Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 43

గ్రామ పంచాయతీలు – ఎన్నికల నిర్వహణ

జి. రాజ్యలక్ష్మి, వి. అరుణ, కె. లలిత


ఫాకల్టీ మెంబర్స్
విస్తరణ శిక్షణా కేంద్రం,
గ్రామ పంచాయతీలు – ఎన్నికల నిర్వహణ
• ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం, 1994 – భాగం – V
• రాష్ట్ర ఎన్నికల కమీషన్ - సెక్షన్స్- 200 నుండి 234 వరకు
• గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ - సెక్షన్స్ – 7 నుండి
20 వరకు
• Sec 200(2): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ - రాష్ట్ర గవర్నర్ చే
నియామకం – హై కోర్ట్ జడ్జి హోదా & జీతభత్యములు – హై
కోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలో తొలగింపు
గ్రామ పంచాయతీ ఎన్నికలు – వివిధ
• దశలు
ఎన్నికల ముందు ప్రక్రియ – ఓటర్ల జాబితా తయారీ &
ప్రచురణ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, వార్డు విభజన, రిజర్వేషన్ల
ఖరారు, ఎన్నిక సామాగ్రి సమకూర్చుకోవటం.
• ఎన్నికల సమయంలో – నోటిఫికేషన్ విడుదల, జిల్లా ఎన్నికల
యంత్రాగం నియామకం, స్టేజి -1 రిటర్నింగ్ అధికారి
నియామకం, ప్రతి గ్రామ పంచాయతీకి స్టేజ్ – 2 రిటర్నింగ్
అధికారి నియామకం
గ్రామ పంచాయతీ ఎన్నికలు – వివిధ
• దశలు
ఎన్నికల అనంతర ప్రక్రియ – ప్రత్యేక సమావేశం నోటీసు, ఉప
సర్పంచ్ ఎన్నిక, ఎన్నిక ధృవపత్రం, ప్రమాణ స్వీకారం, గ్రామ
పంచాయతీ మినిట్స్ పుస్తకంలో నమోదు.
• ఎన్నికల సామాగ్రిని MDPO ఉత్తర్వుల ప్రకారం ట్రెజరీ నందు జమ
• సర్పంచ్ & వార్డు సభ్యుల ఎన్నికల వ్యయం దాఖలు
• పంచాయతీ కార్యదర్శి – ఈ మూడు దశలలో ఫెసిలిటేటర్ గా
వ్యవహరిస్తూ, ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు కృషి చేయాలి.
ఎన్నికల యంత్రాగం
• రాష్ట్ర ఎన్నికల కమీషన్...
• కమీషనర్, పంచాయతీ రాజ్ వారిని ఎన్నికల అధికారిగా

• జిల్లా కలెక్టరును జిల్లా ఎన్నికల అధికారిగా

• జిల్లా జాయింట్ కలెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిషత్ మరియు జిల్లా


పంచాయతీ అధికారులను అదనపు జిల్లా ఎన్నికల అధికారులుగా
• రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా సబ్-కలెక్టరును జిల్లా ఉప ఎన్నికల అధికారిగా
నియమిస్తా రు.

• గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ప్రతి ఎన్నికకు ఒకటి లేదా
అంత కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఒక రిటర్నింగ్ అధికారిని
నియమిస్తా రు.

• అవసరమైతే జిల్లా ఎన్నికల అధికారి జోనల్ అధికారులను కూడా నియమిస్తా రు.


గ్రామ పంచాయతీ ఓటర్ల
జాబితా తయారీ –ప్రచురణ
గ్రామపంచాయతి ఓటర్ల జాబితాల తయారీ
• సెక్షన్ -11: అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామపంచాయతీలో ఓటర్ల
జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ అధికారమిచ్చిన అధికారి నిర్దేశించిన తేదిన
తయారుచేయాలి.

