మబ్బులు తొలగిన వేళ

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

కథా శీర్షిక : మబ్బులు తొలగిన వేళ

"కాస్త నేను చెప్పేది విను వసూ…" అభ్యర్థిస్తు న్నట్లు గా అన్నాడు వాసుదేవ్.

"ఇంకా ఏం వినాలి…!" కోపంతో విసురుగా ఫో న్ పెట్టేయబో యింది వసంత.

"ఆగాగు… అసలు నీకేమన్నా అర్థమవుతోందా!? జరిగినదేమిటో పూర్తిగా తెలుసుకోకుండా, చెప్పేది కొంచెమైనా


వినకుండా… నీ మొండి వైఖరితో నీ బ్రతుకుని నువ్వే చేజేతులా నాశనం చేసుకుంటున్నావు! ప్లీజ్… నేను చెప్పేది
ఒక్కసారి సావధానంగా విను. ఆ తర్వాత నీ ఇష్ట ం!" మరోసారి రిక్వెస్టింగ్ గా అన్నాడతను.

"హు…ఇంకా ఏం వినాలి? ఏం తెలుసుకోవాలి? నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తు న్నానా!? జరిగిన సంఘటనని నా


కళ్ళారా చూసాకకూడా ఎలా నమ్మకుండా ఉండమంటావు? దాన్నిప్పుడు నీకు అనుకూలంగా కాస్త మసిపూసి
మారేడుకాయచేస,ి నన్ను నమ్మించడానికి ప్రయత్నించవద్దు …!" వసంత గొంతులో ఇంకాస్త కోపం తాలూకు గాఢత
పెరిగింది.

ఆమె అలా పెడసరంగా మాట్లా డటంతో, తీవ్రమైన కోపం వచ్చింది వాసుదేవ్ కి. అయినా తనని తాను
తమాయించుకున్నాడు.

"కళ్ళతో చూసేవన్నీ నిజాలైపో వు వసూ! దయచేసి అసలు వాస్త వం తెలుసుకోమంటున్నాను!" ఈసారి మాత్రం
కఠినంగానే అన్నాడు వాసుదేవ్.

"తెలుసుకున్నాను…ఇన్నాళ్ళు మూసుకుపో యిన నా కళ్ళిప్పుడు బాగా తెరుచుకున్నాయి. దయచేసి


ఇంకెప్పుడూ ఫో న్ చేసి నాకు తలనొప్పి తేవద్దు . ఇదే మనిద్ద రికీ చివరి కాల్…!" విసురుగా ఫో న్ కట్ చేసింది
వసంత.

ఏదో కోపంలో ఆవేపడి నాల్రో జులు పుట్టింటికి వెళ్ళి, తనే మరలా తిరిగొస్తు ందనుకున్నాడుగానీ… ఇప్పుడు భార్య
ఒక్కసారిగా అలా మాట్లా డేసరికి నిలుచున్నచోటే నేల రెండుగా చీలి,అందులో తను కూరుకుపో తున్నట్లు
అనిపించింది వాసుదేవ్ కి.

**********

వాసుదేవ్,వసంతలకు పెళ్ళయ్యి రెండేళ్ళయ్యింది.

పెళ్ళి చూపులప్పుడు వాసుదేవ్ ని చూడగానే అతనే తన భర్త గా మనసులో బాగా ఫిక్స్ అయిపో యింది వసంత. ఆ
సందర్భంలో అంతకుముందు పెద్దలు తెచ్చిన రెండు సంబంధాలు తప్పిపో వడం తన అదృష్ట ంగా భావించిందామె.
తను కోరుకున్నట్లు వాసుదేవే తన భర్త గా రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పో యాయి.

అలా పెళ్ళయ్యాక తమ జంటను చూసినవారందరూ…'చూట్టా నికి జంట చూడముచ్చటగా, చిలకా గోరింకల్లా


ఉన్నారు!' అని అన్నప్పుడల్లా తెగ సంబరపడిపో యేది.
ఇక వాసుదేవ్ విషయానికి వస్తే, ఓ ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తు న్నాడు.మనిషి కాస్త
నెమ్మదస్థు డు. ఎవరైనా ఆపదలో ఉంటే తనకు తోచినంత సహాయంచేసే మనస్త త్వం అతనిది.

