భర్త ను ఆఫీసుకు
సాగనంపడం, పిల్లలను తయారుచేసి బడికి పంపడం, ఇంటిపని, వంటపనులతో విసుగూ, విరామం లేకుండా ఇంటికే
అంకితమైపో యింది. దీనితో ఆమె తీరిక లేని జీవితంలో చివరికి తన పేరునే మరచిపో యింది. ఈనాటి సమాజంలో
కూడా ఎంతోమంది చదువుకున్న ఆడవాళ్ళు ఇంటికే అంకితమైపో యి తమ ఉనికిని కోల్పోతున్నారు. కాబట్టి
'ఇల్ల లకగానే' కథలో శారద అనే ఇల్లా లు తన పేరు మరచిపో వడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తా ను.
2. మరచిపో యిన తన పేరును తెలుసుకోవడానికి ఇల్లా లు చేసిన ప్రయత్నాలు ఏవి?.
జ). మరచిపో యిన తన పేరు తెలుసుకోవడానికి ఇల్లా లు అనేక ప్రయత్నాలు చేసింది. ఇంటిలో కిటికీ దగ్గ ర
నిలబడి తల గోక్కుంటూ తెగ ఆలోచించింది. అయినా ఆవిడకు తన పేరు గుర్తు కు రాలేదు. తన పేరేమిటో చెప్పమని
ఇంట్లో పనిచేసే పని మనిషిని అడిగింది. దానికి ఆమె 'ఎప్పుడూ అమ్మగారూ! అని పిలవడం తప్ప, తమ పేరు
తెలుసుకునే అవసరం రాలేదని' సమాధానం చెప్పింది.
బడి నుండి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన పిల్లలను తన పేరేమిటో చెప్పమని అడిగింది.
పిల్లలు ఆశ్చర్యపో తూ 'నిన్ను అమ్మా! అని పిలవడం తప్ప, మాకు ఇంకేం తెలియదు.' అని తెగేసి చెప్పేశారు.
పేరంటం పిలవడానికి వచ్చిన పక్కింటావిడను తన పేరేమిటో చెప్పమని అడిగింది. ఆవిడ తాను ఎప్పుడూ మీ పేరు
అడగనూ లేదు. మీరు చెప్పనూ లేదు. కాబట్టి మీ పేరు నాకు తెలియదని చెప్పేసింది.
భర్త ను అడిగితే 'నీ పేరు నాకు గుర్తు లేదు. కొత్త పేరు ఏదైనా పెట్టు కో' అని నిరుత్సాహపరిచాడు.
చదువుకున్న సర్టిఫికెట్లలో తన పేరు ఉంటుందని ఆత్రు తతో వాటిని వెతికింది. కానీ అవి దొ రకలేదు. పుట్టింటికి వెళ్లి
వాళ్ళ అమ్మను అడిగితే నువ్వు 'మా పెద్దమ్మాయివి..' అంటూ ఆమె పెళ్లి , పేరంటం గురించి చెప్పిందే గాని పేరు
మాత్రం చెప్పలేదు. చివరికి తన చిన్ననాటి స్నేహితురాలు ప్రమీల కనిపించి తనను పేరు పెట్టి పిలిచింది. ఆమెకు
పో యిన ప్రా ణం లేచి వచ్చినట్ల యింది. తన స్నేహితురాలి ద్వారానైనా తన పేరు తెలిసినందుకు ఎంతో ఆనందించింది.
3. ఇల్లా లు, స్నేహితురాలిని కలిసిన సందర్భాన్ని సంభాషణ రూపంలోకి మార్చి రాయండి.
జ). స్నేహితురాలు : శారదా!.. శారదా!.. పిలుస్తు ంటే పలకకుండా వెళ్ళిపో తున్నావేమే?
ఇల్లా లు : హాయ్.. ప్రమీలా! ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు?
స్నేహితురాలు : అదేంటే ఏమని పిలుస్తా ను. నీ పేరుపెట్టి శారద అనేకదా పిలిచాను.
ఇల్లా లు : హమ్మయ్య నీ పిలుపుతో పో యినప్రా ణం లేచి వచ్చిందే ప్రమీలా.
స్నేహితురాలు : అదేంటే అలా అంటున్నావు?
ఇల్లా లు : నిజమే ప్రమీలా! నేను ఇంటి పనుల్లో పడిపో యి నా పేరును కూడా మరచిపో యాను తెలుసా!
స్నేహితురాలు : మరి మీ ఇంట్లో వాళ్ళను ఎవరినైనా అడిగితే చెప్పేవారు కదా!
ఇల్లా లు : ఆ సంబరమూ అయ్యింది. ఒక్కరు కూడా నా పేరు గుర్తు లేదన్నారు.
స్నేహితురాలు : అప్పట్లో నువ్వు టెన్త్ స్కూల్ ఫస్టు వచ్చావు. కాలేజీలో మ్యూజిక్ పో టీల్లో కూడా ఫస్టు
వచ్చావు.
ఇల్లా లు : నిజమే ప్రమీలా! నువ్వు చెబుతుంటే పాత సంగతులన్నీ గుర్తు కు వస్తు న్నాయి.
స్నేహితురాలు : అంతేనా! బొ మ్మలు ఎంత అందంగా వేసేదానివో!
ఇల్లా లు : నిజమే. కానీ కుటుంబ బాధ్యతల్లో పడి ఆ జ్ఞా నమంతా మరుగున పడిపో యింది.
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 60

స్నేహితురాలు : కుటుంబ బాధ్యతలు పంచుకోవడం అవసరమే కాదనను కానీ అవే జీవితంగా


బతికెయ్యకూడదు.
ఇల్లా లు : నీ మాటలతో నాకు జ్ఞా నోదయమైంది ప్రమీలా! ఈ రోజు నుంచి అందరూ కొత్త శారదను చూస్తా రు.
స్నేహితురాలు : సరే శారదా! ఇక నేను వెళ్ళొస్తా ను.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థా లు రాసి, సొ ంత వాక్యాలలో ప్రయోగించండి.
1. కోనేరు హంపి చదరంగం ఆటలో నేర్పరి.
జ). నేర్పరి = నిపుణత కలిగినవారు
*నిపుణత కలిగినవారు ఏ పనినైనా చక్కగా చేయగలుగుతారు.
2. అమ్మ తీర్చిదిద్దిన బొ మ్మను నేను.
జ). తీర్చిదిద్దిన = చక్కగా రూపొ ందించిన
*తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్త కం చక్కగా రూపొ ందించబడింది.
3. ఉపాధ్యాయుడు మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి భుజం తట్టా డు.
జ). భుజం తట్టా డు = అభినందించాడు
*బాగా పనిచేసిన ఉద్యోగిని కంపెనీ మేనేజరు అభినందించాడు.
4. విద్యార్థికి విద్యార్జనే తపనగా ఉండాలి.
జ). విద్యార్జన = చదువుకోవడం
*ప్రతి విద్యార్థి చదువుకోవడమే తన ప్రథమ కర్త వ్యంగా కష్ట పడి చదవాలి.
ఆ). కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నిఘంటువును ఉపయోగించి సమానార్ధక పదాలను
రాయండి.
1. అన్నకు చదివిన పద్యం గుర్తు కు రాలేదు.
జ). గుర్తు = జ్ఞ ప్తి, జ్ఞా పకం
2. పండుగనాడు ఇంట్లో అందరూ కొత్త బట్ట లు ధరించారు.
జ). బట్ట లు = వస్త్రా లు, అంబరాలు
3. నెహ్రూ జైలు నుండి ఇందిరకు ఉత్త రాలు రాశారు.
జ). ఉత్త రాలు = లేఖలు, జాబులు
4. క్రికెట్ చూస్తు న్న వారందరకూ మన జట్టే గెలవాలని తపన.
జ). తపన = ఆత్రు త, మిక్కిలి ఆసక్తి
5. చదువుకున్న ఇల్లా లు ఇంటిని చక్కదిద్దు కుంటుంది.
జ). ఇల్లా లు = భార్య, అర్ధా ంగి, గృహిణి
ఇ). కింది పదాలలో ప్రకృతి - వికృతులను జతపరిచి రాయండి.
తీరము - గారవం - ప్రా ణము - దరి - బాస - గౌరవం - అచ్చెరువు - భాష - ఆశ్చర్యం - పానము
క్రమ సంఖ్య ప్రకృతి వికృతి

1. తీరము దరి

2. గౌరవం గారవం

3. ప్రా ణము పానము

4. భాష బాస

💥వాక్యాలు :
5. ఆశ్చర్యం అచ్చెరువు

అ). కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.


1. రాధ పాట పాడుతున్నది. రవి పాట పాడుతున్నాడు.
జ). రాధ, రవి పాట పాడుతున్నారు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 61

2. సాందీపుడు గురువు. శ్రీకృష్ణు డు శిష్యుడు.


జ). సాందీపుడు, శ్రీకృష్ణు డు గురుశిష్యులు.
3. రవి బజారుకు వెళ్ళాడు. రఘు బజారుకు వెళ్ళాడు.
జ). రవి, రఘు బజారుకు వెళ్ళారు.
4. భీముడు వీరుడు అర్జు నుడు వీరుడు.
జ). భీమార్జు నులు వీరులు.
ఆ). కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. శైలజ నడుస్తు న్నది. శైలజ పాట పాడుతున్నది.
జ). శైలజ నడుస్తూ పాట పాడుతున్నది.
2. నెమలి వేగంగా వచ్చింది. నెమలి పామును చూసింది.
జ). నెమలి వేగంగా వచ్చి పామును చూసింది.
3. నేను ఉదయాన్నే లేచాను. నేను వ్యాయామం చేశాను.
జ). నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను.
4. ఏనుగు తొండం ఎత్తి ంది. ఏనుగు ఘీంకరించింది.
జ). ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది.
ii). వ్యాకరణాంశాలు :
అ). కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.
1. రామన్న కూరగాయలు పండించాడు.
జ). కూరగాయలు = కూర + కాయ = గసడదవాదేశ సంధి
2. ఊరువల్లెలు జాతరకు కదలివచ్చాయి.
జ). ఊరువల్లెలు = ఊరు + పల్లె = గసడదవాదేశ సంధి
3. మన అందరికీ ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రు లు.
జ). తల్లిదండ్రు లు = తల్లి + తండ్రి = గసడదవాదేశ సంధి
4. రాజు కొలువుసేసి ఉన్నాడు.
జ). కొలువుసేసి = కొలువు + చేసి = గసడదవాదేశ సంధి
ఆ). కింది పదాలకు సంధిచేసి కలిపి రాయండి.
1. వాడు + కొట్టె = వాడుగొట్టె = గసడదవాదేశ సంధి
2. నీవు + టక్కరివి = నీవుడక్కరివి = గసడదవాదేశ సంధి
3. వత్తు రు + పో దురు = వత్తు రువోదురు = గసడదవాదేశ సంధి
4. వారు + చనిరి = వారుసనిరి = గసడదవాదేశ సంధి
ఇ). కింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి.(ఎరుపు రంగులో ఉన్నవి సమాధానాలు)
క్రమ సంఖ్య సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు

1. చదువు సంధ్యలు చదువుయునూ,సంధ్యయునూ ద్వంద్వ సమాసం

2. మూడుముళ్ళు మూడైన ముళ్ళు ద్విగు సమాసం

3. అశాంతి శాంతి కానిది నఇ్ తత్పురుష సమాసం

4. పాత కాగితాలు పాతవైన కాగితాలు విశేషణ పూర్వపద కర్మధారయసమాసం

5. నా చరిత్ర నా యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం


.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 62

2.రంగస్థ లం
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. నాటకం అంటే ఏమిటో చెప్పండి?
జ). ప్రజల వినోదం కోసం సంభాషణ, సంగీతం, నృత్య సమన్వితంగా తయారుచేయబడ్డ ఒక కళాత్మక ప్రక్రియ
నాటకం. ఇది వినోద ప్రధానమైన కళ. కవి రాసిన వాక్యాలకు, సృష్టించిన పాత్రలకు నటీనటులు జీవం పో స్తా రు.
విస్త ృతమైన లోకానుభవం, లోతైన మానవ సంబంధాలు, మానవ స్వభావాలు, నటీనటుల అభినయం కలగలిసి
జీవితానికి సమాంతరంగా సాగేది నాటకం. ఇది అనేక కళల సమాహారం.
2. పౌరాణిక నాటకాల విశేషత గురించి రాయండి.
జ). పౌరాణిక నాటకాలు జనరంజకంగా ఉండేవి. వాటిలో మంచి మంచి పద్యాలు, సంభాషణలు ఉండేవి. ఆ
కాలంలో ఉద్ద ండులైన పండితులే కాకుండా, ఏమీ చదువుకోని పామరులు కూడా పౌరాణిక నాటకాలలోని పద్యాలను
రాగ, భావ యుక్త ంగా అలవోకగా ఆలపించి వీనుల విందు చేసేవారు. అప్పట్లో ఈ నాటకాలు ప్రదర్శించని ఊరంటూ
ఉండేదికాదు. ఈ విధంగా పౌరాణిక నాటకాలు ఎంతో విశేషత పొ ందాయి.
3. ఏకపాత్రలో నటించాలంటే నటుడు ఏఏ అంశాలపై దృష్టి పెట్టా లి?
జ). ఏకపాత్ర ఒక రకమైన నాటక ప్రక్రియ. ఒక నటుడు ఒకే పాత్రను అభినయించడాన్ని ఏకపాత్రా భినయం
అంటారు. ఏకపాత్రలో నటుడు ఏ పాత్రను పో షిస్తు న్నాడో ఆ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగా
అర్థం చేసుకోవాలి. వేషధారణ ఆ పాత్రకు జీవం పో స్తు న్నట్లు గా ఉండాలి. నటుని ఆంగికం, వాచకం నటిస్తు న్న పాత్రకు
తగిన విధంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నటుడు తాను నటిస్తు న్న పాత్రను ప్రేక్షకుల హృదయాలలో
జీవింపజేయాలి.
4. వీథి నాటకానికి, వేదిక నాటకానికి తేడాలు రాయండి.
జ). ఊరూరా తిరుగుతూ నాలుగురోడ్ల కూడలిలో, ఖాళీ మైదానాల్లో ప్రదర్శించే నాటకాన్ని వీథి నాటకం
అంటారు. దీనిలో నటులు అతి తక్కువ ఆహార్యం, దుస్తు లతో వలయాకారంగా నిలబడి,అందరికీ కనపడేలా,
వినపడేలా కాగడాల వెలుతురులో నాటకాన్ని ప్రదర్శిస్తా రు. ఈ నాటకాలలో సామాజిక సమస్యలు ప్రధాన
ఇతివృత్త ంగా ఉంటాయి.
ఒకచోట వేదికను ఏర్పాటు చేసుకుని ప్రదర్శించే నాటకాన్ని వేదిక నాటకం అంటారు. చక్కటి వేషధారణ
కలిగిన నటులు గాజు దీపాల వెలుగులో వేదికపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తా రు. రంగురంగుల వస్త్రా లతో వేదిక వెనుక,
రెండు ప్రక్కలా తెరలుగా కడతారు. ప్రేక్షకులు ఆ నాటకం ప్రదర్శించే చోటుకే వచ్చి చూడవలసి ఉంటుంది.
ఆ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఒక కుర్రా డు 23 దేశాల నుంచి వచ్చిన 120 చిత్రా లతో పో టీకి నిలిచి ఎంపికైన 35 చిత్రా లలో ఒక దానికి
దర్శకత్వం వహించి గుర్తింపు సాధించాడు. …………………… ఆ చిన్న చిత్రం వేలాది పేద బాలల అనాధల బాల
కార్మికుల జీవితాలకు ప్రతిబింబమైంది. (పూర్తి గద్యం కొరకు పాఠ్య పుస్త కం చూడగలరు)
@ప్రశ్నలు :
1. ఆషికుల్ సాధించిన ఘనత ఏమిటి?
జ). 11 ఏళ్ల వయస్సులోనే అనాధ బాలల జీవితాన్ని చిత్రించేలా "ఆమి - ఐయామ్" అనే లఘుచిత్రం తీయడం.
2. బాల కార్మికుల జీవితాలు తెలిపే లఘుచిత్రం పేరు ఏమిటి?
జ). బాల కార్మికుల జీవితాలు తెలిపే లఘుచిత్రం పేరు "ఆమి - ఐయామ్".
3. దృష్టిలో పడడం అంటే ఏమిటి?
జ). దృష్టిలో పడడం అంటే ఎదుటివారి మనసును ఆకర్షించడం
4. ముక్టనీర్ సంస్థ ఉన్న ప్రా ంతం ఏది? ( ఆ )
అ). బెంగాల్. ఆ). మధ్యగ్రా మ్ ఇ). ధార్వాడ ఈ). హైదరాబాద్
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). "ఆమి - ఐయామ్". లఘుచిత్రంలోని ఇతివృత్త ం ఏమిటి?
ఇ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
స్థా నం నరసింహారావు శ్రీ పాత్రలు ధరించడంలో దిట్ట. ……………………………… నటుడిగా ధ్వని
అనుకరణలో విశేష ప్రతిభ చూపిన నేరెళ్ల వేణుమాధవ్ గారు తెలుగు ప్రజలకు "వెంట్రిలాక్విజమ్" అనే నూతన కళను
పరిచయం చేశారు. (పూర్తి గద్యం కొరకు పాఠ్య పుస్త కం చూడగలరు)

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 63

@ప్రశ్నలు :
1. పై పేరాలో స్త్రీ పాత్రలు పో షించిన పురుష నటుల పేర్లు రాయండి.
జ). స్థా నం నరసింహారావు, ఉప్పులూరి సంజీవరావు గార్లు స్త్రీ పాత్రలు పో షించిన పురుష నటులు.
2. వేమూరి గగ్గ య్య గారి నటనా విశేషం ఏమిటి?
జ). కంసుడు, యముడు, రావణుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి రౌద్ర పాత్రలు పో షించడం వేమూరి
గగ్గ య్య గారి నటనా విశేషం.
3. సత్య హరిశ్చంద్ర పాత్ర ద్వారా విశేష గుర్తింపు పొ ందిన నటుడు ( ఆ )
అ). స్థా నం నరసింహారావు ఆ). డి.వి.సుబ్బారావు ఇ). బందా కనక లింగేశ్వరరావు
4. పాత్రలో ఒదిగి పో వడం అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు?
జ). 'ఇచ్చిన పాత్రను చక్కగా పో షించడంలో లీనమైపో వడం' అని అర్థం చేసకున్నాను.
5. మిమిక్రీ అనే ఇంగ్లీషు పదానికి సమానార్ధక తెలుగు పదం ఏది?
జ). 'ధ్వని అనుకరణ' అనేది మిమిక్రీ అనే ఇంగ్లీషు పదానికి సమానార్ధక తెలుగు పదం.
ఈ). మీ ఉపాధ్యాయుడిని అడిగి కింది నాటికలను వాటిని రాసిన రచయితలతో జతపరచండి.
1. ఆత్మవంచన - అ). గొల్ల పూడి మారుతిరావు ( 7 )
2. తేలుకుట్టిన దొ ంగలు - ఆ). బళ్లా రి రాఘవ ( 6 )
3. కప్పలు - ఇ). మునిమాణిక్యం ( 5 )
4. కంఠాభరణం - ఈ). పానుగంటి ( 4 )
5. గృహప్రవేశం - ఉ). ఆత్రేయ ( 3 )
6. సరిపడని సంగతులు - ఊ). పొ ట్లూ రి వెంకటేశ్వరరావు ( 2 )
7. సత్యంగారిల్లెక్కడ - ఎ). బుచ్చిబాబు ( 1 )
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. సాంఘిక నాటకాలు సమాజాన్ని చైతన్యపరచడానికి ఏవిధంగా కృషిచేస్తు న్నాయి?
జ). ప్రా రంభంలో పురాణాలు, దేవతల చుట్టూ తిరిగిన నాటకం కాలానుగుణంగా తన మార్గా న్ని
మార్చుకుంది. ప్రజల కష్టా లు, కన్నీళ్లు , వేదనలు, పో రాటాలు ఇతివృత్తా లుగా నాటక రచన ప్రా రంభమైంది.
బాల్యవివాహాలను నిరసిస్తూ , అర్థం పర్థం లేని ఆచారాలను వేళాకోళం చేస్తూ , వితంతు వివాహాలని ప్రో త్సహిస్తూ
గురజాడ అప్పారావు గారు రాసిన 'కన్యాశుల్కం' నాటకం మొదలుకొని సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి
భాస్కరరావు కలసి రచించిన 'మాభూమి', బో యి భీమన్న గారు రాసిన 'పాలేరు', కాళ్ళకూరి నారాయణరావు గారు
రాసిన 'వర విక్రయం', ప్రస్తు త కాలంలో వస్తు న్న అనేక సాంఘిక నాటకాలు వరకూ సామాజిక సమస్యలను సాంఘిక
దురాచారాలను ఎత్తి చూపుతూ, సమాజాన్ని చైతన్య పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ నేఉన్నాయి.
2. నాటక రంగంలో రేడియో నాటకాల ప్రత్యేకతను వివరించండి.
జ). 1967 నుండి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రా రంభమైంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
రాసిన 'గణపతి' హాస్య నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 1967లో ప్రసారమైంది. రేడియో నాటకానికి
సంభాషణలే ప్రా ణం. నండూరి సుబ్బారావు, పుచ్ఛా పూర్ణా నందం, వి.బి.కనకదుర్గ , శారదా శ్రీనివాసన్, చిరంజీవి,
రేడియో అన్నయ్య - అక్కయ్యలుగా పేరుపొ ందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి వంటి ఎందరో ప్రముఖులు
తమ గాత్రా లతో ఎన్నో పాత్రలకు ప్రా ణం పో శారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో నాటకానికి ఎంతో ప్రా చుర్యం
కల్పించింది. రేడియో ద్వారా వినిపించే శ్రవ్య నాటకాలు శ్రో తలను విశేషంగా ఆకర్షించాయి.
3. తెలుగు నాటకరంగంలో సంచలనం కలిగించిన నాటకాల గురించి రాయండి.
జ). తెలుగు నాటక రంగంలో కన్యాశుల్కం, పాలేరు, మాభూమి, వంటి నాటకాలు పెను సంచలనం
కలిగించాయి. గురజాడ అప్పారావు గారి 'కన్యాశుల్కం' నాటకం బాల్యవివాహాలను నిరసిస్తూ , అర్థం పర్థం లేని
ఆచారాలను వేళాకోళం చేస్తూ , వితంతు వివాహాలను ప్రో త్సహిస్తూ , ఆనాటి సమాజంలో గొప్ప సంచలనం
కలిగించింది. బో యి భీమన్న గారి 'పాలేరు' నాటకం ప్రభావంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత
స్థా నాలను అధిరోహించారు. సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు కలిసి రచించిన 'మా భూమి' నాటకం
పీడిత జనుల వేదనాభరిత జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఇలా అనేక నాటకాలు తెలుగు
నాటకరంగంలో సంచలనం కలిగించాయి.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 64

4. రంగస్థ లం పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.