• గ్రామపంచాయతి ఓటర్ల జాబితా ప్రజా ప్రాతినిధ్యపు చట్టం 1950 - సెక్షన్ 22 లేదా


సందర్భానుసారంగా సెక్షన్ 23 - గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో మార్పులు,
చేర్పులు చేయుటకు అసెంబ్లీ ఓటర్ల జాబితాకు నిర్దేశించిన విధానాన్నే పాటించాలి.
అదనంగా వచ్చిన పేర్లు చివరి వార్డు లో చేర్చవలెను.
• సె 11(2)గ్రామ పంచాయతీ యొక్క ఓటర్ల జాబితా
• అర్హతగల తేదీని అనుసరించి తగిన విధంగా
• ప్రతి మామూలు ఎన్నికకు ముందు
• గ్రామ పంచాయితీ సర్పంచ్ /వార్డు మెంబర్లు ఆకస్మిక ఖాళీలు భర్తీ చేయుటకైన ప్రతి ఆకస్మిక
ఎన్నికల ముందు తయారు చేయబడి ప్రచురించబడవలెను.
కొనసాగింపు...
• గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను సంబంధిత వార్డు లలో
నివసించుచున్న ఓటర్లు ఉండునట్లు గా, ఎన్ని వార్డు లు కలవో,
అన్ని భాగములుగా విభజించవలెను.

• అవసరమని తోచినచో ఓటర్లు జాబితాను తిరిగి ఏర్పాటు


చేయవలెను.

• ఒక వార్డు కు సంబంధించిన ఓటర్ల జాబితాలో పేరు ఉన్నట్టి ప్రతి


వ్యక్తి ఈచట్టపు నిబంధనలకు లోబడి, ఆ ఓటర్ల జాబితా
అమలులో వుండగా, ఆ వార్డు లో జరుగు ఏదేని ఎన్నికలలో
ఓటు వేయు హక్కు కలిగిఉంటాడు
కొనసాగింపు...
“ఓటర్ల జాబితా” అని పేర్కొనబడు గ్రామపంచాయతీ
ఎన్నికల జాబితా ఆ గ్రామమునకు సంబంధించిన
ప్రజాప్రాతినిధ్య చట్టము, 1950 క్రింద తయారు చేయబడి,
ప్రచురించబడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గము
యొక్క ప్రస్తు త ఎన్నికల జాబితాలో భాగమైయుండును.

జిల్లా పంచాయితీ అధికారి సదరు శాసనసభ నియోజక


వర్గములయందు జారీచేయబడిన సవరణలను పరిగణలోనికి
తీసుకోని ఎన్నిక నోటిఫికేషన్ తేదివరకు సవరించబడినట్లు గా
తయారు చేయవలెను.
కొనసాగింపు...
• శాసన సభ నియోజకవర్గం కొరకు తయారైన ఒక పోలింగ్ స్టేషన్
వోటర్ల జాబితాను సంబంధిత గ్రామపంచాయతీ లేక అందులో
కొంత భాగమును చెందినంత వరకు వోటర్ల జాబితాగా మార్పు
చేయుట జరుగును .
ఉదా:1. శాసన సభ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ (A)- మొత్తం
అనగా సంబంధిత పోలింగ్ స్టేషన్ మొత్తం వోటర్లు ఒక గ్రామ
పంచాయతీ వోటర్లు గా ఉండవచ్చ లేక 2 గ్రామపంచాయతీలకు
సంబంధించిన వోటర్లు అయి ఉండవచ్చు.
• వ.నం. 1 నుండి 684 వోటర్లు కలిగివున్నచోట, సదరు వోటర్లు “అ” అను
గ్రామపంచాతీలో 1 నుండి 234 వరకు క్షేత్ర స్థా యిలో ఉండవచ్చును.
• వ.నం. 235 నుండి 684 వరకు “ఆ” అను వేరొక గ్రామపంచాయతీ వోటర్లు
అయి ఉండవచ్చును
కొనసాగింపు...
• ఉదా: శాసన సభ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ “B” మరియు
“C” గా 2 అయివున్నప్పటికి ఆ రెండు పోలింగ్ స్టేషన్ల
జాబితాలు ఒకే గ్రామపంచాయతీ వోటర్లు గా క్షేత్రస్థా యిలో
ఉండవచ్చును. కావున ఒక గ్రామపంచాయతీ మాత్రమే జాబితా
తయారుచేయవలసి వున్నది

