Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 9

తెలంగాణ జాతీయాలు (6, 7, 8, 9 & 10 తరగతులు)

6 వ తరగతి జాతీయాలు

1. అందెవేసిన చేయి - (నేర్పరి)


ఏకలవ్యుడు శబ్ద భేదిలో అందివేసిన చేయి.
2. అడకత్తెరలో పోకచెక్క - (బయటపడలేని స్థి తి)
మత్తుమందులకు అలవాటుపడినవారు అడకత్తెరలో పోకచెక్కలా కష్టా లు పడతారు.
3. అద్దు పద్దు - (ఇష్టం వచ్చినట్లు ప్ర వర్తించడం)
నేటి యువత అద్దు పద్దు లేకుండా వాహనాలను నడిపి ప్ర మాదాల పాలవుతున్నారు.
4. అన్నెము పున్నెము – (ఏమీ తెలియని అమాయకత్వం)
అన్నెము పున్నెము తెలియని అనేకమంది పసిపిల్ల లను నేడు వీధులపాలు చేస్తున్నారు.
5. ఇల్లు గుల్ల చేయు – (పూర్తిగా నాశనం కావడం)
మద్యపానం అలవాటు వల్ల అనేకమంది ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.
6. అరటిపండ్లొ లిచినట్లు – (చాలా సులభంగా)
వాల్మీకి రామాయణ రచన అరటిపండొలిచి చేతిలో పెట్టి నట్లుంది.
7. అరచేతనిమ్మపండు – (అదృష్టం దగ్గ రగా ఉండడం)
కష్ట పడి చదివేవారికి ప్ర భుత్వ ఉద్యోగం అరచేతి నిమ్మపండు వంటిది.
8. ఉగ్గు పాలతోపెట్టు – (చిన్నతనం నుండే నేర్పించుట)
జిజియాబాయి శివాజీకి ధైర్యసాహసాలను ఉగ్గు పాలతో పెట్టింది.
9. కంకణముకట్టు కొను – (పూనుకోవడం)
స్వచ్ఛభారత్ కోసం దేశంలోని ప్ర తి పౌరుడూ కంకణం కట్టు కోవాలి.
10. కంట్లో వత్తులేసుకొని – (విశ్రాంతి లేకుండా ఎదురుచూడడం)
అభిమన్యుడు తిరిగివస్తాడని సుభద్ర కంటిలో వత్తులేసుకుని ఎదురుచూసింది.
11. కడుపులో పెట్టు కొను – (జాగ్ర త్తగా కాపాడుకోవడం)
ప్ర కృతిలో ప్ర తిప్రా ణి తన పిల్ల లను కడుపులో పెట్టు కుని చూసుకుంటుంది.
12. కడుపులో చల్ల కదులకుండ – (ఏమాత్రం శ్ర మ లేకుండా)
నేటి రాజకీయ నాయకులు కడుపులో చల్ల కదలకుండా పనిచేస్తారు.
13. కత్తినూరుట – (ఎప్పుడూ యుద్ధా నికి సిద్ధ మవడం)
భారత్‌పై చైనా ఎప్పుడూ కత్తి నూరుతూనే ఉంటుంది.
14. కన్నుకుట్టు - (ఓర్వలేక పోవడం)
భారతదేశాన్ని చూస్తే పాకిస్తాన్‌కు ఎప్పుడూ కన్నుకుడుతూనే ఉంటుంది.
15. కన్నులు నెత్తికెక్కు – (గర్వపడు)
కొంత విజయం సాధిస్తే చాలు మూర్ఖు లకు కన్నులు నెత్తికెక్కుతాయి.
16. కప్పల తక్కెడ – (లెక్కకు మిక్కిలి)