జ). రంగస్థ లం అనే పాఠ్యభాగాన్ని తనికెళ్ళ భరణి గారు రచించారు. వీరి పూర్తి పేరు తనికెళ్ల దశ భరణి శేష
ప్రసాద్. ఆధునిక కాలానికి చెందిన రచయిత,నటుడు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి వంటి కవితా
సంపుటులు; అద్దెకొంప, కొక్కొరోకో, గో గ్రహణం వంటి నాటకాలు; శభాష్ రా శంకర, ఆటగదరా శివ వంటి భక్తి గీతాలు
వీరు రచించారు. 750 సినిమాలలో నటించారు. 52పైగా సినిమాలకు సంభాషణలు రాశారు. మిథునం సినిమాకు
దర్శకత్వం వహించారు. నంది, ఫిలింఫేర్ వంటి ఎన్నో పురస్కారాలు పొ ందారు.
5. 'వ్యాసం' ప్రక్రియను పరిచయం చేయండి.
జ). ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే
ప్రక్రియను వ్యాసం అంటారు. వ్యాసానికి ఒక స్పష్ట మైన ప్రా రంభం, వివరణ, ముగింపు అనే లక్షణాలుంటాయి.
రచయిత విషయాన్ని కూలంకషంగా పరిశీలించి అవసరమైన సమాచారాన్ని క్రో డీకరించి వ్యాసం రూపొ ందిస్తా రు.
6. రంగస్థ లం పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జ). ఎందరో లబ్ద ప్రతిష్టు లైన కవులు అనేక నాటకాలను రాశారు. నటీనటులు తమ అద్భుత నటనతో
వాటికి దృశ్యరూపం కల్పించారు. అనేక నాటక సమాజాలు నాటకాలను ప్రదర్శిస్తూ వాటికి ఆదరణ కల్పించాయి.
సామాజిక సమస్యలను, సాంఘిక దురాచారాలను ఎత్తి చూపుతూ నాటకం కొత్త పుంతలు తొక్కింది. ఒకప్పుడు
అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నాటకరంగం సినిమా ప్రవేశంతో తన ప్రా భవాన్ని కోల్పోయింది. ప్రస్తు త
కాలంలో క్షీణదశలో ఉన్న నాటకరంగం ప్రఖ్యాతిని నేటి తరానికి తెలియజేయాలన్న తపనే ఈ పాఠ్యభాగ నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. మీ ఊరిలో పాటిబండ్ల ఆనందరావు గారు రచించిన 'అంబేద్కర్ రాజగృహ ప్రవేశం' నాటికను
ప్రదర్శిస్తు న్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జ).
రండి చూడండి ఆనందించండి
అంబేద్కర్ రాజగృహ ప్రవేశం - ఆహ్వానం
సో దర సో దరీమణులారా!
నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురించి తెలియని వారు ఎవరూ లేరనుట
అతిశయోక్తి కాదు. అయితే మీలో చాలామందికి అంబేద్కర్ జీవిత విశేషాలు పూర్తిగా తెలిసి ఉండకపో వచ్చు.
అంబేద్కర్ జీవితంలోని మనకు తెలియని అనేక విషయాలను స్పృశిస్తూ పాటిబండ్ల ఆనందరావు గారు
"అంబేద్కర్ రాజగృహ ప్రవేశం" అనే నాటికను రాశారు. ఆ నాటికను తేదీ 05-08-2023న మన కె.పెదపూడి
గ్రా మంలో ప్రదర్శించబో తున్నారు. అంత మంచి నాటిక మన గ్రా మంలో ప్రదర్శించడం చాలా గొప్ప విషయం.
కావున గ్రా మంలోని ప్రతి ఒక్కరూ ఆ నాటికను చూసి తరించవలసిందిగా కోరుచున్నాము.
*నాటిక వివరాలు :
1. ప్రదర్శన స్థ లం : కె.పెదపూడి గ్రా మ సచివాలయం వద్ద
2. ప్రదర్శన తేద,ీ సమయం : 05-08-2023, శనివారం,సాయంత్రం 5 గంటలకు
3. ప్రవేశ రుసుము : ఉచితం
అందరూ ఆహ్వానితులే.
కె.పెదపూడి, ఇట్లు
03-08-2023. లక్ష్మీకృష్ణ కళాసమితి.
2. ఒక నాటికను ప్రదర్శించాలి అంటే నాటిక ఎంపిక దగ్గ ర నుంచి వేదిక మీద ప్రదర్శించడం వరకు ఎన్నో
పనులుంటాయి కదా!మీ ఉపాధ్యాయుని/పెద్దలను అడిగి తెలుసుకుని నాటక ప్రదర్శనపై వ్యాసం రాయండి.
జ). ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే ముందుగా ప్రదర్శించబో యే నాటకంలో మంచి కథాంశం ఉండేలా
ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న కథాంశం ఏ ఒక్క మతాన్ని, కులాన్ని, వర్గా న్ని ప్రో త్సహించేదిగా లేదా
వ్యతిరేకించేదిగా ఉండకూడదు. ఆ తర్వాత ప్రదర్శన స్థ లం, ప్రదర్శన సమయం అందరికీ అనుకూలంగా ఉండేలా
చూసుకోవాలి. ప్రదర్శించబో యే నాటకంలోని పాత్రలకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసుకోవాలి. ఆయా
పాత్రలకు తగిన విధంగా అలంకరణ సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.
నాటక ప్రదర్శనకు ముందే నటినటులు తమ తమ పాత్రల్లో లేనమై నటించేలా తర్ఫీదునివ్వాలి.
నటీనటుల వేషధారణ నాటకంలోని పాత్రలను ప్రత్యక్షంగా చూస్తు న్న అనుభూతిని కలిగించాలి. విశాలమైన రంగస్థ లం
ఏర్పాటు చేసుకోవాలి. రంగస్థ లం అలంకరణ నాటకంలోని కథాంశానికి అనుగుణంగా ఉండాలి. అవసరమైన సంగీత

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 65

వాయిద్య పరికరాలను, కాంతివంతమైన దీపాలను సమకూర్చుకోవాలి. నాటకం విజయవంతంగా ప్రదర్శించాలంటే


ఇలాంటి అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
3. 'ధర్మబో ధ' కథాంశాన్ని తీసుకుని నాటికగా ప్రదర్శించడం కోసం సంభాషణలు రాయండి. ప్రదర్శించండి.
జ). శకుంతల : ఓ దుష్యంత మహారాజా! నిజం చెప్పు. నేనెవరో నిజంగా నీకు తెలియదా? లేదా ఏదైనా కారణం
చేత నన్ను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఇలా మాట్లా డుతున్నావా?
దుష్యంతుడు : నీవెవరో నిజంగా నాకు తెలియదు. ఇంతకు ముందెప్పుడూ నేను నిన్ను చూడలేదు కూడా!
శకుంతల : వేటకోసం వచ్చి కణ్వ మహర్షి ఆశ్రమంలో నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నారే! ఇప్పుడు బిడ్డ
పుట్టా క ఇలా మాట్లా డటం మీకు తగునా?
దుష్యంతుడు : ఇంతకీ నీకు ఏమి కావాలి? ఎందుకొచ్చావిక్కడికి?
శకుంతల : కణ్వ మహర్షి ఆశ్రమంలో నాకు చేసిన ప్రతిజ్ఞ ను నెరవేర్చి, మన ప్రేమకు గుర్తు గా పుట్టిన
ఈ పిల్లవాణ్ణి మీ బిడ్డ గా స్వీకరించండి మహారాజా!
దుష్యంతుడు : మీరెవరో నాకు తెలియదంటున్నా కదా! ఇంకా అనవసరపు మాటలెందుకు? అయినా
మహారాజునైన నేనెక్కడ? సామాన్యులైన మీరెక్కడ?
శకుంతల :(తనలో తాను) అయ్యో! కట్టు కున్న భర్తే నన్ను కాదంటే నాకింక దిక్కెవరు? సత్యాన్ని
కాపాడాల్సిన ప్రభువులే అసత్యం మాట్లా డితే ఎలా? ఎప్పటికైనా ధర్మమే గెలుస్తు ంది.
దుష్యంతుడు : ఇంతవరకూ చెప్పింది చాలు! ఇక నీవు వెళ్ళవచ్చు.
శకుంతల : ఓ పంచభూతాల్లా రా! మీరైనా రాజుకు గతాన్ని గుర్తు చేసి,నాకు న్యాయం జరిగేలా చెయ్యండి.
ఎప్పటికైనా సత్యమే గెలిచి నిలుస్తు ందనే నిజాన్ని లోకానికి చాటిచెప్పండి.
దివ్యవాణి(కనిపించకుండా) : దుష్యంత మహారాజా! ఉత్త మ ఇల్లా లు,మహా ప్రతివ్రత అయిన శకుంతల
వివేకంతో నిజమే చెప్పింది ఈ భరతుడు నీకు, శకుంతలకు పుట్టిన ముద్దు లబిడ్డ డు. వీరిరువురుని
నీ భార్యాబిడ్డ లుగా స్వీకరించు.
దుష్యంతుడు : శకుంతలా! నన్ను మన్నించు. దివ్యవాణి నా కళ్ళు తెరిపించింది. నేటినుండి నీకూ, మన
బిడ్డ కూ ఏలోటూలేకుండా ప్రేమగా చూసుకుంటాను.
III). భాషాంశాలు:
i). పదజాలం :
అ). కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థా లు రాయండి.
1. దూరవాణి వచ్చిన తర్వాత ఉత్త రాలు కనుమరుగు అయ్యాయి.
జ). కనుమరుగు = కనిపించకుండా పో వు
2. ఆమె నటనకు ప్రేక్షకులు హర్షద్వానాలు చేశారు.
జ). హర్షధ్వానాలు = చప్పట్లు
3. కొన్ని నాటకాలు ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటాయి.
జ). నిత్యనూతనంగా = ఎప్పటికీ కొత్త గా
4. అన్నమయ్య కీర్తనలు సంగీత సాహిత్య సమ్మేళనంగా ఉంటాయి.
జ). సమ్మేళనం = కలయిక
5. గణపతి నాటకం ఆద్యంతం హాస్యం పండిస్తు ంది.
జ). ఆద్యంతం = మొదటి నుండి చివరి వరకూ
ఆ). కింది వాక్యాలను పరిశీలించండి. పర్యాయపదాలను గుర్తించి రాయండి.
1. స్త్రీల హక్కుల గురించి తెలిస్తేనే మహిళలు ముందడుగు వేయగలరు.
జ). స్త్రీలు, మహిళలు
2. ఒక గ్రా మంలో నాటక ప్రదర్శన చూసేందుకు చుట్టు పక్కల పల్లెటూర్ల నుండి బండి కట్టు కొని వచ్చేవారు.
జ). గ్రా మం, పల్లెటూరు
3. హాస్య కథలు చదివితే నవ్వు తెప్పిస్తా యి.
జ). హాస్యం, నవ్వు
4. నృత్య ప్రదర్శనలో శోభానాయుడు అద్భుతంగా నాట్యం చేసింది.
జ). నృత్యం, నాట్యం
5. నాటకం చూడడానికి వచ్చిన వీక్షకులు అందరూ ప్రేక్షకులే.
జ). వీక్షకులు, ప్రేక్షకులు

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 66

ఇ). కింది వాక్యాలను పరిశీలించండి. ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్ధా లు రాయండి.
1. పుస్త క పఠనం మనసుకు ఉల్లా సం కలిగిస్తు ంది.
జ). ఉల్లా సం = సంతోషం, ప్రకాశము
2. ఎంచుకున్న మార్గ ం మంచిది అయితే విజయం చేరువ అవుతుంది.
జ). చేరువ = సమీపము, సమూహము
3. కళాక్షేత్రం భవనాన్ని నూతనంగా నిర్మించారు.
జ). నూతనం = కొత్త , యువ
4. కరువు కాలంలో భుక్తి గడవడం కష్ట ం.
జ). కాలం = సమయము, నలుపు
5. ఆమె చేసిన కృషి వల్ల నే విజయం సాధించింది.
జ). కృషి = ప్రయత్నం,వ్యవసాయం

💥
ii). వ్యాకరణాంశాలు :

👉
సంధులు :
రుగాగమ సంధి :
1. పేదరాలు = పేద + ఆలు
2. బీదరాలు = బీద + ఆలు
3. బాలింతరాలు = బాలెంత + ఆలు
4. మనుమరాలు = మనుమ + ఆలు

👉
*పై ఉదాహరణలలో పూర్వపదాలుగా పేద, బీద, బాలెంత, మనుమ అనే పదాలున్నాయి. పరపదంగా "ఆలు" శబ్ద ం ఉంది.
* సూత్రం - 1 : కర్మధారయ సమాసంలో పేదాది శబ్ద ములకు "ఆలు" శబ్ద ం పరమైతే రుగాగమం వస్తు ంది.
ఉదా : 1. పేద + ర్ + ఆలు = పేదరాలు
2. బీద + ర్ + ఆలు = బీదరాలు
3. బాలెంత + ర్ + ఆలు = బాలింతరాలు
4. మనుమ + ర్ + ఆలు = మనుమరాలు

👉
(పేదాదులు - పేద, బీద, ముద్ద , బాలెంత, కొమ, గొట్టు ,అయిదవ,మనుమ … )
సూత్రం - 2 : కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకు "ఆలు" శబ్ద ం పరమైతే పూర్వపదం చివర ఉన్న
అత్వానికి ఉత్వం, రుగాగమం వస్తా యి.
ఉదా : 1. ధీర + ఉ + ర్ + ఆలు = ధీరురాలు
2. గుణవంత + ఉ + ర్ + ఆలు = గుణవంతురాలు
3. విద్యావంత + ఉ + ర్ + ఆలు = విద్యావంతురాలు
4. శ్రీమంత + ఉ + ర్ + ఆలు = శ్రీమంతురాలు
5. అసాధ్య + ఉ + ర్ + ఆలు = అసాధ్యురాలు
*పూర్వపదమైన తత్సమానికి "అకారమునకు" ఉకారం వచ్చింది. దీనిని రుగాగమసంధి అంటారు.
అ). కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
1. లోకానుభవం = లోక + అభినయం = సవర్ణ దీరస ్ఘ ంధి
2. అత్యుత్త మం = అతి + ఉత్త మం = యణాదేశసంధి

💥సమాసాలు :
3. మూకాభినయం = మూక + అభినయం = సవర్ణ దీరస ్ఘ ంధి

అ). కింది పదాలు చదవండి. విగ్రహవాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి.


1. పార్వతీ పరిణయం - పార్వతి యొక్క పరిణయం - షష్ఠీ తత్పురుష సమాసం.
2. పాతిక సంవత్సరాలు - పాతిక సంఖ్య గల సంవత్సరాలు - ద్విగు సమాసం.
3. యుగ కవి - యుగమునకు కవి - షష్ఠీ తత్పురుష సమాసం.

💥వాక్యాలు :
4. మయసభ - మయునిచే కట్ట బడిన సభ - తృతీయా తత్పురుష సమాసం.

అ). ఈ కింది సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.


1. శైలజ సైకిల్ తొక్కుతూ, పాట పాడుతున్నది.
జ). శైలజ సైకిల్ తొక్కుతున్నది. శైలజ పాట పాడుతున్నది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 67

2. రామారావు అన్నం తిని, పడుకున్నాడు.


జ). రామారావు అన్నం తిన్నాడు. రామారావు పడుకున్నాడు.
3. సీతమ్మ బట్ట లు ఉతికి, ఆరవేసింది.
జ). సీతమ్మ బట్ట లు ఉతికింది. సీతమ్మ బట్ట లు ఆరవేసింది.
4. శశిధర్ పరుగెత్తి అలసిపో యాడు.

💥అలంకారాలు :
జ). శశిధర్ పరుగెత్తా డు. శశిధర్ అలసిపో యాడు.

👉స్వభావోక్తి అలంకారం :
ఉదా : జింకలు బిత్త ర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.
వివరణ : పై వాక్యంలో జింకల స్వభావసిద్ధమైన స్థితిని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి చెప్పారు.
లక్షణం : జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లు గా మనోహరంగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి అలంకారం
అంటారు.
ఉదా : 1. చల్ల ని గాలికి పూలతోటలోని మొక్కలు తలలూపుతున్నాయి.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో చల్ల టి గాలికి పూలతోటలోని మొక్కలు ఊగుతుండటాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి
చెప్పారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
2. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తు న్నాయి.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో ప్రకృతికి అనుగుణంగా నెమలి నాట్యం చేస్తు న్న విధానాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి
చెప్పారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
3. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరచి గెంతుతున్నాయి.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో కొండపైనుండి ప్రవహిస్తు న్న సెలయేటిలో చేపలు ఈదటాన్ని ఉన్నది ఉన్నట్లు గా
వర్ణించి చెప్పారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
4. మంచు కొండలలో ముంచే మంచును తట్టు కుంటూ సైనికులు పహారా కాస్తు న్నారు.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో మంచుకొండల్లో సైనికులు పహారా కాయడాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి చెప్పారు.
కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 68

3. ప్రియమైన నాన్నకు
I). అవగాహన ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
1. ప్రియమైన నాన్నకు కథ రచయిత్రి గురించి రాయండి.
జ). ప్రియమైన నాన్నకు కథ రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి గారు. ఈమె 1946వ సంవత్సరంలో
తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తు తం కాకినాడ జిల్లా ) కాట్రా వులపల్లెలో జన్మించారు. తెలుగు, హిందీ, ఒడియా, బెంగాలీ
భాషల్లో రచనలు చేశారు. ఒక చీకటి - ఒక వెన్నెల, పొ గమంచులో సూర్యోదయం, నాన్నకు రాయని ఉత్త రం,
కుసుమ కోమలి, గృహప్రవేశం మొదలైనవి వీరి రచనలు. మహిళా సాధికారత, స్వాతంత్య్రం, చదువు, ఉద్యోగం,
కుటుంబ విలువలు వీరి రచనలలో ఇతివృత్తా లుగా ఉంటాయి. 1992వ సంవత్సరంలో మరణించారు.
2. కృష్ణ మూర్తి గారికి ఫో న్లో మాట్లా డడం కన్నా ఉత్త రాలు రాయడం అంటేనే ఎందుకు ఇష్ట ం?
జ). ఫో న్లో సంభాషణలు అంత సంతృప్తికరంగా ఉండవు. సమయం గడుస్తు న్నకొద్దీ డబ్బులు ఎక్కువై
పో తాయని గాబరా పడుతూ చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పకుండానే ఫో ను పెట్టేస్తు ంటాము. అదే
ఉత్త రాల్లో అయితే చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా రాయగలుగుతాము. ఎదుటివారి మనసును
ఆకట్టు కునేలా చక్కని మాటల్ని గుర్తు కు తెచ్చుకుని మరీ రాయటానికి వీలుంటుంది. అందుకే కృష్ణ మూర్తి గారికి
ఫో న్లో మాట్లా డడం కన్నా ఉత్త రాలు రాయడం అంటేనే ఇష్ట ం.
3. చిన్నతనంలో రచయిత్రి తండ్రిగారైన కృష్ణ మూర్తి గారు ఆమెతో ఏ ఏ పుస్త కాలు చదివించారు?
జ). రచయిత్రి తండ్రిగారైన కృష్ణ మూర్తి గారు చిన్నతనంలో ఆమెతో దక్షయజ్ఞ ం, బంగారురాజు కథ,
జంతువుల - పక్షుల పుస్త కాలు, చందమామ, బాలమిత్ర పుస్త కాలు; ఠాగూర్, శరత్ చంద్ర, బంకించంద్ర ఛటర్జీల
అనువాదాలు; చలం, కొడవటిగంటి గార్ల కథలు; రామాయణం, భారతం, భాగవతం వచన రచనలు; పెర్ల్బక్, స్టీన్జెక్,
టాల్స్టాయ్, ఓహెన్రీ కథలూ; షేక్స్పియర్ నాటకాలు వంటి పుస్త కాలు చదివించారు.
4. రచయిత్రి తండ్రికి ఎప్పుడు, ఎందుకు ఉత్త రం రాయవలసి వచ్చింది?
జ). రచయిత్రి తన తండ్రి మరణించిన తరువాత ఆయనకు ఉత్త రం రాసింది. ఆమె తన తండ్రితో ఎక్కువగా
టెలీఫో న్లో మాట్లా డేద.ి ఆయనకు ఫో న్లో మాట్లా డటం అంత సంతృప్తిగా అనిపించేది కాదు. రచయిత్రి గారేమో ఆమెకు
వీలుకుదరక తండ్రి బ్రతికుండగా ఉత్త రం రాయలేకపో యారు. ఇప్పుడు ఆయనతో ఫో న్లో మాట్లా డదామన్నా ఆయన
ఎవరికీ అందని లోకాలకు వెళ్లి పో యారు. కాబట్టి ఇప్పుడు తండ్రితో తన అనుబంధాన్ని, జ్ఞా పకాలను నెమరు
వేసుకోవడానికి ఏకైక సాధనం ఉత్త రం మాత్రమే. తన తండ్రికి ఇష్ట మైన ఉత్త రం రాస్తు ంటే తండ్రితో మాట్లా డుతున్న
అనుభూతిని పొ ందవచ్చు. అందుకే రచయిత్రి తన తండ్రి మరణానంతరం ఆయనకు ఉత్త రం రాసింది.
5. "కమ్యూనికేషన్ గ్యాప్" అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు?
జ). రెండు తరాలకు చెందిన వ్యక్తు ల మధ్య ఆలోచనలు,జీవన విధానంలో అంతరాలను కమ్యూనికేషన్
గ్యాప్ అంటారని నేను అర్థం చేసుకున్నాను. పూర్వ కాలములోని వారు సమాచార సాధనంగా లేఖలను
ఉపయోగించేవారు. ప్రస్తు త కాలంలో సమాచారాన్ని తెలియజేసుకోవడానికి ప్రతి ఒక్కరూ మొబైల్ ఫో న్,
కంప్యూటర్ల పై ఆధారపడుతున్నారు. ఇక్కడ రెండు తరాల మధ్య సమాచార సాధనాల్లో అంతరం కనిపిస్తు ంది. ఈ
అంతరాలను కమ్యూనికేషన్ గ్యాప్ అంటారని నేను అర్థం చేసుకున్నాను.
ఆ). కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
నా కళ్ళు అందమైనవి అంటుంది అమ్మ. నిజమే నా కళ్ళు పెద్దవే కానీ ఏమి లాభం.
••••••••••••••••••••••••••••••••••••••••••• అమ్మ కళ్ళకు ఏమీ కనిపించవు. కనిపించినా వాటి గురించి అమ్మ
పట్టించుకోదు. ఆడవాళ్ళ కళ్ళే ఇట్లా ఎందుకుంటాయో! (సురక్ష - ఆంధ్రపద ్ర ేశ్ పో లీసు మాసపత్రిక, రాజకీయ కథలు -
శ్రీమతి ఓల్గా ) (*పూర్తి గద్యం కొరకు పాఠ్యపుస్త కంలోని 135,136 పుటలు చూడగలరు)
@ప్రశ్నలు :
1. రచయిత్రికి ఏడుపు అంటే ఇష్ట ం లేదు ఎందుకు?
జ). రచయిత్రి గారు ఏడిస్తే తన కళ్ళు బాగుండవని, మొహమంతా నల్ల గా కాటుకవుతుందని ఆమె అభిప్రా యం.
అందుచేత రచయిత్రికి ఏడుపు అంటే ఇష్ట ంలేదు.
2. 'నోరు మూసుకో లేకుంటే కళ్ళు మూసుకో' అని అమ్మ ఎందుకన్నది?
జ). ఆడపిల్లలకు ఏదైనా విషయం తెలిసినా దానిని బయటికి చెప్పకూడదు. ఏదైనా చూసినా చూడనట్లు గా
ఉండాలి. అనే అభిప్రా యం వాళ్ళ అమ్మగారికి ఉంది. అందుకే ఆమె ఈ మాటలు అన్నది.
3. ఆపదలో ఉన్న వాళ్ల కు సాయం చేయడంలో ఆడ, మగ తేడాలుంటాయా?