• అదే విధముగా గ్రామములో వోటర్ల జాబితా తయారుచేయు


నప్పుడు ఏ వార్డు లో వోటర్లు ఆ వార్డు లో నమోదు
అగుచున్నారా లేదా అని గమనించవలెను
కొనసాగింపు...
• ఒక గ్రామ పంచాయతీలో అనగా “ఇ”నందు శివారు గ్రామాలు
4 కలవు. అవి A,B,C,D
A. శివారు గ్రామం నందు డోర్.నం.1-1 నుండి 1-300
B. శివారు గ్రామం నందు డోర్.నం.2-1 నుండి 2 -250
C. శివారు గ్రామం నందు డోర్.నం.3 -1 నుండి 3 -170
D. శివారు గ్రామం నందు డోర్.నం.4 -1 నుండి 4 -220

డోర్.నం పై విధంగా శివారు గ్రామంలో ఉన్నచో అసెంబ్లీ


నియోజకవర్గం గ్రామపంచాయతీ వోటరు జాబితాగా మార్పు
చేయునప్పుడు ఏ విధమైన సమస్య ఉండదు
కొనసాగింపు...
వేరొక విధంగా
A. శివారు గ్రామం నందు డోర్.నం.1-1 నుండి 1-120
B. శివారు గ్రామం నందు డోర్.నం.2-1 నుండి 2 -230
C. శివారు గ్రామం నందు డోర్.నం.1 -1 నుండి 1 -186
D. శివారు గ్రామం నందు డోర్.నం.3 -1 నుండి 3 -220
• పై విధంగా డోర్.నం శివారు గ్రామాలలో ఒకే విధంగా ఉన్నచో
గ్రామపంచాయతీ వోటర్ల జాబితా తయారు సమస్య అగును
ఎలా అంటే.... A శివారు మరియు C శివారు
• డోర్.నం ఒకే విధము గా ఉన్నందున 2 శివారు గ్రామాలు
వోటర్లు మిశ్రమం కాబడి తప్పుగా ఏ వార్డ్ నందు ఓటర్ ఆ
వార్డ్ ఓటర్ కాకుండా వేరొక వార్డ్ నందు నమోదు
కాబడుతారు.
Sec -10 వార్డు
• ఒక
విభజన
గ్రామంలో సర్పంచ్ తో పాటు 9 స్థా నములు వుండి, 915 మంది వోటర్లు వున్న
యెడల దానిని ఈక్రింద విధంగా 8 వార్డు లుగా విభజించాలి
మొదటి 114 ఓటర్లు 1 నుండి 114 (1 వ వార్డు )

రెండవ 114 ఓటర్లు 115 నుండి 228 (2 వ వార్డు )

మూడవ 114 ఓటర్లు 229 నుండి 342 (3 వ వార్డు )

నాలుగవ 114 ఓటర్లు 343 నుండి 456 (4 వ వార్డు )

అయిదవ 114 ఓటర్లు 457 నుండి 570 (5 వ వార్డు )

ఆరవ 114 ఓటర్లు 571 నుండి 684 (6 వ వార్డు )

ఏడవ 114 ఓటర్లు 685 నుండి 798 (7 వ వార్డు )

ఎనిమిదవ 117 ఓటర్లు 799 నుండి 915 (8 వ వార్డు )

• 8 వార్డు లకు సమానంగా పంచి, అదనపు 3 ఓటర్లను 8వ వార్డు లో చేర్చడం జరిగినది.


వోటర్ల జాబితా ప్రచురణ
1. జిల్లా పంచాయతీ అధికారి యొక్క కార్యాలయం నోటీసు
బోర్డ్ నందు

2. గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డ్ నందు

3. సంబంధిత గ్రామంలోని 3 ముఖ్య ప్రదేశాల యందు


Sec12 - ఓటర్ల జాబితాలను తిరిగి ఏర్పాటు
చేసి మరియు తిరిగి ప్రచురించుట
సెక్షన్ 11(1) క్రింద గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రచురించిన పిమ్మట
గ్రామమును మొట్టమొదటసారిగా వార్డు లుగా విభజించినా, లేక
గ్రామములోని వార్డు ల విభజనను మార్చినా, లేక గ్రామ హద్దు లను
మార్చినా ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనరు అధికారము ఇచ్చిన
వ్యక్తీ, సందర్భానుసారముగా, వార్డు లుగా గ్రామ విభజనను లేక వార్డు ల
మార్పులను లేక హద్దు ల మార్పును అమలు పరుచుటకుగాను గ్రామ
పంచాయితీ ఓటర్ల జాబితాను లేక అట్టి జాబితాలోని ఏదేని భాగమును
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించు రీతిగా తిరిగి ఏర్పాటు చేయుటకు
మరియు తిరిగి ప్రచురించుటకు అధికారమీయవచ్చును
ఎన్నికలు – పోలింగ్ స్టేషన్లు
• ఒక వార్డు కు ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించాలి.