Page 1 of 7
ఈ రోజుల్లో అవినీతిపరులు కప్పలతక్కెడ వలె కనపడుతున్నారు.
17. కలగూరగంప – (అన్నీ కలిసిన)
పిల్ల ల గణితంలో కలగూరగంప ప్ర శ్నలు ప్ర తి అధ్యాయం చివర ఉండాలి.
18. కాలికి బుద్ది చెప్పు – (పారిపోవడం)
పోలీసులను చూసిన దొంగలు కాలికి బుద్ధి చెప్పారు.
19. కాలుగాలిన పిల్లి – (నిలకడలేని స్థి తి)
కాలుగాలిన పిల్లి లా భర్త తిరగడం మనం ఆపరేషన్ గది బయట చూస్తాము.
20. కొండపిండిగొట్టు – (మిక్కిలి శ్ర మించు)
దేశాభివృద్ధి కి కొండిపిండిగొట్టు జనమే ఆధారము.
21. నేతిబీరకాయ – (వ్యర్థ మైనది)
నేటి యువతలో నిస్వార్ధ సేవ నేతిబీరకాయ వలె ఉన్నది.
22. కొట్టి నపిండి – (మిక్కిలి అనుభవం - నైపుణ్యం)
సంగీతంలో బాలమురళీకృష్ణ కొట్టి నపిండి వంటివారు.
23. కొమ్ములు తిరిగినవారు - (మిక్కిలి నైపుణ్యం కలవారు)
పాండిత్యంలో కొమ్ములు తిరిగినవారు తెలుగుభాషలో ఎందరో ఉన్నారు.
24. పెడచెవినబెట్టు – (మాట వినకపోవడం)
సీతను ఎత్తుకురావద్ద ని విభీషణుడు ఎంత చెప్పినా రావణుడు పెడచెవిన పెట్టా డు.
25. ముక్కపచ్చలారని – (చిన్న వయస్సు)
ఇప్పటికీ ముక్కుపచ్చలారని పిల్ల లు ఎంతోమంది పని చేస్తూ బ్ర తుకుతున్నారు.
26. మేకవన్నెపులి – (పైకి మంచివారిలా నటిస్తూ క్రూ రత్వం కలిగివుండుట)
సమాజంలో మనచుట్టూ ఎంతోమంది మేకవన్నె పులులు నివసిస్తున్నారు.
27. మొసలికన్నీరు – (బాధను నటించుట)
మనము కష్టా ల్లో ఉన్నప్పుడు ఎంతోమంది మొసలి కన్నీరు కారుస్తారు.
28. రెండునాలుకలు – (అవకాశవాదం)
రాజకీయ నాయకులలో రెండు నాలుకలు కలవారే అధికంగా కనబడతారు.
29. నోటికి తాళంవేయు – (మౌనంగా ఉండుట)
తెలియని విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు మనం నోటికి తాళం వేయడం మంచిది.
30. చేతికి ఎముకలేనోడు – (మిక్కిలి దానం)
మన పురాణాల్లో ఎంతోమంది ఎముకలేని దాతలు కనిపిస్తారు.
31. తెగేదాకా లాగొద్దు – (సమస్యలను అధికం చేసుకోవడం)
కుటుంబ సమస్యలను తేగేదాకా లాగడం మంచిది కాదు.
32. తీగెకు కాయబరువా? – (ప్రే మను పంచేవారు బాధను లెక్కచేయరు)
ఏ తల్లీ తన బిడ్డ ను తీగకు కాయ బరువుగా భావించదు.
33. ఎంగిలిచేత్తో కాకిని కొట్ట డు - (పిసినారి స్వభావం)
ఉరికి వచ్చి దండాలు పెట్టే వారిలో ఎంతోమంది ఎంగిలి చేత్తో కాకిని కొట్ట నివారే.

Page 2 of 7
34. తేనెలో నీటిబొట్టు - (వ్యర్థ మైనది)
ఎంత కష్ట పడినా అవకాశాలను వదులుకుంటే తేనెలో నీటిబొట్టు లా మారుతుంది.
35. కుండ బద్ద లు కొట్టి నట్లు – ( ఉన్నది ఉన్నట్లు మాట్లా డటం)
కుండ బద్ద లు కొట్టి నట్లు మాట్లా డేవారు స్వార్ధ పరులకు శత్రు వులా కనపడతారు.
36. అరచేతిలో వైకుంఠం – (కష్ట మైన దానిని తేలికగా నమ్మించడం)
రాజకీయ నాయకుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.
8 వ తరగతి జాతీయాలు

37. బండమీది రాత (శాశ్వతం)


