Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 81

పాఠ్యాంశము:

వర్షం ఎక్కడినుండి వస్తుంది?


వర్షాకాలంలో సాధారణంగా వర్షాలు కురుస్తా యి. ఆకాశం మేఘావృతంగా
ఉంటే వర్షం కురవచ్చని మనం ఊహిస్తా ము.
కానీ మేఘాలున్న ప్రతిసారి వర్షం కురవదు.
కొన్నిసార్లు అకస్మాత్తు గా వర్షం కురవవచ్చు.
మేఘాలు ఎందుకు వర్షిస్తా యి?
మేఘాలకు వర్షానికి ఏమిటి సంబంధం?
అన్ని మేఘాలు వర్షాన్నిఎందుకు కురిపించవు?
నీరు – రూపాలు
నీరు ప్రకృతిలో ఏ ఏ రూపాల్లో ఉంటుంది ?
నీరు ప్రకృతిలో

ద్రవ (నీరు) ఘన(మంచు) వాయు (నీటియావిరి)

రూపాలలో ఉంటుంది.
ద్రవ (నీరు)
ఘన(మంచు) వాయు
(నీటియావిరి)
నీరు ప్రకృతిలో సహజంగా ద్రవ రూపంలో ఉంటుంది
నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు
సరస్సులలో నిల్వ ఉంటుంది.
నీటిని వేడిచేస్తే ఎమౌతుంది?
మహాసముద్రాలు, సముద్రాలు, నదులు సరస్సులలో
నీరు సూర్యరశ్మికి వేడెక్కి ఆవిరిగా మారుతుంది. ఇది
నీటి యొక్క వాయురూపం.
సముద్రతీరప్రాంతాల్లో నీటిని ఆవిరిచేసి ఉప్పును
తయారుచేస్తా రు .
నీరు గట్టిగా గడ్డకట్టినట్లు ఉంటే దాన్ని మనం మంచుగడ్డ అని
పిలుస్తా ము ఇది నీటి ఘనరూపం
నీటిని మంచుగడ్డగా మార్చగలమా? ఏమి చెయ్యాలి?
నీటిని మంచుగడ్డగా మార్చగలము దీనికై నీటిని ఎక్కువగా
చల్లబరచాలి.
మంచును ఆరుబయట ఉంచితే ఎమౌతుంది
మంచును ఆరుబయట ఉంచితే కరుగుతుంది. ఎందుకు?
అంటే మంచును వేడిచేస్తే ద్రవరూపం లోకి ఇంకా
మరిగిస్తే వాయురూపంలోకి మారుతుంది.
కనుక నీటికి ఉండే ఈ మూడు రూపాలు ఒక
దానినుండి మరొకటికి మార్చడానికి వీలుకలిగి
ఉంటాయని మనం అర్ధం చేసుకోవచ్చు.
తడి దుస్తు లను ఎండలో ఆరవేసినప్పుడు బట్టలలో
ఉన్న నీరు ఏమౌతుంది?
తడి దుస్తు లను ఎండలో ఆరవేసినప్పుడు బట్టలలో ఉన్న నీరు ఆవిరైపోతుంది
తడి దుస్తు లను త్వరగా
ఆరబెట్టా లనుకున్నప్పుడు వాటిని
రెపరెపలాడించడమో

ఫాను క్రింద వేయడమో


చేస్తుంటాము ఎందుకు?
వర్షం కురిసిన తర్వాత ఇంటి కప్పులపైన , రోడ్ల మీద ఇతర ప్రదేశాలలో నిలచిన నీరు
కొంతకాలం తర్వాత ఆవిరైపోవడం మీరు గమనించి ఉంటారు
ఇలా ఆవిరైపోయిన నీరు ఎక్కడికి పోతుంది?
ఒక గిన్నెలో నీరు తీసుకొని స్టౌపై ఉంచి వేడిచేస్తే నీటి ఉపరితలం నుండి నీటి ఆవిరి పైకి
రావడం మీరు గమనించే ఉంటారు.
వేడిచేయటం వల్ల నీరు నీటియావిరిగా మారి గాలిలో కలసిపోతుంది
తడి దుస్తు ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది
నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను “భాష్పీభవనము” అంటారు

నీటిని కొంచం వేడిచేస్తే వెచ్చబడతాయి


ఇంకా వేడిచేస్తే మరుగుతాయి, ఆవిరవుతాయి.
అంటే నీళ్ళు గ్రహించే ఉష్ణపరిమాణము భాష్పీభవనాన్ని
ప్రభావితం చేస్తుందని అర్ధం.

