STARTUP

You might also like

Download as rtf, pdf, or txt
Download as rtf, pdf, or txt
You are on page 1of 2

2021 లో భారతీయ స్టా ర్టప్ లు దుమ్మురేపాయి. రికార్డు స్ఖాయిలో పెట్టు బడులు సమీకరించాయి.

అంతేకాకుండా
బిలియన్ డాలర్ల విలువైన కొత్త యూనికార్న్ కంపెనీలు ఏడాదిలోనే దాదాపు రెట్టింపవడం మన స్టా ర్టప్ ల సత్తా ను
చాటుతోంది.

>>Roll PKG

వాయిస్..

కరోనా కల్లోలంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికంగా స్తబ్ధత నెలకొన్న సమయంలో భారతీయ స్టా ర్టప్ లు మాత్రం
తిరుగులేని ప్రదర్శన చేశాయి. దేశీ, విదేశీ నిధుల ద్వారా 42 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 3 లక్షల
12 వేల కోట్లకు పైగానే పెట్టు బడులను సాధించగలిగాయి. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఏడాదిలోనే

కొత్త యూనికార్న్ కంపెనీల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 42 కంపెనీలు యానికార్న్ క్లబ్ లో చేరాయి. 2016-2020
మధ్య 30 కంపెనీలు ఈ జాబితాలో చేరగా ఈ ఒక్క ఏడాది 42 చేరడం ఇండస్ట్రీ దూకుడును తెలియ చేస్తోంది.

వాయిస్..

స్టా ర్టప్‌విలువ 1 బిలియన్‌డాలర్లు దాటితే దానిని యునికాన్‌అని అంటారు. మనదేశంలో 2011 లో ఒకటే యూనికాన్
నమోదైంది. ఇలా 2014 వరకూ ఏడాదికి ఒకటి మాత్రమే నమోదయ్యాయ్‌. 2016 లో రెండ కంపెనీలు యూనికార్న్ క్లబ్
లో చేరాయి. 2017 లో ఒక్కటి కూడా చోటు సంపాదించుకోలేకపోయింది. అయితే 2018 లో 8, 2019 లో 9,
2020 లో 11 కంపెనీలు ఈ ఘనతను సాధించాయి. 2021 లో 42 తో కలుపుకుంటే ఇప్పటివరకూ 83 కంపెనీలు ఈ

జాబితాలో చేరాయి. ఇక మన దేశంలో ఎక్కువ యూనికార్న్ లు బెంగళూరులో ఉన్నాయి.

వాయిస్..

స్టా ర్టప్ ఇన్వెస్టర్లు ఐపీఓలు, సెకండరీ సేల్స్ ద్వారా భారీ మొత్తా న్ని వెనక్కు తీసుకోవడం కూడా ఈ ఏడాది ఆసక్తికర
పరిణామం. IVCA-EY రిపోర్ట్ ప్రకారం.. 280 డీల్స్‌ద్వారా దాదాపు 43.2 బిలియన్‌డాలర్ల మొత్తా న్ని సెకండరీ సేల్స్ ,
వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా భారీగా స్టా ర్టప్ ఇన్వెస్టర్లు సంపాదించారు.

వాయిస్..

మన మార్కెట్ల డెప్త్ పెరగడంతో మెరుగైన ఫౌండింగ్ టీమ్స్ స్టా ర్టప్స్ తో ముందుకొస్తు న్నాయనేది నిపుణుల అంచనా.
ఐపీఓల ద్వారా ఎగ్జిట్ కూడా బాగుండటంతో 2021 మన కంపెనీలకు బాగా కలిసొచ్చింది. యూనికార్న్ లో
సంఖ్యాపరంగా మనం బ్రిటన్ ను వెనక్కు నెట్టి మూడో స్థా నాన్ని ఆక్రమించాం. అమెరికా, చైనాలు మొదటి రెండు
స్థా నాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం యూనికార్న్ ల్లో 74 శాతం ఈ రెండు దేశాల్లోనే ఉన్నాయి. భారత
యూనికార్న్ ల్లో 21 బిలియన్ డాలర్లతో బైజుస్ మొదటి స్థా నంలో నిలిచింది. మన స్టా ర్టప్ ల దూకుడు చూస్తుంటే
రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు ఈ క్లబ్ లో చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తు న్నారు.

You might also like