పోతన్న పద్యాలు బండమీది రాతలా ప్ర జల హృదయాల్లో నిలిచిపోయాయి.
38. వండినకుండ (సిద్ధంగా ఉన్నది)
కష్ట పడి చదివేవారికి ప్ర భుత్వ ఉద్యోగాలు వండిన కుండలా ఉన్నవి.
39. కప్పనుదిన్న పాము (అచేతనం, మబ్బు)
తరగతి గదిలో కప్పను తిన్న పాములా ఉండే విద్యార్థు లను ఉత్సాహపర్చాలి, మార్పు తేవాలి.
40. కుక్కబుద్ధి (స్థి రంగా ఉండకపోవడం)
మూర్ఖు ల మనస్సు కుక్కబుద్ధి వలె మారుతూ ఉంటుంది.
41. కుక్కబతుకు (ఎవరికీ పట్ట నిది)
మహానగరాల్లో కుక్క బతుకులా జీవనం కొనసాగించే పేదవారు లక్షలమంది ఉన్నారు
42. గోడకు చెప్పినట్లు (వినిపించుకోకపోవడం)
క్రి కెట్ ఆటతో సమయం వృధా చేయవద్ద ని ఎంత చెప్పినా విద్యార్థు లకు చెప్పినట్లే .
43. బురదల పాతిన గుంజ (నమ్మదగనిది)
అధికారులలో అవినీతి లేదనడం బురదలో పాతిన గుంజ వంటిది.
--x--

9 వ తరగతి జాతీయాలు

44. అగ్గి బుక్కుట (కోపంతో ఉడికిపోవుట)


రాముణ్ణి అడవికి పంపమని కైకేయి అడిగిన కోరికకు దశరథుడు అగ్గి బుక్కిన వాడిలా అయ్యాడు.
45. ఉడుంపట్టు (గట్టి పట్టు దల)
ఏది ఏమైనా అమెరికా వెళ్ళి చదువుకుంటానని మా అన్నయ్య ఉడుంపట్టు పట్టా డు.
46. ఒంటికోతి (ఏకాకి, ఒంటరివాడు)
ఒంటికోతిలా ప్ర వర్తించేవారు ఏ పనినీ సాధించలేరు.
47. కడుపు కుటుకుట (ఓర్వలేనితనం)
తనకంటే ప్ర తిభ ఉంటే ఎవరి కడుపైనా కుటకుటలాడుతుంది.

Page 3 of 7
48. కాకిగోల (భరించలేని శబ్దా లు)
పిల్ల లు మైదానంలో ఆడుతూ కాకిగోల చేస్తున్నారు.
49. కుడితిలో పడ్డ ఎలుక (బయటపడలేక కష్టా ల్లో చిక్కుకోవడం)
మొదటినుండి కష్ట పడని విద్యార్థు లు పరీక్షల సమయంలో కుడితో పడ్డ ఎలుకలా ప్ర వర్తిస్తా రు.
50. కూసమిడిచిన పాము (ఉల్లా సం, చలాకీతనం)
వెట్టి చాకిరి నుండి విముక్తిపొందిన రాము కూసమిడిచిన పాములా ఆనందంతో ఉన్నాడు.
51. కోడిమెదడు (మతిలేకపోవడం)
ప్ర మాద పరిస్థి తుల్లో కోడిమెదడు ఆలోచన సరిపోదు.
52. గాడితమోత (వెట్టి చాకిరి)
కుటుంబం పెద్ద దై సంపాదన ఒక్కరే అయితే గాడిదమోత తప్పదు.
53. గోడకేసిన సున్నం (తిరిగిరానిది)
పథకాల పేరుతో ప్ర జల సొమ్ము గోడకేసిన సున్నమౌతుంది.
54. చచ్చినపాము (ఏమీ చేయలేనిస్థి తి)
పోలీసులకు చిక్కిపోయి దొంగ చచ్చినపామయ్యాడు.
55. చంకలోపిల్లి (చెడుశకునం, కార్యహాని సంకేతం)
దుర్మార్గు నితో జత కలవడం చంకలో పిల్లి ని పెట్టు కున్నట్లే .
56. చుక్కతెగిపడ్డ ట్లు (అకస్మాత్తుగవచ్చుట)
గాంధీ మరణం చుక్క తెగిపడ్డ ట్లు సంభవించెను.
57. చూపులగుర్రం (కేవలం రూపం మాత్ర మే అందంగా ఉండటం)
కేవలం చూపుల గుర్రంలా ఉన్నవారు పనిని నెరవేర్చలేరు.
58. డూ డూ బసవన్న (ఆలోచించకుండా ప్ర తిదానికీ తలూపడం)
పరమానందయ్య శిష్యులు తమ గురువుగారు ఏమి చెప్పినా డూ డూ బసవన్నలా తలను ఊపేవారు.
59. నల్లి కుట్లో డు (బయటకి కనిపించకుండా హాని చేసేవాడు)
శకుని కౌరవులకు నల్లి కుట్లో డులా హాని చేశాడు.
60. నిండుచెరువు (సమృద్ధి )
మా తాతయ్యగారి ఇల్లు పాడిపంటలతో నిండుచెరువులా ఉంది.
61. నీళ్ళునములు (నిజం చెప్పడానికి సందేహించడం)
తండ్రి నిలదీసినపుడు తప్పు చేసిన కొడుకు నీళ్ళు నమిలాడు.
62. నూరిపోయు (విషయాన్ని బలంగా అందజేయడం)
బాలనాగమ్మ బ్ర హ్మనాయుడుపై లేనిపోని చాడీలు నూరిపోసింది.
63. పీనుగ సింగారం (వ్యర్థం)
మండుటెండలో నీళ్ళు పోయడం పీనుగ సింగారం వంటిది.