పెళ్ళయిన తర్వాత వాసుదేవ్ కు వచ్చే జీతం, అలవెన్సులతో వారి సంసార జీవితం మూడు ముద్దు లు, ఆరు
ముచ్చట్లు లా హాయిగా సాగిపో సాగింది. మంచి భర్త దొ రికినందుకు తన అదృష్టా నికి తానే మురిసిపో యింది వసంత.

అలా వారి సంసార జీవితం సంవత్సర కాలంపాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉన్న ఊరిలోనే సంతోషంగా
గడిచిపో యింది.

అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా! అనుకోకుండా ప్రధాన కార్యాలయం నుంచి బదిలీ ఉత్త ర్వులు రావడంతో
ఉన్నపళంగా ఉన్న చోటునుంచి భార్యను తీసుకుని దూరంగా పట్ట ణానికి వెళ్ళక తప్పిందికాదు వాసుదేవ్ కి.

**********

కొత్త ప్రదేశం…ఒక కొత్త వాతావరణం…అక్కడ అంతా కొత్త మనుషులు కావడంతో, మొహమాటస్తు రాలైన వసంత
చుట్టు పక్కలవాళ్ళతో అంత తొందరగా కలవలేకపో యింది.

ఉదయాన్నే భర్త బ్యాంకుకి వెళ్ళాక ఇంటి పనులు పూర్తిచేసి, కాలక్షేపానికి ఇంట్లో టీవీని ఆశ్రయించడం అలవాటు
చేసుకుందామె. టీవీ చూడటం…మధ్యాహ్నం భోజనమయ్యాక చిన్న కునుకుతీసి, సాయంత్రం భర్త ఇంటికి
వచ్చేవరకు అతని కోసం ఎదురుచూడటం…ఆమె దినచర్యలో ఇదంతా రొటీన్ అయిపో యింది. అలాంటి సమయంలో
ఎవరితోనూ పెద్దగా పరిచయం లేనందున ఒంటరితనంతో చాలా బో ర్ గా ఫీలయ్యేది. అయితే, సాయంత్రం భర్త ఇంటికి
చేరాక…అంతవరకు అనుభవించిన నిస్సత్తు వ,ఒంటరితనాన్ని తనలోంచి ఎవరో చేత్తో తీసేసినట్లు ఆనందాన్ని తన
మొహమంతా నింపుకుని భర్త సేవలో తరించిపో యేది వసంత.

పట్ట ణం వచ్చాక వారి సంసార జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగిపో సాగింది. అలా ఇద్ద రి
మధ్య ఎటువంటి పొ రపొ చ్చాలు లేకుండా ఇంకొన్నాళ్ళు గడిచిపో యాయి.

ఓ రోజు ఎదురింటి అంకాయమ్మ వసంత వాళ్ళింటికొచ్చింది. భర్త ను వదిలేసి పుట్టింటికి చేరిన కూతురుతో
ఎదురింట్లో నే ఉంటుందామె. బాగా లౌక్యం తెలిసిన వ్యక్తి. ఎవరైనా పచ్చగా సంసారం చేసుకుంటే చాలు…అందులో
నిప్పులు పో సే రకం.

"ఏంటమ్మాయ్…నువ్వు చాలా మోహమాటస్తు రాలివిలా ఉన్నావ్? ఇరుగు పొ రుగువారితో పెద్దగా పరిచయం


పెంచుకున్నట్లు కూడా లేదు? ఇంట్లో ఒక్కదానివి బో ర్ కొట్ట ట్లేదూ…!?" వచ్చీరాగానే వసంతతో కలుపుగోలుగా అంది
అంకాయమ్మ.

"అబ్బే…అలాంటిదేమీ లేదాంటీ…!" ఆమె అలా మొహమ్మీదే అడిగేసరికి ఏమనాలో తెలియక,


మొహమాటపడుతూనే బదులిచ్చింది వసంత.

"ఆంటీ ఏంటమ్మా…!? కూతురులాంటి దానివి.నోరారా పిన్నీ అని పిలువు. వినడానికి హాయిగా ఉంటుంది!" చిన్నగా
నవ్వుతూ అంది అంకాయమ్మ.

