bjp north east

You might also like

Download as rtf, pdf, or txt
Download as rtf, pdf, or txt
You are on page 1of 3

ఈశాన్యంలో కమలం ఎలా వికసించింది...?

బీజేపీ అంటే ప్రధానంగా ప్రతిపక్షాలు చేసే విమర్శ మతతత్వ పార్టీ... బీజేపీ కూడా హిందుత్వంపై అభిమానాన్ని

దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించదు... అలాంటి బీజేపీ హిందూయేతరులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రా ల్లో

ఎలా పాగా వేయగలిగిందన్నదే ఆసక్తికర అంశం... బీఫ్‌తినడాన్ని బీజేపీ బహిరంగంగా వ్యతిరేకిస్తుంది. ఇటు ఈశాన్య

రాష్ట్రా ల్లో బీఫ్ వినియోగం ఎక్కువ. మరి ఈ రెండింటికీ పొత్తు కుదరడం వెనుక పెద్ద ప్రయత్నమే ఉంది.

మూడు రాష్ట్రా ల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అదరగొట్టింది. నిజానికి ఈ మూడు రాష్ట్రా ల్లో త్రిపురలో మాత్రమే తన సొంత

బలంతో కమలం అధికారంలోకి రాగలిగింది. గతంలో కమ్యునిస్టు లను చావుదెబ్బ కొట్టిన కమలానికి ఈసారి విజయం

అంత ఈజీగా దక్కలేదు. రాజవంశీకుడు స్థా పించిన తిప్రా మోథా పార్టీ బీజేపీని గట్టిగా ఢీకొట్టింది. అయితే విజయాన్ని

మాత్రం అడ్డు కోలేకపోయింది. ఇక నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ

బీజేపీ మైనర్‌పార్ట్‌నర్‌మాత్రమే... మేఘాలయలో బీజేపీ మూడు సీట్లతోనే సరిపెట్టు కున్నా అది తక్కువేం కాదు. ఈ

మూడు రాష్ట్రా ల్లోనే కాదు ఈశాన్యం అంతటా కమలం వికసిస్తోంది.

ఈశాన్యంలో ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతోంది. 2016 లో అస్సాంలో జరిగిన ఎన్నికల్లో

కమలం విజయం సాధించింది. అదే తొలి అడుగు. అదే ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ అధికారంలోకి రాగలిగింది.

2017 లో మణిపూర్‌ను గెలుచుకుంది. 2018 లో త్రిపురలో గెలిచింది. 2019 లో అరుణాచల్‌ప్రదేశ్‌ను గెలుచుకుంది.


2021 లో అస్సాంలో అధికారాన్ని నిలబెట్టు కోగలిగింది. 2022 లో మణిపూర్‌కూడా కమలం ఖాతాలో చేరింది.

బీజేపీ ఇలా ఈశాన్యంలో ఎలా నెగ్గుతోందన్న ప్రశ్నకు చాలా కారణాలే ఉన్నాయి. అస్సాం, త్రిపురలు హిందువులు

ఎక్కువగా ఉన్న రాష్ట్రా లు కాబట్టి ఇక్కడ గెలిచింది అనుకుంటే ఓకే... కానీ మిగిలిన ఈశాన్య రాష్ట్రా ల్లోనూ సత్తా చాటడమే

రాజకీయ విశ్లేషకులకు పూర్తిగా అంతు చిక్కని అంశం. ఆ రాష్ట్రా ల్లో గిరిజనులు, క్రిస్టియన్లు ఎక్కువ. బీఫ్‌ఎక్కువగా

తింటారు. అది అక్కడి సంస్కృతి. పైగా వారు స్థా నిక భాషలతో పాటు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లా డతారు. ఇటు బీజేపీ
ఏమో గొడ్డు మాంసానికి వ్యతిరేకం. అదే సమయంలో హిందీని ఇతర రాష్ట్రా ల మీద రుద్దు తోందన్న ఆరోపణ దానిపై

ఉంది. అలాంటప్పుడు బీజేపీని ఈశాన్య రాష్ట్రా లు ఎలా ఆదరిస్తు న్నారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రా ల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసారు. ఆ

గుడ్‌విల్ అక్కడ ఉంది. మోడీ అధికారంలోకి రాగానే ఈశాన్య రాష్ట్రా లపై స్పెషల్ ఫోకస్ పెట్టా రు. కొత్త ప్రాజెక్టు లు

ప్రారంభించారు. నిధులు మంజూరు చేశారు. పైగా ప్రచారంలో బీజేపీ సంగతి తెలిసిందే.. ఇవన్నీ కొంతమేర ఫలించాయి.

వీటన్నింటికంటే బీజేపీ వేసిన రాజకీయపుటెత్తు లు కమలాన్ని ఈశాన్యంలో నిలబెట్టా యి.