కనుక నీరు అధిక ఉష్ట్నాన్ని పొందితే అది త్వరగా ఆవిరి


అవుతుందని చెప్పవచ్చు.
భూమిపై భాష్పీభవనము సహజంగా జరిగే ఒక ప్రక్రియ.

నీటివనరులైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు


చెరువులు, సరస్సులు మొన్నగు ఉపరితలాలనుంచి సూర్యరశ్మి
వల్ల, వీచే గాలివల్ల నీరు నిరంతరం భాష్పీభవనం చెందుతుంధి.
మొక్కలు, వృక్షాలు వేర్ల ద్వారా భూమి నుండి నీటిలో కరిగిన
ఖనిజలవణాలను గ్రహిస్తా యి అధికంగా గ్రహించిన నీటిని పత్ర
రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదలచేస్తా యి.
దీనినే “భాష్పోత్సేకము” అంటారు
భాష్పీభవనము జరిగిన తర్వాత ఈ నీటియావిరి ఎమౌతుంది?

ఇలా గాలిలోకి భాష్పీభవనము ద్వారా చేరిన నీటియావిరి


మేఘాలుగా మారుతుంది.
మేఘం అంటే ఏమిటి?

ఇలా గాలిలోకి భాష్పీభవనము ద్వారా చేరిన నీటియావిరి


మేఘాలుగా మారుతుంది.
శీతాకాలంలో బాగా మంచు కురిసినరోజు ఉదయాన మనం
మాట్లా డుతున్నప్పుడు నోటినుంచి చిన్న మేఘాలుగా పొగలు
రావడాన్ని చూస్తూంటాము

కారణం ఏమిటి?
కారణం ఏమిటి?

శీతాకాలంలో మన నోటినుంచి వదిలే వదిలే గాలి కంటే బయట వాతావరణం లోని


గాలి చాలా చల్లగా ఉంటుంది. వదిలే గాలిలో ఉండే నీటియావిరి నోటి వెలుపలికి
రాగానే హటాత్తు గా చల్లబడి సూక్ష్మ బిందువులుగా మారుతుంది స్వల్ప ప్రదేశానికి
పరిమితమై సాంద్రీకరణ చెందిన నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా
నోటిముందు కనిపిస్తా యి.
శీతాకాలంలో ఉదయంపూట గడ్డిమీద, మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ
బిందువులు ఏర్పడిఉండటం నీవు గమనిచే ఉంటావు. అవి ఎక్కడినుండి వచ్చి
ఉంటాయి?
ఒక గ్లా స్ నందు కొంత నీరు తీసుకొని దానికి కొన్ని మంచు ముక్కలు కలపండి.
కొద్దిసేపటి తర్వాత గమనించండి . గ్లా స్ వెలుపలితలంలో చిన్న చిన్న నీటి బిందువులు
ఏర్పడటం గమనిస్తా రు

ఎందుకలా ?
గ్లా స్ లో ఉన్న నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మారి గ్లా సును కూడా చల్లబరుస్తుంది
వెలుపల గాలిలో గల నీటి ఆవిరికి గ్లా స్ ఉపరితలంకంటే ఎక్కువ వెచ్చదనం
ఉంటుంది. ఇది చల్లని గ్లా స్ ఉపరితలన్ని తాకి చల్లబడుతుంది. అప్పుడు గాలిలోని నీటి
ఆవిరి ద్రవీభవించి నీటి బిందువులుగా మారి గ్లా స్ వెలుపలితలంపై ఏర్పడుతాయి
నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే “సాంద్రీకరణం” అంటారు
వంటింట్లో మేఘాలు

ఒక పాత్రలో నీటిని నింపి స్టౌ పై నెమ్మదిగా వేడిచేయండి. కొంతసేపు


పరిశీలించి పాత్రను మూతతో మూసివేసి కొన్ని నిముషాల తరువాత మూత
తీసి లోపలితలంలో పరిశీలించండి.

లోపలితలంలో నీటి బిందువులు ఏర్పడినవి


మూతపై చల్లని నీటిని వేసి పరిశీలించండి.