• పోలింగ్ స్టేషన్లోని ఓటర్ల సంఖ్య 600 దాటితే రెండు, 1300 దాటితే మూడు
పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి

• ఓటర్ల సఖ్యా 650 ఉంటే ఒకే పోలింగ్ స్టేషన్ సరిపోతుంది.

• శివారు ప్రాంతాలు లేని గ్రామపంచాయతీలో పోలింగ్ స్టేషన్లు అన్నీ ఒకే


బిల్డింగ్ లో ఏర్పాటు చేయాలి.

• శివారు ప్రాంతాలు ఉంటే అక్కడే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.


కొనసాగింపు...
• సాధ్యం అయినంత వరకు గతంలో ఎన్నికలు జరిగిన కేంద్రాలనే పోలింగ్
స్టేషన్లు గా గుర్తించాలి.

• ప్రజలకు అందుబాటులో ఉండేలా కేవలం 2 కి.మీ దూరంలోనే పోలింగ్


కేంద్రాలను వర్తించాలి.

• ఈ నిబంధన కొండ ప్రాంతాలకు/ గిరిజన ప్రాంతాలకు వర్తించదు.

• సాధ్యం అయినంతవరకు పాఠశాలలు, ప్రభుత్వ భవనాలలోనే పోలింగ్


స్టేషన్లను ఏర్పాటు చేయాలి.
రిజర్వేషన్ల కేటాయింపు
• జి.ఓ.ఎం.ఎస్.నెం. 559, తేదీ: 02.03.2020 మరియు జి.ఓ.ఎం.ఎస్.నెం.
560, తేదీ: 02.03.2020

• సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పదవులను ఆయా వర్గాల నిర్ణీత నిష్పత్తు ల


ఆధారంగా కేటాయించుట (మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదు)

• మొత్తం సీట్లలో మహిళలకు 50% సీట్ల కేటాయింపు

• సెక్షన్ – 15: గ్రామాలుగా ఏర్పాటు చేయబడిన 100% అనుసూచిత జన


జాతుల జనాభాతో ఉన్న గిరిజన నివాస ప్రాంతాలు/ గిరిజన తండాల
విషయంలో, అట్టి గ్రామాలలోని అన్ని సర్పంచ్ పదవులు అనుసూచిత
జనజాతులకు మాత్రమే రిజర్వు చేయవలెను.
రిజర్వేషన్ల కేటాయింపు - నమూనా
గ్రామ పంచాయతీల నిర్వహణ షెడ్యూలు ఎన్నిక
(ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రం నెం. 2, తేదీ: 20.02.2020 ప్రకారం)

• రాష్ట్ర ఎన్నికల కమీషన్ చే ఎన్నికల నోటిఫికేషన్ జారీ: 1వ రోజు

• రిటర్నింగ్ అధికారిచే ఎన్నికల నోటీసు జారీ: 3వ రోజు, సాయంత్రం


5 గంటల వరకు (సెలవు రోజు అయినా, కాకపోయినా)

• నామినేషన్ల స్వీకరణకు ఆఖరి రోజు: 5వ రోజు, సాయంత్రం 5


గంటల వరకు (సెలవు రోజు అయినా, కాకపోయినా)
కొనసాగింపు...
• నామినేషన్ల పరిశీలన: 6వ రోజు, సాయంత్రం 5 గంటల వరకు (సెలవు
రోజు అయినా, కాకపోయినా)

• నామినేషన్ల తిరస్కరణపై రెవెన్యూ డివిజనల్ అధికారి/ జిల్లా


కలెక్టరుకు అప్పీలు: 7వ రోజు, సాయంత్రం 5 గంటల వరకు (సెలవు
రోజు అయినా, కాకపోయినా)

