Press Information Bureau (1)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

ఆర్థిక మంత్రిత్వ శాఖ

మధ్యంతర బడ్జెటు2024-25 లో ముఖ్యాంశాలు


Posted On: 01 FEB 2024 12:54PM by PIB Hyderabad

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మరియు సబ్ కా విశ్వాస్’ అనే ‘మంత్రం’ తోను మరియు ‘‘సబ్ కా ప్రయాస్’’
తాలూకు యావత్తు దేశం అనే వైఖరి తోను ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి
నిర్మల సీతారమణ్ 2024-25 మధ్యంతర బడ్జెటు ను ఈ రోజు న పార్లమెంటు లో సమర్పించారు. బడ్జెటు లో
ప్రధానాంశాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:
భాగం - ఎ

సామాజిక న్యాయం
· ప్రధాన మంత్రి నాలుగు ప్రధాన కులాల మీద శ్రద్ధ తీసుకోనున్నారు. అవి ఏవేవి అంటే ‘గరీబ్’
(పేదలు), ‘మహిళాయేన్’ (మహిళలు), ‘యువ’ (యువత) మరియు ‘అన్నదాత’ (రైతు).

‘గరీబ్ కళ్యాణ్, దేశ్ కా కళ్యాణ్’ (పేదల సంక్షేమం, దేశ సంక్షేమం)

గడచిన పది సంవత్సరాల లో 25 కోట్ల మంది ప్రజల ను బహుళ పార్శ్విక పేదరికం నుండి బయటకు
రావడం లో ప్రభుత్వం సాయపడింది.

· పిఎమ్-జన్ ధన్ ఖాతాల ను ఉపయోగించి 34 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రత్యక్ష
ప్రయోజనాన్ని బదలాయించడం (డిబిటి) ద్వారా ప్రభుత్వాని కి 2.7 లక్షల కోట్ల రూపాయలు ఆదా
అయ్యాయి.
వీధుల లో తిరుగుతూ వస్తు వులు అమ్ముకొనే వారి కి 78 లక్షల మంది కి పిఎమ్-స్వనిధి పరపతి సంబంధి
సహాయాన్ని అందించింది. మూడో విడత రుణాన్ని 2.3 లక్షల మంది స్వీకరించడం జరిగింది.
·పర్టిక్యులర్లీ వల్‌నరబుల్ ట్రైబల్ గ్రూ ప్స్ (పివిటిజి) యొక్క అభివృద్ధి కి పిఎమ్- జన్‌మన్ యోజన
సాయం చేయనుంది.
పద్దెనిమిది విధాలైన వ్యాపారాల లో నిమగ్నమైన చేతివృత్తిదారులు మరియు హస్తకళ ల నిపుణుల కు పిఎమ్-
విశ్వకర్మ యోజన అండదండల ను అందిస్తుంది.

‘అన్నదాత’ యొక్క సంక్షేమం

11.8 కోట్ల మంది రైతుల కు పిఎమ్-కిసాన్ సమ్మాన్ యోజన ఆర్థిక సహాయాన్ని అందించింది.
పిఎమ్ ఫసల్ బీమా యోజన లో భాగం గా, పంట బీమా సదుపాయాన్ని 4 కోట్ల మంది రైతుల కు ఇవ్వడమైంది.
ఎలక్ట్రానిక్ నేశనల్ ఎగ్రీకల్చర్ మార్కెట్ (ఇ-ఎన్ఎఎమ్) 1361 మండీ లను ఏకీకృతం చేసింది, ఫలితం గా 1.8
కోట్ల మంది రైతుల కు సేవ లు అందాయి. వ్యాపార పరిమాణం 3 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది.