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 69

జ). ఆపదలో ఉన్న వాళ్ల కు సాయం చేయడంలో ఆడ, మగ తేడాలుండవు.


4. చూసి చూడనట్లు ఉండడం అంటే ఏమిటి?
జ). కళ్ళముందు జరుగుతున్న సంఘటనలను కూడా పట్టించుకోక పో వడం.
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న రాయండి.
జ). రచయిత్రి గారి కళ్ళు అందమైనవని ఎవరన్నారు?/ కళ్యాణిని వాళ్ళ నాన్న ఏమని తిట్టా డు?
ఇ). కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
యుద్ధ ంలోకి మొదటిసారిగా మహిళల్ని తెచ్చింది నేతాజీ. •••••••••••••••••••••••••••••• "మన మహిళా
దళం పేరు రాణీ ఝాన్సీ రెజిమెంట్. మరణ ధిక్కార మహిళా దళం మనది." అని దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం
చేశారు మహిళా సైనికులు. (*పూర్తి గద్యం కొరకు పాఠ్యపుస్త కంలోని 136వ పుట చూడగలరు)
@ప్రశ్నలు :
1. యుద్ధ రంగంలో మహిళల్ని మొదటిసారిగా పరిచయం చేసిన వారు ఎవరు?
జ). యుద్ధ రంగంలో మహిళల్ని మొదటిసారిగా పరిచయం చేసిన వారు నేతాజీ.
2. స్త్రీలు యుద్ధ రంగంలో ప్రవేశించడంపై మీ అభిప్రా యం రాయండి.
జ). స్త్రీలు శక్తియుక్తు లలో పురుషులకు ఏమాత్రం తీసిపో రు.కాబట్టి స్త్రీలు యుద్ధ రంగంలో ప్రవేశించడం సరియైన
పరిణామమే అని నేను భావిస్తు న్నాను.
3. పై పేరాలో యుద్ధ ం అని అర్థం వచ్చే పదాలను గుర్తించి రాయండి.
జ). సంగ్రా మం, కదనం, పో రాటం
4. 'ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తా రు' అంటే అర్థం ఏమిటి?
జ). లక్ష్మీబాయి తన కంఠంలో ప్రా ణం ఉన్నంత వరకూ ఆంగ్లేయులతో పో రాడింది. అలాగే ఈ మహిళలు కూడా
పో రాడతారని దీని అర్థం.
5. పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి.
జ). నేతాజీ తయారుచేసిన మహిళా దళం పేరేమిటి?
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
1. కృష్ణ మూర్తి గారు తన కుటుంబంతో కలిసి ఫో టో తీయించుకోవడం వెనుక గల సందర్భాన్ని
మీ సొ ంతమాటల్లో రాయండి.
జ). కృష్ణ మూర్తి గారిని కుక్క కరిచింది. రేబిస్ వ్యాధి వచ్చి చనిపో తారని అందరూ ఆయన్ను భయపెట్టా రు.
చనిపో యేలోపు భార్యాబిడ్డ లతో ఒక ఫో టో తీయించుకోవాలని ఆయన కోరిక. ఆ కోరిక తీర్చుకోవడం కోసం తన
భార్యాపిల్లలను తీసుకుని స్టూ డియోకువెళ్ళి, వారితో కలిపి ఒక ఫో టో తీయించుకున్నారు.
2. ఈ పాఠ్యాంశం ద్వారా రచయిత్రి తన తండ్రి గురించి ఏమి చెప్పదలచుకున్నారు?
జ). ఈ పాఠ్యాంశం ద్వారా రచయిత్రి తన తండ్రి వ్యక్తిత్వం గురించి చెప్పదలచుకున్నారు. ఆయన తనను, తన
చెల్లెల్ని, తమ్ముడిని క్రమశిక్షణతో పెంచిన విషయం చెప్పదలచుకున్నారు. ఆయన తన పిల్లల చదువు విషయంలో
చూపించిన శ్రద్ధ గురించి చెబుతూ, గొప్ప గొప్ప సాహిత్య గ్రంథాలు చదివించిన విషయాన్ని చెప్పదలచుకున్నారు.
బిడ్డ ల అభివృద్ధి కోసం తండ్రి పడే తపన గురించి చెప్పదలచుకున్నారు.
3. రచయిత్రి తండ్రి తమ కుమార్తెలకు స్వేచ్ఛనిచ్చినా అప్రమత్త ంగా ఉండేవారు అనడానికి కారణం ఏమిటి?
జ). రచయిత్రి తండ్రి కృష్ణ మూర్తి గారు తన ఇద్ద రు కుమార్తెలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పెంచారు. అయినప్పటికీ
ఆ స్వేచ్ఛ నిరుపయోగం కాకూడదనే మంచి ఆలోచనతో నిరంతరం అప్రమత్త ంగా ఉండేవారు. రచయిత్రి గారు
అధ్యాపకురాలుగా ఉద్యోగంలో చేరిన కొత్త లో కాలేజి మీటింగు ఉందని సాయంత్రం ఐదు దాటినా ఇంటికి
రాకపో యేసరికి ఆయన కారు వేసుకొచ్చి, కాలేజీ అంతా రెండుసార్లు తిరిగి వెళ్లా రట. ఈ సంఘటన రచయిత్రి తండ్రికి
తమ పిల్లలపై గల బాధ్యతను తెలియజేస్తు ంది.
4). సమాచార సాధనమైన 'లేఖ' ప్రక్రియను గురించి వివరించండి.
జ). వ్యక్తు లు,సంస్థ ల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ.
లేఖల ద్వారా తమ భావాలు, అనుభవాలు, అభిప్రా యాలు వ్యక్త మవుతాయి. లేఖలు కొన్ని సందర్భాలలో ప్రత్యేక
సాహితీ లక్షణాలను, విలువలను కలిగి ఉంటాయి. లేఖలు ఆయా కాలాలకు సంబంధించినవే అయినా కొన్నిసార్లు
అందులోని విషయాలు అన్ని కాలాలకు వర్తిస్తా యి. ప్రముఖవ్యక్తు లు రాసుకున్న వ్యక్తిగత లేఖలు తరువాతి
కాలంలో బహిర్గతమై ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఉదాహరణకు 'ఇందిరా - నెహ్రూ లేఖలు', సంజీవదేవ్
లేఖలు, చలం లేఖలు, అబ్రహం లింకన్ లేఖలు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 70

5). ప్రియమైన నాన్నకు పాఠ్యాంశ నేపథ్యం రాయండి.


జ). ఉత్త రం రాయడం ఒక కళ. ఉత్త రం ద్వారా వాస్త విక సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలు,
ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉత్త రం చదువుతుంటే రాసినవారు ఎదురుగా కూర్చుని
మాట్లా డుతున్న అనుభూతి కలుగుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాలైన వాట్సప్, మెయిల్ వంటివి కూడా
ఇలాంటి అనుభూతిని ఇవ్వలేవు. పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తి లా కరిగిపో తూ, బిడ్డ లకు బంగారు
భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం తపించిన తన తండ్రిని తలుచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్త రమే
ఈ పాఠ్యాంశ నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు జవాబులను రాయండి.
1. 'తల్లిదండ్రు ల బాగోగులు చూడడం పిల్లల కర్త వ్యం' ఈ విషయంపై పో టీల్లో మాట్లా డడానికి ఒక ప్రసంగ
వ్యాసాన్ని రాయండి.
జ). తల్లిదండ్రు ల ప్రేమతో సమానమైనది ఈ లోకంలో ఏదీలేదు. అమ్మ తన రక్తా న్ని ధారపో సి జన్మనిస్తే,
నాన్న తన చెమటను చిందించి బిడ్డ ల్ని పెంచి పో షిస్తా డు. అమ్మానాన్నలు తాము పస్తు లుండైనా సరే తమ పిల్లలకు
కడుపునిండా అన్నం పెడతారు. పిల్లల కోసం తాము ఎన్ని కష్టా లనైనా సంతోషంగా భరిస్తా రు. పిల్లలకు చిన్న కష్ట ం
వచ్చినా తట్టు కోలేరు. పిల్లలు విజయం సాధిస్తే తామే విజయం సాధించినట్లు గా ఆనందిస్తా రు. పిల్లల సుఖాలే తమ
సుఖాలుగా భావిస్తూ , తమ జీవితంలోని సుఖసంతోషాలను పిల్లలకోసం త్యాగం చేసే త్యాగమూర్తు లు
అమ్మానాన్నలు.
తల్లిదండ్రు లు ఈ లోకంలో మన కంటికి కనిపించే దేవుళ్ళు. తల్లిదండ్రు లను ఎప్పుడూ చులకన భావంతో
చూడకూడదు. ఆధునిక నాగరికత మోజులో పడి నేటి పిల్లలు చాలామంది పెరిగి పెద్దవారై, అభివృద్ధిలోకి వచ్చిన
తర్వాత తమ తల్లిదండ్రు లకు తిండి పెట్టడానికి కూడా బాధపడుతున్నారు. అమ్మానాన్నలు లేకపో తే మనం ఈ
లోకాన్నే చూసేవాళ్ళం కాదు. మన అభివృద్ధి అంతా వాళ్ళు పెట్టిన భిక్షే. మనం ఏమిచ్చినా వారి ఋణం
తీర్చుకోలేము. అటువంటి తల్లిదండ్రు ల బాగోగులు చూడటం తమ కర్త వ్యమని గుర్తెరిగి అవసరమైనపుడు కనీసం
వారి కనీస అవసరాలైనా తీర్చాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది.
2. మీకు మీ నాన్న మీద ఉన్న ప్రేమను తెలుపుతూ మీ సొ ంతమాటల్లో లేఖను రాయండి.
జ). గంగలకుర్రు ,
15-09-2023.
పూజ్యనీయులైన నాన్న గారికి మీ కుమారుడు శ్రీనివాసరావు నమస్కరిస్తూ వ్రా యు ఉత్త రం..,
నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. అక్కడ మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తు న్నాను. నాన్నా మీరు
నాకోసం, చెల్లి కోసం నిత్యం ఆలోచిస్తు ంటారని నాకు తెలుసు. మీరు సైకిల్ మెకానిక్ గా పనిచేస్తూ , మా అభివృద్ధి
కోసం నిరంతరం విశ్రా ంతి లేకుండా శ్రమిస్తు న్నారు. వస్తు న్న ఆదాయం సరిపొ కపో వడంతో నా చదువు మధ్యలో
ఆగిపో కూడదనే ఉద్దేశంతో మీరు నన్ను హాస్ట ల్లో చేర్చారు.
మీరు, అమ్మ నన్ను విడిచి ఉండలేక ఎంత మదన పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను.
అయినా మీరు నన్ను ఒక మంచి స్థా యిలో చూడాలనే కదా నాన్నా.. నన్ను హాస్ట ల్లో చేర్చింది. నేను ఇక్కడ మీ
ఆశయానికి తగినట్లు గానే చదువుతున్నాను. మా పాఠశాలలో అన్ని రంగాలలోనూ నేనే ప్రథమ స్థా నంలో
ఉంటున్నాను. మీరు నాకోసం పడుతున్న శ్రమను ఎప్పటికీ మర్చిపో ను నాన్నా. అమ్మను, చెల్లి నీ అడిగినట్లు
చెప్పండి. దసరా సెలవులకు ఇంటికి వస్తా ను. కాబట్టి నాగురించి బెంగ పెట్టు కోకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇక
ఉంటాను మరి.
ఇట్లు
మీ కుమారుడు,
శ్రీనివాసరావు.
చిరునామా :
మామిడిశెట్టి కృష్ణ మూర్తి గారు,
ఎస్.మూలపొ లం గ్రా మం,
అయినవిల్లి మండలం,
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్- 533211

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 71

3. 'ఉత్త రాలు రాయడం, టెలిఫో న్ లో మాట్లా డడం' వీటిలో ఏది ఉపయోగకరమైనదని నీవు భావిస్తు న్నావు?
మీ సమాధానాన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
జ). 'ఉత్త రాలు రాయడం, టెలిఫో న్ లో మాట్లా డడం' వీటిలో ఏది ఉపయోగకరమైనదని అడిగితే సమాధానం
చెప్పడం కొంచెం కష్ట మే. కాలానుగుణంగా రెండూ వేటికవే గొప్పవని చెప్పవచ్చు.
ఉత్త రాలలో చెప్పదలచుకున్న విషయాల్ని బాగా ఆలోచించుకుని, ప్రశాంతంగా, వీలు కుదిరినప్పుడు
రాయవచ్చు. చక్కని పదజాలం ఉపయోగించి ఎదుటివారి మనస్సును ఆకర్షించేలా రాయవచ్చు. ఉత్త రాలను
మనకు సమయం దొ రికినప్పుడు చదువుకుని ఆనందించవచ్చు. ఉత్త రాలు ఆయా కాలాలకు సంబంధించిన
సామాజిక, రాజకీయ పరిస్థితులను మన కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. ఆయా ప్రా ంతాలకు చెందిన మాండలిక
భాషాంశాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉత్త రాల ద్వారా సమాజానికి వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఉత్త రాల
ద్వారా ముందు తరాలవారి స్థితిగతులను రాబో యే తరాలవారు తెలుసుకునే వీలుంటుంది.
టెలిఫో న్ విషయానికి వస్తే సమాచారాన్ని అప్పటికప్పుడు చేరవేసే సాధనంగా దీనిని చెప్పవచ్చు. టెలిఫో న్లో
ఎక్కడో దూరప్రా ంతంలో ఉన్నవారితో కూడా మన ఎదురుగానే ఉన్నట్లు గా మాట్లా డవచ్చు. కొన్ని ముఖ్యమైన
సమాచారాలను అప్పటికప్పుడు చేరవేయడానికి టెలిఫో నే సరైన సాధనం. ఒక్కొక్కసారి బిల్లు ఎక్కువగా
వచ్చేస్తు ందనే బెంగతో మాట్లా డాల్సిన విషయాన్ని పూర్తిగా మాట్లా డకుండానే ముగించే పరిస్థితి రావచ్చు. దీనిలో
మనం మాట్లా డిన మాటలు మనకు వీలు కుదిరినప్పుడు విందామంటే కుదరదు. టెలిఫో న్లోని సంభాషణలు భవిష్యత్
తరాలకు అందే అవకాశం లేదు. మొత్తా నికి ఆలోచించి చూస్తే తాత్కాలిక ఆనందాన్ని అందించే టెలిఫో న్ కంటే,
భవిష్యత్ తరాలకు కూడా సమాచారాన్ని అందించే ఉత్త రమే ఎక్కువ ఉపయోగకరం అని నేను భావిస్తు న్నాను.
4. తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన కింది టెలిఫో న్ సంభాషణను పొ డిగించి రాయండి.
కూతురు : నాన్నా… నేను
తండ్రి : ఎలా ఉన్నావు తల్లీ?
కూతురు : బాగున్నాను నాన్న… నువ్వు వేళకు మందులు వేసుకుంటున్నావా? అమ్మ ఎలా ఉంది?
తండ్రి : మీ అమ్మా, నేనూ బాగానే ఉన్నాము తల్లీ!
కూతురు : మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా?
తండ్రి : నా ఆరోగ్యానికేం తల్లీ నిక్షేపంగా ఉంది.
కూతురు : మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది. ఒక్కసారి మా ఊరు రావచ్చు కదా నాన్నా!
తండ్రి : ఈ వయస్సులో మేము అంతదూరం ప్రయాణం చేయలేము తల్లీ! మీరే ఒక్కసారి ఇక్కడికి వచ్చి
మమ్మల్ని చూసి పో వచ్చుగా!
కూతురు : మీ అల్లు డుగారికి సెలవులు ఉండటంలేదు నాన్నా. ఈ దసరా సెలవులకు ఊరు రావడానికి
ప్రయత్నిస్తా ము.
తండ్రి : వచ్చేటప్పుడు మా మనవల్ని కూడా తీసుకురండి.
కూతురు : తప్పనిసరిగా నాన్నా! వాళ్ళుకూడా మీ దగ్గ రకు రావాలని ఎంతో ఆతృతగా ఉన్నారు.
తండ్రి : ఒక్కసారి అల్లు డు గారికి ఫో న్ ఇవ్వు తల్లీ! ఆయనతో కూడా రమ్మని చెప్పాలి కదా!
కూతురు : ఆయన ఆఫీస్ నుండి ఇంకా రాలేదు నాన్నా. వచ్చాక నేను చెబుతానులే. ఆయన ఏమీ అనుకోరు.
తండ్రి : సరే తల్లీ. అల్లు డుగారు వచ్చాక ఫో న్ చెయ్యి. ఆయనతో మాట్లా డతాను.
కూతురు : సరే నాన్నా.. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. మీ అల్లు డుగారు వచ్చాక ఫో న్ చేస్తా లే.
తండ్రి : దసరా సెలవులకు రావడం మాత్రం మరచిపో కండి తల్లీ. మీ కోసం ఎదురు చూస్తు ంటాము.
కూతురు : తప్పనిసరిగా వస్తా ము నాన్నా.. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇక ఉంటాను మరి.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థం రాసి వాటిని సొ ంతవాక్యాల్లో రాయండి.
1. ఏరు చిన్నపిల్లలా ఉరకలు వేస్తో ంది.
జ). ఉరకలు = దుముకు
*కోతులు ఒక చెట్టు పై నుండి మరో చెట్టు పైకి దుముకుతాయి.
2. వర్షా భావం వల్ల కొన్ని ప్రా ంతాల్లో కరువు నీడలు అలముకున్నాయి.
జ). కరువు = క్షామం
*పంటలు పండకపో తే క్షామం వస్తు ంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 72

3. దేశనాయకుల చిత్రా లు ఎన్నో స్మృతులను గుర్తు చేస్తు న్నాయి.


జ). స్మృతులు = జ్ఞా పకాలు
*మా నాన్న జ్ఞా పకాలు నన్ను నిత్యం చైతన్యవంతంగా ఉండేలా చేస్తు న్నాయి.
4. మా ఇంటిపేరు నాన్న అస్తిత్వాన్ని గుర్తు చేస్తో ంది.
జ). అస్తిత్వం = ఉనికి
*మనం ఏ స్థా యిలో ఉన్నా మన ఉనికిని కోల్పోకూడదు.
ఆ). కింది వాక్యాలను చదివి పర్యాయపదాలను గుర్తించి రాయండి.
ఉదా : అమ్మ ఎద ప్రేమమయం, నాన్న హృదయం అనురాగమయం.
జ). ఎద, హృదయం
1. నేను రాసిన లేఖకు మా స్నేహితురాలు ఉత్త రమిచ్చింది.
జ). లేఖ, ఉత్త రం
2. తాతయ్య జ్ఞా పకాలను కుటుంబం మననం చేసుకున్నది.
జ). జ్ఞా పకం, మననం
3. ఆహార పదార్థా ల లేమి వల్ల భోజనంలో కూరల వెలితి కన్పించింది.
జ). i). లేమి, వెలితి; ii). ఆహారం, భోజనం
4. ఆమె పరుగు పో టీల్లో ఆత్రు త వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపో యింది.
జ). ఆత్రు త, తొందర
5. పశువుల గుంపులో బెదురుకున్న గొడ్డు భయంతో పరుగుపెట్టింది.
జ). i). పశువు, గొడ్డు ; ii).బెదురు, భయం
ఇ). కింది పద్యం చదివి నానార్థా లను గుర్తించి రాయండి.
భోగమన పాము పడగయు
భోగంబన శుభము కీర్తి భోజన మొప్పున్
భోగమన దపము భువనము
భోగంబన మేనమామ పుత్రిక యయ్యెన్
జ). భోగము = పాము పడగ, శుభము, కీర్తి, భోజనము, తపస్సు, భువనము, మేనమామ కూతురు
ఈ). కింద సూచించిన ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను గుర్తించి రాయండి. వాటిని వాక్యాల్లో
ప్రయోగించండి.
సిరి కుమారుడు సేమము శ్రీ పంక్తి
క్షేమము ఆశ కొమరుడు బంతి ఆస

క్రమ సంఖ్య ప్రకృతి వికృతి

1 స్త్రీ ఇంతి

2 శ్రీ సిరి

3 కుమారుడు కొమరుడు

4 క్షేమము సేమము

5 ఆశ ఆస
ఉదా : ప్రతి కుటుంబానికి స్త్రీ - సిరితో సమానం. ఆ ఇంతియే ఇంటికి వెలుగు.
1. మనదేశం శ్రీలు పొ ంగిన జీవగడ్డ . సిరియే సకల సుఖాలకూ కారణం.
2. దశరథుని పెద్ద కుమారుడు శ్రీరాముడు. శ్రీ కృష్ణు డు యశోద కొమరుడు.
3. మనం ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే వారు కూడా మన సేమాన్ని కోరుకుంటారు.
4. ఇతరుల సంపదలకు ఆశ పడకూడదు. దేనికీ ఆస పడని వ్యక్తి ఆనందంగా జీవిస్తా డు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 73

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

అ). కింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.


ఉదా : మీరెప్పుడు = మీరు + ఎప్పుడు = ఉకారసంధి(ఉత్వసంధి)
1. ఉత్త రాలు = ఉత్త రము + లు = లు,ల,న,ల సంధి
2. జ్ఞా పకాలు = జ్ఞా పకము + లు = లు,ల,న,ల,సంధి
3. పదిహనేళ్ళు = పదిహేను + ఏళ్ళు = ఉత్వసంధి
4. మాకెవరికీ = మాకు + ఎవరికీ = ఉత్వసంధి
5. అటcజని = అటన్+ చని = సరళాదేశ సంధి
6. వానింగూర్చి = వానిన్ + కూర్చి = సరళాదేశ సంధి
ఆ). సరళాదేశ సంధి మరొకసారి గుర్తు చేసుకుందాం. కింది ఉదాహరణను గమనించండి.
1. రామలక్ష్మణులు రాక్షసులcజూసిరి
2. సత్యభామ నరకాసురుని ప్రా ణముcదీసెను
రాక్షసులcజూసిరి = రాక్షసులన్+ చూసిరి
ప్రా ణముcదీసెను = ప్రా ణమున్+ తీసెను
పై ఉదాహరణల్లో పూర్వపదం చివర 'న్' అనే ద్రు తం ఉంది. పరపదంలో చ, త అనే పరుషాలకు సంధి
జరిగి జ, ద అనే సరళాలుగా మారాయి. క - చ - ట - త - ప లు సంధి జరిగిన తరువాత గ - జ - డ - ద - బ లు గా

👉
మారుతున్నాయి. ఇలా పరుషాల స్థా నంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని సరళాదేశ సంధి అంటారు.
కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. రాcగలడు = రాన్ + కలడు = సరళాదేశ సంధి
2. వచ్చెcదల్లీ = వచ్చెన్ + తల్లీ = సరళాదేశ సంధి
3. పట్టు cబట్టెను = పట్టు న్ + పట్టెను = సరళాదేశ సంధి
4. రావణుcజంపె = రావణున్ + చంపె = సరళాదేశ సంధి

💥సమాసాలు :
5. చాయcబో లె = చాయన్ + పో లె = సరళాదేశ సంధి

అ). కింది పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి.