లోపలితలంలో నీటి బిందువులు ఎక్కువగా ఎర్పడినవి


ఏర్పడిన మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండవు గాలివీచే దిశకు అనుకూలంగా
తరచూ కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్నిమేఘాలు
కలసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి.
ఈ మేఘాలు గాలి ప్రవాహాలవల్ల సముద్రం నుండి భూతలం పైకి వస్తా యి
మేఘాలు మరింతగా చల్లబడినపుడు అందులోని తేమ బిందువులు పెద్దవై
మేఘాలు బరువుగా మారతాయి అవి భూమి వైపుకు దిగుతాయి దీనినే
మనం వర్షం కురవడం అంటాము
బాగా చల్లగా ఉన్న సంధర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న స్పటిఖాలుగా
ఘనీభవించి మంచుకురిసినట్లు గా అనిపిస్తుంది.
మరి కొన్ని సంధర్భాలలో పెద్ద పెద్ద నీటి బిందువులు
ఘనీభవించి మంచు ముక్కలుగా కిందికి పడతాయి.
వీటినే మనం “వడగండ్లు ” అని పిలుస్తా ము
మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తా యి. నైరుతి
మూలనుండి గాలులు వీస్తా యి
కావున వీటిని నైరుతి ఋతుపవనాలని అంటారు
అలాగే నవంబర్ డిసెంబర్ నెలలలో వర్షాలు కురుస్తా యి.
ఈశాన్య మూలనుండి గాలులు వీస్తా యి
కావున వీటిని ఈశాన్య ఋతుపవనాలని అంటారు
వేసవి కాలంలో అధికావేడిమి వల్ల మహాసముద్రాలు, సముద్రాలు,
నదులు సరస్సులలో నీరు సూర్యరశ్మికి భాష్పీభవనము చెంది
నీటిఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోకి చేరి మేఘాలుగా
రూపొందుతుంది, ఈ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం
కురుస్తుంది
నీరు భాష్పీభవనము చెంది నీటిఆవిరిగా మారటం . నీటి ఆవిరి మేఘాలుగా
రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణ ద్వారా వర్షంగా కురవటం ఒక
దాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటిని కలిపి
“జలచక్రం” అంటారు
“జలచక్రం”
కీలక పదాలు

• భాష్పీభవనం
• మేఘం
• ప్రవాహాలు
• వర్షం
• సాంద్రీకరణ
• పొగమంచు
• వడగళ్ళు
• జలచక్రం
మనం ఏమి నేర్చుకున్నాం

• భూమిపై నీరు మూడు రూపాలలో లభిస్తుంది


• నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియే భాష్పీభవనము
• నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియే సాంద్రీకరణము
• నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేదే
మేఘం
• నీటి భాష్పీభవనం, సాంద్రీకరణల పరంపర వర్షానికి
కారణమవుతుంది
• నీరు నీటి ఆవిరిగా, నీటి ఆవిరి మేఘాలుగా, మేఘాలు
వర్షాలుగా రూపొందే ప్రక్రియల పరంపరయే జలచక్రం
అడవులు నరికివేయడం వల్ల,
కర్మాగారాలు వెదజల్లే కాలుష్యం వల్ల,
భూవాతావరణం వేడెక్కి మేఘాలు చల్లబడడానికి కావలసిన
పరిస్థితులు తగ్గిపోతున్నాయి.
ఇవి వర్షాలు తగ్గిపోవటానికి కారణమవుతున్నాయి.
జలచక్రంలో అంతరాయం వరదలకు
కరువులకు దారితీస్తుంది
ఆమ్ల వర్షం

పరిశ్రమలు, వాహనాల నుంచి


సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లతో
మేఘాలు కలుషితమైనప్పుడు
ఆమ్లవర్షాలు కురుస్తా యి .
ఆమ్ల వర్షం
ఈజిప్టు దేశస్థు లు ఎండనుంచి
కాపాడుకోడానికి గొడుగును
రూపొందించారు
సతత హరితారణ్యములోని జీవరాశులు
ప్రాణం తీసే ప్లా స్టిక్ సంచులు

మనం ప్రతీదానికి ప్లా స్టిక్ సంచులు,


కవర్లు ఉపయోగిస్తు న్నాము. విందు
భోజనాలలో వాడి పారవేసే ప్లా స్టిక్
గ్లా సులు ప్లేట్లు విపరీతంగా
వినియోగిస్తు న్నాము. ఇలా రోజు
మనము వాడి పారేసే పాలిథిన్
సంచులు భూమిలో కలసిపోవు.
నేల మీద పొరలు పొరలుగా పెరుకునిపోయి వర్షపు నీరు
భూమిలోనికి ఇంక కుండా నిరోధిస్తా యి .
ఫలితంగా భూగర్భ జలాలు తరిగిపోతున్నాయి.
కరువులకు కారణమవుతున్నాయి.
మరొక వైపు నాలాలకు కాలువలకు అడ్డు పడి వర్షపు
నీటిని ప్రవహించనీయక వరదలకు కారణమవుతున్నాయి
.

You might also like