జోరందుకున్న నారీ శక్తి


ముద్ర యోజన లో భాగం గా మహిళా నవ పారిశ్రా మికవేత్తల కు 30 కోట్ల రుణాల ను ఇవ్వడం జరిగింది.
ఉన్నత విద్య కోర్సుల లో చేరిన మహిళల సంఖ్య లో 28 శాతం వృద్ధి నమోదైంది.
ఎస్‌టిఇఎమ్ కోర్సుల లో నమోదు అయిన వారి లో 43 శాతం మంది అమ్మాయిలు మరియు మహిళలు, ఈ
గణాంకాలు ప్రపంచం లో అత్యధిక స్థా యి గణాంకాల లో ఒకటి గా ఉన్నాయి.
·పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా 70 శాతాని కి పైగా ఇళ్ళ ను గ్రా మీణ ప్రాంతాల కు చెందిన
మహిళల కు ఇవ్వడం జరిగింది.
పిఎమ్ ఆవాస్ యోజన (గ్రా మీణ్)
కోవిడ్ సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడాను, మూడు కోట్ల గృహాల ను పిఎమ్ ఆవాస్ యోజన (గ్రా మీణ్) లో భాగం
గా నిర్మించాలి అనేటటువంటి లక్ష్యాన్ని త్వరలో నే సాధించడం జరుగుతుంది.
· మరో రెండు కోట్ల గృహాల నిర్మాణాన్ని రాబోయే అయిదు సంవత్సరాల లో చేపట్టడం జరుగుతుంది.
రూఫ్‌టాప్ సోలరైజేశన్ మరియు ఉచిత విద్యుత్తు
ఇంటి పై కప్పు భాగం లో సౌర ఫలకాల ను ఏర్పాటు చేసి విద్యుత్తు సౌకర్యాన్ని అందుకొనే ప్రక్రియ వల్ల ఒక కోటి
కుటుంబాలు ప్రతి నెలా 300 యూనిట్ ల ఉచిత విద్యుత్తు ను పొందనున్నాయి.
· ప్రతి ఒక్క కుటుంబం ఏటా 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు మిగుల్చుకోవచ్చన్న
అంచనా ఉంది.

ఆయుష్మాన్ భారత్
ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా అందిస్తు న్న ఆరోగ్య సంరక్షణ కవచాన్ని ఎఎస్ హెచ్ఎ (‘ఆశా’)
కార్యకర్తల కు, ఆంగన్ వాడీ కార్యకర్తల కు మరియు సహాయకుల కు కూడా విస్తరించడం జరుగుతుంది.
వ్యవసాయం మరియు ఫూడ్ ప్రా సెసింగ్

38 లక్షల మంది రైతుల కు లబ్ధి ని చేకూర్చి, మరి 10 లక్షల ఉద్యోగాల ను ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన
కల్పించింది.
2.4 లక్షల ఎస్హె
‌ చ్జి
‌ స్ కు మరియు 60,000 మంది వ్యక్తు ల కు క్రెడిట్ లింకేజీ ల పరం గా ప్రధాన్ మంత్రి
ఫార్మలైజేశన్ ఆఫ్ మైక్రో ఫూడ్ ప్రా సెసింగ్ ఎంటర్ప్రై
‌ జెస్ యోజన సాయాన్ని అందింది.

వృద్ధి , ఉపాధి కల్పన, ఇంకా అభివృద్ధి లకు ఉత్ప్రేరకం గా పనిచేయనున్న పరిశోధన మరియు
నూతన ఆవిష్కరణ లు

ఒక లక్ష కోట్ల రూపాయల కార్పస్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది; యాభై సంవత్సరాల పాటు వడ్డీ
చెల్లించనక్కరలేనటువంటి రుణం దొరుకుతుంది; దీర్ఘకాలిక ఆర్థిక సహాయం గానో లేదా దీర్ఘకాల పరిమితుల తో
కూడిన రీఫైనాన్సింగ్ రూపం లోనో తక్కువ గా ఉండే వడ్డీ రేటు తో గాని లేదా అసలు ఎంత మాత్రం వడ్డీ
చెల్లించనక్కరలేని రీతి లో ఉంటుంది ఇది.
రక్షణ సంబంధి ఉద్దేశ్యాల కు గాను డీప్-టెక్ టెక్నాలజీ లను బలపరచడం కోసం ఒక క్రొ త్త పథకాన్ని
ప్రా రంభించడం జరుగుతుంది; ఈ రంగం లో ‘ఆత్మనిర్భరత’ను వేగిరపరచడం దీని ఉద్దేశ్యం.

మౌలిక సదుపాయాల రంగం


మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఉద్యోగ కల్పన లకు గాను కేపిటల్ ఎక్స్‌పెండిచర్ అవుట్ లెట్
ను 11.1 శాతం అధికం గా కేటాయిస్తూ , దానిని 11,11,111 కోట్ల రూపాయల కు చేర్చడం జరుగుతుంది.
అది జిడిపి లో 3.4 శాతం గా ఉంటుంది.