ప్రస్తు తం పుట్టింటికి,మెట్టినింటికి దూరంగా ఉన్న ఆమె, అంకాయమ్మ అలా అనేసరికి చాలా ఆనందపడిపో యింది. ఆ
తర్వాత అలాగేనంటూ సంతోషంగా తలూపింది. అలా ఎదురింటి అంకాయమ్మతో వసంతకు పరిచయం ఏర్పడింది. ఆ
పరిచయం కొన్నాళ్ళకి బాగా గట్టి పడింది.
వాసుదేవ్ డ్యూటీకి వెళ్ళాక వసంత ఇంటికి వచ్చేది అంకాయమ్మ. వస్తూ నే బయట అక్కడా,ఇక్కడా జరిగే
విషయాల్ని కాస్త ఇంట్రెస్టింగ్ గా చెప్పి, ముందు తననుకున్న దారిలోకి ఆమెను తీసుకొచ్చేది. ఆవిడ
మాటకారితనానికి బాగా ఇంప్రెస్ అయిపో యేది వసంత. ఆ రకంగా వాసుదేవ్ లేని సమయంలో అంకాయమ్మ అలా
వచ్చి ఎంగేజ్ చేస్తు ండటంతో తన ఒంటరితనాన్ని పూర్తిగా మరిచిపో యేదామె.

అయితే…అంకాయమ్మ తెలివితక్కువదేమీ కాదు! వసంత ఇంటికి వచ్చిన ప్రతిసారీ లౌక్యంగా తన అవసరాలను


ఆమె ద్వారా తీర్చుకునేద.ి మగదిక్కులేని కుటుంబం,పైగా పెద్దా విడకదాని తనకు తోచిన సహాయంచేస్తూ , ఆవిడపై
జాలి చూపించేది వసంత.

ఓరోజు వాసుదేవ్ బ్యాంకుకి వెళ్ళాక వసంత ఇంటికి వచ్చింది అంకాయమ్మ. వస్తూ నే,"ఏమ్మా వసంతా…!మీ ఆయన
చాలా మంచివాడన్నావు. నాకెందుకో అలా అనిపించడంలేదమ్మాయ్!" గుమ్మంలోంచి ఇంటిలోకి వెళ్ళబో తున్న
వసంతతో అందామె.

"మీకెందుకొచ్చింది పిన్ని గారూ, అలాంటి సందేహం…?" లోనికి వెళ్ళబో తూ వెనక్కి తిరిగి అడిగింది వసంత.

"ఏం లేదమ్మా…నిన్న బయటికి వెళితే, మీ ఆయన రోడ్డు పైన బైక్ ఎక్కించుకుని ఎవరో అమ్మాయితో కనిపించాడు!
ఏంటో…వయసులో పెద్దగా అందరూ బావుండాలన్నదే నా తాపత్రయం. అందుకే, చూసి ఉండలేక అడిగేసాను. ఏం
అనుకోవద్ద మ్మా!" వసంత కళ్ళల్లో కి చూస్తూ అంది అంకాయమ్మ.

"ఎవరినో చూసి మా ఆయన అనుకుని పొ రబడి ఉంటారు పిన్ని గారు! ఆయన అలాంటివారు కాదు!" నవ్వుతూ
అనేసింది వసంత.

"ఎవరు మాత్రం మేము అలాంటి వారిమని మెడలో బో ర్డు వేలాడేసుకుంటారు చెప్పమ్మా! అయినా…ఈ కాలం
మగాళ్ళను అసలు నమ్మలేం సుమీ! బయట ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగినా, ఇంటికొచ్చాక మాత్రం
శ్రీరామచంద్రు లైపో తారు…ఇలాంటివారిని నా జీవితంలో ఎంతమందిని చూడలేదూ…! తీపి మాటలతో
అమాయకులైన భార్యల్ని మోసం చేసేవారు చాలామందే ఉన్నారీ లోకంలో! అందుకే, జాగ్రత్త తల్లీ…అసలే రోజులు
బాగాలేవు!" వసంతపట్ల అభిమానమున్నట్లు అంది అంకాయమ్మ.

ఆమె అలా చెప్పి వెళ్ళిన తర్వాత, ప్రశాంతంగా ఉన్న వసంత మనసులో ఎక్కడో చిన్నపాటి అనుమానపు బీజం
పడింది. ఆ అనుమానంతో ఆ రాత్రి నిద్రకు దూరమయ్యిందామె.

రెండు రోజుల తర్వాత,ఇంట్లో సరుకులు నిండుకోవడంతో కావాల్సిన సరుకుల లిస్టు తీసుకుని మెయిన్ రోడ్డు లో ఉన్న
సూపర్ మార్కెట్ కి బయలుదేరింది వసంత. మొదట అంకాయమ్మను తోడుగా తీసుకెళ్దా మని అనుకున్నా, తర్వాత
అనవసరంగా ఆవిడను ఇబ్బంది పెట్టడం ఇష్ట ంలేక ఒంటరిగానే బయలుదేరింది.

