Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 19

KY

C
KNOW YOUR CHILD (K.Y.C)

నీ పిల్లలను గూర్చి తెలుసుకో

సుధీర్‌కుమార్‌
పిల్లల సేవకుడు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అనుభవపూర్వకంగా ఎరిగి యుండాలి.

రక్షకుని కలిగియున్న నీవు ఆత్మీయంగా ఎదుగుతూవుండాలి.

బైబిల్‌ధ్యానించే విధానం తెలిసి ,దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తూవుండాలి

చిన్న పిల్లవాని యొక్క మానసిక, శారీరక, ఆత్మీయ లక్షణాలు తెలిసి


ఉండాలి.
ఎదుగుదల - దానికి సంబంధించిన సూత్రాలు :

ఈ సూత్రాలను ఎవరు రూపొందించారు?


యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని
లూకా 2:52 దయయందును, మనుష్యుల దయయందును
వర్ధిల్లు చుండెను.

జ్ఞానం
వయస్సు
దేవుడు
మనుష్యులు దయయందు వర్ధిల్లెను
ఒక క్రమము
1. వయస్సు నందు - శారీరకముగా ఎదుగుచున్నాడు

2 . జ్ఞానమునందు - మానసికముగా ఎదుగుచున్నాడు


3. మనుష్యుల దయయందు - సామాజికముగా ఎదుగుచున్నాడు

4. దేవుని దయయందు - ఆత్మీయముగా ఎదుగుచున్నాడు.

సూత్రాలను రూపొందించిన దేవుడే మానవునిగా వీటిని పాటించి మనకు మాదిరి


చూపించారు. మానవులమైన మనం ఈ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి.
వయస్సు ఆధారంగా పిల్లల విభజన :

3-5 సం॥లు - బిగినర్స్


6-8 సం॥లు - ప్రైమరీ
9-11 సం॥లు- జూనియర్స్
12-14 సం॥లు - ఇంటర్మీడియట్‌
15-17 సం॥లు - సీనియర్స్
18 సం॥లు పైన - యంగ్‌అండ్‌అడల్ట్స్
బిగినర్‌ పిల్లల గుణలక్షణాలు
ఎక్కువ సమయం స్థిరంగా ఉండలేరు
ఎప్పుడూ వారిని గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు

చీకటి, ఒంటరితనం, కుక్కలు మరియు అపరిచిత వ్యక్తు లంటే


భయం కలిగి ఉంటారు.
ప్రేమ, ఆదరణ, భద్రతను కోరుకుంటారు.

చూడటం ద్వారా ఎక్కువ నేర్చుకోవడానికి, జ్ఞాపక ముంచుకోవడానికి


ప్రయత్నిస్తా రు.
బిగినర్‌

పెద్ద పెద్ద పదాలకు అర్థా లు వీరికి తెలియవు. గూఢార్థములు గ్రహించలేరు.

అనుకరణ ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటా రు. అనుకరణ వీరికి ఇష్టము.

చుట్టూ ఉన్న విషయాలను ఆలోచిస్తూ, వాటిని గూర్చి ప్రశ్నలు అడుగుతారు.

వీరు ఒక విషయంపై 5 - 7 నిమిషాలు మాత్రమే ఏకాగ్రతను నిలపగలరు.

పెద్దలు చెప్పిన విషయాలను త్వరగా వారి మనస్సులో ముద్రించుకుంటారు.


ప్రైమరీ పిల్లల గుణలక్షణాలు
చాలా చురుకుగా ఉంటారు.

భాషాపరిజ్ఞానం, బాహ్య ప్రపంచ పరిజ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుదల


ఆరంభమౌతుంది.

భయాలు పోయి, తన సామర్ధ్యంపై నమ్మకత్వమును కలిగియుంటారు.

టీచర్‌కు సహాయం చేయుటకు ఉత్సాహం చూపుతారు.

ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే, నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగి యుంటారు.


ప్రైమరీ
చదువుటకు, వ్రాయుటకు ఇష్టపడుదురు. ప్రోత్సాహకరమైన వాటియందు
పాల్గొనుట ద్వారా ఎంతో నేర్చుకొనగలరు.

కంఠత చేయగలిగిన సామర్ధ్యం కలిగియుంటారు.

అందరికంటే ముందు ఉండుటకు ఇష్టపడుదురు. ప్రేమను, మెప్పును


కోరుకుంటారు.

దేవుని సన్నిధికి వెళ్లు టకు ఇష్టం కలిగి యుంటారు. వాక్యము చదువుట, ప్రార్థించుట
యందు ఆసక్తి చూపుతారు.

ఆటలయందు ఇష్టము కలిగి సంతోషంతో గంతులు వేయటం వీరి లక్షణం.


ప్రైమరీ

దేవుని యందు విశ్వాసము కలిగియుంటారు.

రక్షణను గూర్చిన వర్తమానము అంగీకరించటానికి సిద్ధంగా ఉంటారు.

అధికమైన ఊహాశక్తిని కలిగియుండి అద్భుతములు, ఆశ్చర్యములతో కూడిన


ప్రోత్సాహకరమైన ఆసక్తి కలిగించే కథలు వినుటకు ఇష్టపడతారు.

వీరు గమనం నిలుపు కాలం 10 - 15 నిమిషాలు మాత్రమే.


జూనియర్‌ పిల్లల గుణలక్షణాలు

పెద్దల యొక్క అధికారము క్రింద ఉండక, స్వతం త్రంగా ఉండటానికి ఇష్టపడతారు.


ఇందు వలన సంబంధములలో భేదములు ఏర్పడవచ్చును.