10 వ తరగతి జాతీయాలు

Page 4 of 7
64. చెవిలో ఇల్లు కట్టు కొను (ఒకే విషయాన్ని అదే పనిగా చెప్పడం)
ఉదయాన్నే లేచి చదవమని, మా అమ్మగారు చెవిలో ఇల్లు కట్టు కొని పోరుపెడతారు.
65. శ్రీ కారం చుట్టు (మొదలుపెట్టు )
మా పాఠశాలలో చెట్లు నాటే కార్యక్ర మానికి మేము శ్రీ కారం చుట్టా ము.
66. ఆటపట్టు /కాణాచి/పట్టు గొమ్మ (నిలయం)
అజంతా ఎల్లో రాలు శిల్పకళకు ఆటపట్టు .
67. గుండెల్లో రాయపడుట (ఎక్కువగా బాధపడుట)
మా తాతగారు స్వర్గ స్థు లు అయినప్పుడు నాకు గుండెల్లో రాయి పడ్డ ట్ల య్యింది.
68. ఇబ్బడిముబ్బడగుట (రెండు, మూడు రెట్ల వుట)
నా స్నేహితురాలి పదోతరగతి మార్కులు చూసి, నా సంతోషం ఇబ్బడిముబ్బడయ్యింది.
69. అగ్గి మీద గుగ్గి లం (ఎక్కువ కోపాన్ని ప్ర దర్శించుట)
సరిగ్గా చదవడం లేదని తమ్ముడి మీద నాన్నగారు అగ్గి మీద గుగ్గి లం అయ్యారు.
70. అగ్నికి ఆజ్యం తోడైనట్లు (కోపాన్ని పెంచుట)
చైనా వారు సరిహద్దు లో సైనికులపై చేస్తున్న కాల్పులు మన దేశానికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు గా ఉన్నాయి.
71. అతలాకుతలం (అస్తవ్యస్తంగా మారడం)
మండే ఎండల మూలంగా జనజీవనం అతలాకుతలం అయ్యింది.
72. భగీరథ ప్ర య్నం (ఎక్కువ ప్ర యత్నం)
భగీరథ ప్ర యత్నంతో గాంధీగారు మనకు స్వాతంత్ర్యం తెచ్చారు.
73. పేదవానికి పెన్నిధి దొరికినట్లు (ఆధారం దొరికినట్లు )
తెలంగాణ ప్ర భుత్వం పెట్టి న ‘కళ్యాణలక్ష్మీ’ పథకం పేద ఆడపిల్ల లకు పెన్నిధి దొరికినట్లు అయ్యింది.
74. కళ్ల ల్లో నిప్పులు పోసినట్లు (ఈర్ష్యపడు)
రాణి కొత్తబట్ట లు చూసి రాధ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది.
75. బూడిదలో పోసిన పన్నీరు (వృధా/వ్యర్థం)
నేను చేసిన ప్ర యోగము మా బడి ప్రా జెక్టు లలో చోటు సంపాదించలేకపోవడం చేత నా శ్ర మ అంతా బూడిదలో
పోసిన పన్నీరులా మారింది.
76. తికమకపడు (ఒక దానిని చూసి వేరొకటి అనుకొను)
ముందునుండి చదవని పిల్ల లు పరీక్షల్లో తికమక పడి ఒక జవాబుకు ఇంకొక జవాబు రాస్తారు.
77. కకావికలమగు (బాధతో మనస్సు చెదిరిపోవు)
మా తాతగారు స్వర్గ స్థు లయ్యారాని తెలిసి నా మనస్సు కకావికలమైంది.
78. పెడచెవిన పెట్టు (మాటను లక్ష్యపెట్ట కుండా ప్ర వర్తించు)
విభీషణుని మాటలను రావణుడు పెడచెవిన పెట్టి నాశనం అయ్యాడు.
79. అరణ్యరోదనం (వ్యర్థం)
వరదల వలన పంటలు పాడైన రైతులు తాము పన్ను కట్ట లేమని ప్ర భుత్వానికి చెప్పిన మాటలు
అరణ్యరోదనం అయ్యాయి.