రైల్‌వే లు

లాజిస్టిక్స్ పరమైన సామర్థ్యాన్ని మెరుగు పరచడం కోసం, మరి ఖర్చు ను తగ్గించడం కోసం పిఎమ్ గతి శక్తి లో
భాగం గా అమలు లోకి తీసుకు రావడాని కి గాను మూడు ప్రధానమైన ఇకానామిక్ రైల్ వే కారిడర్ ప్రో గ్రా మ్స్ ను
గుర్తించడమైంది.
·

o శక్తి, ఖనిజాలు మరియు సిమెంటు సంబంధి కారిడర్ లు


o నౌకాశ్రయ సంధానం సంబంధి కారిడర్ లు

హై ట్రా ఫిక్ డెన్సిటీ కారిడర్ లు


నలభై వేల సాధారణ రైలు పెట్టెల ను వందే భారత్ ప్రమాణాల కు తులతూగేటట్టు తీర్చిదిద్దడం
జరుగుతుంది.

విమానయాన రంగం

దేశం లో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపై 149 కి చేరింది


· అయిదు వందల పదిహేడు క్రొ త్త మార్గా ల లో 1.3 కోట్ల మంది రాకపోకలు జరుపుతున్నారు.
భారతదేశం లో విమానయాన సంస్థలు ఒక వేయి కి పైచిలుకు క్రొ త్త విమానాలు కావాలంటూ ఆర్డర్ లను
పెట్టా యి.

గ్రీన్ ఎనర్జి

ఒక వంద ఎమ్‌టి సామర్థ్యం కలిగివుండే కోల్ గ్యాసిఫికేశన్, లిక్విఫేక్శన్ సంబంధి సదుపాయాలను 2030 వ
సంవత్సరాని కల్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
రవాణా అవసరాల నిమిత్తం కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి) లో కంప్రెస్‌డ్ బయో గ్యాస్ (సిబిజి) ని
కలపడాన్ని దశల వారీగా తప్పనిసరి చేయడం; అలాగే, ఇళ్ళ లో వినియోగించడం కోసం గొట్టపు మార్గా ల ద్వారా
సహజ వాయువు (పిఎన్‌జి) ని తప్పనిసరిగా అమలు పరచడం.
పర్యటక రంగం
ప్రసిద్ధ పర్యటక కేంద్రా ల ను సంపూర్ణం గా అభివృద్ధి పరచడం తో పాటు, వాటి కి బ్రాండ్ విలువ ను జత పరచి,
ప్రపంచ స్థా యి లో మార్కెటింగ్ కై రాష్ట్రాల ను ప్రో త్సహించడం జరుగుతుంది.
సౌకర్యాల మరియు సేవల నాణ్యత ను బట్టి పర్యటక కేంద్రా ల యొక్క రేటింగ్ కు గాను విధి విధానాల ను
రూపొందించడం జరుగుతుంది.
ఆ తరహా అభివృద్ధి సాధనకై రాష్ట్రాల కు దీర్ఘకాల అవధి తో కూడిన వడ్డీ చెల్లించనక్కర లేని రుణాల ను మేచింగ్
ప్రా తిపదికన అందించడం జరుగుతుంది.

పెట్టు బడులు

· 2014-23 మధ్య కాలం లో 596 బిలియన్ యుఎస్ డాలర్ మేరకు ఎఫ్‌డిఐ లు నమోదు అయ్యాయి.
ఇది 2005-14 మధ్య కాలం లో తరలివచ్చిన ఎఫ్‌డిఐ లకు రెట్టింపు గా ఉంది.
‘వికసిత్ భారత్’ ఆవిష్కారం కోసం రాష్ట్రాల లో సంస్కరణలు

· లక్ష్యాన్ని చేరుకోవాలన్న గీటురాయి తో కూడిన సంస్కరణల ను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు


పరచేటట్లు గా, వాటి కి మద్ధతు ను ఇవ్వడం కోసం యాభై సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించనక్కర
లేనటువంటి రుణం రూపం లో 75,000 కోట్ల రూపాయల ను సర్దు బాటు చేయడం జరుగుతుంది.
సవరించిన అంచనాలు (ఆర్ఇ) 2023-24