1. తండ్రీకూతుళ్ళు = తండ్రియును, కూతురును - ద్వంద్వ సమాసం
2. అజ్ఞా నము = జ్ఞా నము కానిది = నఇ్ తత్పురుష సమాసం
3. గౌరవాభిమానములు = గౌరవమును, అభిమానమును - ద్వంద్వ సమాసం

💥
4. పఠనలేఖనములు = పఠనమును, లేఖనమును - ద్వంద్వ సమాసం
వాక్యాలు - రకాలు :
అ). కింది వాక్యాలను పరిశీలించండి.
1. నీవు పాఠం చదువు.
2. చిత్రం గురించి వివరించండి.
పై వాక్యాలు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తు న్నాయి. ఇలా విధిగా చేయమని
చెప్పే వాక్యాలు విధ్యర్ధక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలు మీరూ కొన్ని రాయండి.
1. బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకురా.
2. పాఠం శ్రద్ధగా వినండి.
3. మీరు తొమ్మిది గంటలకల్లా పాఠశాలకు రావాలి.
4. మీరు వేకువ జామునే నిద్ర లేవండి.
ఆ). కింది వాక్యాలను పరిశీలించండి.
1. ప్రతి ఆదివారం సెలవు.
2. ప్రతిరోజూ సూర్యుడు తూర్పున ఉదయిస్తా డు.
పై వాక్యాలలో సమాచారం స్పష్ట ంగా కచ్చితంగా తెలుస్తో ంది. ఇలా కచ్చితంగా సమాచారాన్నిచ్చే
వాక్యాలను నిశ్చయార్ధక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలు మీరూ కొన్ని రాయండి.
1. మా నాన్నగారు ఊరినుండి రేపు (తప్పక) వస్తా రు.
2. రాము ఈ రోజు (తప్పకుండా) బడికి వస్తా డు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 74

ఇ). కింది వాక్యాలను పరిశీలించండి.


1. అతిగా సెల్ ఫో నులో ఆటలు ఆడవద్దు .
2. బస్సులో చేతులు బయట పెట్టరాదు.
పై వాక్యాలను గమనిస్తే అవి చేసే పనిని నిషేధిస్తు న్నాయని తెలుస్తో ంది. ఇలాంటి వాక్యాలను
నిషేధార్ధక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలు మీరు కొన్ని రాయండి.
1. నీవు రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు .

💥అలంకారాలు :
2. నీవు తరగతి గదిలోకి రావద్దు .

అ). కింది ఉదాహరణలు పరిశీలించండి. అలంకారాన్ని గుర్తించండి.


1. శేషశాయికి మ్రొ క్కు శిరము శిరము.
జ). ఈ వాక్యంలో/పద్య పాదంలో లాటానుప్రా స అలంకారం ఉన్నది.
2. మధుర ఫలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు.
జ). ఈ వాక్యంలో/పద్య పాదంలో లాటానుప్రా స అలంకారం ఉన్నది.
3. దేవా! నీకు వంద వందనాలు.
జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా స అలంకారం ఉన్నది.
4. నీటిలో పడిన తేలు తేలుతుందా.
జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా స అలంకారం ఉన్నది.
5. వర్ష వర్షంలో తడుస్తూ ఉంది.
జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా స అలంకారం ఉన్నది.
6. రామ బాణం తగిలి వాలి వాలిపో యెను.
జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా స అలంకారం ఉన్నది.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 75

4.ఆశావాది
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
1. ఆశావాది ప్రకాశరావు తల్లిదండ్రు ల గురించి చెప్పండి.
జ). కుళ్ళాయమ్మ, పక్కీరప్ప గార్లు ఆశావాది ప్రకాశరావు గారి తల్లిదండ్రు లు. పక్కీరప్ప గారు ప్రా థమిక
పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. పక్కీరప్ప, కుళ్ళాయమ్మ దంపతులకు ఏడుగురు మగపిల్లలు, ముగ్గు రు
ఆడపిల్లలు కలిపి మొత్త ం పదిమంది సంతానం.
2. ఆశావాది ప్రకాశరావు రచనలు పేర్కొనండి.
జ). పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్త ము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన
కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణం, అవధాన వినోదం - సరస ప్రసంగం, ప్రత్యూష పవనాలు,
వరదరాజ శతకము, మొదలైనవి ఆశావాది ప్రకాశరావు గారి రచనలు.
3. ఆశావాది పూరించిన ఒక సమస్య చెప్పండి.
జ). ఒకసారి తెలుగు శాఖాధ్యక్షుల వారైన డాక్టర్ నండూరి రామకృష్ణ మాచార్యులవారు ఆశావాది ప్రకాశరావు
గారికి "ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్" అనే సమస్యనిచ్చి పూరించమన్నారు. ప్రకాశరావు గారు…
"ప్రశ్నలపై వడి ప్రశ్నలు
ప్రశ్నించెడి తనదు భర్త భావంబేమో
ప్రశ్నించుచు తన యెదలో
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్" అని ఆ సమస్యను చక్కగా పూరించారు.
ఆ). కింది పేరా చదివి ప్రశ్నలకు తగిన సమాధానాలు రాయండి.
తెలుగు సాహిత్యంలో అవధాన విద్య ఒక ప్రా చీన ప్రక్రియ. •••••••••••••••••••••••• సాయికృష్ణ యాచేంద్ర
గారు 'సంగీత గేయధార'తో అవధానంలో కొత్త ఒరవడి సృష్టించారు.
@ప్రశ్నలు :
1. తెలుగు సాహిత్యంలో ఒక ప్రా చీన ప్రక్రియ పేరు రాయండి.
జ). తెలుగు సాహిత్యంలో అవధాన విద్య ఒక ప్రా చీన ప్రక్రియ.
2. అష్టా వధానం అంటే ఏమిటి?
జ). అష్టా వధానం అంటే ఒకే సమయంలో ఎనిమిది విషయములపై మనస్సును ఏకాగ్రతతో నిలపడం.
3. అష్టా వధానంలో ప్రశ్నలు అడిగేవారిని …………….. అంటారు.
జ). అష్టా వధానంలో ప్రశ్నలు అడిగేవారిని పృచ్ఛకులు అంటారు.
4. అష్టా వధానంలోని అంశాల సంఖ్య? ( ఇ )
అ). 6 ఆ). 7 ఇ). 8. ఈ). 9
5. పై పేరాలను చదివి ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). అవధానంలో సమాధానం ఇచ్చేవారిని ఏమంటారు?
ఇ). కింది పేరా చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
ఒకసారి ఒక అబ్బాయి పక్కింటివారి ధాన్యం కొట్ట ంలో కూర్చొని చిన్న దీపం పెట్టు కుని
చదువుకుంటున్నాడు. ••••••••••••••••••••••••• ఆ అబ్బాయి ఇంకెవరోకాదు, ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టి ప్రపంచానికి
చీకట్లో వెలుగులు అందించిన థామస్ ఆల్వా ఎడిసన్.
@ప్రశ్నలు :
1. సృజనాత్మకత అంటే ఏమిటి?
జ). కొత్త విషయాన్ని కనిపెట్టడం కోసం చేసే ప్రత్యేకమైన ఆలోచనను సృజనాత్మకత అంటారు.
2. "పట్టు వదలని విక్రమార్కుడు" సొ ంతవాక్యంలో ప్రయోగించండి.
జ). కష్ట పడి పట్టు వదలని విక్రమార్కునిలా కృషిచేస్తేనే చేసే పనిలో విజయం సాధించగలం.
3. 'తండ్రి' పర్యాయపదాలు రాయండి.
జ). తండ్రి = అయ్య, నాన్న, పిత
4. మీ అమ్మ దగ్గ ర నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్న ఒక్క సందర్భం రాయండి.
జ). నా చిన్నతనంలో నేను ఒకరోజు బడికని బయలుదేరి బడికి వెళ్ళకుండా దారిలో గుడిదగ్గ ర కూర్చున్నాను.
అమ్మ గట్టిగా గదిమేసరికి నిజం ఒప్పుకుని అమ్మను క్షమించమని అడిగాను.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 76

5. పై పేరాకు శీర్షిక పెట్టండి.


జ). ఎలక్ట్రిక్ బల్బు సృష్టికర్త థామస్ ఆల్వా ఎడిసన్.
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
1. ఆశావాది 'బాలకవి'గా ఆశీర్వాదం పొ ందిన సన్నివేశం గురించి రాయండి.
జ). ఆశావాది ప్రకాశరావు గారు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో నే రిటైర్డ్ కలెక్టర్ శ్రీ బి.
జూగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట ప ్ర తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ న్ గారికి స్వాగత పద్యాలు సమర్పించారు.
అలా స్వాగత పద్యాలు సమర్పించిన సందర్భంగా శ్రీశైలంలో 'బాలకవి'గా అమృతాశీర్వాదాలు అందుకొన్నారు.
2. ఆసాదిగా ఉన్న ప్రకాశరావు ఇంటిపేరు ఆశావాదిగా ఎలా మారింది?
జ). ఆశావాది ప్రకాశరావు గారు తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒక సంవత్సరం గాంధీ జయంతి
సందర్భంగా తన మొట్ట మొదటి 'అష్టా వధానం' కార్యక్రమాన్ని ప్రా రంభించి జయప్రదంగా ముగించారు. ఈ వార్త వారి
తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ నండూరి రామకృష్ణ మాచార్యులవారికి తెలిసింది. అప్పుడు నండూరి వారు ప్రకాశరావు
గారిని డిపార్ట్మెంట్ కు పిలిపించుకొన్నారు.
కొంతమంది మాస్ట ర్ల సమక్షంలో "ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్" అనే సమస్యను ఇచ్చి
పూరించమని పరీక్ష పెట్టా రు. ఇచ్చిన సమస్యను చక్కగా పూరించి ప్రకాశరావు గారు ఆ పరీక్షలో నెగ్గా రు. నండూరి
వారి సంతోషించి "నీకు ధైర్యం ఉంది. ఎక్కడైనా నెట్టు కొస్తా వు. నేటి నుంచి నీవు ఆసాదివి కాదు, ఆశావాదివి." అని
ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదంతో అప్పటివరకు ఆసాదిగా ఉన్న ప్రకాశరావు గారి ఇంటి పేరు ఆశావాదిగా మారింది.
3. ఆశావాది గారు పొ ందిన పురస్కారాల గురించి రాయండి.
జ). ఆశావాది ప్రకాశరావు గారు తన 56వ యేట పొ ట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి
'గౌరవ డాక్టరేట్' (డి.లిట్ ) పట్టా ను అందుకున్నారు. 'ప్రహ్లా ద చరిత్ర - ఎఱ్ఱ న, పో తన తులనాత్మక పరిశీలన' అనే
సిద్ధా ంత గ్రంథానికి ఒంగోలు ఎఱ్ఱ న పీఠం వారిచే ఉత్త మ సిద్ధా ంత గ్రంథ రచనా పురస్కారం అందుకున్నారు. 2021 వ
సంవత్సరంలో అప్పటి భారత రాష్ట ప ్ర తి రామనాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ప్రతిష్టా త్మకమైన 'పద్మశ్రీ'
పురస్కారం అందుకున్నారు.
4. ప్రకాశరావు అష్టా వధానంలోకి ప్రవేశం, అవధాన ప్రక్రియలో వారి కృషిని వివరించండి.
జ). ఆశావాది ప్రకాశరావు గారు తాను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో , తన 19వ యేట
గాంధీ జయంతి సందర్భంగా తన మొట్ట మొదటి 'అష్టా వధానం' కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించారు. ఈ వార్త
తెలిసి వారి తెలుగు శాఖాధ్యక్షులు నండూరి రామకృష్ణ మాచార్యులవారు ఒక సమస్యను ఇచ్చి, చక్కగా పూరించిన
ప్రకాశరావు గారిని అభినందించారు.
ప్రకాశరావు గారు డిగ్రీ మూడవ సంవత్సరంలో ఉండగా శ్రీ సి.వి. సుబ్బన్న శతావధాని గారిని గురువుగా
ఎంచుకున్నారు. తన 19వ యేట ప్రా రంభించిన అవధానం 26 సంవత్సరాల పాటు కొనసాగించారు. మన రాష్ట ం్ర లోనే
కాక కర్ణా టక, తమిళనాడు, న్యూఢిల్లీ లలో దాదాపు 171 అవధానాలు చేశారు. అవధాన పద్యాలను భద్రపరచి ఐదు
సంపుటాలుగా పుస్త క రూపంలో ముద్రించారు.
5. ఆశావాది ప్రకాశరావు గారి గురించి రాయండి. (రచయిత పరిచయం).
జ). ఆశావాది ప్రకాశరావు గారు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు 1944వ సంవత్సరంలో జన్మించారు.
వీరి తండ్రి ప్రా థమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. శతావధాని సి.వి.సుబ్బన్న గారిని గురువుగా
ఎంచుకుని సుమారు 171 అవధానాలు చేశారు.
పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్త ము, అవధాన చాటువులు, అవధాన దీపిక,
అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణం, వరదరాజ శతకము, మొదలైనవి ప్రకాశరావు గారి
రచనలు. సాహిత్య సేవకు గుర్తింపుగా వీరు పొ ట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 'గౌరవ డాక్టరేట్'
(డి.లిట్ ) పట్టా , 2021 వ సంవత్సరంలో ప్రతిష్టా త్మకమైన 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్నారు.
6. 'ముఖాముఖి' ప్రక్రియ గురించి రాయండి.
జ). ఏదైనా ప్రత్యేకత గల వ్యక్తు లను ప్రశ్నలు అడగడం ద్వారా వారినుంచి సమాచారాన్ని సేకరించడమే
ముఖాముఖి. సేకరించిన సమాచారాన్ని ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది.
ముఖాముఖి చేసే వ్యక్తికి సమయానుకూలంగా ప్రశ్నలు సంధించే సామర్థ్యం ఉండాలి. ముఖాముఖి ద్వారా వ్యక్తు ల
వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారిద్వారానే తెలుసుకునే వీలుంటుంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 77

ఆ). కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.


1. ఆశావాది వారి సాహితీ జీవన ప్రస్థా నం తెలుసుకున్నారు కదా! మీరు తెలుసుకున్న విషయాలను
మీ మిత్రు నికి లేఖ రూపంలో రాయండి.
జ). కె పెదపూడి,
08-11-2023.
ప్రియమిత్రు డు ఆదిత్య కు,
ఉభయకుశలోపరి. ముఖ్యముగా వ్రా యునది ఏమనగా నాలుగు రోజుల క్రితం మా తెలుగు ఉపాధ్యాయులు
తొమ్మిదవ తరగతిలోని 'ఆశావాది' అనే పాఠాన్ని చక్కగా బో ధించారు. ఆ పాఠం డాII ఆశావాది ప్రకాశరావు గారితో
జరిపిన ముఖాముఖీ కార్యక్రమం. ప్రకాశరావు గారు ఆసాది కులానికి చెందినవారు. చిన్ననాటి నుండీ పద్య రచనపై
ఆసక్తి పెంచుకున్నారు. తన 19వ యేటనే 'అష్టా వధానం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా
ముగించారు.ఈ వార్త తెలిసి వారి తెలుగు శాఖాధ్యక్షులు నండూరి రామకృష్ణ మాచార్యులవారు ప్రకాశరావు గారిని
అభినందించారు. మన రాష్ట ం్ర లోనే కాక కర్ణా టక, తమిళనాడు, న్యూఢిల్లీ లలో దాదాపు 171 అవధానాలు చేశారు.
అవధాన పద్యాలను భద్రపరచి ఐదు సంపుటాలుగా పుస్త క రూపంలో ముద్రించారు.
ఆశావాది ప్రకాశరావు గారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు తన 56వ యేట పొ ట్టి శ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం నుండి 'గౌరవ డాక్టరేట్' (డి.లిట్ ) పట్టా ను అందుకున్నారు. 'ప్రహ్లా ద చరిత్ర - ఎఱ్ఱ న, పో తన
తులనాత్మక పరిశీలన' అనే సిద్ధా ంత గ్రంథానికి ఒంగోలు ఎఱ్ఱ న పీఠం వారిచే ఉత్త మ సిద్ధా ంత గ్రంథ రచనా
పురస్కారం అందుకున్నారు. 2021 వ సంవత్సరంలో ప్రతిష్టా త్మకమైన 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్నారు. నీవు
చదివిన ఎవరైనా సాహితీవేత్త గురించి తెలుపుతూ తిరిగి నాకు లేఖ రాయగలవు. ఉంటాను మిత్రమా!
ఇట్లు
నీ ప్రియమిత్రు డు,
చక్రవర్తి.

చిరునామా :
ఎమ్. ఆదిత్య
తండ్రి శ్రీనివాసరావు గారు,
ఎస్. మూలపొ లం గ్రా మం,
అయినవిల్లి మండలం,
డాII.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్ - 533211
2. మీకు దగ్గ ర్లో ని రైతు/ ఆరోగ్య కార్యకర్త / శ్రా మికుడు/ పో లీసు/ ప్రజాప్రతినిధి వీరిలో ఎవరితోనైనా ముఖాముఖి
(ఇంటర్వ్యూ) నిర్వహించేందుకు 10 ప్రశ్నలు తయారు చేయండి.
జ). ప్రజాప్రతినిధితో ముఖాముఖి నిర్వహించడానికి ప్రశ్నావళి :
1. నమస్కారం ఎమ్.ఎల్.ఏ గారు! ఎలా ఉన్నారు?
2. మీరు రాజకీయాల్లో కి వచ్చి ఎంతకాలం అవుతుంది?
3. మీరు రాజకీయాల్లో కి రాకముందు ఏమిచేసేవారు?
4. మీకు రాజకీయాల్లో కి రావాలని ఎందుకనిపించింది?
5. మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు?
6. మీరు రాజకీయాల్లో కి రావడానికి ప్రేరణనిచ్చింది ఎవరు?
7. మీ నియోజకవర్గ ంలో ఎంతమంది ఓటర్లు న్నారు?
8. మీ నియోజకవర్గ ంలోని సమస్యలపై మీకు అవగాహన ఉందా?
9. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకూ నెరవేర్చారు?
10.ప్రస్తు త రాజకీయాల్లో పెరిగిపో తున్న అవినీతిపై మీ అభిప్రా యం ఏమిటి?
11.భవిష్యత్తు లో మీకు పార్టీ మారే ఉద్దేశం ఏమైనా ఉందా?
12.రాజకీయాల్లో కి రావాలనుకునే నేటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటి?
3. ఈ కింది కవిత చదవండి. ఆలోచించండి. కవితను పొ డిగించి రాయండి.
నాకూ ఒక 'కల' ఉంది
ఆకాశం పైన అడుగులు వేయాలని

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 78

నక్షత్రా ల ఇంట వెలగాలని


సంద్రంలో అలనై ఎగరాలని
చీకట్లో మిణుగురై తిరగాలని
నాకూ ఒక 'కల' ఉంది.
••••••••••••••••••••••••••••••••
జ). దేశ సరిహద్దు ల్లో సైనికుడినై కాపలా కాయాలని
శత్రు వు గుండెల్లో సింహస్వప్నమవ్వాలని
విద్రో హశక్తు ల అంతం చూడాలని
మన సైనిక సత్తా ప్రపంచానికి చాటాలని
జన్మనిచ్చిన భూమి ఋణం కొంతైనా తీర్చుకోవాలని
నాకూ ఒక 'కల' ఉంది.
అన్నార్తు ల ఆకలి తీర్చాలని
అనాథలకు ఆశ్రయం కల్పించాలని
బడుగు జీవులకు బాసటగా నిలవాలని
అబలలకు అన్నగా తోడుండాలని
అందరికీ ఆప్యాయతకు పంచాలని
నాకూ ఒక 'కల' ఉంది.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థా లు రాయండి. ఆ అర్థా లు ఉపయోగించి సొ ంతవాక్యాలు రాయండి. 1.
సజ్జ నులతో గోష్ఠి శ్రేయదాయకం.
జ). గోష్ఠి = సమావేశం, సభ
*మా పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం ప్రా ర్థనా సమావేశం జరుగుతుంది.
2. కొంతమంది కవులు పద్యాలను ఆశువుగా చెబుతారు.
జ). ఆశువు = అప్పటికప్పుడు
*ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ఆలోచించి సమాధానాలు చెప్పాలి.
3. అవధాన ప్రక్రియలో పృచ్ఛకులు ప్రశ్నలు అడుగుతారు.
జ). పృచ్ఛకులు = ప్రశ్నలు అడిగేవారు
*ముఖాముఖిలో ప్రశ్నలు అడిగేవారు మంచి విషయ పరిజ్ఞా నం కలిగిఉండాలి.
ఆ). కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. అవధాన ప్రక్రియలో నేత్రా వధానం కూడా ఉంటుంది.
జ). నేతం్ర = కన్ను, నయనం, అక్షి
2. నాన్న కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తా డు.
జ). నాన్న = తండ్రి, పిత, అయ్య
3. ఆకాశాన కౌముది ప్రకాశం ఎంతో మనోహరంగా ఉంది.
జ). కౌముది = వెన్నెల,చంద్రిక
ఇ). కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్థా లు రాయండి.
1. కవికి సామాజిక స్పృహ అవసరం.
జ). కవి = కావ్యకర్త , ఋషి, శుక్రు డు
2. విద్యార్థు ల్లో జ్ఞా నజ్యోతులను వెలిగించేవాడు గురువు.
జ). గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి
3. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.
జ). కృషి = ప్రయత్నం, వ్యవసాయం
ఈ). కింది పదాలకు వ్యుత్పత్త ్యర్థా లు రాయండి.
1. కృతులు = కర్త చే చేయబడిన పనులు (కావ్యాలు)
2. పౌత్రు డు = పుత్రు ని పుత్రు డు (మనుమడు)
3. ఆచార్యుడు = ఆచరించి చెప్పేవాడు/ వేదవ్యాఖ్యానము చేయువాడు (గురువు)

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 79

ఉ). కింది పట్టికలోని ప్రకృతులకు - వికృతులు, వికృతులకు - ప్రకృతులు రాయండి.


