Bejja Mahadevi

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

26/11/2023, 20:31 (12) Quora

శివుని కోసం పరితపించిన భక్తు రాలు జీవితంలో శివుడే బిడ్డ అయినా సందర్భం?
ఓం శ్రీ కార్తీ క దామోదరాయ నమ:
బెజ్జ మహాదేవి
బెజ్జ మహాదేవి ప్ర తిరోజూ శివుడిని పూజిస్తూ ఉండేది . భక్తి గీతాలు పాడుతూ ఉండేది . ఒక రోజు పూజా మందిరంలో
శివుడి ప్ర తిమను చూస్తు న్న ఆమెకు ఒక విచిత్ర మైన ఆలోచన కలిగింది . లోకంలో ని వారందరికీ తల్లి తండ్రు లు ఉన్నారు .
కానీ శివుడికి తల్లి లేదేం ! శివుడు పులి చర్మం కట్టు కుంటాడు , పాములను మెడలో వేసుకొంటాడు . స్మశానంలో
తిరుగుతూ ఉంటాడు . ఒంటికి బూడిద రాసుకుంటాడు . తల్లి ఉంటె ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా ? విషం
తాగనిచ్చేదా ? ఇలా భిక్షా టన చేయ నిచ్చేదా ?
ఎవరికైన తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది ? తల్లి ఉంటె బిడ్డ లని దగ్గ ర నుండి ఆలనా పాలనా
చూసుకుంటుంది . పెళ్లి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటెనేకదా అందరికి ఆ భాగ్యం దక్కేది ? పాపం శివుడికి తల్లి
లేకపోవటం వల్ల నే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు . ఎవరో ఎందుకు ? నేనే తల్లి ని అవుతాను . శివుడికి పెంచిన తల్లి
అనిపించుకుంటాను అని అనుకుంది బెజ్జ మహాదేవి . అనుకున్నదే తడవుగా శిశువు అంత పరిమాణంగల శివుడి
ప్ర తిమను తయారు చేయించింది . దానినే శిశువుగా భావించి , లాలించి ముద్దా డింది . కాళ్ళ మీద పడుకో పెట్టు కొని
తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరం అంతా రుద్దింది .దోసిలితో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది
.కళ్ళలోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డంపెట్టి స్నానం చేయించింది .
స్నానం అయినతరువాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుడి చుట్టూ తా తిప్పి దిష్టి తీసింది . మెత్త టి గుడ్డ తో ఒళ్ళు తుడిచింది
.తుడిచినతరువాత ధూపం వేసి , ఉయ్యాలలో పడుకోపెట్టింది. ఊపుతూ జోలపాట పాడింది . మూడుకళ్ళకు కాటుక
పెట్టింది . ఆ ప్ర తిమని శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది . ఒక వేలుని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది.
ఇలా రోజు అనేక ములైన బాల్యో పచారములు చేస్తూ వాత్సల్య భక్తి తో పరమేశ్వరుని సేవించు కుంటూ ఉంది ఆయన మీద
తన భక్తి ని ఆవిధంగా తీర్చుకోసాగింది . ఆమె తల్లి ప్రే మను చూసి ముగ్ధు డైన హరుడు ఆమె కోరినట్లే ఐదేళ్ల బాలుడిలా
ప్ర వర్తించేవాడు . ఆమె కొంగు పట్టు కొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ ఆనందంగా స్వీకరించేవాడు . ఒకే రోజు ఆమె
భక్తి ని పరీక్షించాలని అనుకున్నాడు .
ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే; , తినేవాడు కాదు , పలు పట్ట బోతే నోరు తెరిచావాడు కాదు . పెదవులు
బిగించి మాట్లా డకుండా ఉన్నాడు !. "అయ్యా ఏమయ్యిందయ్యా నీకు ?. ఇళ్ల అయిపోతున్నావేంటి ? ఎవరు ఏది పెడితే
అది తింటావు . ఒక భక్తు డు మాంసం నివేదన చేస్తా డు , ఇంకొక భక్తు డు నెత్తి మీద కెక్కి తొక్కుతాడు . నువింత
అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తు న్నారు .అంటూ నిష్ఠూ రాలు ఆడింది . "యెంత దిష్టి తగిలిందమ్మా నా
బిడ్డ కు ? అని దిష్టి తీసివేసింది .
ఎన్ని చేసినా శివుడికి తగ్గ లేదు . "అయ్యో ! నీశరీరం చల్ల గా ఉంది . ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా !.
మాట్లా డవేమయ్యా ! దైవమా ! నాబిడ్డ ను రక్షించు " అంటూ పరిపరి విధాల వాపోయింది . ఎన్ని ఉపచారాలు చేసినా
శివుడి లో మార్పు లేదు .
జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్ర తకనయ్యా?, ఒంటరిగా బ్ర తికే ధైర్యం నాకు లేదు . . ఆ పాడు రోజు నాపాలిట
పడకముందే ఈ గ్రు క్కెడు ప్రా ణం గుటుక్కుమనిపించుకుంటాను" అంటూ తల శివలింగానికేసి కొట్టు కోసాగింది . నుదురు
చిట్లింది . . రక్తం ధారగా కారసాగింది . ఇంతలో ఒక అద్భుతం జరిగింది. . కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు మెరుపులు
మెరిసాయి . పెళ పెళ మంటూ శబ్దా లు వచ్చాయి . శివలింగం స్థా నంలో పులి చర్మం ధరించి మేడలో నాగాభరణం తో,
జటాజూటంలో నెలవంక తో శివుడు ప్ర త్యక్ష మైనాడు .
బిజ్జ మహాదేవి తల శివుడి తొడను అనుకోని ఉంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమైంది . ఆమె తల మీద చేయి వేసి "
అమ్మా ! లే !" అన్నాడు ఆప్యాయంగా . . బెజ్జ మహాదేవి తలెత్తి చూసింది . ఎదురుగా ప్ర సన్నవదనంతో పరమేశ్వరుడు. ఆ
వెనుకనే పార్వతి , నంది , బృంగి వంటి ప్ర ధమ గణాలు అందరూ కనిపించారు .
https://te.quora.com 1/2
26/11/2023, 20:31 (12) Quora

"నీ ప్ర యత్నాన్ని మానుకో ! నీ భక్తి ని మెచ్చాను . ఏం వరం కావాలో కోరుకో ! " అన్నాడు .
"నాకు వర మెందుకయ్యా ! ఇప్పుడు రోగంతో భాదపడుతున్నది నువ్వు. ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతుడవై
ఉంటె అంతకన్నా నాకు కావలసింది ఏముంది నాయనా ! అన్నది అమాయకత్వంగా.
ఆమె వాత్సల్య భక్తి కి శివుడు ఏంటో ఆనందించాడు . "నీలాంటి తల్లి ఉంటె ;నాకు రోగమో ఎలా వస్తుందమ్మా! . నువ్వు
నాకు తల్లి వి గనుక ముల్లో కాలకు ముత్త లివి . ముత్త వ్వ అనే పేరుతొ ప్ర ఖ్యాతి పొందుతావు . అంత్యములో కైలాసానికి చేరు
కొందువు గాక !" అని ఆస్వీరదించి అందరితోపాటు అంతర్ధా నమైపోయాడు పరమేశ్వరుడు ..
బసవ పురాణంలో ఉన్న కథను ఇక్కడ మనం చదువుతున్నది.

https://te.quora.com 2/2

You might also like