రుణాలు కాకుండా మొత్తం జమ ల పరం గా ఆర్ఇ అనేది 27.56 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది, దీనిలో పన్ను
జమ లు 23.24 లక్షల కోట్ల రూపాయలు గా ఉన్నాయి.
మొత్తం వ్యయం తాలూకు ఆర్ఇ అనేది 44.90 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది.
రెవిన్యూ జమ లు 30.03 లక్షల కోట్ల రూపాయలు గా ఉంటాయని భావించడమైంది; ఇవి బడ్జెటు అంచనా ను
మించుతాయన్న భావన ఉంది. ఇవి ఆర్థిక వ్యవస్థ లో బలమైన వృద్ధి కి అదం పడతాయి.
2023-24 లో విత్త లోటు యొక్క సవరించిన అంచనా (ఆర్ఇ) అనేది జిడిపి 5.8 శాతం గా ఉంది.

బడ్జెట్ అంచనాలు 2024-25


రుణాలు కాకుండా, మొత్తం జమ లు 30.80 లక్షల కోట్ల రూపాయలు గాను మరియు మొత్తం వ్యయం 47.60
లక్షల కోట్ల రూపాయలు గాను ఉండవచ్చని అంచనా.
పన్ను జమ లు 26.02 లక్షల కోట్ల రూపాయలు గా ఉంటాయని అంచనా వేయడమైంది.
రాష్ట్రాల కు మూలధన వ్యయం కోసం 50 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించనక్కరలేనటువంటి రుణ పథకాన్ని ఈ
సంవత్సరం కొనసాగించడం జరుగుతుంది; దీనికి గాను మొత్తం అవుట్ లే 1.3 లక్షల కోట్ల రూపాయలు.
2024-25 లో విత్త లోటు ను జిడిపి లో 5.1 శాతం గా అంచనా వేయడమైంది.
2024-25 లో డేటెడ్ సెక్యూరిటీస్ ద్వారా స్థూ ల మార్కెట్ రుణాలు 14.13 లక్షల కోట్ల రూపాయలు గాను, నికర
మార్కెట్ రుణాలు 11.75 లక్షల కోట్ల రూపాయలు గాను అంచనా వేయడమైంది.

భాగం - బి

ప్రత్యక్ష పన్నులు

*ప్రత్యక్ష పన్నుల కోసం ప్రస్తు త పన్ను రేట్లు కొనసాగించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదన
* గత 10 సంవత్సరాల కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగింది. ఆదాయం పన్ను , రిటర్న్
దాఖలు చేసిన వారి సంఖ్య 2.4 రెట్లు పెరిగింది.
*పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచనున్న ప్రభుత్వం

- 2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న కాలానికి సంబంధించి రూ. 25000 వరకు బకాయి ఉన్న ప్రత్యక్ష
పన్ను డిమాండు రద్దు .
- 2010-11 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 10000 వరకు ఉన్న ప్రత్యక్ష పన్ను
డిమాండు రద్దు .
- కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం

*స్టా ర్ట్-అప్‌లు,
సావరిన్ వెల్త్ ఫండ్‌లు లేదా పెన్షన్ ఫండ్‌లు చేసే పెట్టు బడులు 31.03.2025 వరకు పన్ను
ప్రయోజనాలు పొడిగింపు
* ఐఎఫ్ఎస్సి
యూనిట్ల నిర్దిష్ట ఆదాయంపై పన్ను మినహాయింపు 31.03.2024 నుంచి 31.03.2025 వరకు ఒక
సంవత్సరం పాటు పొడిగింపు
పరోక్ష పన్నులు
* పరోక్ష పన్నులు, దిగుమతి సుంకాలపై ప్రస్తు త పన్ను కోసం ఒకే పన్ను రేట్లు కొనసాగింపు
*జీఎస్‌టీ వల్ల భారతదేశంలో పరోక్ష పన్ను విధానాన్ని ఏకీకృతం అయ్యింది.
-ఈ ఏడాది రెండింతలు పెరిగి రూ.1.66 లక్షల కోట్లకు చేరిన సగటు నెలవారీ స్థూ ల జీఎస్‌టీ వసూళ్లు
-రెండింతలు పెరిగిన జీఎస్‌టీ పన్ను చెల్లింపుదారులు సంఖ్య