దైవం, అక్కరం, కార్యం, పద్యము, కీర్తి, సందియం, వమ్ము, కానుక, కవిత, విజ్ఞా నం
జ). ప్రకృతి - వికృతి
దైవం - దయ్యం
కార్యం - కర్జం
పద్యము - పద్దెము
కీర్తి - కీరితి
కానుక - కాన్క
కవిత - కైత
విజ్ఞా నం - విన్నాణం
అక్షరం - అక్కరం
సందేహం - సందియం
వ్యర్థం - వమ్ము
ఊ). కింది జాతీయాలను వివరించండి.
1. ఎత్తి పొ డుపు=ఎప్పుడో జరిగిపో యిన విషయాన్ని తీసుకుని సమయం చూసి ఎదుటి వ్యక్తి మనసుకు బాధ
కలిగేలా మాట్లా డడం.
2. కత్తి మీద సాము= చేయబో యే పని అత్యంత ప్రమాదకరం అని తెలిసికూడా ఆ పనినే చేయడానికి
ప్రయత్నించడం.
3. తామరతంపర = చేసే కొద్దిపాటి ప్రయత్నం వల్ల ఊహించనంత ఎక్కువ ఫలితం రావడం.
ii). వ్యాకరణాంశాలు :
అ). పాఠ్యాంశంలోని కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. అష్టా వధానం = అష్ట + అవధానం = సవర్ణ దీరస ్ఘ ంధి
2. పుస్త కాకృతి = పుస్త క + ఆకృతి = సవర్ణ దీరస ్ఘ ంధి
3. నేత్రా వధానులు = నేత్ర + అవధానులు = సవర్ణ దీరస ్ఘ ంధి
4. ఆద్యంతం = ఆది + అంతం = యణాదేశసంధి
5. ఉన్నతోద్యోగులు = ఉన్నత + ఉద్యోగులు = గుణసంధి
ఆ). కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. రసౌచిత్యం = రస + ఔచిత్యం = వృద్ధిసంధి
2. దివ్యౌషధం = దివ్య + ఔషధం = వృద్ధిసంధి
3. దేవాలయం = దేవ + ఆలయం = సవర్ణ దీరస ్ఘ ంధి
4. దేశౌన్నత్యం = దేశ + ఔన్నత్యం = వృద్ధిసంధి
ఇ). కింది విడదీసిన పదాలను కలపండి, సంధి పేరు రాయండి.
1. రస + ఏక = రసైక = వృద్ధిసంధి
2. వన + ఓషధి = వనౌషధి = వృద్ధిసంధి
3. వసుధ + ఏక = వసుధైక = వృద్ధిసంధి

👉
4. అష్ట + ఐశ్వర్యం = అష్టైశ్వర్యం = వృద్ధిసంధి
వృద్ధిసంధి : అకారానికి ఏ,ఐ లు పరమైతే ఐకారము, ఓ,ఔ లు పరమైనప్పుడు ఔకారము ఆదేశమవుతాయి.
ఈ). కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. మధుర భాషణము = మధురమైన భాషణము - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. మూడు సంవత్సరాలు = మూడు సంఖ్య గల సంవత్సరాలు - ద్విగు సమాసం

💥ప్రత్యక్ష - పరోక్ష కథనాలు :


3. కళా గోష్ఠి = కళ కొరకు గోష్ఠి = చతుర్థీ తత్పురుష సమాసం

👉ప్రత్యక్ష కథనం :ఒక్క వ్యక్తి చెప్పిన మాటలను యధాతధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.
కింది ఉదాహరణను చూడండి.

👉
ఉదా : "నేను తలచుకుంటే ఏదైనా సాధించగలను" అని వర్షిత్ అన్నాడు.
పరోక్ష కథనం : వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 80

కింది ఉదాహరణను చూడండి.


ఉదా : తాను బాగా చదువుకుని, ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది.

👉ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి పాటించవలసిన నియమాలు :


ఈ రెండూ అనుకరణాలే.అనుకరణంలో అంతాచెప్పి కథనం చివర"అని"వాడతాం.దీనిని అనుకారకం అంటారు.

*ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పిన మాటలను ఉద్ధ రణ చిహ్నాలలో " ………… "చూపించాలి.
పరోక్ష కథనంలో ఉద్ధ రణ చిహ్నాలు ఉండవు.
*ప్రత్యక్ష కథనంలో 'నేను' పరోక్ష కథనంలో 'తను' అవుతుంది.
నేను - తాను, తను; నా - తన; నాతో - తనతో; నన్ను - తనను;
నాకు - తనకు; మా - తమ; మాకు - తమకు; మేము - తాము;
అ). కింది ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.
1. "నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి" అని రఫీ చెప్పాడు.
జ). తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు.
2. "పుష్కర బొ మ్మలు బాగా వేస్తు ంది" అని వాళ్ళ నాన్నగారు అన్నారు.
జ). పుష్కర బొ మ్మలు బాగా వేస్తు ందని వాళ్ల నాన్నగారు అన్నారు.
3. "మీరంతా ఎక్కడి నుండి వస్తు న్నారు?" అని శైలజ పిల్లల్ని అడిగింది.
జ). మీరంతా ఎక్కడి నుండి వస్తు న్నారని శైలజ పిల్లల్ని అడిగింది.
4. "నాకు ఈత అంటే ఎంతో సరదా. ఈత కొట్ట డం ఆరోగ్యం కూడా" అని అక్షయ అన్నది.
జ). తనకు ఈత అంటే ఎంతో సరదా అని, ఈత కొట్ట డం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది.
ఆ). కింది పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
1. చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు.
జ). "చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యము" అని ఉపాధ్యాయులు చెప్పారు.
2. తన జీవితంలో ఎన్నో కష్టా లనెదుర్కొని ఈ స్థితికి చేరానని కలామ్ అన్నారు.
జ). "నా జీవితంలో ఎన్నో కష్టా లనెదుర్కొని ఈ స్థితికి చేరాను' అని కలామ్ అన్నారు.
3. తామంతా నిత్యం పుస్త కాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు.
జ). "మేమంతా నిత్యం పుస్త కాలు చదువుతూ ఉంటాము" అని పిల్లలు చెప్పారు.
4. తానొక ప్రకృతి ఆరాధకుడినని విజయ్ అన్నాడు.
జ). "నేనొక ప్రకృతి ఆరాధకుడిని" అని విజయ్ అన్నాడు.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 81

5.ఏదేశమేగినా•••!
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠ్యభాగం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
1. రచయిత్రి విదేశీ పర్యటనలో ఏయే ప్రా ంతాలు సందర్శించింది.
జ). రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక పర్యటనలో
భాగంగా వారి విదేశీ పర్యటనలో బెర్లిన్ నగరం, హాల్ నగరం, చెకొస్లో వేకియా, విల్నూస్, మాస్కో, మాంట్రియల్
ప్రా ంతాలు సందర్శించింది.
2. డాక్టర్ క్లా రాకు భారతీయ సాహిత్యంపై అపార గౌరవం ఉన్నదని ఎలా చెప్పగలవు?
జ). డాక్టర్ క్లా రా గారు హంగరీలోని బుడాపెస్టు యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్టు మెంటులో
పనిచేసేవారు. ఆయన మన భారతీయ వేద పురాణేతిహాసాలపై పరిశోధన చేస్తు న్న మహానుభావుడు. ఆయనకు
భారతీయ సాహిత్యంపై,భగవద్గీతపై అపారమైన గౌరవాదరాలు ఉన్నాయి. భారతీయ సాహిత్యంపై ఉన్న
గౌరవభావంతో ఆయన తన భార్య పేరును 'పద్మ' అని మార్చుకున్నారు. తన కుమార్తెకు 'అమృత' అని పేరు
పెట్టా రు.
3. జర్మనీ భాషలోకి ఏఏ భాషల నుండి అనువాదాలు జరిగాయి?
జ). భారతీయ భాషలైన సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషలనుండి జర్మనీ భాషలోకి అనువాదాలు
జరిగాయి.
4. రూబెన్ పండితుడు భారతీయ స్త్రీలను గురించి ఏమని చెప్పాడు?
జ). దుష్యంతునిచే తిరస్కరించబడిన శకుంతల అతనిని గడ్డిపో చ వలె భావించి, తన స్వశక్తితో కుమారుడైన
భరతుని సర్వవీరునిగా తీర్చిదిద్దిందని రూబెన్ పండితుడు చెప్పాడు. అలాగే సీత, ద్రౌ పది వంటి స్త్రీలను
స్వీయత్యాగంతో, లోకహితాన్ని సాధించిన మహిళామణులుగా కీర్తించాడు. ఇటువంటి త్యాగగుణం భారతీయ స్త్రీలకే
సొ ంతమని రూబెన్ పండితుడు చెప్పాడు.
ఆ). కింది వచనం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
తెలుగులో తొలి యాత్రా రచయిత్రి శ్రీమతి పో తం జానకమ్మ. ••••••••••••••••••• 146 సంవత్సరాల తర్వాత
కాళిదాసు పురుషో త్త ం ఈ గ్రంథాన్ని తెలుగులోనికి అనువాదం చేశారు.
@ప్రశ్నలు :
1. జానకమ్మ తన విదేశీ యాత్రరచన పుస్త కానికి పెట్టిన పేరేమిటి?
జ). జానకమ్మ తన విదేశీ యాత్రరచన పుస్త కానికి "పిక్చర్స్ ఆఫ్ ఇంగ్ల ండ్" అనే పేరు పెట్టా రు.
2. 'జిజ్ఞా స' అంటే అర్థం ఏమిటి?
జ). జిజ్ఞా స అంటే తెలుసుకోవాలనే కోరిక.
3. ఇంగ్లా ండ్ లో కుటుంబ జీవితాలపై రచయిత్రి ఆలోచన ఏమిటి?
జ). ఇంగ్లా ండ్ లో కుటుంబ జీవితాలు బాగున్నాయని, స్త్రీలకు అన్ని చోట్లా సమాన అవకాశాలు లభిస్తు న్నాయని
రచయిత్రి చెప్పారు.
4. సౌతాంప్ట న్ రైల్వేస్టేషన్లో రచయిత్రి గమనించిన ప్రత్యేక అంశం ఏది?
జ). సౌతాంప్ట న్ రైల్వేస్టేషన్లో ఉద్యోగులంతా స్త్రీలే ఉండటం రచయిత్రి గమనించిన ప్రత్యేక అంశం.
5. ఈ కథనం నుంచి ఆలోచింప చేసే ఓ ప్రశ్నను రాయండి.
జ). తెలుగులో తొలి యాత్రా రచయిత్రి ఎవరు?/ పారిస్ ఎలాంటి నగరం?
ఇ). కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1923లో కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. •••••••••••••••• ఆంధ్ర మహిళాసభ
వ్యవస్థా పకురాలైన శ్రీమతి దుర్గా బాయి దేశముఖ్.
@ప్రశ్నలు :
1. కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి? ( ఇ )
జ). అ). విజయవాడ ఆ). బాపట్ల ఇ). కాకినాడ ఈ). చీరాల
2. తెగేసి చెప్పడం అంటే అర్థం ఏమిటి?
జ). నిర్మొహమాటంగా చెప్పడం
3. దుర్గా బాయిని ప్రధాన ద్వారం వద్ద ఎందుకు నిలబెట్టా రు?
జ). కాంగ్రెస్ మహాసభలకు వస్తు న్న వారి దగ్గ ర టిక్కెట్టు చూసి లోపలికి పంపడానికి.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 82

4. నిన్ను ఎవరైనా పెద్దలు భుజం తట్టి మెచ్చుకున్న ఏవైనా రెండు సందర్భాలు రాయండి.
జ). i). నేను మట్టితో చేసిన గణపతి విగ్రహం చూసి మా పాఠశాల ఉపాధ్యాయులు భుజం తట్టి మెచ్చుకున్నారు.
ii). నేను పరుగు పందెంలో గెలిచినప్పుడు మా నాన్నగారు నన్ను భుజం తట్టి మెచ్చుకున్నారు.
5. ఈ పేరాకు తగిన శీర్షికను రాయండి.
జ). "కర్త వ్య దీక్షాదక్షురాలు దుర్గా బాయి"
ఈ). మీ ఉపాధ్యాయుని సహాయంతో కింది యాత్రా రచన - వాటి గ్రంథకర్త ను జతపరచండి.
1. 'ఆటా'జనికాంచె ( ఊ ) అ). అక్కినేని నాగేశ్వరరావు
2. ఇనుపతెర వెనుక ( ఇ ) ఆ). వాసా ప్రభావతి
3. నవ భారతి ( ఈ ) ఇ). రావూరి భరద్వాజ
4. రష్యాలో స్నేహయాత్ర ( ఆ ) ఈ). మాలతీ చందూర్
5. నేను చూసిన అమెరికా ( అ ) ఉ). ఏనుగుల వీరాస్వామి
6. కాశీయాత్రా చరిత్ర ( ఉ ) ఊ). ఎండ్లూ రి సుధాకర్
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
1. లిథువేనియా కవి సర్ ఎడ్వర్డ్ దాస్ రచయిత్రికి అందించిన గౌరవం ఏమిటి?
జ). సర్ ఎడ్వర్డ్ దాస్ రష్యా లోని విల్నూస్ నగరానికి చెందినవారు. ఆయన లిథువేనియా భాషలో గొప్పకవి.
'మాయ్ నో రామ-మాయినో ఇండిష్కీ' అనే కావ్యాన్ని వ్రా శారు. ఆయన లక్ష్మీకాంతమ్మ గారిని సంస్కృత కవయిత్రి
అని తెలుసుకుని గౌరవంతో 'బెల్ట్ ఆఫ్ పొ యిట్స్' అని పిలవబడే ఒక బెల్టు ను బహూకరించారు.
2. కాళిదాసు సాహిత్యాన్ని గూర్చి రూబెన్ పండితుడు ఏమన్నారు?
జ). కాళిదాసు రచనలన్నింటినీ పూర్తిగా అధ్యయనం చేసి జర్మనీ భాషలో మహా గ్రంథాలను రచించిన
మహామనీషి రూబెన్ పండితుడు. మహాకవి కాళిదాసు సృష్టించిన పాత్రలన్నీ ఎంతో ఉత్కృష్ట మైనవని రూబెన్
పండితుడు చెప్పాడు. దుష్యంతునిచే తిరస్కరింపబడిన శకుంతల అతని అవినయాన్ని, ధన మదాంధత్వాన్ని
సహించక, గడ్డిపో చవలె తిరస్కరించిందని కాళిదాసు చెప్పిన తీరు అద్భుతమని రూబెన్స్ పండితుడు అన్నాడు. 3.
ప్రొ ఫెసర్ మోడే పండితుని చూచి రచయిత్రి ఆశ్చర్యపో వడానికి కారణం ఏమిటి?
జ). మోడే పండితుడు గొప్ప విశ్వసాహిత్యవేత్త. ముఖ్యంగా భారతీయ తత్వశాస్త్రా భిమాని. ఆయన హాల్
నగరంలో నివసించేవారు. ఆయన గ్రంథాలయంలో భారతీయ శిల్ప,చిత్ర,నాట్య,సంగీత,సాహిత్యాది వివిధ కళలపై
ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వేదవేదాంగములు, శాస్త ప ్ర ురాణేతిహాసములు, బౌద్ధ వాఙయ సంపుటాలు, రవీంద్రు ని
వ్రా తప్రతులు, మాక్స్ ముల్ల ర్ వ్రా తప్రతులను ఎంతో గౌరవభావంతో భద్రపరచుకొన్నారు. మన తెలుగు సాహిత్యాన్ని
గురించి లెక్కలేనన్ని ఆంగ్ల వ్యాసాలు సేకరించారు. ఆయన తన పేరును 'మోద' అని తన నగరాన్ని 'శాల' అని
పిలవమనేవారు. ఈ విధంగా భారతీయ సాహిత్యంపై మోడే పండితునికి గల అభిమానాన్ని చూసి రచయిత్రి
ఆశ్చర్యపో యింది.
4. ఏ దేశమేగినా.. పాఠ్యాంశ రచయిత్రి గురించి రాయండి?
జ). ఏ దేశమేగినా పాఠ్యాంశ రచయిత్రి శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు. ఈమె నాళం కృష్ణా రావు,
సుశీలమ్మ దంపతులకు 1917లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ నుండి
ఉభయభాషాప్రవీణ పట్టా పొ ందారు. ఆంధ్రు ల కీర్తనవాఙయసేవ, ఆంధ్ర కవయిత్రు లు, అఖిల భారత కవయిత్రు లు,
హంస విజయము, అభిజ్ఞా నశాకుంతలము, జాతిపిత, ఒక చిన్నదివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ , సరస్వతీ
సామ్రా జ్య వైభవము, సాహితీ రుద్రమ, అమృతవల్లి మొదలైనవి వీరి రచనలు.
5. యాత్రరచన ప్రక్రియను పరిచయం చేయండి.
జ). యాత్రికుడు తాను పొ ందిన యాత్రా నుభవాలను గ్రంథస్థ ం చేయడాన్ని యాత్రా రచన అంటారు. ప్రముఖ
వ్యక్తు లు స్వదేశంలో కానీ, విదేశంలో కానీ విశిష్ట త కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను, పొ ందిన
అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణ నాత్మకంగా చేసే రచన యాత్రా రచన. ఇవి విజ్ఞా నయాత్రలు కావచ్చు,
విహారయాత్రలు కావచ్చు, ఆధ్యాత్మికయాత్రలైనా కావచ్చు.
6. ఏ దేశమేగినా పాఠ్యాంశం నేపథ్యం రాయండి.
జ). శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు
పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆమె వివిధ ప్రదేశాలు సందర్శించారు. భారతీయ సంస్కృతిపై, సాహిత్యంపై
అభిమానం గల ఎంతోమంది ప్రముఖ విదేశీ రచయితలను, వ్యక్తు లను ఆమె కలిశారు. ఆ పర్యటన సాగిన విధానం,
ఆమె పొ ందిన అనుభవాలు, విశేషాలను పాఠకులకు తెలియజేయడమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 83

ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


1. మీరు వెళ్ళిన ప్రదేశం విశేషాలను వివరిస్తూ యాత్రా రచన ప్రక్రియలో రాయండి.
జ). నేను మా కుటుంబ సభ్యులతో కలిసి 15-10-2023న విశాఖపట్నం విహారయాత్రకు వెళ్లా ను.
తెల్లవారు జామున 2.30నిIIకు మాఊరు అంబాజీపేట నుండి బయలుదేరి 3గంటలకు అమలాపురం బస్టా ండుకు
చేరుకున్నాము. అక్కడ బస్సెక్కి మద్దిలపాలెం బస్టా ండులో దిగాము. అక్కడినుండి సిటీబస్సు ఎక్కి సింహాచలం
చేరుకున్నాము. సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాము. ఆ దేవాలయ
గోపురాలపై, గోడలపై ఉన్న శిల్పసంపద చూడముచ్చటగా ఉంది.
సిహాచలం నుండి అద్దెకు కారును పురమాయించుకుని నేరుగా మధ్యాహ్నం 2గంటలకు ఆంధ్ర
విశ్వకళాపరిషత్ కు వెళ్ళాము. ఆ విద్యాలయం ఎంతోమంది మేధావులను దేశానికి అందించిందని తెలుసుకుని
ఎంతో పొ ంగిపో యాను. సాయంత్రం 4గంటల సమయంలో రామకృష్ణ బీచ్ కు వచ్చాము. అక్కడి ఇసుక తిన్నెలపై
మా చెల్లి , నేను కొంచెం సేపు సరదాగా ఆడుకున్నాము.
బీచ్ ఒడ్డు న ఉన్న కుర్సుర సబ్మెరైన్ మ్యూజియం చూసాము. అది ఒకప్పుడు శత్రు దేశాల దాడినుండి
మనదేశాన్ని కాపాడిన జలాంతర్గా మి అని తెలుసుకుని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. అక్కడినుండి బయలుదేరి
సాయంత్రం 6గంటల సమయంలో కైలాసగిరి వెళ్ళాము. ఆ కొండపై నెలకొల్పిన శివపార్వతుల విగ్రహాలు
చూడముచ్చటగా ఉన్నాయి. అక్కడినుండి తిరిగి మద్దిలపాలెం బస్టా ండుకు వచ్చి బస్సు ఎక్కి అర్ధరాత్రి సమయానికి
మా ఇంటికి క్షేమంగా చేరుకున్నాము.
2. విదేశాల్లో భారతీయ సాహిత్య మూలాలు చూసిన రచయిత్రి మనోభావాలను సొ ంతమాటల్లో రాయండి.
జ). ఏదేశమేగినా.. పాఠ్యాంశ రచయిత్రి శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక
ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆమె ముందుగా జర్మనీ రాజధాని బెర్లిన్ లో భారత
ప్రభుత్వ రజతోత్సవాలను సందర్శించారు. రూబెన్ పండితుడు కాళిదాసు రచనలపై ఆమూలాగ్రంగా చేసిన
పరిశోధన చూసి ఆశ్చర్యపో యారు. సీత, ద్రౌ పది, శకుంతల వంటి స్త్రీల గురించి ఆయన చెప్పిన విషయాలకు
పులకించిపో యారు.
తరువాత ఆమె రూబెన్ పండితుని శిష్యురాలైన రిచెల్ పండితురాలిని, ప్రొ ఫెసర్ శ్రీ హూబర్ పండితుడిని
కలిశారు. అనంతరం హాల్ నగరంలో నివసిస్తు న్న ప్రొ ఫెసర్ మోడేగారిని, బుడాపెస్టు యూనివర్సిటీలో పనిచేస్తు న్న
డాII క్లా రాగారిని, ప్రా హా విశ్వవిద్యాలయ డైరెక్టరైన కాసా పండితుని కలిశారు. వారందరికీ భారతీయ సంస్కృతిపై,
రామాయణ, భారత, భాగవత, భగవద్గీతలపై గల అభిమానానికి, భారతీయ గ్రంథాలపై వారు చేస్తు న్న పరిశోధనలకు
రచయిత్రి ఆశ్చర్యపో యారు.
భారతీయ భాషలలోని ఉత్త మ గ్రంథాలెన్నో జర్మను భాషలోకి అనువదింపబడ్డా యని తెలుసుకుని
మురిసిపో యారు. రచయిత్రి చెకొస్లో వెకియాలో ఏ గ్రంథాలయానికి వెళ్ళినా, ఏ ఓరియంటల్ డిపార్టు మెంటుకు వెళ్ళినా
భారత, భాగవత, రామాయణ, భగవద్గీతల అనువాద గ్రంథాలు ఉండడం చూసి విస్తు పో యారు. ఈ విధంగా విదేశాల్లో
భారతీయ సాహిత్య మూలాలు చూసిన రచయిత్రి ఎంతగానో సంతోషించారు.
3. విదేశీ యాత్రా రచనల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను తెలుపుతూ మిత్రు నికి లేఖ రూపంలో రాయండి.
జ). కె.పెదపూడి,
15-08-2022.
ప్రియమిత్రు రాలు జాహ్నవికు,
ఉభయకుశలోపరి. నీ లేఖ మొన్ననే నాకు అందినది. చాలా సంతోషం. ముఖ్యముగా వ్రా యునది
ఏమనగా ఈ రోజు మా తెలుగు ఉపాధ్యాయులవారు మాకు "ఏ దేశమేగినా..!" అనే పాఠాన్ని చెప్పారు. రచయిత్రి
ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు తాను చేసిన విదేశీయాత్రలో విశేషాలను ఆ పాఠంలో వివరించారు. పాఠం విన్న
తరువాత విదేశీయాత్రా రచనల వలన అనేక ప్రయోజనాలున్నాయనే విషయం నాకు తెలిసింది.
విదేశీయాత్రా రచనల వలన ఆయా దేశాలలోని వింతలు, విశేషాలు తెలుసుకోవచ్చు. ఎందరో ప్రముఖ
వ్యక్తు ల జీవితాలను గురించి తెలుసుకోవచ్చు. వివిధ దేశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం
తెలుసుకోవచ్చు. అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలను తెలుసుకోవచ్చు. అక్కడి ప్రజల జీవన విధానం
తెలుసుకోవచ్చు. మన భారతీయ సంస్కృతికి, ఇతర దేశాల సంస్కృతికి గల భేదాలను అంచనా వేయవచ్చు. నీవు
ఈ మధ్యకాలంలో ఏదైనా యాత్రా రచన చదివితే ఆ విశేషాలను తెలుపుతూ లేఖ రాయగలవు. ఉంటాను మరి.
ఇట్లు
నీ ప్రియమిత్రు డు,
జగదీష్ కృష్ణ ఆదిత్య.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 84

చిరునామా :
ఎమ్. జాహ్నవి,
తండ్రి - శ్రీనివాసరావు గారు,
ఎస్.మూలపొ లం గ్రా మం,
అయినవిల్లి మండలం,
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్- 533211
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధా న్ని గుర్తించి రాయండి.
(కలవరం, పతివ్రత, కలయిక, ఎక్కిన, గొప్పగా, నమస్కారాలు)
1. పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి.
జ). జోతలు = నమస్కారాలు
2. మంచి మిత్రు లతో సమాగమం మనకు మేలు చేస్తు ంది.
జ). సమాగమం = కలయిక
3. సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైనది.
జ). సాధ్వి = పతివ్రత
4. బయటకు వెళ్లి న పిల్లలు వేళకు చేరుకోక తల్లి మనసు కలగుండు పలికింది.
జ). కలగుండు = కలవరం
5. చదువుకుంటే జీవితం ఉత్కృష్ట ంగా మారుతుందని పెద్దలు అంటారు.
జ). ఉత్కృష్ట ంగా = గొప్పగా
6. బచేంద్రిపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ.
జ). అధిరోహించిన = ఎక్కిన
ఆ). కింది వాక్యాల్లో ఒకే అర్థా న్ని ఇచ్చే పదాలు గుర్తించి రాయండి.
1. ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి. బంధుమిత్రు ల మధ్య ఉత్త రాలు రాసుకోవడం పరిపాటి. లేఖలు
ఎప్పటికీ ఆత్మీయ రేఖలు.
జ). జాబు, ఉత్త రం, లేఖ
2. పరీక్షల తేదీలు ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుని ఆజ్ఞ ను పాటించాలని
ఉపాధ్యాయులు మాకు చెప్పారు. వారి అనుజ్ఞ ను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేసాము.
జ). ఆదేశం, ఆజ్ఞ , అనుజ్ఞ
3. చదివిన అంశాలను జ్ఞ ప్తిలో ఉంచుకోవాలి. ఎక్కువసార్లు చదివితే స్మృతిలో ఉంటాయి. అవసరమైనప్పుడు
జ్ఞా పకం వస్తా యి.
జ). జ్ఞ ప్తి, స్మృతి, జ్ఞా పకం
ఇ). ప్రకృతి - వికృతులను జతపరచండి.
1. దీపము ( ఈ ) అ). జాతర.
2. మాణిక్యం ( ఉ ) ఆ). జతనం
3. యత్నం ( ఆ ) ఇ). నిచ్చెలు
4. యాత్ర ( అ ) ఈ). దివ్వె
5. నిత్యము ( ఇ ) ఉ). మానికం

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

👉అనునాసిక సంధి :
వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతుల్లో నేర్చుకున్నారు కదా! వర్ణ మాలలోని 'క' వర్గ ంలో
పంచమాక్షరం‌ 'ఙ'. కింది పట్టికను గమనించండి.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 85

క ఖ గ ఘ ఙ

చ ఛ జ ఝ

ట ఠ డ ఢ ణ

త థ ద ధ న

ప ఫ బ భ మ
👉కింది పదాల సంధి, విసంధి రూపాలను గమనించండి.
1. వాఙ్మయం = వాక్ + మయం
2. రాణ్మణి = రాట్ + మణి
3. జగన్నాటకం = జగత్ + నాటకం
*పై మూడు ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన క, ట, త లు ఉన్నాయి.

