Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

🙏అర్జు నుడి జెండాపై ఉండే హనుమాన్ వెనుక రహస్యం ఎన్టీ...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿కురుక్షేత్ర యుద్ధంలో అర్జు నుడికి తోడుగా, ఆంజనేయుడు ఆయన రథం మీద జెండా రూపంలో కనిపిస్తా డు.

🌸 ఇలా అర్జు నుడి జెండా మీద హనుమంతుడు ఉండేందుకు వెనుక ఓ కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమిటంటే...

🌿కురుక్షేత్ర సంగ్రా మానికి చాలారోజుల ముందర సంగతి ఇది. అర్జు నుడు ఓసారి దేశాటనకని బయల్దే రాడు. తన యాత్రలో

భాగంగా ఒకో ప్రాంతాన్నీ, అక్కడి పుణ్యక్షేత్రా లనీ సందర్శిస్తూ రామేశ్వరాన్ని చేరుకున్నాడు.

🌸అక్కడ సాక్షాత్తూ ఆ రాములవారు ప్రతిష్టించిన శివలింగాన్ని పూజించాడు.

ఆపై సముద్రతీరాన తిరుగుతూ అక్కడి రామసేతువుని గమనించాడు.

🌿నీలుడనే వానరుని ఆధ్వర్యంలో నిర్మించిన ఆ వంతెనని చూడగానే అర్జు నుడికి ఓ ధర్మసందేహం వచ్చింది. ‘రాముడు

మహా శక్తిసంపన్నుడు కదా! గొప్ప విలుకాడు కదా!

🌸అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఓ దృఢమైన

వంతెనని నిర్మించవచ్చు కదా!’ అన్నదే ఆ సందేహం.

🌿అర్జు నుడి మనసులో ఇలా సందేహం మెదిలిందో లేదో- అక్కడ రాముని ధ్యానంలో ఉన్న హనుమంతులవారికి

విషయం చేరిపో యింది.


🌸వెంటనే ఒక సాధారణ వానరుడిలాగా అర్జు నుడి దగ్గరకు చేరుకుని ‘మీరు ఏదో సమస్యతో మధనపడుతున్నట్లు

ఉన్నారు.

🌿ఏమిటీ విషయం?’ అని అడిగాడు. దానికి అర్జు నుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానరం ముందర నిలిపాడు.

🌸రాములవారు బాణాలతో సేతువుని నిర్మించలేకేమీ కాదు! కాకపో తే కోట్ల కొలదీ వానరులు ఆ వంతెన మీదుగా

ప్రయాణించాలంటే, రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితం.

🌿 అందుకనే వానరులతో వంతెనని నిర్మింపచేశారు, అని బదులిచ్చాడు హనుమంతుడు.

🌸వానరరూపంలోని హనుమంతుడు చెప్పిన జవాబు, అర్జు నుడికి సంతృప్తి గా తోచలేదు. ‘ఏదైనా సరే, రాములవారు

బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సింది!’

🌿అంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాటా మాటా పెరిగింది. ధర్మ సందేహం కాస్తా గొడవకు దారితీసింది. చివరికి

హనుమంతునికి కోపం వచ్చి

🌸 ‘సరే! రాములవారి సంగతి అలా ఉంచు. నువ్వు గొప్ప విలుకాడివని నీ నమ్మకం కదా! సాక్షాత్తూ ఆ రాములవారినే

అనుమానిస్తు న్నావు కదా!

🌿మరి బాణాలతో నువ్వో వంతెనని కట్టిచూడు. ఆ వంతెన మీద నేను నడుస్తా ను. నా బరువుకి తట్టు కుని ఆ వంతెన

నిలిస్తే సరే.

🌸 లేకపో తే నీ ఓటమిని ఒప్పుకుంటావా?’ అని అడిగాడు.


హనుమంతుని సవాలుతో అర్జు నుడికి పట్టు దల చెలరేగింది.