_ జీఎస్‌టీ అమలు లోకి రాక ముందు (2012-13 నుండి 2015-16 వరకు)తో పోల్చి చూస్తే జీఎస్‌టీ అమలు
లోకి వచ్చిన తర్వాత (2017-18 నుంచి 2022-23 వరకు) 1.22 కి పెరిగిన రాష్ట్ర ఎస్జీఎస్టీ రాబడి
(రాష్ట్రాలకు విడుదల చేయబడిన పరిహారం తో సహా)

--జీఎస్‌టీ అమలుకు మొగ్గు చూపుతున్న 94% పరిశ్రమ వర్గా లు


-సరఫరా గొలుసు ను పటిష్టం చేసిన జీఎస్‌టీ

-వాణిజ్యం పరిశ్రమలపై సమ్మతి భారాన్ని తగ్గించిన జీఎస్‌టీ


-- తగ్గిన రవాణా ఖర్చు, పన్నుల వల్ల వస్తు వులు, సేవల ధరలు తగ్గి , వినియోగదారులకు ప్రయోజనం
కలిగిస్తా యి.
పన్ను హేతుబద్ధీకరణ

*2013-14ఆర్థిక సంవత్సరంలో రూ. 2.2 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉన్న ఆదాయంపై పన్ను
మినహాయింపు
* రిటైల్ వ్యాపారాలకు ముండదు పన్నుల పరిమితి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పొడిగింపు
* వృత్తి నిపుణుల ముందస్తు ప‌న్ను చెల్లిం పరిధి రూ.50 ల‌క్ష‌ల నుంచి రూ.75 ల‌క్ష‌లకు పొడిగింపు
* దేశీయ కంపెనీల కార్పొరేట్ ఆదాయపు పన్ను ప్రస్తు త 30% నుంచి 22%కి తగ్గింపు
*కొత్త తయారీ కంపెనీలకు కార్పొరేట్ ఆదాయపు పన్ను రేటు 15%
పన్ను చెల్లింపుదారుల సేవలలో సాధించిన విజయాలు
*2013-14 లో పన్ను రిటర్నుల సగటు ప్రా సెసింగ్ సమయం 93 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించబడింది

*ఎక్కువ సామర్థ్యం కోసం ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ , అప్పీల్విధానం అమలు


* అప్‌డేట్ చేయబడిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, కొత్త ఫారమ్ 26AS మరియు సరళీకృత రిటర్న్ ఫైలింగ్
కోసం ముందుగా పూరించిన పన్ను రిటర్న్‌లు
* కస్టమ్స్‌లో అమలు చేసిన సంస్కరణలు దిగుమతుల విడుదల సమయాన్ని తగ్గించాయి
- ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలలో 47% నుండి 71 గంటల వరకు తగ్గిన సమయం

-ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌ల వద్ద 28% నుండి 44 గంటలకు తగ్గిన సమయం


- సీ పోర్ట్స్ వద్ద 27% నుంచి 85 గంటల వరకు తగ్గిన సమయం

ఆర్థిక వ్యవస్థ -నాడు నేడు


* 2014లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంతోపాటు పాలనా వ్యవస్థలను చక్కదిద్దా ల్సిన బాధ్యత ఏర్పడింది.
ప్రస్తు త కల అవసరాలు
- పెట్టు బడుల ఆకర్షణ
- అవసరమైన సంస్కరణల అమలుకు సహకారం

- ప్రజలకు ఆశ కల్పించడం

‘దేశం ప్రథమం’ అనే బలమైన నమ్మకంతో ప్రభుత్వం పని చేసి విజయం సాధించింది.
*"2014 వరకు మనం ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని చూడాల్సిన అవసరం ఉంది
":ఆర్థిక మంత్రి

అన్ని అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం సభకు సమర్పిస్తుంది.

***

(Release ID: 2001537) Visitor Counter : 1252

Read this release in: Kannada , Malayalam , Assamese , English , Urdu , Hindi , Hindi , Nepali , Marathi , Bengali , Manipuri ,
Punjabi , Gujarati , Odia , Tamil

You might also like