👉
*పరపదంలో మొదట న, మ అనే అనునాసికాలు ఉన్నాయి.
వీటికి సంధి జరిగినపుడు..
క్ + మ = ఙ్మ ( క బదులుగా 'ఙ' ఆదేశంగా వచ్చింది)
ట్ + మ = ణ్మ ( ట బదులుగా 'ణ' ఆదేశంగా వచ్చింది)
త్ + నా = న్నా ( త బదులుగా 'న' ఆదేశంగా వచ్చింది)
*వర్గ ప్రథమాక్షరాలైన క, చ, ట, త, ప లకు 'న' గాని 'మ' గాని పరమైతే అదే వర్గ అనునాసికాలు ఙ, , ణ, న,
మ లు ఆదేశంగా వస్తా యి. దీనిని అనునాసిక సంధి అంటారు.
అ). కింది పదాలను విడదీసి, సంధి సూత్రంతో సరిచూడండి.
1. మరున్నందనుడు = మరుత్ + నందనుడు = అనునాసిక సంధి
2. జగన్నాథుడు = జగత్ + నాథుడు = అనునాసిక సంధి
3. రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం = అనునాసిక సంధి
*అనునాసిక సంధి సూత్రం : *వర్గ ప్రథమాక్షరాలైన క, చ, ట, త, ప లకు 'న' గాని 'మ' గాని పరమైతే అదే వర్గ
అనునాసికాలు ఙ, , ణ, న, మ లు ఆదేశంగా వస్తా యి.
*పై మూడు పదాలలో పూర్వపదం చివరన వర్గ ప్రథమాక్షరాలైన త్, ట్ లు ఉన్నాయి.
పరపదంలో మొదట న, మ అనే అనునాసికాలు ఉన్నాయి. సంధి జరిగి ఆయావర్గా ల అనునాసికాక్షరాలు న, ణ లు
ఆదేశంగా వచ్చాయి. కాబట్టి ఈ మూడు పదాలు అనునాసిక సంధులే.
ఆ). కింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి.
1. వాక్ + మహిమ = వాఙ్మహిమ
2. షట్ + ముఖుడు = షణ్ముఖుడు
3. సత్ + నుతి = సన్నుతి

💥సమాసాలు :
4. చిత్ + మయం = చిన్మయం

అ). కింది సమాస పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి.


1. బెర్లిన్ నగరం = బెర్లిన్ అనే పేరుగల నగరం - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
2. శాస్త్రా భిమాని = శాస్త మ
్ర ును అభిమానించువాడు - ద్వితీయా తత్పురుష సమాసం
3. పురాణ ఇతిహాసాలు = పురాణమును, ఇతిహాసమును - ద్వంద్వ సమాసం

💥అలంకారాలు :
4. యాత్రా నుభవం = యాత్ర వలన అనుభవం - పంచమీ తత్పురుష సమాసం

👉కింది వాక్యాలలోని అలంకారం గుర్తించి సమన్వయం చేయండి.


1. సంసారసాగరం ఈదడం గొప్పవారికీ కష్ట సాధ్యం.
జ). ఈ వాక్యంలో రూపకాలంకారం ఉన్నది.
*రూపకాలంకారం లక్షణం : ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు గా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 86

*సమన్వయం : ఈ వాక్యములో ఉపమేయమైన సంసారానికి, ఉపమానమైన సాగరానికి భేదం లేనట్లు గా


చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యములో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
2. అన్ని ధనములలో కెల్ల విద్యాధనము ప్రధానమైనది.
జ). ఈ వాక్యంలో రూపకాలంకారం ఉన్నది.
*రూపకాలంకారం లక్షణం : ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు గా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ వాక్యములో ఉపమేయమైన విద్యకు, ఉపమానమైన ధనానికి భేదం లేనట్లు గా చెప్పబడింది.
కాబట్టి ఈ వాక్యములో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
3. వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి.
జ). ఈ వాక్యంలో రూపకాలంకారం ఉన్నది.
*రూపకాలంకారం లక్షణం : ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు గా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ వాక్యములో ఉపమేయమైన కుసుమాలకు(పూలకు), ఉపమానమైన అక్షతలకు భేదం

💥వాక్యాలు రకాలు :
లేనట్లు గా చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యములో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.

👉కర్తరి, కర్మణి వాక్యాలు : 'కర్త ' ప్రధానంగా రాసే వాక్యాలను 'కర్త రి' వాక్యాలనీ, 'కర్మ' ప్రధానంగా రాసే వాక్యాలను
'కర్మణి' వాక్యాలనీ అంటారని తెలుసు కదా!
అ). కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1. రవి జామకాయను తిన్నాడు.
జ). రవి చేత జామకాయ తినబడింది.
2. భావన ప్రా జెక్టు పనిని పూర్తి చేసింది.
జ). భావన చేత ప్రా జెక్టు పని పూర్తిచేయబడింది.
3. హర్షిత్ కబడ్డీ జట్టు ను గెలిపించాడు.
జ). హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది.
ఆ). కింది వాక్యాలను కర్త రి వాక్యాలుగా మార్చి రాయండి.
1. "చెట్టు కవిత' ఇస్మాయిల్ చే రాయబడింది.
జ). 'చెట్టు కవిత'ను ఇస్మాయిల్ రాశారు.
2. గాంధీజీగారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది.
జ). గాంధీజీగారు ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు.
3. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డా యి.
జ). చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలను ఇచ్చారు.
*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 87

6.నా చదువు
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. ఆడవారి మాటలలో నుండి శ్రీపాదవారు తెలుగుభాషను నేర్చుకున్న విధానం గురించి మాట్లా డండి,రాయండి.
జ). స్త్రీల భాషలో మాధుర్యమూ, హృదయాలను పట్టివేసే జాతీయత ఉండటాన్ని శ్రీపాదవారు గమనించారు.
భోజనాలయ్యి, ఇళ్ళు సర్దు కోవడం అయ్యాక తటవర్తి సుబ్బమ్మ గారు, మైలవరపు జోగమ్మ గారు, బుద్ధ వరపు
సీతమ్మ గారు శ్రీపాదవారి ఇంటికి వచ్చి వారి అమ్మగారితో గోష్ఠి జరిపేవారు. దాట్ల దివాకరరాజు గారి భార్య బుచ్చి
వెంకయ్యమ్మ గారు కూడా ఆ గోష్ఠిలో కలిసేవారు. వారి గోష్ఠిలో ఛలోక్తు లు, శ్లేషలు, సామెతలు, పలుకుబళ్ళతో
నవరసాలు నాట్యమాడేవి. ఆడవారి మాటల్లో ని విశేషాన్ని గమనించిన శ్రీపాదవారు నలుగురు స్త్రీలు ఎక్కడ
మాట్లా డుకుంటున్నా రహస్యంగా వింటూ తెలుగు భాషను నేర్చుకున్నారు.
2. పాఠం ఆధారంగా కింది వ్యక్తు లు, ప్రదేశాల గురించి మీరేమీ అర్థం చేసుకున్నారో చెప్పండి, రాయండి.
అ). లక్ష్మీపతి సో మయాజులు : వీరు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి తండ్రిగారు. పొ లమూరు గ్రా మంలో
నివసించేవారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త ం్ర , మంత్రశాస్త్రా లలో పండితులు.
ఆ). సీతారామశాస్త్రి గారు : వీరి పూర్తిపేరు గుంటూరి సీతారామశాస్త్రి. 'జల్లిసీమ'లోని మోగల్లు వీరి స్వగ్రా మం. వీరు
వల్లూ రులో శ్రీపాదవారికి విద్య నేర్పిన గురువుగారు. వల్లూ రు గ్రా మస్తు లు తమ ప్రా ంతంలోనివారికి సాహిత్య విద్య
నేర్పడం కోసం సంవత్సరానికి కొంత ధనం ఇస్తూ వీరిని తమ గ్రా మంలో ఉంచుకున్నారు.
ఇ). వల్లూ రు గ్రా మం : ఇది ప్రస్తు తం డాII.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని రామచంద్రా పురం తాలూకాలో
మండపేట పట్ట ణానికి రెండు మూడు మైళ్ళ దూరంలో ఉన్న గ్రా మం. పెద్ద రైతాంగంతో, పాడిపంటలతో
తులతూగుతున్న ఊరు.
ఈ). దేవాలయ గోపురం : వల్లూ రు గ్రా మంలోని దేవాలయ గోపురం శ్రీపాద వారి కలలకు, కల్పనలకు వేదిక.
శ్రీపాదవారు చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం సమయంలో ఆ గోపురం పై అంతస్తు లో కూర్చుని చదువుకునేవారు.
ఆ పరిసరాలు శ్రీపాదవారి చదువుకు అనుకూలంగా ఉండేవి.
3. శ్రీపాద వారికి చదువు పట్ల ఉన్న శ్రద్ధ గురించి చెప్పండి, రాయండి.
జ). శ్రీపాద వారికి చదువుపట్ల చాలా శ్రద్ధ ఉండేద.ి ఆడవారు మాట్లా డుకునే మాటలను రహస్యంగా గమనిస్తూ
తెలుగు భాషను చక్కగా నేర్చుకున్నారు. వారు తన తండ్రి దగ్గ రే జ్యోతిషం, వేదం నేర్చుకున్నారు. వల్లూ రు
గ్రా మంలో వారాలు చేసుకుంటూ సాహిత్యవిద్యను నేర్చుకున్నారు. మధ్యాహ్నం సమయంలో దేవాలయ గోపురం పై
అంతస్తు లో కూర్చుని చదువుకునేవారు. చదువుకునే సమయంలో దినచర్యను క్రమశిక్షణతో పాటించేవారు. ఎన్ని
అవాంతరాలు ఎదురైనా చదువును నిర్ల క్ష్యం చేసేవారుకాదు.
ఆ). కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త ం్ర కాదు. •••••••••••••••••••••• కాలం అనే కొలతలతో పాటు బుద్ధి
అనేది కొలతగా పనిచేస్తు ందని దీనినే 'బుద్ధి కొలతవాదం' అనే పేరుతో ప్రతిపాదించిన వీరు 1980 ఆగస్టు 17 న
మరణించారు.
@ప్రశ్నలు :
1. శాస్త ం్ర - సాహిత్యం వీటికి ఉండాల్సిన లక్షణాలేవి?
జ). శాస్త ం్ర ప్రకృతి రహస్యాలను వివరించాలి. సాహిత్యం మానవ జీవితంలోని ప్రతికోణాన్ని చూపించాలి.
2. రచనా రంగంలో కొడవటిగంటి గారి ప్రత్యేకత ఏమిటి?
జ). 13 సంవత్సరాల వయస్సులోనే రచనకు శ్రీకారం చుట్ట డం రచనా రంగంలో కొడవటిగంటి గారి ప్రత్యేకత.
3. పై పేరాలోని కథలు, గల్పికల పేర్లు రాయండి.
జ). కొత్త జీవితం, నిరుద్యోగం, అద్దెకొంప, బాహుకుడు అనేవి కథలు. మాయాపో రు, భూతదయ, ధర్మయుద్ధ ం
అనేవి గల్పికలు.
4. 'బుద్ధి కొలతవాదం' దేని గురించి చెప్పింది?
జ). ఈ జగత్తు కు స్థ లం, కాలం అనే కొలతలతో పాటు బుద్ధి అనేది కొలతగా పనిచేస్తు ందని చెప్పింది.
5. పై పేరాకు శీర్షిక పెట్టండి.
జ). ఈ పేరాకు “బుద్ధి కొలతవాదం” అనే శీర్షిక సరిపో తుంది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 88

ఇ). కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.


తన తమ్ముడు ఆగని విరేచనాలతో, రక్త హీనత వల్ల బాధపడుతూ, ఆ వ్యాధికి తగిన మందు లేక, సరైన
వైద్యం అందక తన కళ్ళముందే శాశ్వతంగా కన్నుమూశాడు. •••••••••••••••••••• ఎందరో పేద విద్యార్థు లకు ఆర్థిక
సహాయమందించి వారి పట్ల అమితమైన ప్రేమను చూపిన మహనీయుడు ఆయన.
@ప్రశ్నలు :
1. యల్లా ప్రగడ సుబ్బారావు గారు ఈ రంగానికి చెందినవారు…. ( ఇ )
అ). విద్యారంగం ఆ). రాజకీయరంగం ఇ). వైద్యరంగం
2. సుబ్బారావు గారి జన్మస్థ లం ఏది?
జ). సుబ్బారావు గారి జన్మస్థ లం రాజమండ్రి (రాజమహేంద్రవరం).
3. పై పేరాలో నైపుణ్యం అని అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). ప్రా వీణ్యం అనే పదం నైపుణ్యం అనే అర్ధా న్నిస్తు ంది.
4. సుబ్బారావు గారు చదువు కోసం ఏఏ దేశాలు వెళ్ళారు?
జ). సుబ్బారావు గారు చదువు కోసం లండన్, అమెరికా దేశాలు వెళ్ళారు.
5. పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి.
జ). యల్లా ప్రగడ సుబ్బారావు గారు ఏయే వ్యాధులకు మందులు కనుగొన్నారు?
ఈ). కింది పేరాను చదివి పట్టికను పూరించండి.
తెలుగు సాహిత్యంలో పద్యం, గద్యం, వ్యాసం, లేఖ, గేయం, కవిత, జీవిత చరిత,్ర గజల్, ఆత్మకథ మొదలైన
ప్రక్రియలెన్నో ఉన్నాయి. ••••••••••••••••• ఇవన్నీ మనకు వారి జీవితాలలో జరిగిన ఘట్టా లను కళ్ళ
ముందుంచుతాయి.
క్రమసంఖ్య ఆత్మకథ పేరు రచయిత

1 సత్యశోధన మహాత్మాగాంధీ

2 నేను - నాదేశం దరిశి చెంచయ్య

3 నా ఎరుక ఆదిభట్ల నారాయణ దాసు

4 పింజారీ షేక్ నాజర్

5 హంపీ నుండి హరప్పాదాకా తిరుమల రామచంద్ర

6 నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు

7 నా గొడవ కాళోజీ నారాయణరావు

8 నా అంతరంగ కథనం బుచ్చిబాబు

9 సాలగ్రా మం కపిలవాయి లింగమూర్తి

II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :


అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
1. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పొ రుగూరు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి?
జ). శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి వారి అమ్మగారి దగ్గ ర గారాబం ఎక్కువ. వారి పెద్దన్న గారి దగ్గ ర అతి
చనువు ఉండేద.ి ఆయనకు ఊరినిండా స్నేహితులే. ఇంకా ఆటలంటే చాలా ఇష్ట ం. వీటికి తోడు వారి కుటుంబం
తరచూ ఇతర గ్రా మాలకు వెళ్లే వారు. ఇన్ని కారణాలతో శ్రీపాద వారి చదువు సాపీగా సాగేదికాదు. అందుచేత వారు
చదువులో భాగంగా కావ్యపాఠం కోసం పొ రుగూరైన 'వల్లూ రు' వెళ్ళాల్సివచ్చింది.
2. వల్లూ రులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి దినచర్య గురించి రాయండి.
జ). శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వల్లూ రులో విద్యాభ్యాసం చేసే రోజుల్లో సూర్యోదయం అవ్వకముందే
మేల్కొనేవారు. కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే వారి చెంబును వారే తోముకునేవారు. చన్నీళ్ల తో స్నానం చేస,ి
బట్ట లు ఉతుక్కుని, ఆరవేసుకునేవారు. పాతపాఠాలు గుర్తు చేసుకుని, మరచిపో కుండా వల్లేవేసేవారు. కొత్త
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 89

పాఠాలను గురువుగారి వీలునుబట్టి చెప్పించుకునేవారు. స్త్రీలు వంట మొదలుపెట్టక ముందే వెళ్ళి 'వారాలు'
చెప్పుకునేవారు. రాత్రి భోజనం చేశాక వెలుగుతున్న దీపం దగ్గ ర కూర్చుని చదువుకునేవారు.
3. ఆనాటి విద్యావిధానంలో వారాల భోజన పద్ధ తి గురించి వివరించండి.
జ). ఆనాటి విద్యావిధానంలో వారాల భోజన పద్ద తి ఉండేద.ి పొ రుగూరు చదువు కోసం వెళ్ళిన విద్యార్థు లు
రోజుకు ఒక ఇంటికి చొప్పున వెళ్లి , ఆ ఇంటివారు పెట్టే భోజనం చేస్తూ విద్యను కొనసాగించేవారు. ఆ ఇళ్ళవారు
అణకువ, విధేయత ఉన్న వారికే వారాలు ఇవ్వడానికి అంగీకరించేవారు. ఇలా భోజనం పెట్టేటప్పుడు కొంతమంది
ప్రేమగా వడ్డించేవారు. కొందరైతే విసుక్కుంటూ వడ్డించేవారు. ఈ వారాల పద్ధ తి వల్ల చదువుతోపాటు గృహకృత్యాలు
నిర్వహించుకునే నేర్పు అబ్బేది. ఇంగిత జ్ఞా నం, సంస్కారం అలవడేవి.
4. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న అనుభవాలను గురించి రాయండి.
జ). శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు గురుకుల విధానంలో సాహిత్య విద్యను నేర్చుకోవడం కోసం పొ రుగూరైన
'వల్లూ రు' వెళ్ళారు. అక్కడ వారాలు చేసుకుంటూ చదువుకునేవారు. వారాల భోజనంలో వింతవింత అనుభవాలు
కలిగేవి. ఒక వారం భోజనం సులభంగా దొ రికిత,ే మరొక వారం ఎంతో కష్ట పడితే గాని దొ రికేదికాదు. దీని ద్వారా
ఇంగిత జ్ఞా నం, సంస్కారం అలవడ్డా యి. గురుకుల వాసంలో తన పనులన్నీ తానే చేసుకోవాల్సివచ్చేది. దీనితో
ఆయనకు క్రమశిక్షణ అలవడింది.
5. అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలను రాయండి.
జ). అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తన లక్ష్యాన్ని మరచిపో కూడదు. తన ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లో నూ
మార్చుకోకూడదు. చేస్తు న్న సాధనను విడిచిపెట్టకూడదు. చేస్తు న్న పనిపై ఏకాగ్రతను కోల్పోకూడదు. నిద్రా హారాలు
కరువైనా, ప్రా ణభయం కలిగినా వెనుకడుగు వేయకూడదు. విజయం వరించినా, పరాజయం వచ్చినా తన
సంకల్పాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇవి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు.
6. నా చదువు పాఠ్యాంశ రచయిత గురించి రాయండి.
జ). నా చదువు అనే పాఠ్యాంశ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. 20వ శతాబ్దా నికి చెందిన గొప్ప కథా
రచయిత. తూర్పుగోదావరి జిల్లా పొ లమూరులో జన్మించారు. వడ్ల గింజలు, మార్గ దర్శి, గులాబీ అత్త రు మొదలైన
75కథలు, మిథునానురాగం, శ్మశానవాటిక మొదలైన నవలలు, ప్రేమపాశం,రాజరాజు మొదలైన
నాటకాలు,ఆయుర్వేద యోగ ముక్తా వళి వంటి వైద్యశాస్త ్ర గ్రంథాలు రచించారు. ఎన్నో అవధానాలు చేసి కనకాభిషేకం
అందుకున్నారు.
7. ఆత్మకథ ప్రక్రియను పరిచయం చేయండి.
జ). ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే పుస్త క రూపంలో రాసుకుంటే దానిని ఆత్మకథ అంటారు.
ఆత్మకథను స్వీయచరిత్ర అనికూడా అంటారు. ఆత్మకథ ఉత్త మ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలను
చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తు న్న అనుభూతి చెందుతాడు. ఆత్మకథ వ్యక్తిగతమైనదే
అయినప్పటికీ దానిలో సమకాలీన ఆర్థిక, సాంఘిక, రాజకీయ విశేషాలు ప్రతిబింబిస్తా యి. ఆత్మకథ ఇతరులకు
ప్రేరణ కలిగిస్తు ంది.
8. నా చదువు పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జ). తెలుగులో వచన కవిత్వానికి పట్ట ం కట్టిన ప్రముఖ రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు
అగ్రగణ్యులు. వారికి చిన్నతనంలో విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి
మార్గ దర్శకం. వారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకొని రచయితగా ఎదిగిన తీరుని
తన ఆత్మకథ "అనుభవాలూ - జ్ఞా పకాలూనూ"లో వివరించారు. అందులో వారి బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే
సంఘటనలే ఈ పాఠ్యాంశానికి నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేవాలయ గోపురం నుండి కనిపించే దృశ్యాన్ని వర్ణించారు కదా! మీ ఇంటి
ముందు నిలబడి చూస్తే మీ వీధి ఎలా కనిపిస్తు ందో వర్ణిస్తూ రాయండి.
జ). మూలపొ లం గ్రా మంలో రామాలయం ప్రక్కన ఉండే వీథిలో మేము నివాసం ఉంటున్నాము. మా
వీథిలో సుమారుగా 20 ఇళ్ళు ఉంటాయి. మా వీథిలో మాదే చివరి ఇల్లు . వీథిలో రోడ్డు కు ఇరువైపులా రకరకాల
జాతులకు చెందిన పచ్చని వృక్షాలు ఉంటాయి. మా ఇంటి ముందు నిలబడి చూస్తే మా వీథిలోని ఇళ్ల న్నీ ఒక
క్రమపద్ధ తిలో ఉండక, అక్కడక్కడ దూరం దూరంగా ఉంటాయి. అవన్నీ ఆకాశంలో చిందరవందరగా విసిరేసినట్లు న్న
నక్షత్రా ల వలె అందంగా కనిపిస్తా యి.
రోడ్డు ప్రక్కనున్న పూలచెట్లనుంచి రాలుతున్న పూలు స్వర్ణ పుష్పాలను తలపింపజేస్తా యి.
చెట్లపైనుంచి వీస్తు న్న పైరగాలి వీథిలో వెళ్తు న్న వారి మనసులను ఆనందభరితం చేస్తు ంది. ఇరువైపులా ఉన్న చెట్ల