కీలక నేతలను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ వెనకడుగు వేయదు. 2015 లో జరిగిన రాజకీయ పరిణామం బీజేపీకి

కలసి వచ్చింది. ప్రస్తు తం అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ బిశ్వశర్మ అప్పట్లో కాంగ్రెస్‌లో ఉండేవారు. సోనియాతో

విబేధించి ఆయన బీజేపీలో చేరారు. ఈశాన్య రాష్ట్రా ల్లో కాస్త చరిష్మా ఉన్న హేమంత్ బిశ్వశర్మ.... నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్

అలయన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది బీజేపీ ఆ రాష్ట్రా ల్లో చొచ్చుకెళ్లడానికి సాయం చేసింది. కాంగ్రెస్, స్థా నిక పార్టీలకు

దూరంగా ఉన్నవారిని బీజేపీకి దగ్గర చేసింది.

ఈశాన్య రాష్ట్రా లకు ఢిల్లీ పార్టీలంటే అంతగా పడదు. ఒకప్పుడు కాంగ్రెస్ వెలిగినా తర్వాత దాని ప్రభ క్షీణించింది. ఢిల్లీ

బహుత్ దూర్ అనేది స్థా నిక పార్టీల నినాదం... అలాంటి రాష్ట్రా లకు మోడీ నేతృత్వంలోని బీజేపీ విదేశీ పార్టీలాగా

కనిపించడంలో వింతేం లేదు. అయితే శర్మ నేతృత్వంలోని ఎన్‌ఈడీఏను మాత్రం వారు ఆదరించారు. అలాగే

పెమాఖండు, బీరేన్‌సింగ్‌వంటి వారిని బీజేపీ తనవైపు తిప్పుకోగలిగింది. వ్యక్తిగతంగా పట్టు న్న నేతలను తనవైపు

తిప్పుకోగలిగింది. పార్టీలను చీల్చుతోందని అపవాదులు వచ్చినా పట్టించుకోలేదు. దీనికి తోడు రామ్‌మాధవ్‌వంటి వారు

ఈశాన్య రాష్ట్రా లపై చాలాకాలంగా పనిచేస్తూ వచ్చారు. నిజానికి బ్రిటీష్ కాలం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ఇక్కడ కార్యకలాపాలు

నిర్వహిస్తూ వచ్చింది. మిగిలిన పార్టీలకు దూరమైన వారు బీజేపీకి దగ్గరయ్యేలా ఆర్‌ఎస్‌ఎస్‌వ్యూహాలు రచించింది.

పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లాగా ఈశాన్య రాష్ట్రా లు వ్యవసాయ ఆధారిత రాష్ట్రా లు కాదని బీజేపీకి తెలుసు.. అందుకే బీఫ్‌కు

వ్యతిరేకంగా బీజేపీ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కొన్నిరోజుల క్రితం తానూ బీఫ్‌తింటానని ఇది మన
సంస్కృతి అంటూ మేఘాలయ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీ స్ట్రా టజీలో భాగమే.

తనకు అవకాశం ఉన్న చోటు ఆక్రమించేయడం, బలం తక్కువగా ఉన్న చోట కాలు మోపడానికి స్థా నిక పార్టీలను

ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటు. దాన్ని పక్కాగా అమలు చేసింది. పైగా ఈశాన్యంలో కాస్తో కూస్తో పట్టు న్న

పార్టీలు అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ వచ్చాయి. దీన్ని బీజేపీ తనకు అడ్వాంటేజ్‌గా

మార్చుకుంది. ఈ సమీకరణాలన్నీ కమలానికి కలసివచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 25 ఎంపీ

సీట్లకు గాను బీజేపీ 14 చోట్ల, దాని మిత్రపక్షాలు 4 చోట్ల గెలిచాయి. బీజేపీకి ఇక్కడ ఏ స్థా యి పట్టుందో ఇది

చెబుతోంది.

ఓవైపు ఈశాన్యంలో కమలం వికసిస్తోంటే కాంగ్రెస్ మాత్రం వాడిపోతోంది. ఒకప్పుడు రాష్ట్రా లను ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు

కనీసం ఒకటి రెండు సీట్లు కూడా సాధించలేకపోతోంది. త్రిపురలో కమ్యునిస్టు లతో కలసి పోటీ చేసినా ఐదుసీట్లకే

పరిమితమైంది. ఇక మేఘాలయలోనూ ఇదే పరిస్థితి. ఇక నాగాలాండ్ లో అయితే ఒక్కటంటే ఒక్క సీటులోనూ కాంగ్రెస్

గెలవలేకపోయింది. మొత్తంగా చూస్తే అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఈశాన్యంలో కమలం పాగా

వేసింది. రానున్న రోజుల్లో మిగిలిన రాష్ట్రా లపైనా పూర్తిగా పట్టు పెంచుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

You might also like