వాసుదేవ్ పనిచేసే బ్యాంకు,వసంత వెళ్ళే సూపర్ మార్కెట్ కు ఎదురుగానే అవతలివైపు రోడ్డు లో ఉంటుంది.

లిస్టు ప్రకారం ఇంటికి కావల్సిన సరుకులు తీసుకుని, కౌంటర్లో డబ్బులు చెల్లి ంచి,చేతిలో సరుకుల సంచితో సూపర్
మార్కెట్ బయటకు వచ్చింది వసంత.

ఆ సమయంలో ఆమె మనసులో ఓ ఆలోచన కలిగింది. ఎలాగూ దగ్గ రేకదా బ్యాంకుకి వెళ్ళి వాసుదేవ్ ని ఓసారి
చూడాలని మనసు తహతహలాడింది. కానీ…మరుక్షణంలోనే చేతిలో సరుకుల సంచితో అలా వెళ్ళడం బావుండదని
ఆ ఆలోచనను ఆమె మనసులోంచి తీసేసింది.
అదే సమయంలో అనుకోకుండా ఆమె దృష్టి ఎదురుగా ఉన్న బ్యాంకులోంచి బయటికొస్తు న్న వాసుదేవ్ పై పడింది.
అతనితోపాటు అతని పక్కనే నడుస్తూ మరో ఆవిడ కూడా కనిపించిందామెకి.

మరో రెండు నిమిషాల్లో వాసుదేవ్ బైక్ స్టా ర్ట్ చేయడం…బైక్ పై అతని వెనుక ఆవిడ కూర్చోవడం…రయ్యిమంటూ
బైక్ ముందుకెళ్ళిపో వడం…అన్నీ ఆమె కళ్ళముందు సినిమాలాగా చకచకా జరిగిపో యాయి.

అంతే…ఆ దృశ్యం చూసిన వసంత చేతిలోని సరుకుల సంచి జారి కిందపడింది.

'అయిపో యింది…అంతా అయిపో యింది! ఇప్పుడు చేతులు కాలాక, ఆకులు పట్టు కుంటే ఏం లాభం!? అప్పటికీ
పెద్దా విడ చెప్తూ నే ఉంది.ఈ మగాళ్ళ తీపి మాటలు నమ్మొద్ద ని. పిచ్చిదాన్ని నేనే వినలేదు…!!' అని మనసులో
పరిపరి విధాలుగా మధనపడి,అక్కడినుంచి ఇంటికి ఎలా చేరిందో గుర్తు లేదు వసంతకు.

పొ ద్దు న టిఫిన్ చేస్తు న్నప్పుడు నిన్న చూసిన సంఘటన గురించి వాసుదేవ్ కి అడుగుదామనుకుంది వసంత.
కానీ…తనకా అవకాశం ఇవ్వలేదు వాసుదేవ్. ఏదో అర్జంట్ పనున్నట్లు హడావుడిగా టిఫిన్ ముగించి,బైక్ తీసుకుని
వెళ్ళిపో యాడతను.

ఆరోజంతా మనసు అదో లా అయిపో యింది వసంతకి. ఇంట్లో చేస్తు న్న పనుల్లో దేనిపైనా పూర్తిగా శ్రద్ధ
పెట్టలేకపో యిందామె. మనసంతా నిన్న చూసిన సంఘటనపైనే రకరకాల ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నాయి.

రెండు రోజులు గడిచాయి.

అంకాయమ్మకు ఏవో మందులు కావాల్సివచ్చి…మెయిన్ రోడ్డు లో ఉన్న మెడికల్ షాపు వరకు తనకు తోడుగా
రమ్మని పిలవడంతో వెళ్ళకతప్పిందికాదు వసంతకు.

వెళ్ళిన పని పూర్తిచేసుకుని తిరిగి అంకాయమ్మతో రోడ్డు వారగా నడుస్తు న్న వసంతకు, రోడ్డు కు కాస్త దూరంలో ఉన్న
ప్రైవేటు హాస్పిటల్ మెట్లెక్కుతూ కనిపించాడు వాసుదేవ్. అతని వెనుకనే అతన్ని అనుసరిస్తు న్నట్లు
అంతకుమునుపు బ్యాంకు దగ్గ ర చూసిన ఆవిడే కనిపించింది.