Page 5 of 7
80. తృణప్రా యం (చాలా తేలికగా)
సీత రావణున్ని తృణప్రా యంగా తోసి పుచ్చింది.
81. పూస గుచ్చినట్లు (వివరింగా)
నేను బడిలో జరిగిన విషయాలు మా అమ్మకు పూసగుచ్చినట్లు చెబుతాను.
82. కన్నీరు మున్నీరు (ఎక్కువగా దుఃఖించుట)
వరదల వలన పటలు పాడై రైతులు కన్నీరు మున్నీరయ్యారు.
83. కబంధహస్తాలు (తప్పించుకోలేక పోవడం)
చదువు రానివారు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాలలో చిక్కుకుంటారు.
84. అట్టు డికినట్లు (తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని గురించే అందరు చెప్పుకునుట)
రాముని వనవాసం వార్తతో అయోధ్యా నగరం అంతా అట్టు డికిపోయినట్లు అయ్యింది
85. పిక్కబలం చూపు (పరిగెత్తు)
పోలీసును చూసిన దొంగలు పిక్కబలం చూపారు.
86. కన్నులు ఎర్ర జేయు (కోపం ప్ర దర్శించు)
తప్పు చేసినప్పుడు నాన్నగారు కన్నులు ఎర్ర చేస్తారు.
87. గుండె చెరువగు (మిక్కిలి బాధపడు)
పసిబిడ్డ ను పోగొట్టు కున్న తల్లి గుండె చెరువయ్యేలా రోదించింది.
88. నిలువున నీరగు (పూర్తిగా నిరాశ చెందు)
ఉత్తీర్ణు ల జాబితాలో తన పేరు లేక రాము నిలువున నీరైపోయాడు.
89. కాళ్ళాడడం లేదు (ఏమీ తోచకపోవుట)
ప్ర మాదం చూడగానే ఎవరికీ కాళ్ళాడవు, కానీ తెలివితో ముందు 108 కి ఫోన్ చేయాలి.
90. సుగ్రీ వాజ్ఞ (తప్పక నిర్వర్తించవలసిన పని)
కేంద్ర ప్ర భుత్వం ఆజ్ఞ లు రాష్ట్రప్ర భుత్వం సుగ్రీ వాజ్ఞ లా అమలుపరుస్తుంది.
91. ముక్కున వేలేసుకొను (ఆశ్చర్యపోవు)
సర్కస్సులో పిల్ల లు చేసే విన్యాసాలు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు.
92. కళ్ళకు కట్టి నట్లు (కళ్ళతో చూసినట్లు గా)
మా అత్తయ్య ఏ విషయమైనా కళ్ళకు కట్టి నట్లు గా వివరిస్తుంది.
93. అగస్త్యభ్రా త (పేరు తెలియని వారు)
సంఘసంస్కరణ కార్యక్ర మాలకు నేడు ఎందరో అగస్త్యభ్రా తలు సహాయం చేస్తున్నారు.
94. ఆరితేరి (నేర్పరియగు)
అర్జు నుడు విలువిద్యలో ఆరితేరాడు.
95. ఉవ్విళ్ళూరు (ఉత్సాహపడు)
ఆటల పోటీలో పాల్గొ నడానికి నేను ఉవ్విళ్ళూరుతున్నాను.
96. పిడుగుపాటు (అనుకోనివార్త/హఠాత్తుగా వచ్చిన ప్ర మాదం)
గాంధీజీ మరణం ప్ర జలకు పిడుగుపాటులా మారింది.
97. అల్ల కల్లో లం (పరిస్థి తి బాగుండక పోవడం)