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 90

తలలు ఒకదానిలో ఒకటి కలిసిపో యి వీథికి ఆకుపచ్చని గొడుగు పట్టినట్లు గా కనిపిస్తా యి. ఒక్క మాటలో
చెప్పాలంటే మా వీథి సొ గసును చూసి ఆస్వాదించాలేగాని మాటల్లో వర్ణించలేము.
2. నేటి విద్యా విధానంలో విద్యార్థు లకు లభిస్తు న్న సౌకర్యాలను తెలియజేస్తూ కరపత్రం తయారుచేయండి.
జ). అందరూ విద్యావంతులు కావాలి!
ప్రియమైన సో దర సో దరీమణులారా!
మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దేది విద్య మాత్రమే అనే విషయం అందరికీ తెలిసినదే.
పూర్వకాలంలో విద్యను అభ్యసించడానికి ఎన్నో కష్టా లు పడాల్సివచ్చేది. నేటి విద్యా విధానంలో విద్యార్థు లకు
ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కల్పిస్తు న్నాయి. అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థు ల తల్లు ల బ్యాంకుఖాతాలలో
డబ్బులు వేస్తు న్నారు. పాఠ్య పుస్త కాలు, నోటు పుస్త కాలు, బ్యాగులు, బట్ట లు, బూట్లు , బెల్టు లు వంటివి విద్యార్థు లకు
ఉచితంగా అందజేస్తు న్నారు. నాడు - నేడు పేరుతో పాఠశాలలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దు తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం బడి పిల్లల ఆకలి తీరుస్తు ంది.
విద్యలో సాంకేతికతను జోడించి ట్యాబ్లు , IFP ప్యానెల్లు ఉపయోగించి పాఠాలు బో ధిస్తు న్నారు. విద్యను
బో ధించడానికి తగినంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు. విశాలమైన క్రీడాస్థ లాలు ఉన్నాయి. కాబట్టి మీరంతా మీ
చెల్లెళ్ళకు, తమ్ముళ్ల కు, ఇరుగుపొ రుగు వారికి ఈ విషయాలు తెలియజేస,ి ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా
ప్రో త్సహిస్తా రని ఆశిస్తు న్నాము.
సౌకర్యాలను వినియోగించుకోండి - చక్కగా చదువుకోండి.
కె.పెదపూడి, ఇట్లు
22 - 12 - 2023. 9వ తరగతి విద్యార్థినీ విద్యార్థు లు,
జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల, కె.పెదపూడి.
3. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ గురువు సీతారామశాస్త్రి గారి గొప్పతనం గురించి చెప్పారు కదా!
అలాగే మీ ఉపాధ్యాయుని గొప్పతనం గురించి పది వాక్యాలు రాయండి.
జ). మా పాఠశాలలో గంగారావు గారు అనే ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయన మాకు సాంఘిక శాస్త ం్ర
బో ధిస్తా రు. తరగతి గదిలో మాకు కేవలం పాఠ్య పుస్త కంలోని విషయాల్ని మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను
ప్రస్తు తకాలానికి అన్వయించి బో ధిస్తా రు. సమాజ స్థితగతులను కళ్ళకు కట్టినట్లు వివరిస్తా రు. వారు నిరంతరం అనేక
కొత్త పుస్త కాలను అధ్యయనం చేస్తు ంటారు. ఆయన ఇల్లు ఒక పెద్ద గ్రంథాలయంలా ఉంటుంది. వారి ఇంటిలో సగం
స్థ లానికిపైగా ఆ పుస్త కాలకే సరిపో తుంది.
విద్యార్థు లు ఏదైనా సందేహం అడిగితే విసుక్కోకుండా సమాధానం చెబుతారు. ముఖ్యంగా మా
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవసరమైన మెళకువలను కూడా మాకు చెబుతారు. విద్యార్థు లను తన
కన్నబిడ్డ ల్లా చూసుకుంటారు. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అనే మాటకు ఆయన పూర్తిగా అర్హు లు. అందుకే
ఆత్మీయతకు చిరునామాగా నిలిచిన గంగారావు మాష్టా రు అంటే మా పాఠశాలలో అందరికీ ఎంతో అభిమానం.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది పదాలకు సరైన అర్థా లను గుర్తించి రాయండి. వాటిని సొ ంతవాక్యాల్లో ప్రయోగించండి.
వెళ్ళిపో వడం, పొ ందదగినది, నడవడిక, అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు, నిష్ణా తుడు
ఉదా : సఫలం = విజయవంతం
మనం చేసే పనులు సఫలం అయినప్పుడే సార్ధక్యం.
1. ప్రా ప్యం = పొ ందదగినది
*మనం ఎంత ఆశపడినా మనకు ప్రా ప్యం లేనిది మనకు దక్కదు.
2. పారంగతుడు = నిష్ణా తుడు
*అర్జు నుడు విలువిద్యలో పారంగతుడు.
3. ప్రవర్త న = నడవడిక
* మంచి ప్రవర్త న కలిగిన పిల్లలనే అందరూ ఇష్ట పడతారు.
4. దీక్షాపరుడు = అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు
*శ్రీరాముడు పితృవాక్య దీక్షాపరుడు.
5. ఉడాయించడం = వెళ్ళిపో వడం(పారిపో వడం)
*దొ ంగ షాపులోని వస్తు వులను దొ ంగిలించి అక్కడినుండి ఉడాయించాడు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 91

ఆ). కింది వాక్యాలను చదివి, పర్యాయపదాలను గుర్తించి రాయండి.


1. ఆ మార్గ ంలో వెళ్ళడం మంచిది.ఆ తోవలో జనసంచారం ఎక్కువ. అందుకే జనులందరూ ఆ దారిలో వెళ్తా రు.
జ). మార్గ ం, తోవ, దారి
2. మన రహస్యం ఎవరికీ చెప్పకూడదు. మన గుట్టు విప్పడం వలన మనకే కీడు. కనుక మర్మమును మనలోనే
ఉంచుకోవాలి.
జ). రహస్యం, గుట్టు , మర్మం
3. పక్షికి గూడు,మనిషికి గృహం అవసరం. సదనం మనకు రక్షణనిస్తు ంది. అలాంటి ఆవాసం అందరికీ ఉండాలి.
జ). గూడు, గృహం, సదనం, ఆవాసం
4. కోనసీమ పచ్చదనానికి పుట్టిల్లు . ఈ ప్రా ంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందు
చేస్తు ంది.
జ). సీమ, ప్రా ంతం, ప్రదేశం
5. మహిళలు నడయాడే దేవతామూర్తు లు.వనితలను అగౌరవపరచకూడదు. స్త్రీలకు తగిన చేయూతనివ్వాలి.
జ). మహిళలు, వనితలు, స్త్రీలు
ఇ). కింది పదాలను సరైన నానార్ధా లతో జతచేయండి.
1. పూనిక ( ఆ ) అ). ఆకృతి, కల్పన
2. నిర్మాణం ( అ ) ఆ). యత్నం, సన్నాహం
3. దృక్పథం ( ఉ ) ఇ). కుదురు, ఆవాసం
4. పాదు ( ఇ ) ఈ). ఏమాత్రం, ఏకొంచెమైనా
5. సుతరాం ( ఈ ) ఉ). అభిప్రా యం, మార్గ ం
ఈ). కింది ప్రకృతి పదాలను చదవండి. వాటికి సరైన వికృతి పదాలను గుర్తించి వాక్యాలలో రాయండి.
శాస్త ం్ర , వీథి, దేవాలయం, దృష్టి, నిద్ర, రాత్రి, స్నానం
ఉదా: విద్య - విద్దె
*మనిషికి విద్య అవసరం. విద్దెను వదలక సాధించాలి.
1. దేవాలయం (ప్రకృతి) - దేవళం (వికృతి)
*అప్పనపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆ దేవళంలోని దేవుడిని బాలబాలాజీ స్వామిగా పిలుస్తా రు.
2. వీథి (ప్రకృతి) - వీది (వికృతి)
*మా వీథి కంటే మా ప్రక్క వీది కొంచెం విశాలంగా ఉంటుంది.
3. నిద్ర (ప్రకృతి) - నిదుర (వికృతి)
*నేను రాత్రి తొమ్మిది గంటలకల్లా నిద్రపో తాను. మా తమ్ముడు పదైనా సరే నిదుర పో కుండా టి.వి. చూస్తా డు.
4. శాస్త ం్ర (ప్రకృతి) - చట్ట ం (వికృతి)
*న్యాయశాస్త ం్ర ప్రకారం తప్పు చేసిన వారికి తగిన శిక్ష ఉంటుంది. చట్ట ం దృష్టిలో అందరూ సమానమే.
5. రాత్రి (ప్రకృతి) - రాతిరి (వికృతి)
*రాత్రి ఆకాశంలో నక్షత్రా లు మెరుస్తూ కనిపిస్తా యి. రాతిరి వేళ ఆరుబయట పడుకోవడమంటే నాకెంతో ఇష్ట ం.
6. దృష్టి (ప్రకృతి) - దిస్టి (వికృతి)
*మా తమ్ముడు బొ ద్దు గా ఉండటంతో అందరి దృష్టి వాడిపైనే ఉంటుంది. అందుకే మా అమ్మ వాడికి రోజూ దిస్టి
తీస్తు ంది.
7. స్నానం (ప్రకృతి) - తానం (వికృతి)
*నేను రోజూ సబ్బుతో స్నానం చేస్తా ను. పండుగ రోజుల్లో నైతే నలుగుపిండి రాసుకుని తలంటు తానం చేస్తా ను.

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

అ). కింది పదాలను విడదీసి, సంధిని గుర్తించి సూత్రం రాయండి.


1. సూర్యోదయం = సూర్య + ఉదయం = గుణసంధి

👉
2. నవోదయం = నవ + ఉదయం = గుణసంధి
గుణసంధి సూత్రం : ‘అ’ కారానికి ఇ,ఉ,ఋ లు పరమైనపుడు వరుసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తా యి.
3. విద్యార్థు లంటే = విద్యార్థు లు + అంటే = ఉత్వసంధి
4. పో రుగూళ్ళు = పొ రుగు + ఊళ్ళు = ఉత్వసంధి

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 92

👉ఉత్వసంధి సూత్రం : ఉత్తు నకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యంగా వస్తు ంది.
👉సరళాదేశ సంధి సూత్రా లు :
5. కలగcజొచ్చింది = కలగన్ + చొచ్చింది = సరళాదేశ సంధి

i). ద్రు తప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తా యి. (కలగన్ + జొచ్చింది)
ii). ఆదేశ సరళాలకు ముందున్న ద్రు తానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తా యి.

👉టుగాగమసంధి :
(కలగcజొచ్చింది/కలగంజొచ్చింది/కలగన్జొచ్చింది)

తెలుగు సంధులలో ఒకటైన టుగాగమసంధిని గురించి తెలుసుకుందాం!


కింది ఉదాహరణలను పరిశీలిద్దా ం.
ఉదా : 1. కఱకుటమ్ము = కఱకు + అమ్ము (ఉ+అ = ఉ+ట్+అ)
2. నిలువుటద్ద ము = నిలువు + అద్ద ం (ఉ+అ = ఉ+ట్+అ)
పై ఉదాహరణలు పరిశీలిస్తే అవి కర్మధారయ సమాసాలు. పూర్వపదం చివరి అక్షరంగా ఉ (ఉత్తు ) ఉన్నది. అలాగే
పరపదంలోని మొదటి అక్షరంగా అ (అచ్చు) ఉన్నది.
పూర్వ పరస్వరాలు కలిసిపో యేటప్పుడు పూర్వస్వరం అలాగే ఉంటూ 'ట్' ఆదేశంగా వస్తు న్నది. కావున దీనిని

👉
టుగాగమసంధి అంటారు.
సూత్రం1: కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర 'ఉ' ఉండి దానికి అచ్చు పరమైనప్పుడు 'ట్' ఆగమంగా
వస్తు ంది.
*కింది ఉదాహరణలను పరిశీలిద్దా ం.
ఉదా : పేరుటురము = పేరు + ఉరము = పేరుట్ + ఉరము
చిగురుటాకు = చిగురు + ఆకు = చిగురుట్ + ఆకు
పై ఉదాహరణలు పరిశీలిస్తే పూర్వపదం చివరి అక్షరంలో 'ఉత్తు ' ఉన్నది. (పూర్వపదంలోని పదాలన్నీ పేర్వాది
శబ్దా లున్నాయి. పేరు, చిగురు, పొ దరు మొదలైన శబ్దా లను పేర్వాదులు అంటారు. ఈ పదాల చివరి అక్షరంలో ఉత్తు
ఉన్నది.)
పరపదం మొదటి అక్షరంగా అచ్చులున్నాయి. ఇందులో పూర్వపదంలోని చివరి అక్షరంలో గల 'ఉత్తు ' అలాగే ఉంది.
పరపదంలోని 'అచ్చు' స్థా నంలో టుగాగమం వస్తు ంది.

👉
అంటే ఉ = టు గాను, ఆ = టా గాను మార్పు చెందినది. కాబట్టి ఇది టుగాగమసంధి.
సూత్రం 2 : కర్మధారయంబునందు పేర్వాది శబ్దా లకు అచ్చు పరమగునపుడు టుగాగమం విభాషగానగు.
అ). కింది పదాలను విడదీసి, సంధిపేరు తెలిపి సూత్రీకరించండి.
1. పొ దరుటిల్లు = పొ దరు + ఇల్లు = టుగాగమసంధి
2. తూగుటుయ్యేల = తూగు + ఉయ్యేల = టుగాగమసంధి
3. పల్లెటూరు = పల్లె + ఊరు = టుగాగమసంధి
4. పండుటాకు = పండు + ఆకు = టుగాగమసంధి
5. పెంకుటిల్లు = పెంకు + ఇల్లు = టుగాగమసంధి
*టుగాగమసంధి సూత్రం : కర్మధారయంబునందు పేర్వాది శబ్దా లకు అచ్చు పరమగునపుడు టుగాగమం

💥సమాసాలు :
విభాషగానగు.

అ). కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.


1. సీత భర్త - సీతయొక్క భర్త - షష్ఠీ తత్పురుష సమాసం
2. బావి నీరు - బావినందలి నీరు - సప్త మీ తత్పురుష సమాసం
3. అసాధ్యుడు - సాధ్యుడు కానివాడు - నఞ్ తత్పురుష సమాసం
4. అధర్మము - ధర్మము కానిది - నఞ్ తత్పురుష సమాసం
5. నిద్రా హారాలు - నిద్రయును, ఆహారమును - ద్వంద్వ సమాసం

💥ఆధునిక వచనం :
6. కొత్త వీధి - కొత్త దైన వీధి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

అ). కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి.


1. తమ శిష్యులందరిలోను నాకే అగ్రతాంబూలంబునిచ్చిరి.
జ). వారి శిష్యులందరిలోకీ నాకే అగ్రతాంబూలం ఇచ్చారు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 93

2. చల్ల ని నీటితో స్నానంబుసేస,ి బట్ట లనద్దు కొనియూ వేసుకొనవలయును.


జ). చల్ల టి నీటితో స్నానం చేస,ి బట్ట లను అద్దు కొని వేసుకోవాలి.
3. మధ్యాహ్నంబు వేళ తఱచుగాబో యి దేవాలయ గోపురంబు పైయంతస్తు న కూర్చునియుండెడివాడను.
జ). మధ్యాహ్నం వేళ తరచుగా వెళ్ళి దేవాలయ గోపురం పై అంతస్తు లో కూర్చునేవాడిని.
4. నేను మా నాన్నగారి యనుమతితో యాడుకొనుటకు వెళ్ళెడివాడిని.
జ). నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని.

*******

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 94

7. ఆకుపచ్చ శోకం
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. 'ఆకుపచ్చ శోకం' పాఠ్యాంశాన్ని భావయుక్త ంగా చదవండి.
జ). (వచనాన్ని, వచన కవితను ఉపాధ్యాయుడు చదివేటప్పుడు విద్యార్థు లు గమనించి, భావయుక్త ంగా
చదవడానికి ప్రయత్నిస్తా రు.)
2. మనిషిని కవి ఆక్టో పస్ తో ఎందుకు పో ల్చారో చెప్పండి.
జ). ఆక్టో పస్ చాలా ప్రమాదకరమైన జీవి. దానికి అన్నివైపులా చేతులవంటి అవయవాలు ఉంటాయి.
దాని సమీపానికి ఇతర జీవులు రాగానే ఆ చేతులతో పట్టు కుని వాటిని ఆహారంగా తినేస్తు ంది. అలాగే మనిషి కూడా
విచక్షణ లేకుండా కనిపించిన చెట్టు నల్లా నరికేస్తు న్నాడు. ఆక్టో పస్ వల్ల జలచరాలకు నష్ట ం వాటిల్లు తున్నట్లే మనిషి
వల్ల పర్యావరణానికి కూడా ముప్పు పొ ంచివుంది. అందువల్ల మనిషిని కవి ఆక్టో పస్ తో పో ల్చారు.
3. ‘లెక్కల్లో మునిగిపో యిన మనిషి మొక్కల్నేం పట్టించుకుంటాడు' అని కవి ఎందుకు అన్నారు?
జ). మనిషి స్వార్థజీవి. మనిషి ఏ పనిచేసినా దానిలో లాభనష్టా లను అంచనావేసుకునే చేస్తా డు. తనకు
లాభం కలిగించే పనిని ఎంత కష్ట మైనా చేస్తా డు. తనకు లాభం లేదనుకుంటే అస్సలు ఏ పనీ చేయడు. చేసే
ప్రతిపనిని లెక్కలేసుకుని చేసే మనిషికి మొక్కల్ని పట్టించుకునే తీరికే ఉండటం లేదని కవి ఆవేదనతో ఈ మాటలు
అన్నారు.
4. పచ్చటి లోకాన్ని ముందు తరాలకు హామీగా ఇవ్వాలంటే మనమేం చేయాలి?
జ). పర్యావరణానికి హితాన్ని కలిగించే మొక్కలను ఎక్కువగా పెంచాలి. వాటిని బాధ్యతతో సంరక్షించాలి.
మన ఇంటిలో పుట్టినరోజు, వివాహం వంటి శుభకార్యాలు జరిగే సమయాల్లో ఆ రోజుకు గుర్తు గా కొన్ని మొక్కల్నైనా
నాటాలి. మన అవసరాల కోసం చెట్లను విచ్చలవిడిగా నరకకూడదు. చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి హాని
కలుగుతుందని అందరికీ తెలిసేలా ప్రచారం చెయ్యాలి. ఈ విధంగా చేయడం ద్వారా పచ్చటి లోకాన్ని ముందు
తరాలకు హామీగా ఇవ్వవచ్చు.
ఆ). కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
తులసి గౌడ కర్ణా టక రాష్ట ం్ర లోని హూన్నాలి గ్రా మానికి చెందినది. ఆమె పర్యావరణ రక్షకురాలు.
•••••••••••••••••••••• ఆమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 26 జనవరి 2020న 'పద్మశ్రీ' పురస్కారంతో
గౌరవించింది.
@ప్రశ్నలు :
1. తులసి గౌడను స్థా నికులు ఏమని పిలుస్తు న్నారు?
జ). తులసి గౌడను స్థా నికులు 'వృక్షదేవి' అని పిలుచుకుంటారు.
2. తులసి గౌడ మొక్కల్ని ఎలా భావించింది?
జ). తులసి గౌడ మొక్కల్ని కన్నబిడ్డ లుగా భావించింది.
3. తులసి గౌడను ఏ అవార్డు తో సత్కరించారు? ( ఇ )
అ). పద్మ ఆ). భారతరత్న ఇ). పద్మశ్రీ
4. ఎన్నో విషయాలు తెలిసి ఉండడం అని అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). విజ్ఞా న సర్వస్వం అనే పదం ఎన్నో విషయాలు తెలిసి ఉండడం అనే అర్థా న్నిస్తు ంది.
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జ). తులసి గౌడ ఒక్క ఏడాది కాలంలో ఎన్ని మొక్కలు నాటింది?
ఇ). కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
నటరాజన్ పుట్టింది తమిళనాడులోని పుదుక్కోటలో. నటరాజన్ కి రెండేళ్లు ఉన్నప్పుడే తల్లి భాగీరధి
చనిపో యింది. •••••••••••• శారద అనే కలం పేరుతో రచనలు చేశాడు. ఈయన శారద నటరాజన్ గా ప్రసిద్ధు డు.
@ప్రశ్నలు :
1. వంట పట్టించుకోవడం అంటే అర్థం ఏమిటి?
జ). వంట పట్టించుకోవడం అంటే పూర్తిగా నేర్చుకోవడం అని అర్థం.
2. నటరాజన్ జీవితంలో మీకు గొప్పగా అనిపించిన అంశం ఏమిటి?
జ). బ్రతుకుతెరువు కోసం గారెలు, బజ్జీలు అమ్ముతూ, సాహిత్యంపై ప్రేమతో రచనలు చేయడం నటరాజన్
జీవితంలో నాకు గొప్పగా అనిపించింది.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 95

3. శారద నటరాజన్ రాసిన నవలల పేర్లు రాయండి?