అయితే ఈసారి ఆమె మొహం స్పష్ట ంగా కనిపించింది వసంతకు. వివాహితలా కనిపిస్తు న్నా…మంచి శరీర
సౌష్ట వంతో,రింగులు తిరిగిన జుట్టు తో మగాళ్ళని తనవైపుకు తిప్పుకునేలా ఉంది ఆమె అందం. ఆమె అందానికి ఏ
మగాడైనా గులాం అవ్వాల్సిందే!

అసలే అంతకుముందు వాళ్ళిద్ద ర్నీ పక్కపక్కనచూసి ఓర్చుకోలేకపో యినామెకు… ఆ దృశ్యం చూడగానే గుండెల్లో
ఒక్కసారిగా వెయ్యి వోల్కనోలు బద్ద లైనట్లు అయ్యింది. కళ్ళు సజల నయనాలయ్యాయి.

'ఆ దృశ్యం అంకాయమ్మ చూసిందేమో…!? ఛీ…ఛీ…తమ ఇంటి పరువంతా గంగలో కలిసిపేసాడు తన భర్త .
ఇన్నాళ్లూ తన భర్త మంచివాడు…శ్రీరామచంద్రు డు అని చెప్పిన తను, రేపట్నుంచి ఆవిడ ముందు తలెత్తు కుని ఎలా
తిరగడం…?' రకరకాల ఆలోచనలు ఆమె మెదడును కందిరీగల్లా తొలిచేస్తు ంటే,తలంతా బరువెక్కి తూలి పడబో యి
నిలదొ క్కుకుంది వసంత.

ఇంటికొచ్చాక తలుపులు బిగించి తన పరిస్థితికి కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ తర్వాత ఏదో నిర్ణ యానికి వచ్చినట్లు
బట్ట లు, తనకు సంబంధించిన వస్తు వుల్ని బ్యాగులో సర్దు కుందామె. ఆ తర్వాత వాసుదేవ్ ని ఉద్దేశిస్తూ …'నిన్ను
ఎంతగానో ప్రేమించి,గుండెల్లో పెట్టు కున్నందుకు…జీవితాంతం గుర్తు ండిపో యేలా నాకు సరైన పాఠమే నేర్పావు…!
ఇంట్లో పెళ్ళాన్ని పెట్టు కుని బయట ఆడాళ్ళతో తిరిగే నీ నిజ స్వరూపం తెలిసాక నిన్నేమని సంబో ధించాలో నాకైతే
అర్ధం కావట్లేదు! నేను వెళుతున్నాను. గుర్తు ంచుకో…నువ్వు చేసిన మోసాన్ని నా కన్నవారింటికివచ్చి కన్విన్స్
చేద్దా మని ప్రయత్నించకు! ఇక నీకూ, నాకూ ఎటువంటి సంబంధం లేదు. నా గురించి ఇంక మర్చిపో …ఎలాగూ నీ
ప్రియురాలు ఉంది కదా!' అని తను కళ్ళారా చూసిన దృశ్యాల్ని కూడా ఘాటుగా పేపరుపై రాస్తూ , దాన్ని వాసుదేవ్ కి
కనబడేటట్లు టేబుల్ పై పెట్టింది వసంత.

ఆ క్షణంలో మళ్ళీ వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె మనసంతా దుఃఖపు మేఘాలు కమ్ముకున్నాయి. వస్తు న్న
కన్నీళ్ళని చీరకొంగుతో అదిమిపెట్టి, ఇంటికి తాళమేసి చేతిలో బ్యాగుతో పుట్టింటికి వెళ్ళడానికి బస్ స్టేషన్ కి
బయలుదేరిందామె.

**********

వాసుదేవ్ ని వదిలి వసంత పుట్టింటికొచ్చి రెండు వారాలు దాటింది. వసంతవనంలా శోభాయమానంగా ఉండాల్సిన
తన జీవితం…ఆకులురాలి శిశిరానికి ఎండిన మోడులా అయిపో యిందన్న బాధ రోజురోజుకూ ఆమెను
కృంగదీయసాగింది.