Page 6 of 7
వరదల వలన నగరం అంతా అల్ల కల్లో లం అయ్యింది.
98. అంగరంగ వైభవం (చాలా గొప్పగా)
భద్రా ద్రి లో రాముని కళ్యాణం అంగరంగవైభవంగా జరుగుతుంది.
99. మట్టి గరచు (ఓడించు)
భీమునితో చేసిన ముష్టి యుద్ధంలో జరాసంధుడు మట్టి గరిచాడు.
100. అభయమిచ్చు (రక్షించు)
రైతులను కాపాడతామని ప్ర భుత్వం అభయమిచ్చింది.
101. యథాతథం (ఉన్నది ఉన్నట్లు గా)
మా తాతగారు రామాయణం యథాతథంగా చెప్పగలరు.
102. ఆమూలాగ్రం (మొదటి నుండి చివరవరకు/పూర్తిగా)
నేను భాగవతం ఆమూలాగ్రం చదివాను.
103. బుద్ధి గడ్డి తిని (తెలిసి తప్పు చేయుట)
రావణుడు బుద్ధి గడ్డి తిని సీతను అపహరించాడు.
104. వెన్నతో పెట్టి న విద్య (చిన్ననాటి నుండి బాగా వచ్చిన విద్య)
విరాట్‌కు క్రి కెట్ వెన్నతో పెట్టి న విద్య.
105. తలలో నాలుక (వినయంతో ఉండు)
మా మేనత్త అందరికీ సలహాలు ఇస్తూ తలలో నాలుకలా ఉంటుంది.
106. చుక్కల్లో చంద్రు డు (ప్ర త్యేకంగా కనిపించు)
గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమంలో చుక్కుల్లో చంద్రు నిలా గుర్తింపు పొందాడు.
107. ఆచంద్ర తారార్కం (శాశ్వతంగా)
మనదేశ ప్ర తిష్ఠ ఆచంద్ర తారార్కం వెలుగొందాలి.
108. పంచప్రా ణాలు (మిక్కిలి ప్రే మ)
మా ఇంట్లో నేనంటే అందరికీ పంచప్రా ణాలు.
109. నీరు కారు (ఉత్సాహం పోవుట)
వర్షం పడడం వల్ల మా కార్యక్ర మం నీరుకారిపోయింది.
110. మొసలి కన్నీరు / కొంగజపం (మోసపూరిత నటన)
రైతుల కష్టా లకు సహాయం చేసే నాయకుల కన్నా మొసలి కన్నీరు కార్చే నాయకులు ఎక్కువ.
111. నడుం కట్టు (మొదలుపెట్టు )
మా వీధిని శుభ్రం చేయడానికి మేము నడుం కట్టా ము.
112. నడుం బిగించు (పట్టు దలతో పనిచేయు)
నదుల అనుసంధానానికి ప్ర భుత్వం నడుం బిగించింది.