జ). శారద నటరాజన్ మంచీచెడూ, అపస్వరాలు, ఏది సత్యం, చీకటి తెరలు వంటి నవలలు రాశారు.
4. నటరాజన్ తల్లిదండ్రు ల పేర్లు రాయండి.
జ). భాగీరథి, సుబ్రహ్మణ్య అయ్యర్ గార్లు నటరాజన్ తల్లిదండ్రు లు.
5. పై కథనం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జ). నటరాజన్ గారు ఏ కలం పేరుతో రచనలు చేశారు?
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు ఇవ్వండి.
1. 'ఆకుపచ్చ శోకం' అనే పేరు పాఠ్యాంశానికి ఎలా సరిపో తుందో వివరించండి.
జ). ప్రకృతి సమస్త ప్రా ణికోటికి జీవనాధారం. మనిషి అభివృద్ధి పేరుతో అటువంటి ప్రకృతిని సర్వనాశనం
చేస్తు న్నాడు. తన అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రకృతిలో భాగమైన చెట్లను విచ్చలవిడిగా నరికేస్తు న్నాడు. అలా
చేయడం మనిషి మనుగడకే ప్రమాదకరం. ఈ పాఠంలో చెట్లను నరకడం వల్ల జరిగే నష్టా లను కవి గారు కళ్ళకు
కట్టినట్లు చెప్పారు. కాబట్టి ఈ పాఠానికి 'ఆకుపచ్చ శోకం' అనే పేరు సరిపో తుందని చెప్పవచ్చు.
2. పర్యావరణ పరిరక్షణకు మనం ఎలాంటి చర్యలు చేపట్టా లి?
జ). పర్యావరణానికి హితాన్ని కలిగించే మొక్కలను ఎక్కువగా పెంచి, వాటిని బాధ్యతతో సంరక్షించాలి.
మన స్వార్థం కోసం పంచభూతాలను కలుషితం చేయకూడదు. కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలను
వినియోగించాలి. ప్లా స్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని
పూర్తిగా తగ్గించి, భూమికి మేలుచేసే సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. ఇటువంటి కనీస చర్యలు తీసుకోవడం
ద్వారా మనం పర్యావరణాన్ని కొంతవరకైనా రక్షించవచ్చు.
3. ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదల్చుకున్నారు?
జ). నగరీకరణ, పారిశ్రా మికీకరణ వలన పర్యావరణం వినాశనం అవుతోంది. మనిషి డబ్బు మీద ఆశతో
పర్యావరణ వినాశనానికి సిద్ధపడుతున్నాడు. వర్షా లు కురవాలంటే చెట్లు ఉండాలి. మన ఊపిరి నిలపే ఆక్సిజన్ కు
చెట్లే ఆధారం. చెట్ల శాతం తగ్గేకొద్దీ ఉష్ణో గ్రతలు పెరిగిపో యి,భూగర్భజలం తరిగిపో తుంది. ఇదే పరిస్థితి ఇలాగే
కొనసాగితే భూమ్మీద సమస్త జీవకోటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి,
పచ్చటి ప్రకృతిని, పర్యావరణాన్ని రాబో యే తరాలకు హామీగా ఇవ్వాలని కవి చెప్పదల్చుకున్నారు.
4. 'అందరికీ చెట్టొ క పానకంలో పుడక' ఈ వాక్యం గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో రాయండి.
జ). పానకం కలిపేటప్పుడు అందులో రుచి కోసం, ఆరోగ్యం కోసం మిరియాలు, యాలకులు వంటి సుగంధ
ద్రవ్యాలు కలుపుతారు. కానీ ఆ పానకాన్ని తాగేటప్పుడు నోటికి అడ్డు గా తగులుతున్నాయని ఆ ద్రవ్యాలను
తీసిపారేస్తా రు. అలాగే మనిషి తన ప్రతి అవసరానికి చెట్లపైనే ఆధారపడి జీవిస్తా డు. అదే చెట్లను అవసరం
తీరిపో యాక ఇంటి నిర్మాణానికో వేరే అవసరానికో అడ్డ ంగా ఉన్నాయనే నెపంతో తొలగిస్తా డు. అని ఈ వాక్యం గురించి
నేను అర్థం చేసుకున్నాను.
5. 'ఆకుపచ్చ శోకం' పాఠ్యాంశ రచయిత గురించి రాయండి.
జ). 'ఆకుపచ్చ శోకం' అనే పాఠ్యాంశాన్ని శ్రీ కొండెపో గు బి.లివింగ్స్టన్ గారు రచించారు. ఈయన ప్రకాశం
జిల్లా మార్కాపురంలో జన్మించారు. జీవశాస్త ్ర అధ్యాపకునిగా పనిచేశారు. అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ
శోకం మొదలైన కవితా సంపుటాలు; కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం పేరు మీద
ఆధ్యాత్మిక వ్యాసాలు వీరి రచనలు. పర్యావరణం ఇతివృత్త ంగా వచన కవితలు రాయడంలో వీరు అందెవేసిన చేయి.
6. 'పర్యావరణ కవిత్వం' ప్రక్రియను పరిచయం చేయండి.
జ). తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి,
పర్యావరణానికి కలుగుతున్న హానిని, దాని వలన కలిగే పర్యవసానాలను తెలియజెప్పడమే పర్యావరణ కవిత్వం
ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తా డు. అందువలన దీనిని
కవితావ్యాసం అని కూడా అంటారు.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. 'చెట్టు ఆవేదన'ను ఏకపాత్రా భినయం చేయడానికి ప్రదర్శన పాఠం తయారుచేయండి.
జ). నేను ఈ భూమిపై జీవులకు అత్యంత ముఖ్యమైన సహజ వనరులలో ఒకదాన్ని. నేను సకల
జీవరాశి బ్రతకడానికి కావలసిన ప్రా ణవాయువును అందిస్తా ను. నేను ఈ భూమ్మీద లేకపో తే జీవుల మనుగడే
ప్రశ్నార్థకం అవుతుంది. నన్ను ఎప్పుడో , ఎక్కడో చూసినట్లు గా ఉంది కదూ! అవును మీ మానవుల స్వార్థా నికి
బలియైపో తూ బతుకుజీవుడా అంటూ బతుకీడుస్తు న్న పచ్చని చెట్టు ను నేను.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 96

నేను మీకు ఎన్నో రకాలుగా మేలుచేస్తా ను. ఎండనుండి, వాననుండి మీకు రక్షణ కల్పిస్తా ను. నేను
మనుష్యులకు, పశువులకు, పక్షులకు, కీటకాలకు అంతెందుకు ఈ భూమిమీద బ్రతికే ప్రతిజీవికీ ఆహారాన్ని
అందిస్తా ను. స్వచ్ఛమైన గాలిని అందిస్తా ను. నన్ను ఆశ్రయించి బతికే పక్షుల కువకువ రాగాలు ఎంతో
వీనులవిందుగా ఉంటాయి.
నేను ఎవ్వరిమీదా ఆధారపడకుండా గాలి, సూర్యకాంతి ద్వారా సొ ంతంగా ఆహారం తయారు
చేసుకోగలను. మీకు ఇన్ని విధాలుగా ఉపయోగపదుతున్న నన్ను మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్ట మొచ్చినట్లు
నరికేస్తు న్నారు. భవిష్యత్తు లో ఇది మీ మనుగడకే ప్రమాదం అని తెలుసుకోండి. నా బ్రతుకు నన్ను బతకనివ్వండి.
లేదంటే మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. తస్మాత్ జాగ్రత్త.
2. గ్లో బల్ వార్మింగ్ ద్వారా సంభవించబో యే విపత్తు ల గురించి రచయిత చేసిన హెచ్చరికలను
మీ సొ ంతమాటల్లో వ్యాసంగా రాయండి.
జ). భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తూ ఓజోన్ పొ ర సమస్త
జీవులనూ కాపాడుతుంది. అటువంటి ఓజోన్ పొ ర, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం వల్ల తరిగిపో తోంది. దీనినే
"గ్లో బల్ వార్మింగ్" లేదా "భూమి వేడెక్కడం" అని అంటారు. ఈ గ్లో బల్ వార్మింగ్ వల్ల మానవాళి అనేక విపత్తు లను
ఎదుర్కోవలసివస్తు ంది.
గ్లో బల్ వార్మింగ్ ప్రభావం వల్ల కార్బన్డ యాక్సైడ్ వంటి విషవాయువులు పెరిగి భూగోళం తాపంతో
మరిగిపో తుంది. భూతాపం వల్ల ఇరుధ్రు వాల్లో ని మంచుఖండాలు కరిగ,ి సముద్రా లు పొ ంగిపొ ర్లు తాయి. కాలంతో
సంబంధం లేకుండా ఉష్ణ తాపం పెరిగిపో తుంది. పచ్చికబయళ్ళు ఎడారులుగా మారిపో తాయి. భూగర్భ జలాలు
ఇంకిపో తాయి. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమ్మీద మానవులతో పాటు సమస్త జీవుల మునుగడ ప్రశ్నార్థకం
అవుతుంది. అంటూ కవి గ్లో బల్ వార్మింగ్ ద్వారా సంభవించబో యే విపత్తు ల గురించి హెచ్చరించారు.
3. పల్లె,పట్నం తేడాలేకుండా చెట్లు కనుమరుగు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మిత్రు నికి లేఖ రాయండి.
జ). కె.పెదపూడి,
22-02-2024.
ప్రియమిత్రు డు జగదీష్ కృష్ణ ఆదిత్యకు,
ఉభయకుశలోపరి. ప్రస్తు త కాలంలో పల్లె,పట్నం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ చెట్లు
కనుమరుగు అవుతుండడాన్ని మనం చూస్తూ నే ఉన్నాము. పెద్దపెద్ద భవనాలు నిర్మించుకోవడం కోసం చెట్లు
అడ్డు గా ఉన్నాయనే నెపంతో వాటిని తొలగిస్తు న్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన కలప కోసం చెట్లను
అవసరానికిమించి నరికేస్తు న్నారు. పరిశమ ్ర ల నిర్మాణానికి విశాలమైన స్థ లాలు అవసరం కావడంతో ఆ స్థ లాలలో
ఉన్న చెట్లను ఇష్టా నుసారం తీసిపారేస్తు న్నారు. ఇంకా కరెంటు తీగలకు తగులుతున్నాయనో, రహదారుల విస్త రణకు
అడ్డొస్తు న్నాయనో అనేక చెట్లను నరికేస్తు న్నారు.
ఇలా చెట్లను విచ్చలవిడిగా నరికేయడం వల్ల కాలుష్యం ఎక్కువై, భూతాపం పెరిగిపో తుంది. దీనివల్ల
రాబో యే కాలంలో ఈ భూమ్మీద జీవరాశి మనగడే ప్రశ్నార్ధకం అవుతుంది. కాబట్టి మనమంతా ఇప్పటికైనా కళ్ళు
తెరిచి ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సూక్తిిలోని పరమార్థం గ్రహిద్దా ం. జరగబో యే అనర్ధా న్ని ముందుగానే గుర్తించి ఉన్న
చెట్లను రక్షించుకుందాం. కొత్త మొక్కలను విరివిగా నాటుదాం. ఈ విషయంపై నీ అభిప్రా యాన్ని కూడా తెలియజేస్తూ
లేఖ రాయగలవు. ఉంటాను మిత్రమా!
ఇట్లు
నీ ప్రియమిత్రు రాలు,
జాహ్నవిశ్రీ షణ్ముఖ లాస్య.
చిరునామా :
ఎమ్.జగదీష్ కృష్ణ ఆదిత్య,
తండ్రి - శ్రీనివాసరావు గారు,
ఎస్. మూలపొ లం గ్రా మం,
అయినవిల్లి మండలం,
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్ : 533211

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 97

4. "మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం" అనే అంశంపై కరపత్రం తయారుచేయండి.


పర్యావరణం పచ్చదనం ప్రశాంత జీవనం
“మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం”
మిత్రు లారా!
ప్రస్తు త కాలంలో పల్లె, పట్నం అనే తేడా లేకుండా రకరకాల కారణాలవల్ల పర్యావరణం కలుషితం
అవుతుంది. ఈ కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో మా వంతుగా మేము మా గ్రా మంలో
పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా ఒక ఇంటిని నిర్మించుకున్నాము. కొబ్బరాకులు, తాటాకులతో మా ఇంటి
పైకప్పు నిర్మించుకున్నాము. ఇంటి గోడలుగా కొబ్బరిచాపలు ఉపయోగించి, వాటిపై ఆవుపేడ,మట్టి మిశ్రమంతో
అలికాము. అందువల్ల మా ఇంటిలోపల చల్ల గా ఉంటుంది.
మా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ంటాయి. అందువల్ల మాకు స్వచ్ఛమైన గాలికి లోటులేదు. మా
ఇంటిలో మట్టితో, చెక్కతో చేసిన పాత్రలనే ఉపయోగిస్తా ము. వస్తు వులు తెచ్చుకోవడానికి కాగితపు సంచులను,
గుడ్డ సంచులను ఉపయోగిస్తా ము. మేము ఉపయోగించే ఏ వస్తు వుల వలనా పర్యావరణానికి ఏమాత్రం హాని
కలుగదు. అందుచేత మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహము అని సగర్వంగా చెప్పగలము. మీరుకూడా
మాలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉండే గృహాలను నిర్మించుకుంటారని ఆశిస్తు న్నాము.
పర్యావరణాన్ని కాపాడదాం - ప్రశాంతంగా జీవిద్దా ం.
ఎస్.మూలపొ లం, ఇట్లు
21 - 02 - 2024. మామిడిశెట్టి కృష్ణ మూర్తిగారి కుటుంబసభ్యులు,
ఎస్. మూలపొ లం గ్రా మం.

III).భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధా లు రాసి వాక్య ప్రయోగం చేయండి.
1. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.
జ). హరితం = పచ్చదనం
*కాలుష్యం కోరల్లో చిక్కి చెట్లు పచ్చదనాన్ని కోల్పోతున్నాయి.
2. గాలివాన వలన చాలా ఉపద్రవం కలిగింది.
జ). ఉపద్రవం = ప్రమాదం
*విద్యుత్తు తో చెలగాటం ప్రా ణాలకే ప్రమాదం.
3. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి.
జ). బాహువులు = చేతులు
*మానవ మృగాల చేతుల్లో అబలల జీవితాలు బలైపో తున్నాయి.
4. వేసవికాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు.
జ). ఛాయ = నీడ
*మూర్ఖు నితో స్నేహం పాము పడగ నీడలో తలదాచుకోవడంతో సమానం.
5. జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితమవుతున్నాయి.
జ). గరళం = విషం
*లోకక్షేమం కోసం పరమేశ్వరుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు.
ఆ). కింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తా యి.
జ). చెట్లు = వృక్షాలు, తరువులు
2. పెళ్లి లో వధూవరులను ముస్తా బు చేశారు.
జ). ముస్తా బు = అలంకరణ, అందంగా తయారవ్వడం
3. నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు.
జ). జాడ = ఆచూకి, ఆనవాలు

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 98

4. ఏటేటా భూగోళం మీద తాపం పెరుగుతూ ఉంది.


జ). తాపం = వేడ,ి సెగ
5. సముద్రా ల్లో కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది.
జ). సముద్రం = సాగరం, అంబుధి, జలధి
ఇ). కింది నానార్థా లను జతచేయండి.
1. ఎండ ( ఉ ) అ). విధం, ఆచూకి, దారి
2. కాలం ( ఇ ) ఆ). శరీరం, గురి, స్వభావం
3. కాయం ( ఆ ) ఇ). సమయం, నలుపు
4. జాడ ( అ ) ఈ). దప్పిక, కాలుట
5. దాహం ( ఈ ) ఉ). వెలుగు, ఆతపం
ఈ). కింది ప్రకృతి, వికృతులను జతపరచండి.
1. మనిషి ( ఇ ) అ). కత
2. పట్ట ణం ( ఈ ) ఆ). సంద్రం
3. సముద్రం ( ఆ ) ఇ). మానిషి
4. ఛాయ ( ఉ ) ఈ). పత్త ణం
5. కథ ( అ ) ఉ). చాయ
ఉ). కింది వాక్యాలలో జాతీయాలను వివరించండి.
1. అందరికీ చెట్టొ క పానకంలో పుడక.
జ). ఏదైనా విషయం గురించి ఇద్ద రు వ్యక్తు లు ముచ్చటించుకుంటున్న సందర్భంలో వేరే వ్యక్తి వచ్చి మధ్యలో
కల్పించుకుని వారి మాటలకు ఆటంకం కలిగించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తా రు.
2. నగరాల్లో తామరతంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తు న్నారు.
జ). అవసరం ఉన్నదానికంటే ఎక్కువగా/ ఊహించిన దానికంటే అధికంగా అనే అర్థా న్ని తెలియజేసే సందర్భంలో
ఈ జాతీయాన్ని ఉపయోగిస్తా రు.
3. పర్యావరణాన్ని నాశనం చేయడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే.
జ). తన జీవితాన్ని చేతులారా తానే నాశనం చేసుకోవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తా రు.
4. కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరుమంటుంటే మనిషి నిమ్మకునీరెత్తి నట్లు న్నాడు.
జ). కళ్ళముందు జరుగుతున్నదంతా చూస్తూ కూడా తనకేమీ పట్ట నట్లు గా ప్రవర్తించడం అనే అర్థంలో
ఈ జాతీయాన్ని ఉపయోగిస్తా రు.
5. ప్లా స్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరు నడుం కట్టా లి.
జ). మనస్పూర్తిగా అంకిత భావంతో పనిచేయడం అనే అర్థా న్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని
ఉపయోగిస్తా రు.

💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :

అ). కింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరుమంటోంది.
జ). కళ్ళెదుట = కళ్ళ+ ఎదుట = అత్వసంధి
2. మనందరికీ చెట్టొ క ప్రా ణమిత్రు డు.
జ). చెట్టొ క = చెట్టు + ఒక = ఉత్వసంధి
3. నగరాల్లో చల్ల ని జానెడు నీడేద? ి
జ). నీడేది = నీడ + ఏది = అత్వసంధి
4. ప్లా స్టిక్ కొబ్బరి చెట్లు ముస్తా బైన శవాల్లా దర్శనమిస్తు ంటాయి.
జ). ముస్తా బైన = ముస్తా బు + ఐన = ఉత్వసంధి
ఆ). కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. తేనెటీగ = తేనె + ఈగ = టుగాగమ సంధి
2. పడకటిల్లు = పడక + ఇల్లు = టుగాగమ సంధి
3. పర్యావరణం = పరి + ఆవరణం = యణాదేశ సంధి
4. బాలింతరాలు = బాలింత + ఆలు = రుగాగమ సంధి

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 99

ఇ). కింది కర్మణి వాక్యాలను కర్త రి వాక్యాలుగా మార్చండి.


1. చంద్రు ని చేత చల్ల ని వెన్నెల ఇవ్వబడుతుంది.
జ). కర్త రి వాక్యం : చంద్రు డు చల్ల ని వెన్నెలను ఇస్తా డు.
2. రైతుల చేత పంటలు పండించబడతాయి.
జ). కర్త రి వాక్యం : రైతులు పంటలను పండిస్తా రు.
3. చెట్ల చేత ప్రా ణవాయువు అందించబడుతుంది.
జ). కర్త రి వాక్యం : చెట్లు ప్రా ణవాయువును అందిస్తా యి.
4. గోపి చేత మొక్క నాటబడింది.

💥సమాసాలు :
జ). కర్త రి వాక్యం : గోపి మొక్కను నాటాడు.

అ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.


సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు

1చెట్టు చేమలు చెట్టు యును, చేమయును ద్వంద్వ సమాసం

2.ఆకుపచ్చ శోకం ఆకుపచ్చనైన శోకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

3.జానెడు నీడ జానెడైన నీడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

4.రావిచెట్టు రావి అనే పేరుగల చెట్టు సంభావన పూర్వపద కర్మశారయ సమాసం

5.పచ్చనిచెట్లు పచ్చనివైన చెట్లు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం


💥అలంకారాలు :
👉కింది వాక్యాలలో అలంకారం గుర్తించండి.
1. ఆక్టో పస్ లా విస్త రించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫట్ చేస్తు న్నాయి.
జ). ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది.
*ఉపమాలంకారం లక్షణం : ఉపమేయ, ఉపమానాలకు చక్కని పో లిక చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ వాక్యంలో మనిషి బాహువులు - ఉపమేయం, ఆక్టో పస్ - ఉపమానం, లా - ఉపమా వాచకం,
హాంఫట్ చేయడం - సమాన ధర్మం. ఇక్కడ ఉపమేయమైన మనిషి బాహువులకు, ఉపమానమైన ఆక్టో పస్ కు
పో లిక చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
2. ఒక్కోచోట నిలువెత్తు ప్లా స్టిక్ కొబ్బరి చెట్లు ముస్తా బైన శవాల్లా దర్శనమిస్తు ంటాయి.
జ). ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది.
*సమన్వయం : ఈ వాక్యంలో ప్లా స్టిక్ కొబ్బరిచెట్లు - ఉపమేయం, ముస్తా బైన శవాలు - ఉపమానం, లా - ఉపమా
వాచకం. ఇక్కడ ఉపమేయమైన ప్లా స్టిక్ కొబ్బరిచెట్లకు, ఉపమానమైన ముస్తా బైన శవాలుకు పో లిక చెప్పబడింది.
కాబట్టి ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
3. ఆమె కేశాలు నల్ల ని త్రా చా అన్నట్లు న్నాయి.
జ). ఈ వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారము ఉన్నది.
*ఉత్ప్రేక్ష అలంకారము లక్షణం : ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని
ఉత్ప్రేక్ష అలంకారము అంటారు.
*సమన్వయం : ఈ వాక్యంలో కేశాలు - ఉపమేయం, నల్ల ని త్రా చు - ఉపమానం. ఇక్కడ ఉపమానమైన నల్ల ని త్రా చు
లక్షణాలు ఉపమేయమైన కేశాలలో ఉండటం వలన ఉపమేయమైన కేశాలను ఉపమానమైన నల్ల ని త్రా చులా
ఊహించారు. కాబట్టి ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.
4. ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లు న్నాయి.
జ). ఈ వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారము ఉన్నది.
*సమన్వయం : ఈ వాక్యంలో ఇటుకల బట్టీలు - ఉపమేయం, ఈజిప్టు మమ్మీలు - ఉపమానం. ఇక్కడ
ఉపమానమైన ఈజిప్టు మమ్మీల లక్షణాలు ఉపమేయమైన ఇటుకల బట్టీలలో ఉండటం వలన ఉపమేయమైన
ఇటుకల బట్టీలను ఉపమానమైన ఈజిప్టు మమ్మీలుగా ఊహించారు. కాబట్టి ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారము
ఉన్నదని చెప్పవచ్చు.

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.


తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 100

5. ఆ వస్తు న్న ఏనుగు నడుస్తు న్న కొండా అన్నట్లు ంది.


జ). ఈ వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారము ఉన్నది.
*సమన్వయం : ఈ వాక్యంలో ఏనుగు - ఉపమేయం, కొండ - ఉపమానం. ఇక్కడ ఉపమానమైన కొండ
లక్షణాలు(ఆకారంలో) ఉపమేయమైన ఏనుగులో ఉండటం వలన ఉపమేయమైన ఏనుగును ఉపమానమైన
కొండలా ఊహించారు. కాబట్టి ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.

*******

🌹 🌹
కృషితో నాస్తి దుర్భిక్షం
శుభం

రూపకల్పన :
మామిడిశెట్టి శ్రీనివాసరావు,
ఎమ్.ఏ; టి.పి.టి; నెట్; స్లెట్.
పాఠశాల సహాయకుడు (తెలుగు),
జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల, కె.పెదపూడి,అంబాజీపేట మండలం,
డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . :9493646591

✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.

You might also like