ఇంటికి వచ్చిన రోజు…'అల్లు డు గారు రాలేదేమ్మా?' అని తల్లిదండ్రు లు అడిగిన ప్రశ్నకు,ఏం సమాధానం చెప్పాలో
తెలియక…అప్పటికి తనకుతోచిన అబద్ధ ంచెప్పి మేనేజ్ చేసింది వసంత. కానీ వాసుదేవ్ గురించి,తను తీసుకున్న
నిర్ణ యం గురించి వాళ్ళకు ఎలా తెలియజేయాలా అని మనసులో పరిపరివిధాలుగా మధనపడసాగిందామె.

పుట్టింటికి వచ్చిందని మాటేగాని,తాను తీసుకోబో యే నిర్ణ యానికి…'తల్లిదండ్రు లు ఎంతవరకు సహకరిస్తా రో!?


ఇకనుండి తన జీవితం ఎన్నెన్ని మలుపులు తిరగబో తుందో !?' అని గుండెల్లో ఒకటే ఆందో ళనగానే ఉంది వసంతకు.

అదిగో అలాంటి సమయంలోనే చాలా రోజుల తర్వాత తన క్లా స్ మేట్,ఆత్మీయ స్నేహితురాలైన మాలతి తనని
చూడడానికి ఇంటికి రావడం ఆమెకు కాస్త ఉపశమనంగానూ, ఎక్కడలేని ఆనందాన్ని కలుగజేసింది.

ఇద్ద రూ కలిసి తాము చదువుకున్న రోజుల్లో ని జ్ఞా పకాలన్నింటినో గుర్తు చేసుకున్నారు. స్నేహితురాలతో
మాట్లా డుతున్నంతసేపు తనలోని బాధనంతటినీ మరచిపో యింది వసంత.

"ఊళ్ళో ఇంకా ఎన్ని రోజులుంటావు మాలా…?" అడిగింది వసంత.

"ఎన్ని రోజులా…!? మా సాఫ్ట్ వేర్ నౌకరీలు గురించి నీకు తెలిసిందే కదా వసూ…జీతం ఎక్కువన్న మాటేగానీ,చేసేది
గొడ్డు చాకిర!ీ సూర్యోదయంచూసి చాన్నాళ్ళయిందంటే నమ్ము! ఈ ప్రా జెక్టు వర్కులు, దానికి టార్గెట్లూ ,ఇచ్చిన టైం కి
వర్క్ పూర్తిచేయగలమో…లోదో నన్న వత్తి ళ్ళు!? పీకమీదికి అవాంతరం వచ్చినా సెలవు దొ రకని
నిస్సహాయత…దొ రికినా పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి! ఇలా దీనితోనే జీవితం వేడి గిన్నెలో వెన్నలా
కరిగిపో తోంది!" నిట్టూ రుస్తూ తన బాధను చెప్పుకొచ్చింది మాలతి.

ఆమె మాటలకు స్నేహితురాలివైపు జాలిగా చూస్తూ …"పో నీలేవే…మొత్తా నికి చాలా రోజుల తర్వాత నిన్ను
చూడటం,నీతో మాట్లా డటం నాకైతే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను!" అంది వసంత.

"నాకింకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలనివుంది. కానీ ఏం చేస్తా ం…తుమ్మితే ఊడే ఉద్యోగాలు మావి! సబ్మిట్
చేయాల్సిన ప్రో జెక్ట్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది వసూ! అందుకే ఈరోజు సాయంత్రం తిరుగు ప్రయాణానికి టికెట్స్
కూడా బుక్ చేసుకున్నాం. నువ్వు ఊళ్ళో ఉన్నావని తెలిసి నిన్నోసారి కలిసిపో దామని వచ్చాను…!" తన
అసక్త తతను వ్యక్త ంచేస్తూ కాస్త బాధగానే అంది మాలతి.
"పో నీలే మాలా…ఈసారి పుట్టింటికి వచ్చినపుడు నాలుగు రోజులు ఉండేలా ప్లా న్ చేసుకురా! హడావుడిగా వస్తే
ఇదిగో ఇలాగే ఉంటుంది!" లేచి వెళ్ళబో తున్న స్నేహితురాలితో అంది వసంత. అవునన్నట్లు గా తలూపింది మాలతి.

"అవునూ… అంత అర్జెంటుగా రావాల్సిన కారణమేంటి?"