• అభ్యర్ధిత్వముల ఉపసంహరణకు ఆఖరు తేదీ: 8వ రోజు, సాయంత్రం


5 గంటల వరకు (సెలవు రోజు అయినా, కాకపోయినా)
కొనసాగింపు...
• పోటీ చేయుచున్న అభ్యర్ధు ల తుది జాబితా ప్రచురణ: 8వ రోజు,
సాయంత్రం 5 గంటల వరకు (సెలవు రోజు అయినా, కాకపోయినా)

• అవసరమైన చోట ఎన్నిక నిర్వహణ: 13వ రోజు, (సెలవు రోజు


అయినా, కాకపోయినా)

• ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన: 13వ రోజు, (సెలవు రోజు


అయినా, కాకపోయినా)
ఎన్నికల ప్రక్రియ -స్టేజ్-I
ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్న 3 నుంచి 5 పంచాయతీలకు జిల్లా ఎన్నికల అధారిటీ
ఒక రిటర్నింగ్ అధికారి-1 ను నియమిస్తా రు.
• ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం.
• నామినేషన్ పత్రాలను స్వీకరించడం మరియు పరిశీలించడం.
• సక్రమంగా నామినేట్ చేయబడిన అభ్యర్ధు ల జాబితా ప్రకటించడం.
• ఉపసంహరణకు సంబంధించిన అప్లికేషన్స్ స్వీకరించి తగు చర్యలు తీసుకోవడం.
• ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్ధు ల జాబితాను
తయారుచేసి, వారికీ ఎన్నికల సంఘం ఇచ్చిన సింబల్స్ లిస్ట్ లో నుంచి సింబల్స్
కేటాయించి ప్రచురించడం.
• పోటీలో ఉన్న అభ్యర్ధు లు కట్టిన డిపాజిట్ లను గ్రామ పంచాయతీ సాధారణ
పద్దు కు జమచేయడం.
గ్రామ పంచాయతీ సర్పంచ్ & సభ్యుల
అర్హతలు – అనర్హతలు
ఎన్నికలలో పోటి చేయుటకు అర్హత
• గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు అయి
ఉండవలెను

• 21 సం. వయస్సు నిండి ఉండాలి (సెక్షన్ 17)


ఎన్నికలలో పోటి చేయుటకు అనర్హత
సెక్షన్ :18 ప్రకారం అనర్హులు :

• కేంద్ర, రాష్ట్ర,ప్రభుత్వ ఉద్యోగులు అయిఉండరాదు

• కేంద్ర, రాష్ట్ర,ప్రభుత్వ పదవిని నిర్వహిస్తూ పదవి నుండి డిస్మిస్


చేయబడిన వ్యక్తి అనర్హుడు.

• రాష్ట్ర శాసనమండలికి ఎన్నుకోబడటానికి అనర్హుడైన వక్తి.

• ఎన్నికల నేరాలకు శిక్షించబడిన వ్యక్తి.


ఎన్నికలలో పోటి చేయుటకు అనర్హత
సెక్షన్ 19 ప్రకారం అనర్హులు:

• పౌర హక్కుల చట్టం క్రింద శిక్షించబడిన వ్యక్తు లు.

• ఇతర నేరాలకు 2 సం. తగ్గని శిక్ష విధించబడిన వ్యక్తు లు.

• న్యాయ స్థా నంచే అస్వస్థ మనస్కులని ప్రకటించిన వ్యక్తు లు.

• చెవిటి, మూగవారు, దివాళాకోరులు, దివాళా తీసినట్లు


నిర్ధా రించమని న్యాయస్థా నానికి దరాఖాస్తు పెట్టు కున్న వ్యక్తు లు.

• పంచాయతీ కాంట్రాక్టర్లు
ఎన్నికలలో పోటి చేయుటకు అనర్హత
సెక్షన్ 19-ఎ అనర్హులు:

• దోష స్థా పన చేయబడిన అట్టి వ్యక్తి ఇప్పటికే ఎన్నికైన సందర్భంలో


అతను/ ఆమె పదవి నుండి విరమించవలెను.

(ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రం నెం. 2, తేదీ: 20.02.2020 ప్రకారం)


ఎన్నికలలో పోటి చేయుటకు అనర్హత
సెక్షన్ 19(1)(ఎ) ప్రకారం అనర్హులు:

• సివిల్ హక్కుల రక్షణ చట్టం,1955 క్రింద అపరాధం చేసిన వారు

సెక్షన్ 19(1)(బి) ప్రకారం అనర్హులు:

• పంచాయతీరాజ్ చట్టం యొక్క 5 వ విభాగం లోని 2 వ


అధ్యాయం క్రింద శిక్షించదగిన నేరాలకు పాల్పడిన వ్యక్తు లు,
ఎన్నికలలో పోటి చేయుటకు అట్టి నేరం నిరూపణ తేది నుండి 5
సం. కాలావధి వరకు అనర్హులు.
ఎన్నికలలో పోటి చేయుటకు అనర్హత
సెక్షన్ 19(బి) ప్రకారం అనర్హులు:

• ఎన్నికల ఖర్చులను సకాలంలో సమర్పించనిచో, ఉత్తర్వు తేది నుండి


3 సం. కాలవ్యవధి వరకు అనర్హుడు

సెక్షన్ 19(2) ప్రకారం అనర్హులు:

• పంచాయతీకి చెల్లించవలసిన బకాయిలు నోటీసు అందిన నిర్ణీత


గడువులోగా చెల్లించకపోవటం

సెక్షన్ 19(3) ప్రకారం అనర్హులు:

• ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం కలిగివున్నప్పుడు (30-05-1995)


సెక్షన్ 19(3) – అనర్హత – వేర్వేరు కేసుల్లో కోర్టు తీర్పులు
అవినీతి చేష్టలకు శిక్ష
• సెక్షన్- 212: సెక్షన్ 211లో తెల్పినట్లు గా లేదా ఎన్నికకు సంబంధించి
ఏవేనీ అవినీతి చేష్టలకు దోషిగా ఎవరేని వ్యక్తి నిర్ణయించబడినచో
అతను/ ఆమె 3 సంవత్సరముల వరకు పొడిగించదగిన జైలు శిక్ష
మరియు 10 వేల రూపాయల వరకు పొడిగించదగిన జరిమానాతో
శిక్షింపబడవలెను.
ఉపసర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం
• సెక్షన్ 245 మరియు జి.ఓ.నెం.200 తేది:28-04-1998

• 4 సం. వరకు అవిశ్వాసం తీర్మానం పెట్టరాదు

• అవిశ్వాస తీర్మాన నోటీసు RDO గారికి ఇవ్వాలి.

• సగానికి తగ్గకుండా సంతకం చేసిన వార్డు మెంబర్లలో ఇద్దరు వ్యక్తిగతంగా


RDO కి ఇవ్వాలి. 30 రోజులలో సమావేశం ఏర్పాటు -15 రోజుల ముందు
సమావేశ నోటీసు ఇవ్వాలి.

• 2/3 సభ్యులు ఆమోదిస్తే తీర్మానం ఆమోదించబడుతుంది - చేత్తు లెత్తే


విధానంలో ఆమోదం

• తీర్మానం ఆమోదాన్ని కలెక్టర్ కి తెలియజేయాలి.


రాజీనామాలు
సర్పంచ్:

• సర్పంచ్ రాజీనామా గ్రా.పం./డి.పి.ఓ. కి ఇవ్వాలి.

• గ్రా.పం.లో అయితే సమావేశంలో ఆమోదం పొందిన తేది నుండి


అమలులోకి వస్తుంది.

• డి.పి.ఓ. కి నేరుగా ఇస్తే ఆరోజు నుండి అమలులోకి వస్తుంది

• వార్డు మెంబర్ :

• మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఇవ్వాలి.