🌿‘నీ ధాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపో తే, ఓటమిని అంగీకరించడమే కాదు... ఇక్కడికిక్కడే అగ్నిగుండంలో

ప్రా ణత్యాగం చేస్తా ను,’ అని శపథం చేశాడు.

🌸ఇంకేం! రసవత్త రమైన పో టీకి రంగం సిద్ధమైంది.

అర్జు నుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి అద్భుతమైన ఓ శరవంతెనను నిర్మించాడు.

🌿 కానీ ఏం లాభం! రామనామం చేస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదో... వంతెన కాస్తా

తునాతునకలు అయిపో యింది.

🌸 ఆ ధాటికి విస్తు పో వడం అర్జు నుడి వంతయ్యింది. దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి

దూకి ప్రా ణాలను త్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డా డు.

🌿ఇంతలో...

ఎక్కడి నుంచో ఒక బ్రా హ్మణుడు వారిని సమీపించాడు. అగ్నిప్రవేశం చేయబో తున్న అర్జు నుడిని చూసి ‘ఏం

జరుగుతోంది?’ అంటూ ప్రశ్నించాడు.

🌸ఆ బ్రహ్మణుడి ముఖవర్చస్సు చూసి హనుమంతుడు, అర్జు నుడు ఇద్దరూ కూడా ఆశ్చర్యపో యారు. ఆపై జరిగినదంతా

పూసగుచ్చినట్లు వివరించారు.

🌿‘అంతాబాగానే ఉంది! కానీ న్యాయనిర్ణేత లేకుండా పో టీ అనర్హం కదా! అందుకని మీరు మరోసారి మీ పో టీ సాగించండి.
🌸ఈసారి నేను సాక్షిగా వ్యవహరిస్తా ను. ఎలాంటి పక్షపాతానికీ ఆస్కారం లేకుండా చూస్తా ను,’ అన్నాడు బ్రా హ్మణుడు.

🌿బ్రా హ్మణుని మాటలు కూడా సబబుగానే తోచాయి. వెంటనే మరోసారి పో టీకి సిద్ధమయ్యారు. ఈసారి అర్జు నుడు తన

గురువు, ఆప్త బంధువు అయిన కృష్ణు నుడిని తల్చుకుని వారధిని నిర్మించాడు.

🌸 అలా నిర్మించిన వారధిని స్పృశించి ఆ బ్రా హ్మణుడు కూడా తన ఆశీస్సులని అందించాడు. ఇదంతా చిరునవ్వుతో

గమనిస్తు న్న హనుమంతుడు ఆ వారధిని కూలగొట్టేందుకు దాని మీదకు ఎక్కాడు.

🌿విచిత్రం! ఈసారి వారధి హనుమంతుని బరువుని తట్టు కుని నిలబడింది. అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా అది

కించిత్త యినా కదలనే లేదు.

🌸 అది చూసి హనుమంతునికీ, అర్జు నుడికీ కూడా ఏదో అద్భుతం తోడయ్యిందన్న విషయం అర్థమైంది. తమ

ముందున్న బ్రా హ్మణుడు సామాన్యుడు కాడనీ... సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణపరమాత్ముడనీ బో ధపడింది.

🌿 అహంకారానికి లోనై, తాము పనికిరాని పంతాన్ని పట్టా మని ఇద్దరికీ అర్థమైంది. వారికి ఆ జ్ఞా నోదయం కలిగినవెంటనే

శ్రీకృష్ణు డు తన నిజరూపంలో వారి ముందు సాక్షాత్కరించాడు.

🌸 రాముని అవతారంలో తనని సేవించిన హనుమంతునీ, కృష్ణు ని అవతారంలో తోడుగా నిలిచిన అర్జు నుడినీ కలిపాడు.

అలా చిగురించిన స్నేహంతోనే అర్జు నుడి జెండా మీద ఆంజనేయుడు కొలువైనాడని అంటారు...స్వస్తి ..🚩🌞🙏

You might also like