"మా పిన్ని కూతురు మాధవి వాళ్ళ ఆయనకు రెండు వారాల క్రితం బ్ల డ్ క్లా ట్ అవ్వడంతో పెరాలసిస్ స్ట్రో క్
వచ్చి,కుడిచేయి, కుడికాలు చచ్చుబడిపో యాయి. ఉంటోంది పట్ట ణంలో…పైగా తనకు వెన్నుదన్నుగా
వెనుకాముందు ఎవరూ లేరు. ఇంటికి ఆధారమైన భర్త కు ఒక్కసారిగా అలా జరగడంతో ఏం చేయాలో తెలియక,
చిన్న పిల్లలతో ఉన్న తను చాలా భయపడిపో యింది. ఈ విషయం తెలిసాక ఆమెకు కాస్త ధైర్యం చెప్పడానికి
హడావుడిగా రావాల్సివచ్చింది. మాధవికి కాస్త ధైర్యం చెప్పి, ఎలాగూ ఇంత దూరం వచ్చాం కాబట్టి…అమ్మావాళ్ళని
కూడా ఓసారి చూసినట్లు ంటుందని ఊరొచ్చాం…!" అర్జంటుగా రావడానికి కారణం చెప్పింది మాలతి.

"అయ్యో పాపం…ఆయనకు ఇప్పుడెలా ఉంది?" బాధగా అడిగింది వసంత.

"ప్రస్తు తం పర్లేదు…హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటిదగ్గ రే ట్రెయిన్డ్ నర్సుతో ఫిజియోథెరపీ చేయిస్తు న్నారు.
అయితే, కష్ట కాలంలో అతనితో పాటు బ్యాంకులో పనిచేస్తు న్న అతని కొలీగ్ ఒకతను మొదటినుంచీ తమ ఫ్యామిలీకి
సపో ర్టు గా నిలిచాడని…ఆ అన్నయ్య సపో ర్టే లేకుంటే తమ ఫ్యామిలీ ఏమైపో యేదో నని బాధపడింది మాధవి. ఆ
సమయంలో ఆమె కష్ట ంచూసి నిజంగా నాకు కన్నీళ్ళొచ్చాయి! తోటి కొలీగ్ కష్ట ంలో ఉన్నప్పుడు అతను
తనవంతుగా సాయపడడం నిజంగా అభినందించాల్సిన విషయమే కదూ!" వసంతవైపు చూస్తూ చెప్పింది మాలతి.

"అవునా…!? తోటి కొలీగ్ గా అతను చేసిన సాయం నిజంగా గ్రేటే సుమీ! అన్నట్లు , మాధవి భర్త ఏ బ్యాంకులో
పనిచేస్తు న్నారు?" క్యాజువల్ గా అడిగింది వసంత. బ్యాంకు పేరు చెప్పింది మాలతి.

"ఏ బ్రా ంచ్…నీకేమన్నా ఐడియా ఉందా?" ఈసారి మనసులో ఏదో అనుమానం వచ్చినట్లు చకచకా అడిగింది
వసంత. బ్రా ంచ్ పేరు కూడా చెప్పిందామె. అయితే, స్నేహితురాలు ఆ వివరాలన్నీ ఎందుకు అడుగుతోందో అర్థం
కాలేదు మాలతికి.

మాలతి ఆ బ్యాంకు బ్రా ంచ్ చెప్పగానే వసంత కళ్ళచుట్టూ పేరుకుపో యిన అనుమానపు పొ ర నెమ్మనెమ్మదిగా
తొలిగిపో సాగింది. అయినా పూర్తిగా సందేహ నివృత్తి చేసుకునేందుకు…"తన జీవితంలో వచ్చిన అంత కష్టా నికి
ఏమాత్రం కృంగిపో కుండా, దుఃఖాన్ని తట్టు కుని కుటుంబం కోసం నిలబడటం నిజంగా హర్షించదగ్గ
విషయం…మాధవిని ఓసారి చూడాలని ఉంది…!" మొహంపై తెచ్చిపెట్టు కున్న గంభీరతతో అంది వసంత.

ఆమె మాటలకు మాలతి చిన్నగా నవ్వింది. "ఈసారి వచ్చినప్పుడు కచ్చితంగా మాధవిని మనూరు
తీసుకొస్తా ను.అప్పుడు నువ్వు తనతో కావాల్సినంతసేపు మాట్లా డుకోవచ్చు! తనని చూడాలన్నావు
కాబట్టి…ప్రస్తు తానికైతే ఈ ఫో టోతో సరిపెట్టు కో!" అంటూ తన మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేసి మాధవి ఫో టోని
స్నేహితురాలికి చూపించింది మాలతి.