Page 7 of 7
113. కొంగు బంగారం (అందుబాటులో ఉన్న గొప్ప వస్తువు)
భద్రా ద్రి రామన్న మన కోరికలు తీర్చే కొంగుబంగారం.
114. త్రి కరణ శుద్ధి గ (మనసు, వాక్కు, పని అంతటా మంచి భావాలు ఉండుట)
వృద్ధు లకు సేవ చేయాలని నేను త్రి కరణశుద్ధి గా అనుకుంటున్నాను.
115. ఆబాలగోపాలం (అందరు)
సీతారాముల కళ్యాణం చూడడానికి ఆబాలగోపాలం వచ్చారు.
116. స్వస్తి చెప్పు (వదిలిపెట్టు )
ఆటలకు స్వస్తిచెప్పి నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను.
117. కరతలామాలకం (చాలా సులభం)
బాగా చదుకువుకునే విద్యార్థు లకు పరీక్షలు రాయడం కరతలామాలకం.
118. అందెవేసిన చేయి (నేర్పరి)
సత్యభామ విలువిద్యలో అందెవేసి చేయి.
119. ఆయువు పట్టు (ప్ర ధాన నిలయం/ముఖ్యమైనది)
రామాయణ భారతాలు మన దేశ సంస్కృతికి ఆయువుపట్టు .
120. కాలికి బుద్ధి చెప్పు (పారిపోవు)
పోలీసుల్ని చూసి దొంగలు కాలికి బుద్ధి చెప్పారు.
121. కన్నులు పండుగ (అందంగా ఉండుట)
దీపావళి రోజున మా ఇల్లు వెలుగుల్లో నిండి కన్నుల పండుగలా ఉంది.
122. కత్తి మీద సాము (ప్ర మాదకరం/చాలా కష్ట మైన పని)
మనదేశంలో తీవ్ర వాదం తగ్గించడం కత్తీమీద సాములా మారింది.
123. నూటికి నూరు పాళ్ళు (పూర్తిగా)
పరీక్షలకు నేను నూటికి నూరు పాళ్ళు చదివాను.
124. ఇల్లు గుల్ల చేయు (నాశనం చేయు)
మద్యానికి బానిసలు అయినవారు ఇల్లు గుల్ల చేస్తారు.
125. బుర్ర బద్ద లు కొట్టు కోవడం (చాలా ఆలోచించుట)
పర్యావరణం ఎలా కాపాడుకోవాలి అని శాస్త్ర జ్ఞు లు బుర్ర బద్ద లు కొట్టు కుంటున్నారు.
126. తోక తొక్కిన తాచు (మిక్కిలి కోపాన్ని ప్ర దర్శించు)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ చర్యలకు ట్రంప్ తోక తొక్కిన తాచులా మారుతున్నాడు.
127. నీళ్ళు నములు (సరిగ్గా సమాధానం చెప్పకపోవడం)
గురువుగారు అడిగిన ప్ర శ్నలకు సమాధానం తెలియని విద్యార్థు లు నీళ్ళు నములుతారు.
128. బావిలో కప్ప (బయట ప్ర పంచం తెలియకపోవటం)

Page 8 of 7
పూర్వం స్త్రీ లు విద్యావకాశాలు లేకపోవడం వల్ల బావిలో కప్పలా ఉండేవారు.
129. పక్కలో బల్లెం (దాగి ఉన్న ప్ర మాదం)
ఉగ్ర వాదులు ప్ర భుత్వానికి పక్కలో బల్లెంలా ఉన్నారు.
130. ఆణిముత్యం (శ్రే ష్ట మైనది)
కవయిత్రు లలో మొల్ల ఆణిముత్యం వంటిది.
131. కుంభకోణం (మోసం)
ప్ర తిరోజూ వార్తాపత్రి కల్లో ఏదో ఒక కుంభకోణం బయటపడుతోంది.
132. ఓనమాలు దిద్దు (తొలిదశలో ఉండు)
పాకిస్తాన్ సాంకేతిక రంగంలో ఓనమాలు దిద్దే స్థి తిలో ఉంది.
133. గగనకుసుమం (దొరకనిది/అసాధ్యమైనది)
ఈనాడు యువకులకు ప్ర భుత్వ ఉద్యోగాలు దొరకడం గగనకుసుమంగా ఉంది.
--xx--

Page 9 of 7

You might also like