గ్రామ పంచాయతీని సస్పెండ్ చేయుట/
సెక్షన్ 250 రద్దు చేయుట
• ఒక గ్రామపంచాయతీ తన విధి నిర్వహణలో పరిపాలన సామర్థ్యం
కోల్పోయినట్లు ప్రభుత్వం భావించినా
• అధికారాలను సక్రమంగా వినియోగించలేకపోయినా

• చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను మించి వ్యవహరించినా

• అధికార దుర్వినియోగానికి పాల్పడినా

• రద్దు కాబడిన కాలంలో అధికారాలను ప్రత్యేకాధికారికి దఖలు చేయబడును

• రద్దు కాబడిన పంచాయతీ పదవీకాలము ఆరు నెలల కంటే తక్కువగా వుంటే


తాత్కాలిక ఎన్నికలు నిర్వహించరాదు.
ఎన్నికల ప్రక్రియ -స్టేజ్ - 2
ఒక గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున రిటర్నింగ్ అధికారి-2 లను జిల్లా ఎన్నికల
అధారిటీ నియమిస్తా రు.
ఎన్నికల ఏజెంట్,పోలింగ్ ఏజెంట్ మరియు కౌంటింగ్ ఏజెంటుకు సంబంధించిన
అప్లికేషన్స్ తీసుకొని వారిని నియమించడం.
పోస్టల్ బ్యాలెట్ జారీ చేయడం.
ఎన్నికల సిబ్బంది నియామకం, వారికి శిక్షణ ఇవ్వడం
గ్రామపంచాయతీకి సంబంధించి ఎన్నికల నిర్వహణకు కావలసిన మెటీరియల్ ను
తనకు కేటాయించిన ఎన్నికల సిబ్బందితో కలిసి తీసుకోవడం.
ఎన్నికల తేదీన ఎన్నికల నిర్వహించడం,ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం.
• పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించడం.
ఓట్ల లెక్కింపు
• ఎన్నిక జరిగిన రోజుననే మధ్యాహ్నం గం.2.00లకు ప్రారంభం
అవుతుంది.
• పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ సిబ్బందిగా వ్యవహరిస్తా రు.

• ఓట్ల లెక్కింపు సమయంలో హాజరు కాదగిన వ్యక్తు లు

• పోస్టల్ బ్యాలెట్లను మొదటగా లెక్కించాలి

• తదుపరి బ్యాలెట్ బాక్సులలోని ఓట్లను లెక్కించాలి.

• సర్పంచ్ బ్యాలెట్ – గులాబీ రంగు, వార్డు మెంబరు బ్యాలెట్ – తెలుపు


రంగు


కొనసాగింపు...
• ఓట్లను నిరాకరించుటకు కారణాలు
• ఓట్లను తిరిగి లెక్కించుట

• ఓట్లు సరి సమానంగా వచ్చినపుడు లాటరీ వేయుట

• ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధు లకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం.

• ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం

• ఉప సర్పంచ్ ఎన్నికకు ఏర్పాట్లు


ఉప సర్పంచ్ ఎన్నిక
• ఎన్నిక జరిగిన రోజుననే ఉప సర్పంచ్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం
నిర్వహించుట

• ప్రదేశం: గ్రామ పంచాయతీ కార్యాలయం

• గ్రామ పంచాయతీ కార్యాలయపు నోటీసు బోర్డు కు నోటీసును


అంటించుట

• కోరం: ఎన్నికైన సభ్యులలో ½ (సగం) కంటే తక్కువ ఉండరాదు.

• ప్రత్యేక సమావేశమునకు రిటర్నింగ్ అధికారి – 2 అధ్యక్షత


వహించాలి.
కొనసాగింపు...
ఉపసర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తికీ ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం, ప్రత్యేక సమావేశ
మినిట్స్ ను ధృవీకరించడం.
ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధు లు గ్రామ పంచాయతీకి కట్టిన ఎన్నికల
డిపాజిట్ ను గ్రామ పంచాయతీకి జమ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం.
• ఎన్నికలకు సంబంధించిన మొత్తం స్టా ట్యూటరీ, నాన్ - స్టా ట్యూటరీ, ఇతర
మెటీరియల్ ను సంబంధిత యం.పి.డి.ఓకు అప్పగించడం.
ఈ అంశం విషయమై సందేహాలకు దిగువ తెల్పిన ఫ్యాకల్టీని సంప్రదించగలరు

• జి. రాజ్యలక్ష్మి, 7901004523, (కర్నూలు, చిత్తూరు, అనంతపురము,

కడప జిల్లా లు)

• వి. అరుణ, 8309819702, (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,

తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా లు)

• కె. లలిత, 9494235394, (కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా లు)


ధన్యవాదాలు

You might also like