ఆరోజు హాస్పిటల్ దగ్గ ర తన భర్త వాసుదేవ్ పక్కన చూసిన ఆవిడ, మాలతి చూపించిన ఫో టోలో ఉన్న మాధవి
ఒక్కరే! అదే శరీర సౌష్ట వం…అదే రింగురింగుల జుత్తు …! ఆ ఫో టోచూసి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు స్థా నువులా
ఉండిపో యింది వసంత.
అంటే…మాలతి చెప్పినదానిబట్టి, మాధవి కుటుంబానికి అండగా నిలబడింది, ఆమె అన్నయ్యగా భావించుకున్నది
తన భర్త వాసుదేవే అన్నమాట! కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కళ్ళతో చూసేవన్నీ నిజాలే అనుకునే తనెంత
మూర్ఖు రాలో ఆ సందర్భంలో అర్థమయ్యిందామెకి.

ఊసరవెల్లి స్వభావంతో స్వార్థంగా ఆలోచించే అంకాయమ్మ మాటలువిని… వసంతవనంలా పచ్చగా ఉండాల్సిన తన


సంసారాన్ని చేజేతులా తప్పుడు నిర్ణ యంతో శిశిరానికి ఎండిన మోడులా చేసుకున్నందుకు లోలోపల
కుమిలిపో యింది. ఉబికివస్తు న్న కన్నీళ్ళని స్నేహితురాలికి కనబడనీయకుండా…"ఇప్పుడే వస్తా ను మాలా…!"
అంటూ తన గదిలోకి వచ్చింది వసంత.

గదిలోకి వస్తూ నే అదురుతున్న చేతులతో మొబైల్ తీసుకుని భర్త కు రింగ్ చేసిందామె. రెండో రింగుకే ఫో న్ లిఫ్ట్
చేశాడు వాసుదేవ్. ఆ సమయంలో భర్త తో ఏం మాట్లా డాలో అర్థం కాలేదామెకు. బుగ్గ లపై జారుతున్న కన్నీళ్ళని
చీరకొంగుతో తుడుచుకుని…"న…న్ను…క్ష…మి…స్తా …వు…క…దూ…!" ఒక్కొక్క అక్షరాన్ని భారంగా
పలుకుతూ అంది వసంత.

"నీ తప్పు తెలుసుకున్నావ్…ఇంకా క్షమించడానికి ఏముంటుంది! కడిగిన ముత్యంలాంటి మనసుతో వసంత బాల
రాకకోసం ఒంటరి పిట్టనై ఎదురుచూస్తు ంటాను…!" నవ్వుతూ అన్నాడు వాసుదేవ్.

గదిలోకి వెళుతున్నప్పుడు వసంత కళ్ళలో కనిపించిన నీలినీడలు, గదినుంచి బయటికొచ్చినపుడు


కనపడకపో వడం స్పష్ట ంగా గమనించింది మాలతి.పైగా ఇప్పుడు ఆమెకి వసంత కళ్ళల్లో లెక్కించలేని కాంతి
కిరణాలు కనిపించాయి.

'ఏం జరిగుంటుందబ్బా!' అని ఆలోచనలో పడిన మాలతికి,ఎంత ఆలోచించినా ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఎందుకంటే… వసంతకంటే ముందే పెళ్ళిచేసుకుని దూరంగా వెళ్ళిపో వడం, పైగా వసంత పెళ్లి కి తను రానందున,
ఆమె పెళ్లి తర్వాత అక్కడి విషయాలేమీ మాలతికి తెలియవు.

అయితే స్నేహితురాలికి జరిగిన విషయాలేవీ చెప్పలేదు వసంత. జరిగిన పరిణామాల దృష్ట్యా మళ్ళీ తన సంసారం
మూడో వ్యక్తి వలన ఎక్కడ ప్రమాదంలో పడుతుందో నని భయపడిందామె!

'నేనింక వెళ్ళొస్తా ను వసూ!" అంది మాలతి. స్నేహితురాలిని ఆప్యాయంగా సాగనంపి గదిలోకొచ్చింది వసంత.
ఇప్పుడామె మనసునిండా వెలకట్ట లేని ప్రేమతో వాసుదేవ్ నిండిపో యివున్నాడు.

*** సమాప్త ం ***

************************************************

You might also like