ఎక్కువశక్తి, ఉత్సాహమును కలిగి యుంటారు.

తల్లిదండ్రు లతో కంటే తన స్నేహితులతో కలిసి ఉండ టానికి ఇష్టపడతారు.

వస్త్రధారణ, భాష, కేశాలంకరణ, ఇతర అభిరుచులయందు తన తోటివారిని


పోలియుండుటకు ఆశిస్తా రు.
జూనియర్‌

సున్నితమైన మనస్సును కలిగి, భావోద్రేకాలకు తరచుగా లోనవుతారు.


ఇతరులు తమ యెడల ప్రవర్తించు విధానమునకు త్వరగా స్పందిస్తా రు.

విన్న ప్రతిదానిని తేలికగా నమ్మక ప్రశ్నలు అడుగుతూ సత్యమును


తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగియుంటారు.

వేషధారణకాక పరిపూర్ణమైన, ఆదర్శప్రాయమైన జీవితమును


కలిగియుండాలని కోరుకుంటారు. సాహసాలను ఇష్టపడతారు.
జూనియర్‌

వాక్యాలను బాగా గుర్తుంచుకోగలరు. పోటీలను ఇష్టపడతారు. వాగ్దా నాలను


విశ్వసిస్తా రు.

ఈ దశలో వేటిని అలవర్చుకుంటారో అవి స్థిర ముగా వారి అలవాట్లు గా మారతాయి.

పుస్తకాలు చదవటం, వస్తు వులు సేకరించటం, ఆటలాడటానికి ఇష్టపడతారు.

రక్షణను అంగీకరించుటకు సిద్ధంగా ఉంటారు.


ఇంటర్మీడియట్‌
పిల్లల గుణలక్షణాలు

ఈ వయస్సులో పిల్లలలో శారీరకంగా, మానసికంగా, నైతికంగా, సాంఘికంగా మార్పు


వస్తుంది. ఇటు పెద్దవాడుకాక, చిన్నవాడుకాక ఒంటరితనమును అనుభవిస్తా డు.

ఒక్కోసారి సంతోషంగా, ఒక్కోసారి నిరుత్సాహంగా ఉంటారు. ఉద్రేకాలు త్వరితంగా


మారతాయి.

అందచందాలకు ప్రాధాన్యత ఇస్తా రు.

మతపరమైన, ఆత్మీయమైన, నైతికపరమైన విలువలు బలముగా కలిగియుందురు.


దేనినైనా త్వరగా అంగీకరించక అందులోని నిజాన్ని కనుగొనుటకు సిద్ధపడుదురు.
ఇంటర్మీడియట్‌

అనవసరంగా నేరారోపణచేస్తే ఒప్పుకోరు. పని చేయడానికి ఇష్టపడతారు,


కానీ బరువైన పనులు చేయలేరు.

అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తా రు.

చెప్పినది నమ్మరు, రుజువు కోరుకుంటారు. అనుమానాలు అధికంగా ఉంటాయి.

పెద్దలను విమర్శనాత్మక దృష్టితో చూస్తా రు. మాదిరి జీవితంతో బోధించే బోధకుల ద్వారా
త్వరగా క్రీస్తు వద్దకు రాగలరు.

మాదిరిలేని బోధకుల వలన వారు పూర్తిగా క్రీస్తు నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఇంటర్మీడియట్‌

మేము పెద్దవారము, పిల్లల కార్యక్రమం మాకెందుకని అనుకుంటారు.

ఆజ్ఞలను తిరస్కరిస్తా రు, సలహాలను పాటిస్తా రు.

ఈ దశలోనే అనేకులు క్రీస్తు కొరకు తమ జీవితాలను సమర్పించుకుంటారు.

ఈ వయస్సులో ఆడపిల్లలు త్వరగా ఎదుగుదల కలిగియుందురు.


ఈ వయస్సులోనే లైంగిక ఆకర్షణలు ప్రారంభమౌతాయి.
సీనియర్‌

త్వరలో పెద్దవాళ్లు కాబోతున్నారు కాబట్టి వారి మాటల్లోను, చేతల్లోను కొంచెం చాదస్థం


కనిపిస్తుంది.

ఏదో ఒకటి చేస్తూ ఉండాలని కోరుకుంటారు.

వీరు విమర్శనాత్మక దృష్టితో ఉంటారు. చాలామొరటుగా ప్రవర్తించటం, తిరుగుబాటు


చెయ్యటం జరుగుతుంది.

తాము ప్రత్యేకమైనవారిగా చూపించుకోవాలనుకుంటారు. కొంచెం తక్కువచేసి మాట్లా డితే


నొచ్చుకుంటారు.

తమ వయస్సువారితో కలిసి మెలిసి ఉండటానికి ఇష్టపడతారు


సీనియర్‌

తమను అందరూ ఇష్టపడాలని కోరుకుంటారు.

వీరు చాలా చురుకుగా ఉంటారు. విషయాన్ని తర్కించుకుని వారి స్వంత నిర్ణయాలు


తీసుకుంటారు.

వీరు అస్థిరమైన మనస్థత్వమును కలిగి ఉంటారు. లోక ఆకర్షణలకు సులభంగా


లొంగిపోతారు.

జీవితాన్ని క్రీస్తు కు అప్పగించుకోవడానికి అనుకూలమైన మంచి వయస్సులో ఉంటారు.

వీరికి ఇచ్చే నడిపింపు సరిఅయినది కాకపోతే దేవునికి దూరమైపోయే ప్రమాదముంది.

You might also like